reserve
-
కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి సౌందర్యం ప్రపంచం నలుమూలల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విదేశీ వలస పక్షులకు శీతాకాలపు ఆవాసాలుగా మారే ప్రదేశాలు ఉత్తరాఖండ్‌లో అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది ప్రతియేటా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వలస పక్షులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఉంది.అక్టోబర్ వచ్చేసరికి సెంట్రల్ ఆసియా, సైబీరియా, కజకిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా తదితర శీతల ప్రాంతాల నుండి వేలాది విదేశీ పక్షులు అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు తరలివస్తాయి. కఠినమైన శీతాకాలం నుండి తప్పించుకునేందుకు ఈ పక్షులు డెహ్రాడూన్‌లోని ఈ అందమైన ప్రదేశానికి వచ్చి నివసిస్తాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆరు వేలకుపైగా విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తాయి. మార్చిలో అవి మళ్లీ తమ స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఈసారి అక్టోబరులోనే 300లకు పైగా పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి.రడ్డీ షెల్డక్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, కామన్ పోచార్డ్, యురేషియన్ విజియన్ వంటి పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అందమైన నీటి పక్షులను చూడటానికి పక్షి ప్రేమికులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌లో పక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెహ్రాడూన్ నుండి చక్రతా జాతీయ రహదారి మీదుగా హెర్బర్ట్‌పూర్ చేరుకోవచ్చు. అసన్ కన్జర్వేషన్ ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం -
పిన్నెల్లి వ్యాజ్యాలపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్‌లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండిఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండిపోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధంఅనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్‌రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
కవితకు బెయిల్‌పై 8న తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్‌లు వాదనలు వినిపించారు. తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్ సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
ప్రణీత్‌రావు పిటిషన్లో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
ఫ్రిడ్జ్ అవసరం లేని ఇన్సులిన్!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఫ్రిడ్జ్‌లలోనే నిల్వ చేసే పద్ధతికి ఇక స్వస్తి చెప్పవచ్చు. గది ఉష్ణోగ్రతలోనే కాదు.. మరింత ఎక్కువ వేడిని కూడా తట్టుకొని పనిచేయగల సరికొత్త ఇన్సులిన్‌ను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) సంయుక్తంగా అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఇప్పటివరకూ ఇంజెక్షన్ల రూపంలో తీసుకొనే ఇన్సులిన్‌ను కచ్చితంగా రిఫ్రిజరేటర్లలోనే నిల్వ చేయాల్సి వచ్చేది. లేదంటే కొన్ని గంటల వ్యవధిలోనే అందులో ఫిబ్రిలేషన్స్ (చిన్నచిన్న గడ్డలు కట్టడం) జరిగిపోయి అది వాడకానికి పనికిరాకుండా పోతుంది. అలాగని ఎక్కువ కాలం కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచినా అది పాడైపోతుంది. ఈ కారణంగానే ఇన్సులిన్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా.. సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉంచినా చెడిపోని ఇన్సులిన్‌ను తయారు చేయగలిగితే ఎన్నో లాభాలుంటాయి. దీనిపై దృష్టిపెట్టిన ఐఐసీటీ, ఐఐసీబీ శాస్త్రవేత్తలు... ఓ పెప్టైడ్ ద్వారా ఇన్సులిన్‌కు ఉన్న లోపాలను పరిష్కరించవచ్చునని గుర్తించారు. నాలుగు అమినోయాసిడ్లతో కూడిన ఈ పెప్టైడ్‌కు వారు ‘ఇన్సులక్’ అని పేరు పెట్టారు. ఈ పెప్టైడ్ ఇన్సులిన్ గడ్డకట్టకుండా ఉండగలదని, వేడి కారణంగా జరిగే నష్టాన్నీ అడ్డుకోగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. అలాగే ఇన్సులక్ చేర్చడం వల్ల ఇన్సులిన్ పనితీరులో ఏ మార్పులూ కనిపించలేదు. ఇన్సులక్తో కూడిన ఇన్సులిన్‌ను సాధారణ గది ఉష్ణోగ్రతల్లోనే నెలలకొద్దీ నిల్వ చేయవచ్చని అంతర్జాతీయ జర్నల్ ‘ఐసైన్స్’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు -
