overtake
-
సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను తలదన్నిన భారత్
భారత్ 2023లో సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌరశక్తి ఉత్పాదక దేశంగా అవతరించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ అంబర్ తన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.2015లో సౌరశక్తి వినియోగంలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్ గత కొన్ని ఏళ్లుగా సౌరశక్తి వినియోగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దాని ఫలితమే ఈ విజయం. ‘గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’ పేరుతో అంబర్ ఈ నివేదికలో 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 5.5 శాతం సౌరశక్తి రూపంలో లభించిందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వృద్ధి 2023లో ఆశా జనకంగా ఉందని, అయితే చైనాలో కరువు కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.ప్రపంచంలో అత్యంత చౌకైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం భారతదేశం అయితే అత్యంత ఖరీదైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం కెనడా. 2023 నాటికి భారతదేశం సౌరశక్తి ఉత్పత్తి విషయంలో ప్రపంచంలోనే నాల్గవ దేశంగా నిలిచింది. ఈ విషయంలో చైనా, అమెరికా, బ్రెజిల్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. సౌరశక్తి వృద్ధిలో ఈ నాలుగు దేశాల వాటా 2023లో 75 శాతంగా ఉంది. జపాన్.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి సహకారం 2015లో 0.5 శాతంగా ఉండగా, ఇది 2023లో 5.8 శాతానికి పెరిగింది. సౌర శక్తి 2030 నాటికి ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 22 శాతానికి పెరగనున్నదనే అంచానాలున్నాయి. 2030 నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని యోచిస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. -
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్‌సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్‌లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
కారును ఓవర్టేక్ చేయబోయి..
పటాన్చెరు టౌన్: లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలు కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ రెహమాన్(19), ఖాసీం ఇద్దరూ బతుకుదెరువు కోసం ఏడాది కిందట వచ్చి బొల్లారం పరిధిలోని గాంధీనగర్‌లో ఉంటున్నారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ పని నిమిత్తం బైక్‌పై శంకర్పల్లి వైపు బయలుదేరారు. ముత్తంగి సర్వీస్ రోడ్ నుంచి కర్ధనూర్ వైపు వెళ్తుండగా కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ అబ్దుల్ రెహమాన్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: పుట్టపర్తిలో దారణం.. అనుమానంతో భర్త! -
లారీని ఓవర్ టేక్ చేస్తూ.. ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు డీసీఎంను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో వెనక నుంచి వచ్చిన టిప్పర్ వారి మీదుగా వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కై సర్ నగర్లో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుండిగల్ ఐఏఆర్ఈ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పవన్ ( 21), మణిదీప్ (20) మల్లంపేటలో నివాసం ఉంటున్నారు. సోమవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న వీరు కై సర్ నగర్ సమీపంలో ముందు వెళుతున్న డీసీఎంను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ వీరిపై నుండి వెళ్లడంతో తీవ్ర గాయాలైన పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మణిదీప్‌ను ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్ జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, బూరుగుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకులకు ఝలక్ ఇచ్చిన ఎంఎఫ్ఐలు.. లోన్లలో ఇవే టాప్!
