conservation
-
నేషనల్ ఎనర్జీ కన్జ ర్వేషన్ డే ఎందుకు జరుపుకుంటారు?
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) శక్తి (ఎనర్జీ) వినియోగం తగ్గించడానికి విధా నాలు, వ్యూహాల అభివృద్ధికి సహాయపడే రాజ్యాంగ పరమైన సంస్థ. భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ద్వారా శక్తి ప్రాముఖ్యం గురించి ప్రజలు తెలుసు కోవటానికి, అలాగే తక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా ఎక్కువ శక్తిని ఆదా చేయడానికి ప్రోత్సహిస్తుంది. ప్రజా జీవితంలో శక్తి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడం; శక్తి పరిరక్షణ దినోత్సవం లక్ష్యాలుగా చర్చలు, సమావేశాలు, పోటీలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇంధన పరిరక్షణ ప్రక్రియను ప్రోత్సహించడం... వంటి ప్రధాన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తూంటుంది. శక్తిని అనవసరమైన వాటికి వాడటాన్ని నివారించడంతో పాటు, తక్కువ శక్తిని ఉపయోగించడం భవిష్యత్తుకు చాలా అవసరం. ప్రతి ఏడాదీ ‘జాతీయ శక్తి వినియోగ దినోత్సవం (నేషనల్ ఎనర్జీ కన్జ ర్వేషన్ డే)’న్ని డిసెంబర్ 14న భారతదేశం అంతటా జరుపుకొంటారు.2013 నుండి మొత్తం ప్రాథమిక ఇంధన వినియోగంలో చైనా, అమెరికా తరువాత ప్రపంచంలో మూడవ స్థానంలో భారత్ ఉంది. అలాగే అమెరికా, చైనా తరువాత 2017లో 221 మిలియన్ టన్నుల చమురు వినియోగంలో భారత్ మూడవ స్థానంలో ఉంది. మొత్తం ప్రాథమిక శక్తిలో దాదాపు 45% నికర శక్తి దిగుమతిదారుగా మన దేశం ఉంది. 2017లో 294.2 మెట్రిక్ టన్ను లతో భారత్ బొగ్గు ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో నిలిచింది. భారత దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో దాదాపు 80% బొగ్గు నుంచి వస్తుంది. ఇది దేశ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగంలో భారతదేశంరెండవ స్థానంలో ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచ ఇంధన వినియోగంలో 3.4% వాటా కలిగిన భారత్ 6వ స్థానంలో ఉంది. భారతదేశం తన ఇంధన డిమాండ్లను తీర్చడానికి ఎక్కువగా శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశ విద్యుత్ ఉత్ప త్తిలో 80% శిలాజ ఇంధనాల నుండే జరుగుతోంది. చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్లలో మన దేశం ఒకటి. 2035 నాటికి... ప్రపంచ ఇంధన డిమాండ్ పెరుగుదలకు కారణమయ్యే దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 18% పెరుగుదలకు కారణమవుతుంది. భారతదేశపు పెరుగుతున్న ఇంధన డిమాండ్లు పరిమిత దేశీయ చమురు, గ్యాస్ నిల్వలను దృష్టిలో పెట్టుకుని దేశం తన పునరుత్పాదక, అణు విద్యుత్ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతి ష్ఠాత్మక ప్రణాళికలను చేపట్టింది. మన దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్‌ను కలిగి ఉందన్న సంగతి ఇక్కడ గమనార్హం. శిలాజ ఇంధనాలకు బదులుగా వాడటా నికి ఏ ఒక్క శక్తి వనరూ సిద్ధంగా లేదు.చదవండి: ఇది మాయ కాక మరేమిటి?అందుకే కనీసం గృహ అవసరాలకు వినియోగించే శక్తి పరిమాణాన్ని తగ్గించడం, ఆదా చేయడం వంటి చర్యలతో శక్తి వనరులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. రోజువారీ అనవసర వాడకాన్ని తగ్గించడం, తగిన సమయములో బల్బులను మార్చడం, స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించడం, శక్తి సామర్థ్య నీటి తాపన ఖర్చులను తగ్గించడం, కార్యాలయ పరికరాలు, ఉపకరణాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ఇంటిని ఇన్సులేట్ చేయడం మొదలయిన పద్ధతులు ఇందుకోసం పాటించవచ్చు. - డాక్టర్ పిఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్(డిసెంబర్ 14న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే) -
కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి సౌందర్యం ప్రపంచం నలుమూలల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విదేశీ వలస పక్షులకు శీతాకాలపు ఆవాసాలుగా మారే ప్రదేశాలు ఉత్తరాఖండ్‌లో అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది ప్రతియేటా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వలస పక్షులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఉంది.అక్టోబర్ వచ్చేసరికి సెంట్రల్ ఆసియా, సైబీరియా, కజకిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా తదితర శీతల ప్రాంతాల నుండి వేలాది విదేశీ పక్షులు అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు తరలివస్తాయి. కఠినమైన శీతాకాలం నుండి తప్పించుకునేందుకు ఈ పక్షులు డెహ్రాడూన్‌లోని ఈ అందమైన ప్రదేశానికి వచ్చి నివసిస్తాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆరు వేలకుపైగా విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తాయి. మార్చిలో అవి మళ్లీ తమ స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఈసారి అక్టోబరులోనే 300లకు పైగా పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి.రడ్డీ షెల్డక్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, కామన్ పోచార్డ్, యురేషియన్ విజియన్ వంటి పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అందమైన నీటి పక్షులను చూడటానికి పక్షి ప్రేమికులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌లో పక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెహ్రాడూన్ నుండి చక్రతా జాతీయ రహదారి మీదుగా హెర్బర్ట్‌పూర్ చేరుకోవచ్చు. అసన్ కన్జర్వేషన్ ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం -
పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు బషీర్‌బాగ్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు. -
వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!
వాటర్ ఉమన్ నదుల గొప్పతనం గురించి చెప్పమంటే మాటల్లో ఎన్ని అయినా చెబుతాం. అలాంటి పుణ్య నదులు నిర్లక్ష్యం బారిన పడి జీవం కోల్పోయే పరిస్థితిలో ఉంటే మాత్రం పట్టించుకోము. ఈ ధోరణికి భిన్నమైన మహిళ శిర్ప పథక్. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శిర్పకు నదులు అంటే ఇష్టం. వాటికి సంబంధించిన పురాణ కథలు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుణ్యనది గోమతి సంరక్షణ కోసం వెయ్యిన్కొక్క కిలోమీటర్ల పాదయాత్ర చేసింది... సన్నని ప్రవాహమై బయలుదేరే గోమతి ప్రయాణంలో బలపడుతుంది. ‘ప్రయాణం గొప్పతనం బలం’ అని ఆ నది మౌనంగానే చెబుతుంది. అందుకేనేమో ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదానికి బలం ఇవ్వడానికి పాదయాత్ర చేసింది శిర్ప పథక్. పారిశ్రామిక వ్యర్థాలు, నివాసాలలో నుంచి వచ్చే మురుగు నీరు... మొదలైన వాటి వల్ల గోమతి అనేక ప్రాంతాలలో కలుషితం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం జరగడం లేదు. ‘గంగానదితో పోల్చితే గోమతి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది’ అని నివేదికలు తెలియజేస్తున్నాయి. ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన నదిని మనమే రక్షించుకుందాం’ అంటుంది శిర్ప. పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన శిర్ప పథక్ ‘వాటర్ ఉమన్’గా పేరు తెచ్చుకుంది. ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదంతో పదిహేను జిల్లాలలో ఊళ్లు, పల్లెలు, పట్టణాల గుండా సాగిన పాదయాత్రలో ఆ పుణ్యనది ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసింది. ‘పరిస్థితి ఇది. మనం చేయాల్సింది ఇది’ అంటూ స్పష్టంగా చెప్పింది. ప్రతిరోజు 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసింది. ‘నది ఒడ్డున మొక్కలు నాటుదాం’ అని ప్రజలతో ప్రమాణం చేయించింది. శిర్ప వెంట ప్రజలు వచ్చేవాళ్లు. పర్యావరణ సంబంధిత విషయాలను చర్చిస్తూ ఆమె పాదయాత్ర ముందుకు సాగేది. ‘ఆక్రమణలను అడ్డుకుందాం. పుణ్యనదిని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడేది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేసుకున్నారు. ‘నా పాదయాత్రలో భాగంగా నది చుట్టు పక్కల ప్రాంతాలలో నివసించే ఎంతోమందితో మాట్లాడాను. నది పరిస్థితి తెలిసినప్పటికీ ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేశాను’ అంటుంది శిర్ప. శిర్ప విషయానికి వస్తే... నదుల సంరక్షణ గురించి పల్లెలు, పట్టణాల గుండా యాత్ర చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో నర్మద నది సంరక్షణ కోసం 3600 కిలోమీటర్ల యాత్ర చేసింది. ‘నదులకు ఏమైతే మనకేమిటి? మనం హాయిగానే ఉన్నాం కదా అనే భావన నుంచి బయటికి రావాలి. నదుల మనుగడలోనే మనుషుల మనుగడ ఉంది. ప్రకృతి వనరులే మన శక్తులు. నదులకు ముప్పు వాటిల్లితే మన కుటుంబ పెద్దలకు ముప్పు వాటిల్లినట్లుగా భావించి తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. మనిషికి రక్తం ఎంత అవసరమో నది ఆరోగ్యానికి కలుషితం కాని నీరు అంతే అవసరం’ అంటోంది శిర్ప. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాకు చెందిన శిర్ప ఉన్నత చదువులు చదివింది. ‘ఏదో ఒక ఉద్యోగం చేయడం కంటే నదుల పరిరక్షణకు నా వంతుగా ఏదైనా చేస్తాను’ అంటూ ప్రయాణం మొదలు పెట్టింది. ఆ ప్రయాణం వృథా పోలేదని ఎన్నో ఊళ్లలో వచ్చిన మార్పు తెలియజేస్తుంది. నదిలో నీళ్లు మాత్రమే కాదు ఆ నది కార్చే కన్నీళ్లు కూడా ఉంటాయి. నీళ్లు అందరికీ కనిపిస్తాయి. కన్నీళ్లు కొందరికి మాత్రమే కనిపిస్తాయి. ఆ కొందరు అందరిలో అవగాహన రావడం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి ఒక వ్యక్తి... వాటర్ ఉమన్ శిర్ప పథక్. ‘నా వల్ల ఏమవుతుంది అనే మాట బలహీనమైది. నా వల్ల కూడా అవుతుంది అనేది బలమైనది. బలమైన మాటే మన బాట అయినప్పుడు మార్పు సులభం అవుతుంది’ అంటుంది శిర్ప పథక్. (చదవండి: చిద్విలాస చిత్రగణితం! మ్యాథ్స్‌తో ఆర్ట్‌ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!) -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమం.. దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, హైదరాబాద్: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవ వైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను ప్రజలకు వివరించనుంది. ఈ ఎగ్జిబిషన్లో ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని తీసిన పులుల ఫొటోలను టీఎస్ఆర్టీసీ ప్రదర్శిస్తోంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(పీసీసీఎఫ్) రాకేశ్ మోహన్ డోబ్రియాల్, ఐఎఫ్ఎస్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు. అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్(ఐపీఎఫ్), ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌లోని పులుల ఫొటోలు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు. రాకేశ్ మోహన్ డోబ్రియాల్ మాట్లాడుతూ.. పులుల సంరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి టీఎస్ఆర్టీసీ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ అటవీ శాఖ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. రెండు టైగర్ రిజర్వ్ లలో దాదాపు 30 పులులు ఉన్నాయని చెప్పారు. పులులు అడవుల్లో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, పులుల ఆవాసాలు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. తమ ఆధీన ప్రాంతంలో ఉండే అన్ని జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవి తోడ్పాడుతాయని వివరించారు. పులులను కాపాడటమంటే అడవులను, వాటిలోని జీవరాశిని, జీవవైవిద్యాన్ని రక్షించడమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పులులను సంరక్షిస్తే పర్యావరణాన్ని సంరక్షించినట్లే అని ఆయన చెప్పారు. పులులను సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్ తో కలిసి టీఎస్ఆర్టీసీ 'హైదరాబాద్ ఆన్ వీల్స్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతమైన మీడియా అని.. ఫోటోస్, విజువల్స్ ద్వారా సమాజం ప్రభావితం అయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. మాటల ద్వారా వ్యక్తికరించలేని భావాలను ఫోటోలు చెప్తాయని వివరించారు. ఈ ఫొటో గ్రఫీ ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ప్రజా రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అని తెలిపారు. 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్'లో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించామని చెప్పారు. అడవుల్లోకి వెళ్లలేని వారు ఈ ఎగ్జిబిషన్ లోని పులుల ఫోటోలను చూసి మంచి అనుభూతుని పొందవచ్చని అన్నారు. హైదరాబాద్ లోని జనసమర్థ ప్రాంతాల్లో హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సు తిరుగుతుందని, ప్రజలందరూ ఈ ఫోటోలను వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తోన్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. పర్యవరణహితం కోసం టీఎస్ఆర్టీసీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్ట ప్లాన్ చేస్తోందని వివరించారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఐపీఎఫ్ వ్యవస్థాపకుడు ఆక్విన్ మాథ్యూస్ అన్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంతో కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులులపై అవగాహన కల్పించాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారిని ఈ సందర్భంగా అభినందించారు. చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ దాదాపు 13 ఏళ్లుగా ఎంతో కష్టపడి తీసిన తన ఫొటోలను హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని అన్నారు. అడవుల్లో ఒక్కో పులి ఫొటో తీయడానికి రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. యువతకు పులుల సంరక్షణపై అవగాహన లేదని, వారికి పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు, ఐపీఎఫ్ ప్రతినిధురాలు తరుషా సక్సేనా, తదితరులు పాల్గొన్నారు. -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం
సాక్షి, హైదరాబాద్: అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరమని, గ్రీన్ ఇండియా చాలెంజ్ తరపున పులుల రక్షణకు మద్దతు తెలుపుతున్నట్లు అడవులు, పర్యావరణంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్రం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రవేశ పెట్టింది. శనివారం (ఏప్రిల్ 1) ఈ సేవ్ టైగర్ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని సంతోష్ పేర్కొ న్నారు. 1973లో 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు చేరగా.. టైగర్ రిజర్వుల సంఖ్య తొమ్మిది నుంచి 53కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రాధాన్యాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సేవ్ టైగర్ ఉద్యమం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు విడుదల చేసిన టైగర్ బుక్, టీషర్ట్, కాఫీ మగ్ సావనీర్లను సంతోష్ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని బాగా నిర్వహిస్తోందని, పులుల సంఖ్య పెరుగుతోందన్నారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, శ్రీకాంత్ పాల్గొన్నారు. (చదవండి: ఇక తిరుపతికి ఎనిమిదిన్నర గంటల్లోనే.. వేగంగా వెళ్లేందుకే ఆ మార్గం ఎంపిక.. ) -