విజయ్ మాల్యాకు షాకిచ్చిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి.. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడంటూ 2017లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ యూయూ లలిత్, అశోక్ భుషణ్లతో కూడిన ధర్మాసనం మల్యాకు వ్యతిరేకంగా డబ్బు కొల్లగొట్టడం, ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలు ఉన్నట్లు అభిప్రాయపడింది. అంతేకాక మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్‌ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని ధర్మాసనం ఈ ఏడాది జూన్‌లోనే ఆదేశించింది. అంతేకాక ఈ రివ్యూ పిటిషన్‌కు సంబంధించిన ఫైల్‌ను ఏ ఏ అధికారులు డీల్ చేశారో అందరి వివరాలను అందించాలని ధర్మాసనం ఆదేశించింది. (చదవండి: మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!) ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపు వ్యవహారంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14, 2017 నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. దీనిలో భాగంగా గురువారం సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. -
కవ్వాల్ నుంచి రెండు గ్రామాలు రీలొకేట్
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రధాన అటవీ ప్రాంతం (కోర్ ఏరియా) నుంచి మైసంపేట, రాంపూర్ గ్రామాలను రీలొకేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 112 హెక్టార్ల అటవీప్రాం తాన్ని డీనోటిఫై చేస్తూ ఆదేశాలిచ్చింది. గురువారం ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులిచ్చారు. గ్రామస్తులు ఖాళీ చేసిన ప్రాంతాన్ని అటవీశాఖ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని, తగిన విధంగా నిర్వహించాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ నివాసుల (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్), 2006 చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలోని వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు (ట్రాన్స్‌లొకేషన్) పీసీసీఎఫ్ చర్యలు తీసుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అటవీశాఖ పర్యవేక్షణలో చెట్లను కొట్టాలని పేర్కొన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస ప్రక్రియ ఏ మేరకు జరిగిందన్న దానిపై చెన్నైలోని కేంద్ర అటవీశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిశీలిస్తుందని, ఒకవేళ గ్రామస్తులు వెనక్కు వెళితే ఈ అనుమతిని తిరగదోడవచ్చునని స్పష్టం చేశారు. తొలి ఐదేళ్ల వరకు ప్రాంతీయ కార్యాలయం పరిశీలనను కొనసాగిస్తుందని తెలిపారు. అటవీ భూమిలో లేబర్ క్యాంప్‌లు లేకుండా పీసీసీఎఫ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. దశలవారీగా తరలింపు దశల వారీగా కవ్వాల్ అడవి ప్రధాన ప్రాంతం నుంచి వివిధ గ్రామాలు, నివాసిత ప్రాంతాలను బయటి ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అడ్మిన్, వైల్డ్‌లైఫ్ ఇన్చార్జి అడిషనల్ పీసీసీఎఫ్ మునీంద్ర ‘సాక్షి’కి తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తుల నుంచి స్వచ్ఛంద అంగీకారం తీసుకున్నాకే వారిని ఇతర ప్రాంతాల్లోకి పంపించే ప్రక్రియను చేపడుతున్నట్టు చెప్పారు. గ్రామసభల్లో తీర్మానం చేశాకే తరలింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ గ్రామాల ప్రజలకు ప్రధాన అటవీ ప్రాంతం కాకుండా ఇతర అటవీ ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. టైగర్ రిజర్వ్‌లోని కోర్ ఏరియాలో మొత్తం 37 వరకు ఆవాసాలు (హ్యాబిటేషన్లు) ఉన్నాయని, వాటిలో మైసంపేట, రాంపూర్ గ్రామాలను రీలొకేట్ చేయడం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. -