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను దాటుకుని నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సూక్ష్మ రుణాల్లో ఎంఎఫ్‌ఐల వాటా 2022–23లో 40 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 35 శాతం కంటే పెరిగింది. కరోనా లాక్డౌన్లతో ఎంఎఫ్ఐ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. కలెక్షన్లు, కొత్త రుణాల మంజూరు గణనీయంగా పడిపోయింది. దీంతో 2020 మార్చి నాటికి సూక్ష్మ రుణాల్లో ఎంఫ్ఐల వాటా 32 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 31 శాతానికి తగ్గింది. 2022 మార్చి నాటికి తిరిగి 35 శాతానికి పుంజుకున్నది. ఇక ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సూక్ష్మ రుణాల్లో తమ వాటాను 40 శాతానికి పెంచుకున్నాయి. గత ఆర్థిక సంవత్సంలో సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌లు 24 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎంఎఫ్ఐలు 37 శాతం వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగాలకు రుణ వితరణ కింద దాదాపు అన్ని బ్యాంకులు ఎంఎఫ్ఐ రుణ పుస్తకాన్ని నిర్వహించడం తప్పనిసరి. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 2023 మార్చి నాటికి 34 శాతానికి తగ్గింది. ఈ రంగంలో బ్యాంక్‌ల వాటా 2020, 2022 మార్చి నాటికి 40 శాతంగా ఉంటే, మధ్యలో 2021 మార్చి నాటికి 44 శాతానికి పెరిగింది. కరోనా సవాళ్లను ఎంఎఫ్ఐ పరిశ్రమ అధిగమించడంతో, సూక్ష్మ రుణాల్లో అవి మరింత దూకుడుగా వాటాను పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేర్ విడుదల చేసింది. వృద్ధి తగ్గొచ్చు సూక్ష్మ రుణ పరిశ్రమలో వృద్ధి ఇక ముందూ కొనసాగుతుందని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతానికి పరిమితం కావచ్చని కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. సగటు రుణ టికెట్ సైజు పెరగడం, జాయింట్ రుణాలకు బదులు, విడిగా వ్యక్తులకు రుణాలు ఇవ్వడం అనేవి రిస్క్‌లుగా కేర్ రేటింగ్స్ పేర్కొంది. రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల వల్ల కుదుపులకు లోనయ్యే తత్వం వీటికి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రుణ రేటుపై పరిమితులను ఆర్బీఐ ఎత్తివేయడంతో, రిస్క్ ఆధారంగా రేటు విషయంలో ఎంఎఫ్ఐలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. ఇది వాటి నికర వడ్డీ మార్జిన్లను (నిమ్) పెంచుతున్నట్టు వివరించింది. 2020–21లో గరిష్ట స్థాయికి వెళ్లిన రుణ వ్యయాలు సైతం అక్కడి నుంచి తగ్గాయని, అయినప్పటికీ కరోనా ముందున్న నాటితో పోలిస్తే అధిక స్థాయిలోనే ఉన్నట్టు తెలిపింది. పునరుద్ధరించిన కొన్ని రుణాలు ఎన్పీఏలుగా మారడాన్ని ప్రస్తావించింది. నిమ్ 2023–24లో 3.8 శాతానికి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. -
నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయబోయి..
క్రైమ్: కర్ణాటకలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యంగా తన ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఓ బైకర్ ఘోరంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్ తుక్కు తుక్కు కాగా, తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. కర్ణాటక ముద్బిద్రిలో ఆల్వా కాలేజీ దగ్గర గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లోంచి బస్సు బయటకు రాగా.. ఆ వెనకాలే వస్తున్న బైకర్, బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. ఇంతలో మరో పక్క నుంచి కారు దూసుకువచ్చింది. బైకర్‌ను బలంగా ఢీ కొట్టి కారు దూసుకెళ్లింది. బైక్ ఎత్తులో ఎగిరి తునాతునకలై దూరంగా పడిపోగా.. అతను రోడ్డు మధ్యలో పడిపోయాడు. కదలకుండా పడిపోయిన అతన్ని స్థానికులు కొందరు పక్కకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా ఓవర్ టేక్ చేయడమే కాదు.. కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఆ బైకర్. సీసీటీవీ ఫుటేజీలో యాక్సిడెంట్ దృశ్యాలు నమోదు అయ్యాయి. Shocking visual from #Karnataka. A #CCTV footage from Alva's college near Mudbidri shows a horrific accident where a biker rams into an oncoming car. @dpkBopanna reports pic.twitter.com/BTCTwFdPJu — Mirror Now (@MirrorNow) April 1, 2023 Video Credtis: Mirror Now -
కుడి ఎడమల మధ్య.. రహదారి రక్తసిక్తం!
