Sabarimalai
-
దీప కాంతుల శోభితం అరుణాచలం
తిరుమలలో బ్రహ్మోత్సవాలు, శబరిమలైలో మకరజ్యోతి ఉత్సవం ఎంత వైభవంగా జరుగుతాయో ..... ప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలంలో కార్తీగ దీపోత్సవాలు అంతటి వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన మొదలైన ఉత్సవాలు 14వ తేదీ దాకా జరుగుతాయి. అతి ముఖ్యమైన భరణీ దీపాన్ని ఈ నెల 10వ తేదీన అంటే వచ్చే మంగళవారం వెలిగిస్తారు. ఆ రోజు సాయంత్రం అరుణాచలం కొండ మీద అత్యంత భారీగా దివ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. పున్నమి రాత్రుల వెన్నెలతో పోటీ పడుతూ వెలిగిపోయే దివ్య జ్యోతి కాంతుల్ని దర్శించుకొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు అరుణగిరికి పయనం అవుతున్న తరుణం ఇది. దాదాపు 10, 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ జ్యోతి దర్శనం ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అనేక విశిష్టతలు గోచరిస్తాయి. వీటినే కార్తీక బ్రహ్మోత్సవాలు అనికూడా అంటారు. ఇందులో మొదటి రోజున అంటే ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన .. అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు. అంటే వినాయకుడు, కుమారస్వామి, చండీశ్వర స్వామి సహా పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఇక ప్రతీ రోజూ రెండు పూటలా ఉదయం సమయంలో చంద్రశేఖరమూర్తిగా, రాత్రి సోమస్కంధ మూర్తిగా ఊరేగింపు నిర్వహిస్తూ వచ్చారు. ఇక ఎనిమిదో రోజు వచ్చేసరికి ఉత్సవాలు ఊపందుకోవటం జరుగుతుంది. పదో రోజు కార్యక్రమాన్ని దృష్టిలోపెట్టుకొని చాలా మంది భక్తులు ముందుగానే విచ్చేస్తుంటారు. ఎనిమిదో రోజు అంటే నేటి ఉదయం అశ్వవాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం 4 గంటల నుండి భిక్షాటనమూర్తి మాఢవీధులలో ఊరేగింపు జరుగుతుంది. అదేరోజు రాత్రి పంచకళ్యాణివాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇందులో నాలుగు కాళ్లు కిందకు ఆనని రీతిలో దీన్ని రూపొందించారు. తొమ్మిదోరోజు ఉదయం పురుష మృగ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. రాత్రి కైలాస రావణ వాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇక ఈ సమయానికి నెమ్మదిగా అరుణాచల క్షేత్రం భక్తులతో పోటెత్తుతుంది. డిసెంబరు 10న ఉదయం 4 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణీదీపం వెలిగిస్తారు. ఈ రోజంతా భక్తుల పూజలతో క్షేత్రం మార్మోగిపోతుంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అరుణగిరి మీద మహాదీపం వెలుగుతుంది. దీనిని దీపనాడార్ వంశస్తులు తీసుకొని రావటం సాంప్రదాయం. 600 మీటర్ల ఒత్తితో 2500 కేజీల ఆవునెయ్యితో అత్యంత వైభవంగా మహాదీపోత్సవం కాగానే అరుణగిరి కోటి కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోతుంది. ఈ వైభవాన్ని చూసేందుకు వెయ్యికనులు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున జరిగే ఊరేగింపును చూస్తుంటే ఒడలు పులకించిపోవటం ఖాయం. అగ్ని రూపుడైన అరుణాచలేశ్వరుడు దేవేరితో కలిసి అరుణ కాంతులతో వెలిగిపోతూ దర్శనం ఇస్తారు. అరుణాచల శివ అంటూ భక్తులు స్వామి వారిని పిలుస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. ఆ సమయంలో జరిగే గిరి ప్రదక్షిణ అద్భుతమైనది. వేలమంది ఒక్కసారిగా కదులుతూ గిరిని ప్రదక్షిణం చేసుకొంటారు. తర్వాత 11వ రోజున అయ్యన్ కొలనులో చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం. 12వరోజున పరాశక్తి తెప్పోత్సవం, 13వ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం, 14వ రోజున చండికేశ్వరుని తెప్పోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది. వాస్తవానికి అరుణాచల క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతాలు గోచరిస్తాయి. అగ్ని లింగ రూపంలో స్వామివారు, అందరినీ అనుగ్రహించే అమ్మవారు, పర్వత రూపంలో నిలిచిన పరమాత్మ, కలియుగంలో మార్గదర్శనం చేసిన రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తాయి. కావ్యకంఠ మహాముని ముక్తినొందిన క్షేత్రం ఇది. అందుచేత అరుణాచల దర్శనం సకలపాప హరణం అని చెప్పుకోవచ్చు. – వై. రమ విశ్వనాథన్ సీనియర్ పాత్రికేయులు -
అయ్యప్ప సేవలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు
సాక్షి, చిత్తూరు: రాష్ట్ర పంచాయతిరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమల వెళ్లారు. అక్కడ ఆలయ ఆధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తర్వాత మంత్రి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి పులంగి సేవలో పాల్గొన్నారు. మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటే గౌడ్ , పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు రాక సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
మీ అమ్మలా కావద్దు!