‘అయోధ్య మధ్యవర్తి’ తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాద కేసును మధ్యవర్తికి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సమస్య పరిష్కారానికి అర్హులైన మధ్యవర్తుల పేర్లు సూచించాలని కక్షిదారుల్ని కోరింది. ఈ వ్యవహారంలో త్వరలోనే ఆదేశాలు జారీచేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తెలిపింది. వివాద స్వభావం దృష్ట్యా మధ్యవర్తిత్వ మార్గం ఎంచుకోవడం సరైనది కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సమస్య సద్దుమణిగేందుకు అవకాశం ఉన్నప్పుడే ఈ దిశగా యోచించాలని పేర్కొన్నారు. గతంలోనూ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కక్షిదారు రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు లాయర్ సీఎస్ వైద్యనాథన్ గుర్తుచేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయంలో ఎలాంటి వివాదం లేదని, కాబట్టి ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమి ప్రభుత్వానికే చెందుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆ స్థలంలో ఆలయం ఉండేదని గుర్తిస్తే, రామాలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని 1994లో పీవీ ప్రభుత్వం కోర్టుకు మాట ఇచ్చిన సంగతిని ప్రస్తావించారు. వివాదం ఆస్తికే సంబంధించికాదని, సెంటిమెంట్లు, విశ్వాసాలతోముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న కోర్టు సూచనకు ముస్లిం సంస్థలు అంగీకరించగా, హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. -
‘శబరిమల’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ బుధవారం ముగిసింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలోనే తీర్పును ప్రకటిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల లాయర్లు రాతపూర్వక వాదనలను సేకరించి వారంలోగా తమ ముందు ఉంచాలని ఆదేశించింది. చివరి రోజు విచారణలో కేరళ ప్రభుత్వం తరఫు లాయర్ జయ్‌దీప్ గుప్తా వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్యనున్న మహిళలు రాకుండా నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నారు. -
‘కేసుల కేటాయింపు’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపు (రోస్టర్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలన్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. కేసుల కేటాయింపు బాధ్యతను ఐదుగురు జడ్జీల కొలీజియంకు అప్పగించాలని కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఫలానా కేసు తనకు కేటాయించలేదని లేదా ఎందుకు కేటాయించరంటూ కొందరు జడ్జీలు అసంతృప్తికి గురయిన సందర్భాలు కూడా హైకోర్టుల్లో ఉన్నాయని విచారణ సందర్భంగా జడ్జి సిక్రి అన్నారు. పిటిషనర్ తరఫున దుశ్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. సున్నితమైన కొన్ని కేసుల బాధ్యతను కొన్ని బెంచ్‌లకే అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ‘మాస్టర్ రోస్టర్’గా సీజేఐకు అపరిమిత అధికారం ఉన్నట్లు కాదని తెలిపారు. సుప్రీంజడ్జిగా ఇందూ ప్రమాణం సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా(61) సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె రాకతో సుప్రీంజడ్జీల సంఖ్య 25కు చేరుకుంది. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. సుప్రీం చరిత్రలో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జీలు పనిచేయడం ఇది మూడోసారి. -
సాగర తీరంలో... సైట్ కావాలా..!
