ఎంత పని చేశావు అయ్యప్పా..
లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా
కారును ఢీకొన్న మరో లారీ
అక్కడికక్కడే ఆరుగురు మృతి
మరో నలుగురికి తీవ్ర గాయూలు
భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల వేసి.. ఇరుముడితో శబరిమలై వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించారు.. అందరినీ చల్లగా చూడాలని వేడుకుని తిరుగు ప్రయూణమయ్యూరు.. కాసేపట్లో ఇల్లు చేరుకుంటారనగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.. మృతులు ఆరుగురూ వారి కుటుంబాల్లో ఒకే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మా ఇంటి దీపాలార్పేశావు అయ్యప్పా.. అంటూ కన్నీరు మున్నీరయ్యూరు.
చెళ్లకెర రూరల్, తోరణగల్లు: చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు తాలూకా బీజీ కెరె వద్ద మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో లారీ-కారు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో ఆరుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అంకారెడ్డి(38), తిరుమలేష్(25), సణ్ణహొన్నూరుస్వామి(30), సతీష్‌గౌడ(22), రామాంజనేయులు(24), మురళి(28) ఉన్నారు. వీరిని బళ్లారి నగర శివార్లలోని బత్రి ప్రాంతవాసులుగా గుర్తించారు. వీరు గత బుధవారం శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ మరోగంట సేపట్లో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న టవేరా వాహనం ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా, అదే సమయంలో ఎదురుగా దూసుకు వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్‌కుమార్, వీరేష్, కేశవ, రవికుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గం జిల్లా ఎస్పీ అనుచేత్, ఏఎస్పీ శాంతరాజ్, డీఎస్పీ ఎం.శ్రీనివాస్, మొళకాల్మూరు ఎస్‌ఐ లోకేష్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మొళకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బత్రిలో విషాదఛాయలు
మరో గంటలో ఇల్లు చేరుకోవాల్సింది. అయితే అంతలో విధి వక్రీకరించింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు అయ్యప్ప భక్తులను కబలించింది. ప్రమాద దుర్ఘటన తో బళ్లారి నగర శివారులోని బత్రి ప్రాంతంలో ఉద యం నుంచే విషాదఛాయలు అలుముకున్నాయి. మృ తులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువుల రో దనలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే మొళకాల్మూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను మొళకాల్మూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. గాయపడిన వారిని బళ్లారి విమ్స్‌కు తరలించా రు. కాగా మృతుల్లో నలుగురు పెళ్లి కాని యువకులు ఉ న్నారు. మృతి చెందిన ఆరుగురు.. వారి తల్లిదండ్రులకు ఒక్కరే కొడుకులు కావడంతో బంధువులు, తల్లిదండ్రులు విమ్స్ వద్ద హృదయవిదారకంగా విలపించారు. బత్రిలో ఒకేసారి 45 మంది అయ్యప్ప మాల వేయడం ఇదే మొదటిసారని బత్రి ప్రాంత వాసులు తెలిపారు