డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి సౌందర్యం ప్రపంచం నలుమూలల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విదేశీ వలస పక్షులకు శీతాకాలపు ఆవాసాలుగా మారే ప్రదేశాలు ఉత్తరాఖండ్‌లో అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది ప్రతియేటా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వలస పక్షులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఉంది.
అక్టోబర్ వచ్చేసరికి సెంట్రల్ ఆసియా, సైబీరియా, కజకిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా తదితర శీతల ప్రాంతాల నుండి వేలాది విదేశీ పక్షులు అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు తరలివస్తాయి. కఠినమైన శీతాకాలం నుండి తప్పించుకునేందుకు ఈ పక్షులు డెహ్రాడూన్‌లోని ఈ అందమైన ప్రదేశానికి వచ్చి నివసిస్తాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆరు వేలకుపైగా విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తాయి. మార్చిలో అవి మళ్లీ తమ స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఈసారి అక్టోబరులోనే 300లకు పైగా పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి.
రడ్డీ షెల్డక్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, కామన్ పోచార్డ్, యురేషియన్ విజియన్ వంటి పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అందమైన నీటి పక్షులను చూడటానికి పక్షి ప్రేమికులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌లో పక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెహ్రాడూన్ నుండి చక్రతా జాతీయ రహదారి మీదుగా హెర్బర్ట్‌పూర్ చేరుకోవచ్చు. అసన్ కన్జర్వేషన్ ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం
Comments
Please login to add a commentAdd a comment