మీలో ఎవరైన సమ్మర్ వెకేషన్ కోసం ఉత్తర పోలాండ్లోని బాల్టియా సముద్ర తీరానికి వెళ్లాలను కుంటే మాత్రం కొంచెం ముందుగానే జాగ్రత్త పడాలి. ఆ బీచ్‌లో కొంత స్థలాన్ని ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. మీస్థలాన్ని ఇతరులతో వేరు చేసేలా నిర్మించుకోవడమో లేక అక్కడ కొంత స్థలాన్ని కొనుగోలు చేయడమో చేయాలి. ఎందుకంటే ఆ బీచ్‌లో ప్రతి ఒక్కరికి కొంత ప్రదేశాన్ని కేటాయిస్తారు. ఇది చాలా ఏళ్లుగా వస్తున్నపోలాండ్ సంప్రదాయమట.. కాకపోతే ఈ మధ్య కాలంలో విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువవడం, సామాజిక మాధ్యమాలు పెరిగిపోవడం, వాటిలో వీరు తమ ఫొటోలను షేర్ చేయడంతో ఈ సంప్రదాయం ఇంకాప్రాచుర్యంలోకి వచ్చిందని పోలాండ్ మీడియా చెబుతోంది. కర్రలను మట్టిలో నాటి వాటి చుట్టూ ఒక పెద్ద రంగు రంగుల గుడ్డను చుడతారు. బీచ్‌కు వచ్చే కుటుంబ సభ్యుల పరిమాణం బట్టి ఎంత స్థలం కావాలో అంతకేటాయిస్తారు. -
సైకిల్ గుర్తు రిజర్వ్!
• ఎస్పీ గుర్తుపై ఇరువర్గాల వాదలను విన్న ఈసీ • వీలైనంత త్వరలో నిర్ణయం వెలువరుస్తామని ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ గుర్తు (సైకిల్)పై రేగిన వివాదంలో తమ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రిజర్వ్ చేసింది. యూపీ శాసనసభ ఎన్నికలకు జనవరి 17 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న తరుణంలో గుర్తుపై శుక్రవారం తేలుతుందని భావించినా.. ఫలితం కోసం వేచిచూడక తప్పలేదు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు సైకిల్‌పై దాదాపుగా 5 గంటలసేపు ములాయం వర్గం, అఖిలేష్ వర్గాల వాదనలను విన్న ఈసీ.. తమ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా వెలువరుస్తామని స్పష్టం చేసింది. ములాయం తరపున శివ్‌పాల్, అమర్‌సింగ్.. అఖిలేశ్ వర్గం తరపున రాంగోపాల్ యాదవ్, నరేశ్ అగర్వాల్ ఈసీ ముందు హాజరయ్యారు. మాదంటే మాదే! కేంద్ర ఎన్నికల సంఘం ముందు యూపీ సీఎం అఖిలేశ్ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, రాజేశ్ ధవన్ వాదనలను వినిపించారు. అటు ములాయం వర్గం కూడా గుర్తు తమకే ఇవ్వాలని కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్నికల సంఘం ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఇరువర్గాలు సమర్పించిన వివరాల ప్రకారం ఏ గ్రూపునకు మెజారిటీ ఉందో తేల్చిన తర్వాతే గుర్తుపై ఈసీ స్పష్టత నిస్తుంది. సదరు వర్గానికి ఎన్నికల గుర్తును కేటాయించే విషయం పరిశీలనకు వస్తుంది. గుర్తు స్తంభింపజేసే ఆప్షన్ ఈసీ ముందున్నది నిపుణులంటున్నారు. గుర్తు తమకే దక్కుతుందని అఖిలేశ్ వర్గం ధీమాగా ఉంది. త్వరలోనే తమ వర్గం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపింది. అటు, అఖిలేశ్ వర్గంతో కూటమికట్టే విషయాన్ని కాంగ్రెస్ ఖండించలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి నిర్ణయాలైనా వెలువడొచ్చని కాంగ్రెస్ తెలిపింది. -
కొండలనే మింగుతున్న చిలువలు
