సందర్భం
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) శక్తి (ఎనర్జీ) వినియోగం తగ్గించడానికి విధా నాలు, వ్యూహాల అభివృద్ధికి సహాయపడే రాజ్యాంగ పరమైన సంస్థ. భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ద్వారా శక్తి ప్రాముఖ్యం గురించి ప్రజలు తెలుసు కోవటానికి, అలాగే తక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా ఎక్కువ శక్తిని ఆదా చేయడానికి ప్రోత్సహిస్తుంది. ప్రజా జీవితంలో శక్తి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడం; శక్తి పరిరక్షణ దినోత్సవం లక్ష్యాలుగా చర్చలు, సమావేశాలు, పోటీలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇంధన పరిరక్షణ ప్రక్రియను ప్రోత్సహించడం... వంటి ప్రధాన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తూంటుంది. శక్తిని అనవసరమైన వాటికి వాడటాన్ని నివారించడంతో పాటు, తక్కువ శక్తిని ఉపయోగించడం భవిష్యత్తుకు చాలా అవసరం. ప్రతి ఏడాదీ ‘జాతీయ శక్తి వినియోగ దినోత్సవం (నేషనల్ ఎనర్జీ కన్జ ర్వేషన్ డే)’న్ని డిసెంబర్ 14న భారతదేశం అంతటా జరుపుకొంటారు.
2013 నుండి మొత్తం ప్రాథమిక ఇంధన వినియోగంలో చైనా, అమెరికా తరువాత ప్రపంచంలో మూడవ స్థానంలో భారత్ ఉంది. అలాగే అమెరికా, చైనా తరువాత 2017లో 221 మిలియన్ టన్నుల చమురు వినియోగంలో భారత్ మూడవ స్థానంలో ఉంది. మొత్తం ప్రాథమిక శక్తిలో దాదాపు 45% నికర శక్తి దిగుమతిదారుగా మన దేశం ఉంది. 2017లో 294.2 మెట్రిక్ టన్ను లతో భారత్ బొగ్గు ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో నిలిచింది. భారత దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో దాదాపు 80% బొగ్గు నుంచి వస్తుంది. ఇది దేశ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు ప్రధాన కారణం.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగంలో భారతదేశంరెండవ స్థానంలో ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచ ఇంధన వినియోగంలో 3.4% వాటా కలిగిన భారత్ 6వ స్థానంలో ఉంది. భారతదేశం తన ఇంధన డిమాండ్లను తీర్చడానికి ఎక్కువగా శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశ విద్యుత్ ఉత్ప త్తిలో 80% శిలాజ ఇంధనాల నుండే జరుగుతోంది.
చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్లలో మన దేశం ఒకటి. 2035 నాటికి... ప్రపంచ ఇంధన డిమాండ్ పెరుగుదలకు కారణమయ్యే దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 18% పెరుగుదలకు కారణమవుతుంది. భారతదేశపు పెరుగుతున్న ఇంధన డిమాండ్లు పరిమిత దేశీయ చమురు, గ్యాస్ నిల్వలను దృష్టిలో పెట్టుకుని దేశం తన పునరుత్పాదక, అణు విద్యుత్ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతి ష్ఠాత్మక ప్రణాళికలను చేపట్టింది. మన దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్‌ను కలిగి ఉందన్న సంగతి ఇక్కడ గమనార్హం. శిలాజ ఇంధనాలకు బదులుగా వాడటా నికి ఏ ఒక్క శక్తి వనరూ సిద్ధంగా లేదు.
చదవండి: ఇది మాయ కాక మరేమిటి?
అందుకే కనీసం గృహ అవసరాలకు వినియోగించే శక్తి పరిమాణాన్ని తగ్గించడం, ఆదా చేయడం వంటి చర్యలతో శక్తి వనరులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. రోజువారీ అనవసర వాడకాన్ని తగ్గించడం, తగిన సమయములో బల్బులను మార్చడం, స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించడం, శక్తి సామర్థ్య నీటి తాపన ఖర్చులను తగ్గించడం, కార్యాలయ పరికరాలు, ఉపకరణాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ఇంటిని ఇన్సులేట్ చేయడం మొదలయిన పద్ధతులు ఇందుకోసం పాటించవచ్చు.
- డాక్టర్ పిఎస్. చారి
మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్
(డిసెంబర్ 14న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే)
Comments
Please login to add a commentAdd a comment