జీవ వైవిధ్య సంరక్షణలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ నడుం కట్టింది. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు, అక్కడి ప్రత్యేకతలతో జీవ వైవిధ్య రిజిస్టర్లు రూపొందించి జీవ వైవిధ్య సంరక్షణకు పటిష్టమైన పునాదులు వేసింది. 2002లో జీవ వైవిధ్య చట్టం అమల్లోకి వచ్చినా.. రాష్ట్రంలో దాని అమలుకు సంబంధించిన నియమ నిబంధనలకు మాత్రం 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆమోదం లభించింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవ వైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యత పెరిగి ఆ అంశంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. అన్ని గ్రామాల్లో యాజమాన్య కమిటీలు జీవ వైవిధ్య చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి.. తద్వారా ప్రజా జీవ వైవిధ్య రిజిస్టర్లను రూపొందించాల్సి ఉంది. కానీ.. జీవ వైవిధ్య మండలి ఏర్పాటైన 13 సంవత్సరాల వరకు దాని గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ 2020 డిసెంబర్‌లోపు అన్ని స్థానిక సంస్థల్లోను వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2020 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య మండలికి పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించడంతో మండలి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రతి మండలానికి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కో–ఆర్డినేటర్‌గా మండలి నియమించింది. రాష్ట్రంలో మొత్తం 14,157 స్థానిక సంస్థల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయగా.. వాటిలో 13,363 గ్రామ పంచాయతీ స్థాయివి కాగా 661 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్ స్థాయి కమిటీలు ఉండటం విశేషం. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల్లో జీవ శాస్త్ర శాఖాధిపతులను సంప్రదించి జీవ వైవిధ్య రిజిస్టర్లను తయారు చేసే పనిలో పాల్గొనేలా చేసింది. సమగ్ర కార్యాచరణ అమలు జీవ వైవిధ్య కమిటీలు పని చేసేందుకు 15 అంశాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. గ్రామ వనాలు, మండల, జిల్లా స్థాయిలో జీవ వైవిధ్య ఉద్యాన వనాలు ఏర్పాటు, అంతరించే జాతుల నర్సరీలను పెంచడం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, స్కూళ్లు, కాలేజీలలో మొక్కలు నాటడం, మహిళా సంఘాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు, స్థానిక వైద్యులు, నాటు వైద్యులను గుర్తించి వారి వద్ద ఉన్న జ్ఞానాన్ని గ్రంథస్తం చేయడం వంటి పనులను ఈ కమిటీలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని స్థానిక సంస్థల సర్పంచ్‌లు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, క్రియాశీలక సభ్యులతో జాయింట్ బ్యాంక్ ఖాతాలను తెరిపించి వారికి మంజూరు చేసిన నిధులను బదిలీ చేశారు. ఇప్పటివరకు 10 వేల గ్రామ పంచాయతీలకు రూ.75 వేల చొప్పున మొదటి విడతగా రూ.12 కోట్లను బదిలీ చేశారు. జీవ వైవిధ్య సంరక్షణలో ఓ మైలురాయి అన్ని స్థానిక సంస్థల్లోనూ 15 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న జీవ వైవిధ్య యాజమాన్యాల కమిటీలను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం జీవ వైవిధ్య సంరక్షణలో ఒక మైలు రాయి. ఇది దేశం మొత్తంలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను, ఒక విశిష్టమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో జీవవైవిధ్య సంరక్షణకు సంస్థాగత నిర్మాణం జరిగింది. – దెందులూరి నళినీమోహన్, అటవీ శాఖ పూర్వ పీసీసీఎఫ్, జీవ వైవిధ్య మండలి రిటైర్డ్ సభ్య కార్యదర్శి -
ఇంధన సంరక్షణలో ఏపీ ఆదర్శం.. డాక్టర్ అజయ్ మాథుర్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ మేటి అని అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ కొనియాడారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ‘ఎనర్జీ ఎఫిషియన్సీ మ్యాటర్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ పుస్తక రచయితల్లో ఒకరైన డాక్టర్ అజయ్ మాథుర్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి తన పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాథుర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను అందుకున్న ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎస్ఈసీఎంను అభినందించారు. ఇంధన పరిరక్షణకు సంబంధించిన పలు పథకాలను సమర్థంగా అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. ఏపీలో ఎల్ఈడీ బల్బుల పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో అన్ని శాఖలనూ భాగస్వాములను చేయడం, అన్ని విభాగాల్లోనూ ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు వంటి చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని ఆయన చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రోత్సాహం, అనుసరిస్తున్న విధానాలతోనే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధనశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు లభిస్తున్నాయని చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్రానికి మూడు ‘ఎనర్షియా’ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న విధానాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు లభించింది. ఇంధన రంగంలో జాతీయ స్థాయిలో ఏపీకి మూడు అవార్డులు వచ్చాయి. ఇంధన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవార్డుకు ఏపీ ఎంపికైంది. అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీట్రాన్స్కో)కు అవార్డు లభించింది. ఉత్తమ పునరుత్పాదక సంస్థగా ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌ఆర్‌ఈడీఏపీ) నెడ్కాప్ను అవార్డు వరించింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన 15వ ఎనర్షియా అవార్డుల సదస్సులో ఈ అవార్డులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్ అందుకున్నారు. ఎనర్షియా ఫౌండేషన్ అనేది ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది భారత్‌తో పాటు ఆసియా, మిగిలిన ప్రపంచ దేశాల్లో క్లీన్, గ్రీన్, సస్టైనబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ, ఇంధన రంగం అభివృద్ధికి కృషిచేస్తోంది. చదవండి: పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా? -
అటవీ పరిరక్షణపై రాజీపడొద్దు!
చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అయితే అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది. అటవీ పరిరక్షణ చట్టానికి తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టరూపం దాల్చితే, దేశంలోని అటవీ భూములను భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే. కొత్త విద్యుత్ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని మనం కాపాడుకోవాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం విధానాలను మార్చుకోవడం ప్రమాదకరం. అనేక సందర్భాల్లో అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది. 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఉనికిలోకి రాకముందు సేకరించిన భూమిని వివిధ ప్రాజెక్టులకు మళ్లించడం జరుగుతున్నా, దానిలో చాలా భాగాన్ని ఇప్పటికీ వినియోగించడం లేదు. గత సంవత్సరం పర్యావరణ ప్రభావిత అంచనా (ఇఐఏ) చట్టాల్లో మౌలిక మార్పులను ప్రారంభించడం ద్వారా దేశ పర్యావరణ పరిరక్షణ చట్టాలపై బహుముఖ దాడికి రంగం సిద్ధమైంది. 