వజ్రకూటం ఆర్ఎఫ్లో జోరుగా మట్టి తవ్వకాలు ఫారెస్టు అధికారుల అండదండ రెండేళ్లుగా నిర్విరామంగా సాగుతున్న వైనం దాడులతో బయటపడ్డ భాగోతం అక్రమార్కులు కొండలను పిండేస్తున్నారు. కత్తిపూడికి సమీపంలోని వజ్రకూటం రిజర్వుఫారెస్టు కొండపైకి అక్రమార్కులు జొరబడి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వీరికి అధికార పార్టీ నేతల అండదండ సరేసరి. దీనికితోడు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరో కారణం. వెరసి వజ్రకూటం ఆర్ఎఫ్ బీ624లో ఇప్పటికే కోట్ల రూపాయల విలువచేసే మట్టి బయటి ప్రాంతాలకు తరలించుకుపోయారు. - శంఖవరం శంఖవరం మండలం కత్తిపూడికి సమీపంలోని వజ్రకూటం ప్రాంతంలోని కొండను ఆనుకుని ఖాళీ భూముల్లో కొందరు నిరుపేద రైతులకు డి పట్టా భూములున్నట్లు అక్రమార్కులు గుర్తించారు. మీ భూమిని చదును చేసి అప్పగిస్తామని, మట్టిని తాము తీసుకుంటామని, ఇందుకు ఎకరాకు రూ.లక్ష ఇస్తామని రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని తవ్వకాలు ప్రారంభించినట్లు తెలిసింది. భూమి చదును కావడమే గాక వారిచ్చే రూ.లక్షకు చాలామంది ఆశపడారు. దీనితో ఏళ్ల తరబడి పెంచుకుంటున్న జీడి మామిడి చెట్లను సైతం నరికి మట్టి తవ్వకాలకు అక్రమార్కులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. దాదాపు 10 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది. మొదట డీ పట్టా భూముల్లో తవ్వకానికి దిగిన అక్రమార్కులు క్రమేపీ రిజర్వుఫారెస్టు పరిధిలోకి చొరబడారు. ఈ అక్రమార్కులకు అధికార పార్టీ నేతలు అండదండ ఉండడంతో మట్టి వ్యాపారం మూడు పువ్వూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. పల్లపు భూముల్ని మెరక చేసేందుకే... కాకినాడ, రాజమండ్రి, తుని వైపు జాతీయరహదారిని ఆనుకుని ఉన్న భూముల్ని మెరక చేసేందుకు భారీఎత్తున మట్టి తరలిస్తున్నారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ తంతులో ఇప్పటికే కోట్లాది రూపాయల మట్టిని తరలించుకుపోయినా సంబంధిత అటవీశాఖ అధికారులు ఎన్నడూ స్పందించిన దాఖలాలు లేవు. అటవీశాఖ కత్తిపూడి కేంద్రం చేసుకుని మూడు దశాబ్ధాలకు పైగా ఫారెస్టు ఠాణా నడుపుతోంది. ఈ ఠాణా మీదుగా మట్టి లారీలు రాకపోకలు సాగిస్తున్నా రిజర్వుఫారెస్టు అంతమవుతోందని గుర్తించకపోవడం శోచనీయమం. శంఖవరం సెక్షన్ పరిధిలో ఉన్న ఈ కొండపై పలుచోట్ల మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సెక్షన్ కార్యాలయం కూడా కత్తిపూడిలోనే ఉంది. సంబంధిత అధికారుల అండదండలు అక్రమార్కులకు లభిస్తున్నట్లు చెబుతున్నారు. అక్రమార్కుల ధనార్జనకు ఈ ప్రాంతంలో బొరియపడని కొండలు లేవంటే అతిశయోక్తి కాదు. అంతేగాక లారీల రాకపోకలు అధికమై రోడ్లు ఛిద్రం కావడం, వాతావరణ, వాహన, శబ్ధ కాలుష్యాలు పెరిగి పరిసర గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. తక్షణం దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్ అధికారి దాడి ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్ అధికారి జె.శ్రీనివాస్ ఆధ్వర్యంలోని అటవీ బృందం ఆకస్మికంగా దాడిచేసి మట్టిని తరలింపుకు సిద్ధమైన రెండు లారీలను, ఒక పొక్లయి¬న్ను, ఒక మోటారు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ కొండను ఆనుకుని తవ్విన ప్రదేశాల్ని గుర్తించారు. అం¬తే ఈ ప్రాంతం అటవీశాఖ పరిధిలోనిదా?కాదా? అనే దానిపై నిర్థారణ చేసి తవ్వకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ సందిగ్ధంగా చెప్పడం వెనుక మతలబు ఉందనే వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి¬. ఈ దాడుల్లో శంఖవరం సెక్షన్ ఆఫీసర్ విజయరత్నం కూడా ఉన్నారు. గతంలో ఆయనే కత్తిపూడిలో మకాం ఏర్పాటు చేసుకుని ఉండటం గమనార్హం. -
కార్తీక మాసంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