బిందు తెలుసుకదా. జనవరి 1న శబరిమల అయ్యప్పను దర్శించుకుని వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు. (ఇంకొకరు కనకదుర్గ). దళిత్ యాక్టివిస్ట్. నిజానికి ఆమె అక్టోబర్ నెలలోనే శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. కాని నిరసనకారులు అడ్డుకోవడంతో వెనక్కి తిరిగారు. ఆ నిరసన ఆమెకు దైవర్శనం కానివ్వకుండా అడ్డుకోవడం వరకే ఆగలేదు. బిందు ఇంటిదాకా, ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవరకూ వెంటాడింది. తొలిసారి దర్శనానికి వెళ్లి విఫలమై వచ్చినప్పటి నుంచే బిందు సంప్రదాయవాదుల వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. బిందు కుటుంబం కోళికోడ్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఆ ఇంటి యజమాని ముందస్తు సమాచారం, తగిన సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయించారు. చేసేదిలేక ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకుంటుంటే అక్కడా వేధింపులు తప్పలేదు. అక్కడినుంచీ ఆమె వెళ్లిపోయేలా చేశారు. బిందుకు పదకొండేళ్ల కూతురు ఉంది. ఆ అమ్మాయి ప్రస్తుతం అగాలీ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతోంది. వచ్చే యేడాది కోసం కూతురిని విద్యావనమ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేర్పించాలనుకున్నారు బిందు. దాని తాలూకు ఇంటర్వ్యూ, పేరెంట్స్ మీటింగ్‌నూ పూర్తి చేశారు. అమ్మాయికి అడ్మిషన్ ఇస్తున్నాం అని కూడా స్కూల్ యాజమాన్యం కూడా చెప్పింది. మొన్న సోమవారం.. అంటే జనవరి ఎనిమిదో తారీఖున అడ్మిషన్‌కు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తిచేసుకోవాల్సి ఉంది. బిందు స్కూల్‌కి వెళ్లారు.‘‘నా కూతురితో స్కూల్లోకి అడుగుపెట్టాను. అక్కడ దాదాపు అరవై మంది గుమిగూడి ఉన్నారు. వాళ్లంతా స్థానికులు, మగ వాళ్లు. మమ్మల్ని ఏమీ అనలేదు. ప్రిన్సిపల్ రూమ్‌లోకి వెళ్తుంటే కూడా ఏమీ అడ్డుకోలేదు. తీరా లోపలికి వెళ్లాక చూస్తే.. ప్రిన్సిపలే వింతగా ప్రవర్తించారు. ‘‘నేను మీలాగా యాక్టివిస్ట్‌ని కాను. కాని ఎడ్యుకేషనల్ యాక్టివిస్ట్‌ని’’ అంటూ సందర్భంలేకుండా మాట్లాడారు. నేను వెళ్లింది మా అమ్మాయి అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కోసం. ఆ ఊసెత్తకుండా ప్రిన్సిపల్ ఏవేవో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. చివరకు ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చి ఈ స్కూల్ వాతావరణాన్ని పాడు చేయదలచుకోలేదు మేము’’ అంటూ అసలు సంగతి చెప్పారు. గది నుంచి స్కూల్ ఆవరణలోకి వస్తుంటే ఓ టీచర్ చెప్పారు అక్కడున్న అరవై మంది మగవాళ్లను చూపిస్తూ ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వద్దని వీళ్లంతా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు’’ అని. పాత స్కూల్లో కూడా టీచర్స్ మా అమ్మాయితో ‘‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్‌లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్ మెయిన్టైన్ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడా స్కూల్‌కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని చెప్పారు బిందు. -
శాస్తారం ప్రణమామ్యహం
అయ్యప్ప అనగానే అందరికీ యోగాసనంలో, మోకాలికి యోగపట్టం ధరించి కుడి చేత్తో అభయాన్నిస్తూ, ఎడమచేతిని మోకాలిపై ఉంచే రూపం గుర్తుకు వస్తుంది. శబరిమలైపై కొలువు తీరిన రూపం ఇదే. ఇక్కడ ఆయన బ్రహ్మచారిగా కనిపిస్తాడు. కానీ ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పూర్ణ, పుష్కలా వారి పేర్లు. శక్తి సమేతుడైన స్వామిని ధర్మశాస్త అని పిలుస్తారు. అచ్చన్ కోసం ఆలయంలో స్వామివారు ఇరువైపుల దేవేరులతో పాటు ఆసీనుడై కుడి కాలిని కిందకు చాచి ఎడమకాలిని మడిచి పీఠంపై ఉంచి నడుముకూ ఎడమమోకాలికీ కలిపి వేసిన పట్టంతో కుడిచేతిలో పుష్పాన్ని, ఎడమచేతిని ఎడమమోకాలిపై జారవిడిచి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. పూర్ణాపుష్కలా దేవేరులు చేతిలో సౌగంధికా పుష్పాలను పట్టుకుని వరదముద్రనూ చూపుతూ వరాలిస్తుంటారు. ఇదే స్వరూపంలో తమిళనాడులోని కాంచీపురం,కడలూర్ మొదలైన కొన్ని దేవాలయాలలో మాత్రం అరుదుగా దర్శనమిస్తాడు. పూర్ణాపుష్కలాసమేత ధర్మశాస్త విగ్రహ స్వరూపాన్ని మయమత శిల్పశాస్త్రం విశేషంగా వివరించింది. ఇతడి చేతిలో చండ్రాకోలును ఉంచాలని చెప్పింది. ఈ స్వామి వాహనం, ధ్వజచిహ్నం రెండూ గజమే. చతుర్భుజుడైన స్వామికి కుక్కుటధ్వజం ఉంటుంది.