DiCaprio
-
ఆ హీరో ఆస్కార్ ఒత్తిడిని ఇలా జయించాడు!
లాస్ఏంజిల్స్: ఓవైపు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర పడుతోంది. మరోవైపు ఆరుసార్లు నామినేట్ అయిన తమ అభిమాన హీరో ఈ సారైనా ఆస్కార్ గెలుస్తాడా అని ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కళ్లన్నీ ఆయనపైనే. ఈ నేపథ్యంలో మరి ఆ హీరోపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎట్టకేలకు రెవనాంట్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న లియోనార్డో డికాప్రియో ఆస్కార్ ఒత్తిడిని ఎలా అధిగమించాడు అనే అంశంపై ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 88వ ఆస్కార్ అవార్డుల సందర్భంగా తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉండటానికి లియోనార్డో డికాప్రియో పెద్ద కసరత్తే చేశాడట. అదే తేనెటీగలతో సావాసం. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్న కొద్దీ.. పెరుగుతున్న ఒత్తిడిని దూరం చేయటానికి డికాప్రియోకు ఆయన తల్లి స్నేహితుడు డేవిడ్ సహాయం చేశాడు. స్వతహాగా తేనెటీగల పెంపకంలో మంచి అనుభవం ఉన్నవాడు అయిన డేవిడ్.. డికాప్రియోను ఆ పనిలో మునిగిపోయేలా చేశాడట. తేనెటీగలను పెంచుతూ మన హీరో మిగతా విషయాల గురించి ఆలోచించలేదట. దీని ద్వారా అవార్డుల కార్యక్రమానికి ముందుగా డికాప్రియో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోకుండా ఉన్నాడని మీడియా సంస్థ మిర్రర్ వెల్లడించింది. -
టైటానిక్ హీరో గొప్ప మనసు
లాస్ ఎంజిల్స్: టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో పర్యావరణ సంరక్షణ కోసం భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. లావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో క్రిస్టల్ అవార్డ్ ప్రదానోత్సవం సందర్భంగా తన లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్(ఎల్డీఎఫ్) ద్వారా 15 మిలియన్ డాలర్లు( సుమారు రూ 100 కోట్లు) పర్యావరణ హితం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా డికాప్రియో మాట్లాడుతూ.. మన భవిష్యత్తు తరాల కోసం సుస్థిరతను సాధించడం చాలా అవసరం అందుకోసం పర్యావరణ సంరక్షణకు ఎల్డీఎఫ్ చేపట్టే నూతన కార్యక్రమాలను వేగవంతం చేయడం కోసం ఈ నిధులను కెటాయిస్తున్నట్లు తెలిపాడు. ఈ నిధుల్లో కొంత భాగాన్ని అంతరించిపోతున్న రెయిన్ ఫారెస్ట్‌ల సంరక్షణకు, ఈక్వెడార్ ప్రాంతంలో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ మూలంగా నష్టపోతున్న అమేజాన్ ప్రాంత సంరక్షణ కోసం ఉపయోగించనున్నట్లు డికాప్రియో వెల్లడించారు. -
నవంబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: డికాప్రియో (హాలీవుడ్ నటుడు), రాబిన్ ఉతప్ప (క్రికెటర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతి సంఖ్య కావడం వల్ల నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా గుర్తింపబడతారు. ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మంచి పనిమంతులుగా పేరుతెచ్చుకుంటారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. కొత్త కొత్త కోర్సులు చేస్తారు. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. వీరు పుట్టిన తేదీ 11. ఇది న్యూమరాలజీలో మాస్టర్ నంబర్. దీని వల్ల ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు స్వతఃసిద్ధంగా అబ్బుతాయి. సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలనుంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే నేత్రవ్యాధులు, హృద్రోగాలు, మానసిక అస్థిరత ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,7; లక్కీ కలర్స్: పర్పుల్, గ్ల్రే, ఎల్లో, బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్