కడప అర్బన్ : కార్తీక మాసంలో శివాలయాలను సందర్శించే భక్తులు వారు చూడదలచుకున్న పుణ్య క్షేత్రాలకు కడప డిపో నుంచి బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఆర్ఎం చెంగల్‌రెడ్డి, డిపో మేనేజర్ ఆదినారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మందికి తక్కువ కాకుండా గ్రూపులుగా వస్తే టిక్కెట్ ప్రాతిపదికన బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మాసంలో ప్రతి సోమవారం జిల్లాలోని శైవ క్షేత్రాలైన పొలతల, నిత్యపూజకోన పుణ్యక్షేత్రాలకు రద్దీని బట్టి బస్సులు తిప్పుతామన్నారు. శబరిమలై వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు తక్కువ ధరలకు అద్దె ప్రాతిపదికన న్యూ బ్రాడెండ్ బస్సులను సమకూర్చినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర పన్ను మినహాయింపు కలదన్నారు. బస్సును రిజర్వు చేసుకొనదలిచిన వారు కేవలం రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇతర వివరాలకు కడప డీఎం (99592 25774), ఏఎంటీ (73828 65275), ఆర్టీసీ ఏజెంట్ (94404 49559)లను సంప్రదించాలన్నారు. -
రాజస్థాన్ అడవుల్లో పులిపిల్లలు..
న్యూఢిల్లీః ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో పర్యాటకులకు పులిపిల్లలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యప్రాణ ప్రేమికులకు, అధికారులకు ప్రత్యేక వార్తగా మారింది. ఇండియాలో క్రమంగా పులుల సంఖ్య పెరగడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో పర్యటనకు వెళ్ళిన కొందరు పర్యాటకులకు రెండు పులి పిల్లలు కనిపించాయి. దీంతో వన్యప్రాణ ప్రేమికులు సహా అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓ శుభ పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇండియాలోని రాజస్థాన్ రణతంబోర్ రిజర్వ్ అడవుల్లో పులి కూనలు కనిపించడంతో అధికారులు సంబరాలు జరిపారు. పార్కులోని జోన్ 5 కు చెందిన కచిడా ఏరియాలోని ధకడా ప్రాంతంలో టూరిస్టులు ఈ పులి పిల్లలను కనుగొన్నారు. ఈ పిల్లలకు సుమారు రెండు మూడు నెలల వయసు ఉంటుందని, వీటి తల్లి రిజర్వ్ లో నివసిస్తున్న టి-73 అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక ఆ పెద్దపులి మరిన్ని పిల్లలను కూడ కని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జోన్ లో అత్యంత ఎక్కువమంది సందర్శించిన పులిగా పేరుతెచ్చుకున్న... అకాసుందరి పేరుగల టి-17 కు పుట్టిన ఆడపులే టి-73 అని, ఇప్పుడు ఈ టి-73 కూడ ముద్దులొలికే పులి కూనలను కనడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు తాను ఉండేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని, ఇక్కడే నివసిస్తున్న మొదటి ఆడపులి ఈ టి-73 అని, చాలా కాలం తర్వాత ఇక్కడే ఈ పులి పిల్లలను పెట్టడం వన్యప్రాణ ప్రేమికులకు నిజంగానే శుభవార్త అని అధికారులు అంటున్నారు. ఈ అభయారణ్యంలో మరిన్ని ఆడ పులులు పిల్లలు పెట్టి ఉండొచ్చని వాటిని కూడ గుర్తిస్తామని తెలిపారు. -
డిపాజిటర్ల అవగాహన కోసం ఆర్బీఐ గ్రాంట్లు
స్వచ్ఛంద సంస్థల దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 27 న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిటర్లకు అవగాహన కల్పించటానికి రిజర్వుబ్యాంక్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనికోసం ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’ను ఏర్పాటుచేసింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించే వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునివ్వటానికి ఈ ఫండ్ నుంచి వాటికి గ్రాంట్లను