1980 అటవీ పరిరక్షణ చట్టం స్వయంగా ఈ దాడిలో బాధితురాలు కాబోతోంది. ఆనాటి చట్టం భారత పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 1980 అటవీ పరిరక్షణ చట్టంలో తీవ్రమార్పులను ప్రతిపాదించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ మార్పులను ఇటీవలే ప్రజా పరిశీలన నిమిత్తం బహిరంగపర్చారు. సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రభావితం చేసేలా అటవీ పరిరక్షణ చట్టానికి విస్తృతమైన భాష్యాన్ని బలహీన పర్చేలా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టంలో భాగంగా మారితే, దేశంలోని అటవీ భూములును భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే. భారతదేశంలో పర్యావరణ వ్యవస్థ అంత పాతదేమీ కాదు. ఆర్థిక పురోగతిలో పర్యావరణ అంశాలను మేళవించడం అనే భావన తొలిసారిగా నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1969–1974) తీసుకొచ్చారు. ఆనాటివరకు రాజకుటుంబాలు, విదేశీ పర్యాటకులు సఫారీ పేరుతో జంతువుల వేటను తీవ్రస్థాయిలో కొనసాగించేవారు. అప్పట్లో వన్యప్రాణుల విభాగం వ్యవసాయ మంత్రిత్వ కార్యాలయానికి అనుసంధానమై ఉండేది. ఇది వలసపాలనా కాలం నాటి చట్టాలతోటే నడిచేది. 1973లో ప్రారంభించిన టైగర్ ప్రాజెక్టు దేశంలో ప్రప్రథమ వన్యప్రాణి పరిరక్షణ ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. తదనంతరం మంత్రిత్వ శాఖగా మారిన పర్యావరణ విభాగం 1980లో ఉనికిలోకి వచ్చింది. అదే సమయంలో రిజర్వ్ చేసిన అడవులను రిజర్వ్డ్ పరిధిలోంచి తీసివేయాలన్నా, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నా కేంద్రప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నాటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అలాంటి అనుమతుల విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఒక సంప్రదింపుల కమిటీని కూడా నెలకొల్పారు. దీంతో చట్టబద్ధమైన ఆదేశంతో అటవీ పరిరక్షణ విధానానికి నాంది పలికినట్లయింది. అలాగే అటవీ భూములను మరే ఇతర ప్రాజెక్టుకోసమైనా మళ్లించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ చట్రం క్రమానుగతంగా రూపొందుతూ వచ్చింది కానీ అది ఎల్లప్పుడూ పర్యావరణ మెరుగుదలకు తోడ్పడలేదు. పర్యావరణ పరిరక్షణ అనే భావనను అవసరమైన దుష్టురాలిగా ప్రభుత్వాలు చూడసాగాయి. ఫలితంగా అటవీ పరిరక్షణ చట్టం 1980ల నుంచి అనేక మార్పులకు గురవుతూ వచ్చింది. పైగా అనేక వివాదాలకు, లావాదేవీలకు ఇది కేంద్రబిందువైంది. 1996 డిసెంబరులో సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు ఈ చట్టం పరిధిని విస్తృతం చేసింది. యాజమాన్యం, గుర్తింపు, వర్గీకరణలతో పనిలేకుండా ప్రభుత్వ రికార్డులో ’అడవి’గా నమోదైన అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందని ఈ తీర్పు వ్యాఖ్యానించింది. ఈ అంశానికి కట్టుబడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత అటవీ చట్టం, 1927, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కింద గుర్తించిన ప్రాంతాలను మాత్రమే అడవులుగా అన్వయిస్తూ వచ్చాయి. అయితే అడవులు అంటే నిఘంటువుల్లో ఉన్న అర్థాన్ని నిర్దారించే ప్రాంతాలను కూడా అటవీ పరిరక్షణ చట్టం కిందికి తీసుకురావాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ అనేక ఉదంతాల్లో అటవీ శాఖ ఆమోదం పొందనవసరం లేనివిధంగా ప్రాజెక్టు ప్రతిపాదనలకు మినహాయింపు నిచ్చేలా పలు లొసుగులను సృష్టిం చాలని ఇప్పుడు ప్రయతిస్తూ ఉండటం గమనార్హం. అయితే 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఏర్పడక ముందు సేకరించిన భూమి అటవీ భూమి అయినప్పటికీ దానికి, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలాంటి అనుమతులూ పొందనవసరం లేదు. లేదా దీన్ని రక్షిత అటవీప్రాతంగా దీన్ని గుర్తించాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే విధంగా 1996 సుప్రీం తీర్పుకు ముందు రెవిన్యూ రికార్డుల్లో అడవిగా వర్గీకరించిన భూమిని అటవీ పరిరక్షణ చట్టం పరిధికి ఆవల ఉంచేయడం జరిగింది. అడవుల పెంపకం ఫలితంగా పెరిగిన కొత్త అడవులను వాస్తవానికి అడవులుగా గుర్తించ కూడదని కేంద్ర మంత్రిత్వ శాఖ భావిస్తోంది. మరొక మినహాయింపు ఏమిటంటే, అటవీ భూమిని వ్యూహా త్మక, రక్షణ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలకు నేరుగా అనుమతి నివ్వడం. అలాంటి ప్రాజెక్టుల గురించి సరైన నిర్వచనం ఇవ్వని నేపథ్యంలో అటవీ భూములను కొత్త ప్రాజెక్టులకు ఉపయోగించుకోవడానికి అడ్డదారులకు భారీగా అవకాశం ఇచ్చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ గణాం కాల ప్రకారం– అటవీ నిర్మూలనను అరికట్టడంలో అటవీ పరిరక్షణ చట్టం(ఎఫ్సీఏ) గొప్ప పాత్ర పోషించింది. 1951 నుంచి 1976 మధ్య ప్రతి సంవత్సరం 1.6 లక్షల హెక్టార్ల అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించడం జరిగేది. కానీ అటవీ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంతో 1980 నుంచి 2011 మధ్య ఈ సంఖ్య ఏటా 32,000 హెక్టార్లకు తగ్గిపోయింది. కాబట్టి ఈ చట్టాన్ని నీరుగార్చే ఏ చర్య అయినా నిర్వనీకరణకు కారణం అవుతుంది. చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. కార్బన్ గ్రాహకాలుగా పనిచేస్తున్నాయి. అటవీ నిర్మూలన, అడవుల్లో జీవవైవిధ్యాన్ని దిగజార్చే ఏ చర్య అయినా కార్బన్ ఉద్గారాలకు కారణం అవుతుంది. వాతావరణ మార్పును నిరోధించాలంటే, అడవులను కాపాడుకోవడం, మరిన్ని అదనపు అడవులను సృష్టిం చడం తప్పనిసరి. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి విధానపరమైన సదస్సుకు అనుగుణంగా చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కూడా ఇండియా దానికి కట్టుబడి ఉండాలి. కొత్త విద్యుత్ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని కాపాడుకోవాల్సిన, విస్తరించాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. సహజ వనరుల నియంత్రణ కోసం ముక్కలు ముక్కల ధోరణి కాకుండా అవిభాజ్యమైన కొనసాగింపు విధానం ఉండాలి. భారతదేశంలో అటవీ, వృక్ష ఆచ్ఛాదన ప్రస్తుతం ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండాల్సిన 33 శాతం కాకుండా 25 శాతం కంటే తక్కువగా ఉంది. చెప్పాలంటే, అటవీ ఆచ్ఛాదనకు సంబంధించిన శాస్త్రీయమైన ఆడిట్ కూడా జరగాలి. చట్టంలో మార్పులకు సంబంధించి స్థానిక సమాజాలు, పౌర సమాజం, రాష్ట్రాలు, ఇతర పక్షాలతో కూడిన విస్తృతమైన ప్రజాబాహుళ్యంలో చర్చ జరగాలి. స్వల్పకాలిక లక్ష్యాలకు సరిపడేలా విధానాలను మార్చుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. – దినేష్ శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యాఖ్యాత -
వెల్లువలా మద్దతు: బ్రిట్నీ స్పియర్స్‌కు భారీ ఊరట
Britney Spears తండ్రిని సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని చేస్తున్న న్యాయ పోరాటంలో పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ‘సగం గెలుపు’ సాధించింది. తండ్రి జేమీ స్పియర్స్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లాయర్(అటార్నీ)ను తానే నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని కోర్టు వెల్లడించింది. సుమారు మూడువారాల తర్వాత బుధవారం(జులై14న) జరిగిన వాదనల టైంలో లాస్ ఏంజెల్స్ కోర్టుకు ఫోన్ కాల్ ద్వారా విచారణకు హాజరైన బ్రిట్నీ.. ‘నన్ను చంపే ప్రయత్నం జరుగుతోంది’ అని కన్నీరు పెట్టుకుంది. గార్డియన్షిప్ నుంచి తన తండ్రిని తప్పించాలని.. ఆయన వ్యవహారశైలి క్రూరంగా ఉందని, కనీసం ఈ వ్యవహారంలో వాదనల కోసమైన తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆమె న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి స్పందించిన జడ్జి బ్రెండా పెన్నీ.. స్పియర్స్ తరుపున ఇంతకు ముందు అటార్నీ రాజీనామాను ఆమోదిస్తూనే, కొత్త అటార్నీ మాథ్యూ రోసెన్గార్ట్ను నియమించుకునే హక్కును బ్రిట్నీకి కల్పిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. జేమీ స్పియర్‌ను బ్రిట్నీ సంరక్షణ నుంచి తప్పించాలన్న పిటిషన్‌పై ఇక నుంచి వాదనలు వినిపించబోతున్నారు రోసెన్‌గార్ట్. గతంలో స్టీవెన్ స్పీల్బర్గ్, సీన్ పెన్ లాంటి ప్రముఖుల తరపున వాదించారు. Coming along, folks ... coming along 🖕🏻!!!!! New with real representation today ... I feel GRATITUDE and BLESSED !!!! Thank you to my fans who are supporting me ... You have no idea what it means to me be supported by such awesome fans !!!! God bless you all !!!!! pic.twitter.com/27yexZ5O8J — Britney Spears (@britneyspears) July 15, 2021 ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతుగా భారీ ఎత్తున ఫ్రీబిట్నీ ‘#FreeBritney’ సైన్ పిటిషన్‌ను రన్ చేస్తున్నారు. లక్షల మంది సంతకాలు చేపడుతున్నారు. అయితే ఆమె మానసిక స్థితి దృష్ట్యా తండ్రిని తప్పించలేమని కోర్టు గత వాదనల టైంలో స్పష్టం చేసింది. అయితే తదనంతర పరిణామాలు ఆమెకు పూర్తి వ్యతిరేకంగా మారాయి. స్పియర్స్‌కు చాలాకాలంగా మేనేజర్‌గా వ్యవహరించిన లారీ రుడోల్ఫ్తో పాటు ఆమె అటార్నీ సామ్యుయెల్ ఇన్గ్హమ్ కూడా తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే మేనేజర్ లారీ తప్పుకోవడంతో 39 ఏళ్ల బ్రిట్నీ.. తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతోందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి కూడా. -
