టైటానిక్ హీరో గొప్ప మనసు
లాస్ ఎంజిల్స్: టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో పర్యావరణ సంరక్షణ కోసం భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. లావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో క్రిస్టల్ అవార్డ్ ప్రదానోత్సవం సందర్భంగా తన లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్(ఎల్డీఎఫ్) ద్వారా 15 మిలియన్ డాలర్లు( సుమారు రూ 100 కోట్లు) పర్యావరణ హితం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపాడు.
ఈ సందర్భంగా డికాప్రియో మాట్లాడుతూ.. మన భవిష్యత్తు తరాల కోసం సుస్థిరతను సాధించడం చాలా అవసరం అందుకోసం పర్యావరణ సంరక్షణకు ఎల్డీఎఫ్ చేపట్టే నూతన కార్యక్రమాలను వేగవంతం చేయడం కోసం ఈ నిధులను కెటాయిస్తున్నట్లు తెలిపాడు. ఈ నిధుల్లో కొంత భాగాన్ని అంతరించిపోతున్న రెయిన్ ఫారెస్ట్‌ల సంరక్షణకు, ఈక్వెడార్ ప్రాంతంలో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ మూలంగా నష్టపోతున్న అమేజాన్ ప్రాంత సంరక్షణ కోసం ఉపయోగించనున్నట్లు డికాప్రియో వెల్లడించారు.