శాస్త అంటే శాసించువాడని అర్థం. ఆగమ, శిల్ప శాస్త్రాలలో అనేక శాస్తా స్వరూపాలున్నా వాటిలో ఎనిమిది శాస్తారూపాలు ప్రసిద్ధమైనవి. ఆదిశాస్త, ధర్మశాస్త, జ్ఞానశాస్త, కల్యాణవరదశాస్త, గజారూఢ శాస్త, సమ్మోహన శాస్త, సంతానప్రాప్తి శాస్త, వేదశాస్త, వీరశాస్తలలో ఒక్కో దేవుడూ ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు.ధర్మశాస్తా దర్శనంతో సకలాభీష్టాలూ నెరవేరుతాయి. మహాపాతకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, పుత్రసిద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాగమం చెప్పింది. -
కార్తీక మాసంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
కడప అర్బన్ : కార్తీక మాసంలో శివాలయాలను సందర్శించే భక్తులు వారు చూడదలచుకున్న పుణ్య క్షేత్రాలకు కడప డిపో నుంచి బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఆర్ఎం చెంగల్‌రెడ్డి, డిపో మేనేజర్ ఆదినారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మందికి తక్కువ కాకుండా గ్రూపులుగా వస్తే టిక్కెట్ ప్రాతిపదికన బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మాసంలో ప్రతి సోమవారం జిల్లాలోని శైవ క్షేత్రాలైన పొలతల, నిత్యపూజకోన పుణ్యక్షేత్రాలకు రద్దీని బట్టి బస్సులు తిప్పుతామన్నారు. శబరిమలై వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు తక్కువ ధరలకు అద్దె ప్రాతిపదికన న్యూ బ్రాడెండ్ బస్సులను సమకూర్చినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర పన్ను మినహాయింపు కలదన్నారు. బస్సును రిజర్వు చేసుకొనదలిచిన వారు కేవలం రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇతర వివరాలకు కడప డీఎం (99592 25774), ఏఎంటీ (73828 65275), ఆర్టీసీ ఏజెంట్ (94404 49559)లను సంప్రదించాలన్నారు. -
శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి 132 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక ైరె ళ్లలో ఈ నెల 22వ తేదీ నుంచి భక్తులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. హైదరాబాద్-కొల్లామ్ (07109 / 07110) స్పెషల్ ట్రైన్స్ డిసెంబర్ 11,15,16,19,23,24,31, జనవరి 3,4,5,6,7,8,10,11,12,13,14,15 తేదీల్లో మధ్యాహ్నం 3.55కు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 13,17,18,21,25,26 తేదీలలో జనవరి 2,5,6,7,8,9,10,12,13,14,14,16,17 తేదీలలో తెల్లవారు జామున 2.15 కు బయలుదేరి రెండవ రోజు ఉదయం 10.30 కు హైదరాబాద్ చేరుకుంటుంది. మరో ట్రైన్ హైదరాబాద్-కొల్లామ్ (07133/ 07134) డిసెంబర్ 12,20,30 తేదీల్లో, జనవరి 2,16 తేదీల్లో మధ్యాహ్నం 3.30కు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9,16,23 జనవరి 4,18 తేదీల్లో తెల్లవారుజామున 2.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. నిజామాబాద్-కొల్లామ్ (07613/07614) స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 7,14,21 తేదీల్లో మధ్యాహ్నం 12.10కి నిజామాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14,21, జనవరి 1వ తేదీల్లో తెల్లవారుజామున 2.