మంజూరుచేయనుంది. గ్రాంట్లు పొందే సంస్థలు డిపాజిటర్లకు సురక్షితమైన బ్యాంకు లావాదేవీలు, భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాల్ని, సదస్సులను నిర్వహించాలని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక విధానాలు, విషయాలపట్ల ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాల్ని కూడా చేపట్టవచ్చని తెలిపింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు గ్రాంటు కోసం ఫిబ్రవరి 27 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అలాగే ఫండ్ కోసం ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను విడుదలచేసింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని, వినియోగంలోలేని అకౌంట్ల డబ్బుల్ని బ్యాంకులు వడ్డీతో సహా ఈ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించింది. ఈ ఫండ్ ఒక కమిటీ ఆధీనంలో ఉంటుందని పేర్కొంది. -
బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 1993 నుంచి 218 గనుల కేటాయింపుల్లో అవినీతి, పారదర్శకత పాటించకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. చీఫ్ జస్టిస్ ఆర్ ఎమ్ లోథా సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. -
బడ్జెట్ వరాలపై దేశవ్యాప్త ఆసక్తి
దుగ్గిరాల: సబ్సిడీలు, ప్రణాళికా వ్యయంలో మార్పుల వల్ల ద్రవ్యలోటు 4.5 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగిందని రిజర్వుబ్యాంకు అనుబంధ సంస్థ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ వైస్ చాన్సలర్ సూర్యదేవర మహేంద్రదేవ్ చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఏ విధంగా ఉంటుందోనని దేశం యూవత్తూ ఎదురుచూస్తోందని అన్నారు. ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త సూర్యదేవర సంజీవదేవ్ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ నిర్వహణకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం వచ్చిన ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు, గృహనిర్మాణ పన్ను మినహాయింపు, ఊపాధి అవకాశాల కోసం మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గితే నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టి సాధారణ ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9 శాతంగా ఉందని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ కంటే వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో సంస్కరణలు ఎక్కువగా ఉంటాయన్నారు. మౌలిక వసతులపై పన్ను పదేళ్ల వెనుక తేదీ నుంచి చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్ల రాక తగ్గిందని పేర్కొన్నారు. అన్ని రకాల పరిశ్రమలు తరలివస్తే సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రైతుల రుణ మాఫీపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వివరించారన్నారు. పంటల మద్దతు ధర పెంచాలని కోరేకన్నా దిగుబడులు పెంచటంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. సాధార ణ రకం వరికి రూ.1360 మద్దతు ధర ప్రకటించినట్టు చెప్పారు. దేశమంతటా ఒకే మద్దతు ధర ప్రకటించటం వల్ల దిగుబడి ఎక్కువగా ఉండే పంజాబ్ వంటి రాష్ట్రాలకు లాభం ఉంటుందని, దిగుబడి తక్కువగా ఉన్న ఆంధ్ర వంటి రాష్ట్రాలకు అంతగా లాభం ఉండటం లేదని వివరించారు. రాష్ట్రంలో సాగు పద్ధతులు, సాగునీటి సరఫరా విధానాల్లో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు.