కడప అర్బన్ : కార్తీక మాసంలో శివాలయాలను సందర్శించే భక్తులు వారు చూడదలచుకున్న పుణ్య క్షేత్రాలకు కడప డిపో నుంచి బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, డిపో మేనేజర్ ఆదినారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మందికి తక్కువ కాకుండా గ్రూపులుగా వస్తే టిక్కెట్ ప్రాతిపదికన బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మాసంలో ప్రతి సోమవారం జిల్లాలోని శైవ క్షేత్రాలైన పొలతల, నిత్యపూజకోన పుణ్యక్షేత్రాలకు రద్దీని బట్టి బస్సులు తిప్పుతామన్నారు. శబరిమలై వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు తక్కువ ధరలకు అద్దె ప్రాతిపదికన న్యూ బ్రాడెండ్ బస్సులను సమకూర్చినట్లు చెప్పారు. అంతర్‌రాష్ట్ర పన్ను మినహాయింపు కలదన్నారు. బస్సును రిజర్వు చేసుకొనదలిచిన వారు కేవలం రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇతర వివరాలకు కడప డీఎం (99592 25774), ఏఎంటీ (73828 65275), ఆర్టీసీ ఏజెంట్ (94404 49559)లను సంప్రదించాలన్నారు.