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.05కు నిజామాబాద్ చేరుకుంటుంది. మచిలీపట్నం-కొల్లామ్ (07275 / 07276) డిసెంబర్ 13వ తేదీ రాత్రి 7.40కి మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కి కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 15వ తేదీన తెల్లవారుజామున 2.05కు కొల్లామ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు మచిలీపట్నం చేరుకుంటుంది. కాకినాడ-కొల్లామ్ (07211/07212) స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 15,16,18,19,21,24,25 జనవరి 1,2,4,5,7,8,10,11,13,14 తేదీల్లో రాత్రి 10.10 కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 12.50కి కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 17,18,21,23,24,26,27, జనవరి 3,4,5,6,7,9,10,12, 13,15,16 తేదీల్లో తెల్లవారు జామున 3 గంటలకు కొల్లామ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15కు కాకినాడ చేరుకుంటుంది. వివిధ మార్గాల్లో. .. అయ్యప్ప భక్తుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా నర్సాపూర్-కొల్లామ్, విజయవాడ-కొల్లామ్, ఔరంగాబాద్-కొల్లామ్, అకోల-కొల్లామ్, ఆదిలాబాద్-కొల్లామ్, సిర్పూర్కాగజ్నగర్-కొల్లామ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. అలాగే కరీంనగర్, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి కూడా డిసెంబర్ మొదటి వారం నుంచి జనవరి 2వ వారం వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. -
ఎంత పని చేశావు అయ్యప్పా..
లారీని ఓవర్టేక్ చేస్తుండగా కారును ఢీకొన్న మరో లారీ అక్కడికక్కడే ఆరుగురు మృతి మరో నలుగురికి తీవ్ర గాయూలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల వేసి.. ఇరుముడితో శబరిమలై వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించారు.. అందరినీ చల్లగా చూడాలని వేడుకుని తిరుగు ప్రయూణమయ్యూరు.. కాసేపట్లో ఇల్లు చేరుకుంటారనగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.. మృతులు ఆరుగురూ వారి కుటుంబాల్లో ఒకే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మా ఇంటి దీపాలార్పేశావు అయ్యప్పా.. అంటూ కన్నీరు మున్నీరయ్యూరు. చెళ్లకెర రూరల్, తోరణగల్లు: చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు తాలూకా బీజీ కెరె వద్ద మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో లారీ-కారు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో ఆరుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అంకారెడ్డి(38), తిరుమలేష్(25), సణ్ణహొన్నూరుస్వామి(30), సతీష్‌గౌడ(22), రామాంజనేయులు(24), మురళి(28) ఉన్నారు. వీరిని బళ్లారి నగర శివార్లలోని బత్రి ప్రాంతవాసులుగా గుర్తించారు. వీరు గత బుధవారం శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ మరోగంట సేపట్లో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న టవేరా వాహనం ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేస్తుండగా, అదే సమయంలో ఎదురుగా దూసుకు వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్‌కుమార్, వీరేష్, కేశవ, రవికుమార్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గం జిల్లా ఎస్పీ అనుచేత్, ఏఎస్పీ శాంతరాజ్, డీఎస్పీ ఎం.శ్రీనివాస్, మొళకాల్మూరు ఎస్ఐ లోకేష్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మొళకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బత్రిలో విషాదఛాయలు మరో గంటలో ఇల్లు చేరుకోవాల్సింది. అయితే అంతలో విధి వక్రీకరించింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు అయ్యప్ప భక్తులను కబలించింది. ప్రమాద దుర్ఘటన తో బళ్లారి నగర శివారులోని బత్రి ప్రాంతంలో ఉద యం నుంచే విషాదఛాయలు అలుముకున్నాయి. మృ తులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువుల రో దనలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే మొళకాల్మూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను మొళకాల్మూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. గాయపడిన వారిని బళ్లారి విమ్స్‌కు తరలించా రు. కాగా మృతుల్లో నలుగురు పెళ్లి కాని యువకులు ఉ న్నారు. మృతి చెందిన ఆరుగురు.. వారి తల్లిదండ్రులకు ఒక్కరే కొడుకులు కావడంతో బంధువులు, తల్లిదండ్రులు విమ్స్ వద్ద హృదయవిదారకంగా విలపించారు. బత్రిలో ఒకేసారి 45 మంది అయ్యప్ప మాల వేయడం ఇదే మొదటిసారని బత్రి ప్రాంత వాసులు తెలిపారు -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