పక్షుల కిలకిల.. మెరుగైన జీవవైవిధ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిలో ఎన్నో ప్రాణులున్నా పక్షులది ప్రత్యేక గుర్తింపు.. ఎన్నో రకాలు.. ఎన్నో రంగులు.. మరెన్నో రాగాలు.. రాష్ట్రంలో వివిధ రకాల పక్షులు కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం మెరుగైన జీవవైవిధ్యం, చెట్లు, పూల మొక్కలు, పక్షులు, జంతుజాలంతో రాష్ట్రం విలసిల్లుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 350కు పైగా పక్షుల రకాలు ఉన్నట్టుగా పర్యావరణ, పక్షుల ప్రేమికులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్.. దాని చుట్టుపక్కలే 270 దాకా వివిధ రకాల పక్షులుంటాయని చెబుతున్నారు. తాజాగా వికారాబాద్ అనంతగిరిలో దేశంలోనే అరుదైన ‘బ్లూ అండ్ వైట్ ఫ్లై క్యాచర్’ పక్షి కనిపించడం విశేషం. గత 30 ఏళ్ల కాలంలో ఇది తెలంగాణలోనే కనిపించలేదని, ఇప్పుడు కనిపించడాన్ని బట్టి మెరుగైన ఎకో సిస్టమ్‌తో పాటు జీవవైవిధ్యం బాగా ఉన్నట్టుగా, పక్షులు స్వేచ్ఛగా తమ జీవక్రియలను కొనసాగించేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టుగా భావించవచ్చని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. జనవరి 5వ తేదీని ‘నేషనల్ బర్డ్ డే’గా అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అమెరికాలో దీనిని ఒక ఉద్యమంగా ఒక కార్యాచరణ మాదిరిగా నిర్వహిస్తున్నారు. బర్డ్‌వాచింగ్, పక్షులపై అధ్యయనం, బర్డ్ యాక్టివిటీస్ పర్యవేక్షణ, పక్షులను దత్తత తీసుకోవడం అనేవి ‘నేషనల్ బర్డ్ డే’ యాక్టివిటీగా దాదాపు 5 లక్షల మంది వరకు నిర్వహిస్తుండటం విశేషం. యూఎస్‌లో ‘యాన్యువల్ క్రిస్మస్ బర్డ్ కౌంట్’లో భాగంగా దీనిని కూడా నిర్వహిస్తా రు. తమ దేశంలోని పక్షుల పురోభివృద్ధి, క్షేమ సమాచారం తెలుసుకునేందుకు సిటిజన్ సైన్స్ సర్వే మాదిరిగా చేపడుతున్నారు. పదేళ్ల కింద నుంచే నేషనల్ బర్డ్ డేను నిర్వహిస్తుండగా, భారత్‌లో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్‌లోనూ జనవరి 5న నేషనల్ బర్డ్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్, వానలతో మేలు.. ‘తెలంగాణలో పక్షి జాతులు, రకాల సంతతి బాగానే వృద్ధి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అలాగే హైదరాబాద్, చుట్టుపక్కల వివిధ రకాల పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సాధారణంగానే పక్షుల మనుగడ, పరిరక్షణ విషయంలో మన రాష్ట్రం మెరుగైన స్థితిలోనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్, ఆ తర్వాత వర్షం సీజన్ బాగా ఉండటం మనకు ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా పర్యావరణానికి, అడవులు, జంతువులు, పశుపక్ష్యాదులకు మంచి జరిగింది. ప్రస్తుత సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు, పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లతో బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశాలున్నాయి. అయితే దీని పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సంస్థ అధ్యక్షుడు పాలినేటర్స్ పార్కులు పెట్టాలి.. ‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్ పార్కులను పెడుతున్న విధంగానే ‘పాలినేటర్స్ పార్కు’లను కూడా ఏర్పాటు చేయాలి. కనీసం జిల్లాకో పార్క్ పెట్టాలి. తెలంగాణకు ప్రత్యేకమైన, స్థానిక మొక్కలు, పండ్ల మొక్కలను వాటిలో పెంచితే పక్షులు వాటిని తిన్నాక ఇతర ప్రాంతాల్లో వాటి డ్రాపింగ్స్ ద్వారా ఈ మొక్కలు పెరుగుతాయి. అదే ఎగ్జోటిక్, ఇన్వెసివ్ ప్లాంట్లను పెట్టడం వల్ల మనుషులు, పక్షులకు ఎలర్జీలు ఏర్పడుతున్నాయి. నేటివ్ ప్లాంట్స్ ఎకోసిస్టమ్‌ను పెంచడానికి, జీవవైవిధ్యం మరింత మెరుగుపడేందుకు పాలినేటర్స్ పార్కులు దోహదపడతాయి. వీటి వల్ల పక్షుల సంఖ్య కూడా పెరుగుతుంది. బర్డ్ ఫ్లూ కేసులు, కొత్త వైరస్ బయటపడిన నేపథ్యంలో ఎక్కడైనా చనిపోయిన పక్షులు కనిపిస్తే వాటి గురించి అటవీ, వెటర్నరీ అధికారులకు తెలియజేస్తే వాటిని సేఫ్‌గా డిస్పోజ్ చేయవచ్చు. లేకపోతే చనిపోయిన పక్షుల వల్ల కూడా వైరస్ వ్యాపించే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి’ – గైని సాయిలు, బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్, ఫారెస్ట్ 2.0 రీజినల్ డైరెక్టర్ జపాన్‌లో కనిపించే పక్షి వికారాబాద్ జిల్లాలోని అడవిలో ఇటీవల మేము పర్యటిస్తున్న సందర్భంగా దేశంలోనే అత్యంత అరుదైన ‘బ్లూ అండ్ వైట్ ఫ్లై క్యాచర్’పక్షి తారసపడటంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బ య్యాము. జపాన్, కొరియాలో ప్రధానంగా కనిపించే ఈ పక్షి, భారత్‌లోని దక్కన్ పీఠభూమిలో కనిపించడాన్ని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీరాంరెడ్డి తన కెమెరాలో బంధించాడు. అడవుల సంరక్షణతో పాటు జీవవైవిధ్యం మెరుగ్గా ఉంటే ప్రతీ ఏడాది ఈ పక్షి తెలంగాణలో కనిపించి కనువిందు చేస్తుంది. – గోపాలకృష్ణ, పక్షి ప్రేమికుడు -
నదులకు జీవం.. అడవుల రక్షణ
సాక్షి, అమరావతి: దేశంలోని గోదావరి, కృష్ణాతోపాటు 13 జీవ నదుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నదీ తీరం వెంబడి ఇరువైపులా అడవులను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడం.. హఠాత్తుగా వచ్చే వరదల (ఫ్లాష్ ఫ్లడ్స్)కు అడ్డుకట్ట వేయడం.. ఏడాది పొడవునా నదుల్లో నీటి ప్రవాహం ఉండేలా చేయడానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు రూపొందించే బాధ్యతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కి అప్పగించింది. అడవుల పెంపకం వల్ల నదీ పరీవాహక ప్రాంతంలో ఏకరీతిగా వర్షం కురిసే అవకాశం ఉంటుందని.. వర్షం నీటి ప్రవాహ ఉధృతికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంపొందేలా చేస్తాయని.. ఇది నదిలో సహజసిద్ధ ప్రవాహాన్ని పెంచుతుందని పర్యావరణ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మరోవైపు భూమి కోతకు గురవకుండా అడవులు అడ్డుకుంటాయని, ఇది జలాశయాల్లో పూడిక సమస్యను పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ‘నమామి గంగే’ తరహాలో.. ♦దేశంలో అత్యధిక శాతం ఆయకట్టుకు సాగునీటిని, అధిక శాతం ప్రజలకు తాగునీటిని అందించే జీవ నదులుగా బియాస్, చీనాబ్, జీలం, రావి, సట్లెజ్, లూని, యమున, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి, బ్రహ్మపుత్ర, మహానది పేరొందాయి. ♦గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ తరహాలోనే ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ 13 నదులను పరిరక్షించకపోతే తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పవని అటవీ, పర్యావరణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచి్చంది. ♦దీని ఆధారంగా ఈ నదుల పరిరక్షణకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు రూపొందించే బాధ్యతను డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేసే ఐసీఎఫ్ఆర్ఈకి కేంద్రం అప్పగించింది. ♦నది జన్మించిన ప్రదేశం నుంచి.. సముద్రంలో కలిసే వరకూ నదికి ఇరువైపులా ఎంత విస్తీర్ణంలో అడవుల్ని పెంచవచ్చనేది డీపీఆర్‌లో ఐసీఎఫ్ఆర్ఈ పొందుపర్చనుంది. ఈ నదుల పరిధిలోని అడవుల్లో ఎలాంటి చెట్లను పెంచాలన్నది నిర్ణయిస్తుంది. ♦ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అటవీ విస్తీర్ణం పెరిగి పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల అన్నిచోట్లా ఏకరీతి వర్షపాతం సాధ్యమవుతుంది. ♦వర్షపు నీటిని అడవులు ఒడిసి పట్టడం ద్వారా నీటి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసి ఫ్లాష్ ఫ్లడ్స్‌ను నివారిస్తాయి. దీనివల్ల భూగర్భ జలమట్టాలు స్థిరపడి నదిలో సహజసిద్ధ (ఊట) ప్రవాహం పెరిగేందుకు దోహదం చేస్తుంది. తద్వారా వేసవిలోనూ నదుల్లో పుష్కలంగా జలాలు లభిస్తాయి. ♦అడవుల్ని పెంచడం వల్ల జలాలు కలుషితం కావు. భూమి కోత నివారించబడి ప్రాజెక్టుల్లో పూడిక చేరదు. -
భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం: భూ ఆక్రమణదారులు ఎంతటివారైనా సరే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. విశాఖలో విలువైన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకునే విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. పంచగ్రామాల భూసమస్య, గాజువాక హౌస్ కమిటీ భూములపై తదుపరి సమీక్ష సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. జిల్లాలో పేదలందరికీ ఇంటిస్థలం, విశాఖలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, పంచగ్రామాల భూ సమస్య తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ఇంతవరకూ దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి జూలై 8వ తేదీన ఇంటిపట్టాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల సూచనలూ పరిగణనలోకి తీసుకుంటున్నామంటే పారదర్శకతకు ఒక నిదర్శనమని అన్నారు. అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని చెప్పారు. అనర్హుల జాబితాలో ఉన్నవారికి అధికారులు వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించాల్సి వచ్చిందో వెల్లడించాలని అధికారులను ఆదేశించామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇంకా మిగిలిన అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. కొంతమంది కోర్టుకెళ్లారు.. జిల్లాలో ఇంటిస్థలాల పంపిణీ కోసం ఆరు వేల ఎకరాలను సమీకరించినట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. కొంతమంది వ్యక్తులకు కోర్టుకు వెళ్లి ఆపడం వల్ల కొన్నిచోట్ల జాప్యమవుతోందని అన్నారు. ఆ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టరును ఆదేశించినట్లు తెలిపారు. లీగల్ సెల్ ఏర్పాటు రాష్ట్రంలోనే అత్యధిక విలువైన భూములు విశాఖలోనే ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. భవిష్యత్తులో నగరానికి మరింత విలువ పెరగబోతోందని చెప్పారు. దీంతో కొంతమంది రకరకాల న్యాయవివాదాలు సృష్టించి ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల నష్టపోతున్న వ్యక్తులు ప్రభుత్వంపై, విజయసాయిరెడ్డిపై ఎదురుదాడికి తెగిస్తున్నారని చెప్పారు. విశాఖ డివిజన్‌లోనే 4,900 ఎకరాలు వివాదాల్లో, ఆక్రమణల్లో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరు నేతృత్వంలో లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. చూస్తూ ఊరుకోవాలా? గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూఅక్రమాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. సిట్ నివేదిక వచ్చేవరకూ ప్రభుత్వ భూములు పరాధీనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఓ విలేకరి ప్రశ్నకు స్పందించారు. ప్రజా ఆస్తులకు సంరక్షకుడిగా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ పక్కాగా అమలుచేస్తామని ఉద్ఘాటించారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి పటిష్ట చర్యలు తీసుకొనేలా అధికారులకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. స్వీయ నియంత్రణతో ‘కోవిడ్’ కట్టడి కోవిడ్ 19 కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాలకు వచ్చినపుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో బోర్డులు విశాఖ పరిసరాల్లో ఎంతో విలువైన భూములు గత ప్రభుత్వ హయాంలో పరాధీనమయ్యాయని మంత్రి కన్నబాబు చెప్పారు. అలాంటి పరిస్థితులు కొనసాగకుండా తక్షణమే ప్రభుత్వ భూములను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. గాజువాకలో అన్యాక్రాంతమవుతున్న చెరువులను రక్షించి సుందరీకరణ చర్యలు తీసుకోవాలని సూచించామని చెప్పారు. ల్యాండ్ ఆడిట్ జరగాలి.. గతంలో పారిశ్రామిక, వ్యాపార, విద్యా తదితర అవసరాల కోసం భూములు పొందిన వారంతా ఆయా అవసరాలకే వినియోగిస్తున్నారా లేదా అనే విషయమై ల్యాండ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్ కూడా తక్షణమే నిర్వహించాలని ఆదేశించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచి్చన విధానాల వల్ల చివరకు కంప్యూటర్ ఆపరేటర్లు సైతం భూరికార్డుల్లో వివరాలు తారుమారు చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. -
4 మినార్లు..5 సంవత్సరాలు
"గత మే నెలలో చార్మినార్ నైరుతి భాగంలోని మినార్ నుంచి భారీ పెచ్చు ఊడింది. దాని మరమ్మతుకుగాను సిబ్బంది ఆ భాగం వద్దకు చేరుకుని, కూర్చుని పని చేయటం కోసం స్కఫోల్డింగ్ (ఇనుప రాడ్లు, కర్రలతో ఏర్పాటు చేసే భాగం) ఏర్పాటుకు రూ.3.5 లక్షలు ఖర్చు అయింది. ఇది చార్మినార్ పరిరక్షణ నిధుల్లో కోత పడి అసలు పనుల్లో జాప్యానికి కారణమైంది. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రతినిధి రానున్నాడని తెలిసి గత నెల దాని చుట్టూ పరిసరాలు, సమీపంలోని ఉప ఆలయాల ముస్తాబు, కొత్త రోడ్డు నిర్మాణం, పచ్చిక బయలు...తదితర పనులు చేశారు. ఇందుకు పట్టిన సమయం కేవలం ఒక నెల. వీటికి ఏఎస్ఐ రూ.5 కోట్లను విడుదల చేసింది. యుద్ధప్రాతిపదిక పనులు అంటే ఇవి" సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్. ఓ రకంగా చెప్పాలంటే ఈ నగర సంతకం లాంటిది ఆ నిర్మాణం. మరి అది ప్రమాదంలో పడిందంటే పరిరక్షణ చర్యలు యుద్ధప్రాతిపదికన జరగాల్సిందే. కానీ, ఒక్కోటి 48.7 మీటర్ల చొప్పున ఎత్తు ఉండే నాలుగు మినార్ల పరిరక్షణ పనులు పూర్తి చేసేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ‘పంచవర్ష ప్రణాళిక’నే కొనసాగించారు. 2014, డిసెంబర్లో ప్రారంభమైన పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు దిగువ భాగానికి పరిరక్షణ పనులు ప్రారంభించారు. మరి ఆ భాగం పనులు పూర్తి చేసేందుకు ఎన్నేళ్లు పడతాయో చూడాలి. చివరి మినార్ పని పూర్తయ్యేసరికి, మొదటి మినార్ రంగు మారిందంటే, పనుల్లో జాప్యం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. "ఒక మినార్‌లో చిన్న పని మినహా దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడే దిగువ భాగం పని ప్రారంభిస్తున్నాం. మొత్తం కట్టడం పని వీలైనంత తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ పనులు క్లిష్టమైనవే అయినందున కాస్త జాప్యం తప్పదు. అయినా వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం." మిలింద్ కుమార్ చావ్లే, ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు ఎందుకు జాప్యం..? 427 ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్ క్రమంగా వాతావరణ ప్రభావం, వాహనాల కాలుష్యంతో దెబ్బ తింటూ వస్తోంది. అంతేకాదు కొందరు పర్యాటకులు కట్టడం గోడలపై లోతుగా పేర్లు చెక్కడం లాంటి పనులతో నిర్మాణం పైపూత దెబ్బతింటోంది. క్రమంగా పగుళ్లు ఏర్పడి వాటిల్లోంచి వాన నీళ్లు, గాలిలోని తేమ లోనికి చొరబడి చార్మినార్‌ను ప్రమాదంలో పడేశాయి. ధవళ వర్ణంతో మెరవాల్సిన గోడలు గోధుమ, పసుపు వర్ణంలోకి మారాయి. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ కాన్పూర్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), విస్కాన్నిన్ విశ్వవిద్యాలయం నిపుణుల బృందం అధ్యయనం చేసి, వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టకుంటే కట్టడం శిథిలమవడం ఖాయమని తేల్చి నివేదిక అందించారు. దీంతో 2014లో పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఏఎస్ఐ నిర్ణయించింది. ఇందుకు దాదాపు రూ.2 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. కానీ.. ఏఎస్ఐ తెలంగాణ విభాగానికి సంవత్సరానికి వచ్చే నిధులు సగటున రూ.2 కోట్లకు అటూఇటుగా ఉంటాయి. దీంతో వాటిల్లోంచి చార్మినార్‌కు ఒక్కో సంవత్సరం కొన్ని లక్షలను మాత్రమే కేటాయిస్తూ వచ్చారు. డంగు సున్నం మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించినందున మళ్లీ అదే మిశ్రమంతో కట్టడం మొత్తం పైపూత వేయటమే ఈ పని. ఏడాదిన్నరలో ఈ పని పూర్తి చేసి, మరో ఏడాదిలో దిగువ భాగాన్ని కూడా సిద్ధం చేయాలని తొలుత భావించారు. కానీ నిధులు సరిపోక, ఆ వచ్చేవి కూడా సకాలంలో విడుదల కాక పనుల్లో ఇంత జాప్యం జరిగింది. -
అడవిని రక్షిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సాంకేతికతంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలు, వసతులను ఉపయోగించుకుని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల పరిరక్షణతో పాటు హరితహారంలో భాగంగా పచ్చదనం గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఆయా లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధించేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అటవీశాఖ భావిస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని అడవుల రక్షణకు ఎలా వినియోగించాలన్న దానిపై దృష్టి పెట్టింది. అడవుల్లో ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలను గుర్తించి సాధ్యమైనంత త్వరగా సమాచారం తెలుసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లకుండా నివారణకు ఇదివరకే నేషనల్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) తో అటవీశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఏతో పాటు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకుని వివిధ సాంకేతికతల సాయంతో మరింత సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపడుతోంది. శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా అడవుల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, తదనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇటీవలే తెలంగాణ ఫారెస్ట్ ప్రొటెక్షన్ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ కూడా భేటీ అయి సాంకేతికను ఏయే పద్ధతుల్లో ఉపయోగించాలన్న దానిపై చర్చించింది. హరితహారానికి చేదోడు వాదోడు.. హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది వంద కోట్ల మొక్కలు పెంచేందుకు వీలుగా కొత్తగా మరిన్ని ఖాళీ ప్రదేశాలు, ప్రాంతాల గుర్తింపునకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనిలో భాగంగా నాటుతున్న మొక్కలు, ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాలను సాంకేతికత పరిజ్ఞానం సాయంతోనే ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అడవుల లోపల, పరిసర ప్రాంతాల్లోనూ చెట్ల నరికివేత, అటవీ ప్రాంతాలను చదును చేయటం తదితర మార్పులను పసిగట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అడవుల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే శాటిలైట్ల ద్వారా వెంటనే గుర్తించి, దీనికి సంబంధించిన క్షేత్ర స్థాయి అటవీ సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతికతను కూడా అటవీ శాఖ ఇప్పటికే ఉపయోగిస్తోంది. ఎన్ఆర్ఎస్ఏ సహకారంతో అడవుల్లో తరచుగా అగ్నిప్రమాదాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని అటవీ సిబ్బంది, అడవుల సంరక్షణలో పాలుపంచుకుంటున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సెల్ఫోన్లకు అగ్నిప్రమాదాలు, ఇతరత్రా ఘటనలకు సంబంధించి ఎన్ఆర్ఎస్ఏ నుంచి వచ్చే అలర్ట్స్‌ను పంపించే ఏర్పాట్లు కూడా చేసింది. టైగర్ రిజర్వ్‌ల్లో డ్రోన్లు.. రాష్ట్రంలో వన్యప్రాణుల వేటతో పాటు, పులులను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న దాడుల ఘటనలు వెలుగులోకి రావడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ల్లో డ్రోన్ కెమెరాలు వినియోగించాలని యోచిస్తోంది. ఇటీవల హైకోర్టు కూడా అడవుల సంరక్షణపై పలు సూచనలు చేయడంతో రక్షణ చర్యలకు సంబంధించి అత్యాధునిక సాంకేతికత ను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులోని టైగర్ రిజర్వ్‌లో డ్రోన్ కెమెరాల ద్వారా పులుల పర్యవేక్షణ జరుపుతున్న విధంగా ఇక్కడ కూడా చర్యలు చేపట్టాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో డ్రోన్ల సేవలు ఉపయోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు ఎన్ఆర్ఎస్ఏ సేవలను తీసుకోనున్నట్టు సమాచారం. డ్రో న్ల వినియోగంపై అధ్యయనం చేసేందుకు కన్హా జాతీయ పార్కుకు ఒక అధ్యయన బృందాన్ని పంపాలనే యోచనలో అటవీశాఖ ఉంది. -
టెక్నాలజీతో అటవీ సంరక్షణ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో అడవుల పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్.ఝా తెలిపారు. ఇందులో భాగంగా టెక్నాలజీ ద్వారా అడవుల ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలను గుర్తించి సమాచారం అందించేందుకు ఇప్పటికే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో అటవీ శాఖ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అరణ్య భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ ఫారెస్ట్ ప్రొటెక్షన్ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో అడవుల సంరక్షణలో టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ఎలా వినియోగించాలన్న దానిపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా పీసీసీఎఫ్(విజిలెన్స్) రఘువీర్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు సరిహద్దుల గుర్తింపు, వాటి చుట్టూ 8 వేల కిలోమీటర్ల మేర కందకాలు తవ్వటం (సీపీటీ– క్యాటిల్ ప్రూఫ్ ట్రెంచెస్) గట్లపై రక్షణకు గచ్చకాయ మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల పర్యావరణం, అడవులపై ఒత్తిడి పెరుగుతున్నందున వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ దేవేంద్ర పాండే పేర్కొన్నారు. ఖాళీ ప్రదేశాల గుర్తింపు... హరితహారం లక్ష్యం ఈ ఏడాది వంద కోట్ల మొక్కలకు పెరగటంతో కొత్తగా మరిన్ని ఖాళీ ప్రదేశాలను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఐ.జీ ఏకే మొహంతీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ౖఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సీటీ సైంటిస్ట్ రవి శంకర్ రెడ్డితో పాటు పీసీసీఎఫ్ పీ.కే.ఝా, రఘువీర్, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైశ్వాల్, శోభ పాల్గొన్నారు. -
ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను ప్రారంభించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలోని పీపుల్స్ ప్లాజాలో ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఇన్స్టిట్టూట్ ఆఫ్ ఇంజినీర్స్, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందివ్వనున్నట్లు తెలిపారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వాక్ నిర్వహించారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా..?
వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి గార్లదిన్నె : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి పేర్కొన్నారు. వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాపరిరక్షణ యాత్రలో భాగంగా బుధవారం మండల వ్యాప్తం గా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో సమావేశాలు నిర్వహిం చారు. కొప్పలకొండలో డీఇఓ అంజయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణయాత్రకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. ఓబుళపతి మాట్లాడుతూఉపాధ్యాయ సాహర్థ్య పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌టీఎఫ్ పని చేస్తుందని తె లిపారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి , వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా నాయకులు అజీమొద్దీన్, పవన్‌కుమార్, శివప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. సమాఖ్య 81వ ఆవిర్భావ వేడుకలను భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. సమాఖ్య జెండాను ఆవిష్కరించిన అనంతరం 80 మీట ర్ల పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాని కి పూల మాలలు వేశారు. అనంతరం జూని యర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివరామక్రిష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానంటూ మభ్యపెడుతూ ఆంధ్రా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, నాయకులు మట్టి సర్వేష్, భగత్, వెంకటేష్, నవీన్, రాజేందర్, మహేందర్, సీపీఐ నాయకులు రాజ్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు. -
టైటానిక్ హీరో గొప్ప మనసు
లాస్ ఎంజిల్స్: టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో పర్యావరణ సంరక్షణ కోసం భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. లావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో క్రిస్టల్ అవార్డ్ ప్రదానోత్సవం సందర్భంగా తన లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్(ఎల్డీఎఫ్) ద్వారా 15 మిలియన్ డాలర్లు( సుమారు రూ 100 కోట్లు) పర్యావరణ హితం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా డికాప్రియో మాట్లాడుతూ.. మన భవిష్యత్తు తరాల కోసం సుస్థిరతను సాధించడం చాలా అవసరం అందుకోసం పర్యావరణ సంరక్షణకు ఎల్డీఎఫ్ చేపట్టే నూతన కార్యక్రమాలను వేగవంతం చేయడం కోసం ఈ నిధులను కెటాయిస్తున్నట్లు తెలిపాడు. ఈ నిధుల్లో కొంత భాగాన్ని అంతరించిపోతున్న రెయిన్ ఫారెస్ట్‌ల సంరక్షణకు, ఈక్వెడార్ ప్రాంతంలో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ మూలంగా నష్టపోతున్న అమేజాన్ ప్రాంత సంరక్షణ కోసం ఉపయోగించనున్నట్లు డికాప్రియో వెల్లడించారు. -
జంట జలాశయాల పరిరక్షణకు శ్రీకారం
- సమీప గ్రామాల మురుగు నీరు చేరకుండా నాలుగు ఎస్టీపీల నిర్మాణం - సమగ్ర నివేదిక రూపొందిస్తున్న పీబీఎస్ కన్సల్టెన్సీ - నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్న నివేదిక సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల( హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్) పరిరక్షణకు జలమండలి శ్రీకారం చుట్టింది. సమీప గ్రామాలు, రిసార్టులు, కళాశాలల నుంచి వచ్చి చేరుతున్న మురుగు నీటితో భవిష్యత్‌లో ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలలు, సమీపంలోని 12 గ్రామాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు జలాశయాల్లోకి చేరకుండా ఉండేందుకు నాలుగు మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటి నిర్మాణంతోపాటు జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతలను నగరానికి చెందిన పీబీఎస్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఈనెలాఖరులోగా సదరు సంస్థ నివేదికను బోర్డుకు అందజేస్తుందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నివేదిక దృష్టిసారించనున్న అంశాలివే.. - జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా నాలుగు మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపు. మురుగు నీటి అంచనా. - సుమారు పదివేల కి.మీల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జలాశయాల సరిహద్దులు, జి.ఓ.111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ పరిధి వరకు జలాశయాల సరిహద్దులను పక్కాగా గుర్తించడం. ఇందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సహాయం తీసుకోవడం. - జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికతో ఎన్జీఆర్ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరవాత డిజిటల్ మ్యాపులు సిద్ధంచేయడం. - జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించడంతోపాటు జంతు, వృక్ష అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, జలాశయాల అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు. - జలాశయాల్లో నీటి రంగు మారకుండా ఏరియేషన్(ఆక్సిజన్‌స్థాయి పెంపునకు) వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించడం. - జలాశయాల్లో చేపలవేట నిషేధం. ఈ విషయంలో స్థానికుల సహకారం తీసుకోవడం. - ఫుల్ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్)వరకు ఉన్న చెట్లను కూకటి వేళ్లతో సహా తొలగించడం. - జలాశయాల్లోకి వరదనీరు చేర్చే 9 ఇన్‌ఫ్లో మార్గాల గుర్తింపు, వాటి ప్రక్షాళన. - ఎగువ ప్రాంతాలు, ఇన్‌ఫ్లో చానల్స్‌లో మట్టి, ఇసుక తోడుతున్న మాఫియాపై క్రిమినల్ కేసుల నమోదు. - క్రిమిసంహారకాలు కలిసిన వ్యర్థజలాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చి కలుస్తున్న నీటిని జలాశయాల్లోకి ప్రవేశించనీయకుండా తీసుకోవాల్సిన చర్యలు. - ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, రిసార్టులు, గృహవ్యర్థాలు, పరివాహ ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్న మురుగు నీటి కట్టడికి అవసరమైన చర్యలు. - చేపల పెంపకం, వేట, బట్టలుతకడం, స్నానాలు చేయడం వంటి చర్యలపై నిషేధం. - రిజర్వాయర్‌లోకి ప్రవేశించే అన్ని కెనాల్స్ పరిరక్షణ చర్యలు సూచించడం. - జలాశయాల పరిరక్షణ విషయంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, అటవీ శాఖల ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక. -
చెరువులు గ్రామాల ఆస్తులు
వాటి పరిరక్షణకు ఉద్యమిద్దాం: సీఎం సూక్ష్మనీటి సేద్యపు పథకానికి పరిమితులు లేవు గజ్వేల్ అభివృద్ధిపై సమీక్ష సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘చెరువులు గ్రామాల ఆస్తులు.. మన చెరువులను మనమే రక్షించుకుందాం. శ్రమదానం చేద్దాం. కాకతీయులు, రెడ్డిరాజుల నాటి వైభవాన్ని తిరిగి తెచ్చుకుందామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో కబ్జా కోరల్లో చిక్కిన చెరువులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో జరిగిన గజ్వేల్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఒకరిద్దరి కోసం ముఖాలు చూడొద్దని, సర్పంచ్‌లు, ప్రజలంతా కలసికట్టుగా చెరువుల్లోకి నీళ్లు తెచ్చే కట్టుకాల్వలను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ జిల్లాల్లో మొత్తం 45 వేల చెరువులు ఉన్నాయని, వీటి ద్వారా 265 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉందన్నారు. కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో చెరువులే తాగు నీళ్లందించాయని, ఇప్పుడు కాకతీయ మిషన్ ద్వారా చేపట్టబోయే చెరువుల పునరుద్ధరణతో మళ్లీ ఆనాటి వైభోగం రావాలన్నారు. ఒకసారి చెరువులను తోడితే వారం పాటు దేవుడు కరుణిస్తే మూడేళ్లదాకా కరువు వచ్చే పరిస్థితే ఉండదని సీఎం పేర్కొన్నారు. చెరువుల విస్తరణక అవసరమైతే పదెకరాల భూమిని కొనుగోలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చెరువుల పునరుద్ధరణను ఒక సామాజిక ఉద్యమంగా తీసుకొని ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని ఆయన కోరారు. గోదావరి నదీజలాలతో గజ్వేల్ నియోజకవర్గంలోని పంట పొలాలను కలుపుతామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ద్వారా మెదక్, కరీంనగర్ మొదలగు జిల్లాలకు సాగునీరందిస్తామని చెప్పారు. వర్గల్ మండలం పాములపర్తి, ములుగు మండలం మర్కుక్ గ్రామాల మధ్య నిర్మించనున్న రిజర్వాయర్‌ను టీఎంసీ నుంచి 20టీఎంసీలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బిందు సేద్యం చేసే రైతులకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీతో, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీతో అంది స్తామన్నారు. ప్రతి గ్రామంలో ఏడాదికి 40 వేల మొక్కల చొప్పున మూడేళ్ల పాటు కోటి 20 లక్షల మొక్కలు పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామంలో పారిశుద్ధ్యం కోసం మండల కేంద్రానికి 50లక్షలు, గ్రామానికి 25లక్షలు, మదిర గ్రామాలకు 10లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి మండలానికి 104 వాహనాన్ని సమకూరుస్తామని, ఇప్పుడున్న 108 వాహనాల సంఖ్యను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటీల్, కలెక్టర్ రాహుల్‌బొజ్జా, జేసీ శరత్, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుతోపాటు ఉన్నతాధికారులు, గజ్వేల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక చేతలే!: కేసీఆర్ ఇక మాటలు కాదు.. అన్ని చేతలేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు దూసుకెళుతానని చెప్పారు. పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు. ‘‘ వచ్చే ఐదేళ్ల వరకు ఎన్నికల్లేవ్.. ఇక రాజకీయాలకు ఆస్కారమే ఉండదు. నిధులు ఇచ్చే బాధ్యత నాది.. అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీది’’ అని ప్రజాప్రతినిధులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామానికి రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సీఎం తెలిపారు. మనం చేపట్టే అభివృద్ధి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని కేసీఆర్ చెప్పారు. -
జీవ వైవిధ్యంతోనే రైతుకు రక్షణ
ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ హంపయ్య వెల్లడి హైదరాబాద్: జీవ వైవిధ్య చట్టం కళ్లుగప్పి తరలిపోతున్న జీవవనరుల పరిరక్షణతోనే రైతుకు లబ్ధి చేకూరుతుందని ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ డాక్టర్ ఆర్.హంపయ్య, సభ్య కార్యదర్శి ఎన్.చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. జీవ వైవిధ్య చట్టం, నియమావళి, వినియోగంపై వారు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈ చట్టం 2002లో వచ్చినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల వన్యప్రాణులు, ఔషధ మొక్కల ఉత్పత్తులు, జల సంపద వంటివి ఎటువంటి అనుమతులు లేకుండానే తరలిపోతున్నాయని వివరించారు. గిరిజనులు సేకరించే సహజ ఉత్పత్తులనేకానికి కనీస ధర కూడా ఇవ్వకుండానే పెద్దపెద్ద కంపెనీలు తరలించుకుపోతున్నాయన్నారు. మున్ముందు జీవ వైవిధ్య చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ సౌలభ్య సంస్థ (జీఇఎఫ్) కింద గ్రామీణ ప్రాంతాల్లోని జీవ వనరుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఆ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త జి.సాయిలు తెలిపారు.