డిసెంబర్ 5 నుంచి జనవరి 17 వరకు శుక్రవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ సిటీబ్యూరో : శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే వివిధ మార్గాల్లో 132 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది. భక్తుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా డిసెంబర్ 5వ తేదీ నుంచి వచ్చే జనవరి 17వ తేదీ వరకు ఈ రైళ్లు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రైళ్ల కోసం శుక్రవారం ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్, నిజామాబాద్, కాకినాడ, విజయవాడ,మచిలీపట్నం, సిరిపూర్‌కాగజ్‌నగర్,కరీంనగర్, ఔరంగాబాద్, అకోల,ఆదిలాబాద్,తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ► హైదరాబాద్-కొల్లాం (07109/07110) ప్రత్యేక రైలు డిసెంబర్ 11,15,16,19,23,జనవరి 3,4,5,6,8,10,11,12,13,14,15 తేదీలలో సాయంత్రం 4.05 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 12,16,17,20,24 జనవరి 4,5,6,7,9,11,12,13,14,15,16 తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 5.25 కు నాంపల్లికి చేరుకుంటుంది. ► హైదరాబాద్-కొల్లాం (07115/07116) ప్రత్యేక రైలు డిసెంబర్ 12, 20,30, జనవరి 2,16 తేదీలలో సాయంత్రం 3.50 కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 13,21,31 జనవరి 3,17 తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు 5.25 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. ► కాచిగూడ-కొల్లాం (07623/07624) ప్రత్యేక రైలు డిసెంబర్ 31,జనవరి 7 తేదీలలో సాయంత్రం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 1,8 తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ► నిజామాబాద్-కొల్లాం (07613/07614) ప్రత్యేక రైలు డిసెంబర్ 5,10,17 తేదీలలో మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 6,11,18 తేదీలలో రాత్రి 11.50 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి రెండ వ రోజు ఉదయం 7.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. ► కాకినాడ-కొల్లాం (07211/07212) ప్రత్యేక రైలు డిసెంబర్ 12,13,15,18,19,21,22,25,26,జనవరి 1,2,4,5,7,8,10,11,14,15 తేదీలలో రాత్రి 10.10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14,15,17,20,21,23,24,27,28, జనవరి 3,4,6,7,9,10,12,13,16,17 తేదీలలో తెల్లవారు జామున 2.15 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ► నర్సాపూర్-కొల్లాం (07217/07218) ప్రత్యేక రైలు డిసెంబర్ 30,31 తేదీలలో రాత్రి 8.50 కి నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 1,2 తేదీలలో తెల్లవారు జామున 2.15 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు నర్సాపూర్ చేరుకుంటుంది. ► విజయవాడ-కొల్లాం (07219/07220) ప్రత్యేక రైలు డిసెంబర్ 7,11 తేదీలలో రాత్రి 10.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9,16,30 తేదీలలో తెల్లవారు జామున 2.15 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ► మరో రైలు (07213/07214) జనవరి 3వ తేదీ రాత్రి 11.55 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 8,14 తేదీలలో ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 కు విజయవాడ చేరుకుంటుంది. ► మచిలీపట్నం-కొల్లాం (07215/07216) ప్రత్యేక రైలు జనవరి 6,12 తేదీలలో రాత్రి 11.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 5వ తేదీ ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ► మరో రైలు (07235) డిసెంబర్ 21వ తేదీ రాత్రి 8 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది. అలాగే రైలు (07236) డిసెంబర్ 28వ తేదీ సాయంత్రం 6.50 కి మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 కు కొల్లాం చేరుకుంటుంది.-విజయవాడ-కొల్లాం-మచిలీపట్నం (07231/07232) ప్రత్యేక రైలు డిసెంబర్ 18,జనవరి 9 తేదీలలో రాత్రి 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 19,22, తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3 గంటలకు మచిలీపట్నం వరకు వస్తుంది. ► సిరిపూర్‌కాగజ్‌నగర్-కొల్లాం (07111) ప్రత్యేక రైలు జనవరి 4,9 తేదీలలో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.45 కు కొల్లాం చేరుకుంటుంది. ► కొల్లాం-సికింద్రాబాద్ (07112) ప్రత్యేక రైలు డిసెంబర్ 30,జనవరి 6,11 తేదీలలో ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► కరీంనగర్-కొల్లాం (07113) ప్రత్యేక రైలు డిసెంబర్ 28 రాత్రి 9.15 కు కరీంనగర్ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 కు కొల్లాం చేరుకుంటుంది. ► ఔరంగాబాద్-కొల్లాం (07505) డిసెంబర్ 6,20 తేదీలలో ఉదయం 10.15 కు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.25 కు కాచిగూడకు,రెండవ రోజు తెల్లవారు జామున 3.45 కు కొల్లాం చేరుకుంటుంది. ► అకోల-కొల్లాం (07507) డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30 కు అకోల నుంచి బయలుదేరి రాత్రి 9.25 కు కాచిగూడకు చేరుకుంటుంది. రెండవ రోజు ఉదయం 3.45 కు కొల్లాం చేరుకుంటుంది. ► ఆదిలాబాద్-కొల్లాం (07509) డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.25 కు కాచిగూడకు, రెండవ రోజు తెల్లవారు జామున 3.45 కు కొల్లాం చేరుకుంటుంది. ►కొల్లాం-తిరుపతి (07506) డిసెంబర్ 8,15,22,29 తేదీలలో ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 11.45 కు తిరుపతికి చేరుకుంటుంది. ► తిరుపతి-అకోల (07408) డిసెంబర్ 17న ఉదయం 9.15 కు బయలుదేరి రాత్రి 10.15 కు కాచిగూడ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు అకోల చేరుకుంటుంది. ► తిరుపతి-ఔరంగాబాద్ (07410) డిసెంబర్ 10,24 తేదీలలో తేదీలలో ఉదయం 9.15 కు బయలుదేరి రాత్రి 10.15 కు కాచిగూడకు మరుసటి రోజు ఉదయం 8.10 కి ఔరంగాబాద్ చేరుకుంటుంది. ► తిరుపతి-ఆదిలాబాద్ (07407) డిసెంబర్ 31న ఉదయం 9.15 కు బయలుదేరి రాత్రి 10.15 కు కాచిగూడకు,మరుసటి రోజు ఉదయం 7.15కు ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది. -
శబరిమలైకి మరో రెండు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. నిజామాబాద్-కొల్లాం (07601) ప్రత్యేక రైలు డిసెంబర్ 10, 17 తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిజామాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 11, 18 తేదీలలో తెల్లవారుజామున 1.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరుతుంది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ నవంబర్ 30 నుంచి ప్రారంభిస్తారు. -
శబరిమలైకు 128 ప్రత్యేక రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో: శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తాయి. హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, సిరిపూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోల స్టేషన్ల నుంచి కొల్లాం వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 25 నుంచి ఉదయం 8 గంటలకు శబరి ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. -
అయ్యప్ప భక్తుల కోసం 128 ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మొత్తం 128 ప్రత్యే రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాన పౌరసంబంధాల అధికారి (సీపీఆర్వో) కె. సాంబశివరావు ఈ విషయాన్ని ఓప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు హైదరాబాద్, కాకినాడ టౌన్, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నరసాపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోలా నుంచి కొల్లాం వరకు వెళ్తాయని ఆయన తెలిపారు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 18 వరకు అటునుంచి ఇటు వస్తాయని వివరించారు. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లు నడుపుతున్నామని, ఈనెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 25వ తేదీ వరకు రిజర్వేషన్లు చేయించుకోవచ్చని సీపీఆర్వో సాంబశివరావు చెప్పారు.