సాక్షి, హైదరాబాద్: ‘వాహనాలు ఎడమ వైపునే వెళ్లాలి.. కుడివైపు నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయాలి’ఇది మన దేశంలో ట్రాఫిక్ నిబంధన. కానీ హైవేలపై ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిన లోడ్‌లారీలు కుడివైపు నుంచి వెళ్తున్నా యి. దీంతో అనివార్యంగా ఎడమ వైపు నుంచే ఓవర్టేక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది డ్రైవర్లలో అయోమయానికి కారణమై తరచూ ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. శనివారం ప్రజ్ఞాపూర్ సమీపంలోని రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనకు కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. ఎడమ వైపు నుంచే ఓవర్టేక్ చేసే క్రమం లో ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఒకవేళ కుడి వైపు నుంచి ఓవర్టేక్ చేస్తూ.. లారీని ఢీ కొని ఉంటే లారీ ఎడమవైపు రోడ్డు దిగువకు దూసుకెళ్లి ఉండేది. ప్రమాదం తప్పేది. కానీ ఎడమ వైపు నుంచి ఢీ కొనటంలో లారీ.. అవతలి రోడ్డుపై కంటైనర్, కారును ఢీకొంది. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇంత జరుగుతున్నా.. ఇటు పోలీసు శాఖ కానీ అటు రవాణా శాఖ పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతోంది? సాధారణంగా హెవీ లోడ్ లారీలు, కంటైనర్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఇవి రోడ్డుకు ఎడమ వైపున వెళ్లాలి. వేగంగా వెళ్లే కార్లు, బస్సులు కుడివైపున వెళ్లాలి. కానీ మనరోడ్లపై లారీలు పూర్తిగా కుడి వైపు నుంచి వెళ్తున్నాయి. దీంతో వెనక వచ్చే కార్లు, బస్సులు వాటి ని నిబంధనలకు విరుద్ధంగా ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయాల్సి వస్తోంది. వేరే వాహనాలు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసేప్పుడు ఉన్నట్టుండి ముందున్న లారీలు కూడా ఎడమ వైపు జరుగుతున్న సందర్భాలూ ఉన్నాయి. ఎడమవైపు నుంచి వెళ్లే ద్విచక్ర వాహనాలకు ఈ తప్పుడు ఓవర్ టేకింగ్స్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఓవర్టేక్ చేసేప్పుడు భారీ వాహనాలు ఎడమవైపు వచ్చి ద్విచక్రవాహనాలపైకి వెళ్తున్నాయి. పరిమితికి మించి పొడవు బస్సుల తయారీలో నిబంధనల ఉల్లంఘన కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కంపెనీలు నిబంధనల ప్రకారమే చాసిస్‌ను రూపొందిస్తున్నాయి. తర్వాత దానికి బాడీ తయారు చేసేప్పుడు నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 93.. బస్సు పొడవు, ఎత్తు తదితర వివరాలను స్పష్టం చేస్తోంది. రవాణా బస్సు 12 మీటర్లకు మించి పొడవు, 3.8 మీటర్లకు మించి ఎత్తు ఉండొద్దు. కానీ సంస్థలు అక్రమంగా బస్సు పొడవు, ఎత్తు పెంచుతున్నాయి. బాడీ తయారీ సమయంలో ముప్పావు మీటరు మేర దానికి అతుకు ఏర్పాటు చేసి పొడవు పెం చేస్తున్నాయి. అదనంగా సీట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో బస్సు సులభంగా అదుపు తప్పేందుకు కారణమవుతోందని, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. బస్సుపై భాగంలో మాత్రమే లగేజీ ఏర్పాటుకు చట్టం అనుమతిస్తోంది. కానీ బస్సు దిగువ భాగంలో విడిగా క్యాబిన్ ఏర్పాటు చేసి లగేజీ ఉంచుతున్నారు. బస్సు ఎత్తు పెరగటానికి ఇది కూడా కారణమవుతోంది. ఆర్టీసీ కూడా ఈ అక్రమాలకు పాల్పడుతోంది. కంపెనీ రూపొందించే చాసిస్‌కు అతుకు ఏర్పాటు చేసి పరిమితికి మించి బాడీ రూపొందిస్తోంది. ఉల్లంఘనలే కారణం.. ఎడమ వైపు నుంచి వేగంగా ఓవర్టేక్ చేయటం, బస్సులను పరిమితికి మించి పొడవుగా రూపొందించటం.. ఈ రెండు ఉల్లంఘనలు భారీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. వీటిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజా ప్రమాదంలోనూ ఈ ఉల్లంఘనలే కారణమై ఉంటాయని అనిపిస్తోంది. – ‘సాక్షి’తో రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్, హైకోర్టు న్యాయవాది సీఎల్ఎన్ గాంధీ -
ప్రాణాలు తీసిన ఓవర్టేక్
కణేకల్లు : ఓవర్ టేక్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వేగంగా బైక్ నడుపుతూ ముందు వెళుతున్న ఆటోను ఓవర్టేక్ చేసి కిందపడిన వారిపై ట్రాక్టర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఎస్ఐ యువరాజు కథనం మేరకు.... కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన కుమ్మరి సంజీవప్ప (34) నిరుపేద రైతు. రెండేళ్ల క్రితం ఇతను డి.హిరేహళ్ మండలం గొడిశెలపల్లికి కుటుంబాన్ని మార్చాడు. తహసీల్దార్ కార్యాలయంలో పని నిమిత్తం ఉదయం కణేకల్లుకు వచ్చాడు. సాయంకాలం 6గంటల సమయంలో పని పూర్తి కావడంతో స్వగ్రామానికి బయలుదేరాడు. తనకు బాగా తెల్సిన గోపులాపురానికి చెందిన సన్నకారు రైతులు యల్లప్ప (32), హనుమంతరాయుడు (38)లు కూడా తహసీల్దార్ కార్యాలయానికొచ్చారు. కణేకల్లుక్రాస్ వరకు ద్విచక్ర వాహనంలో వస్తానని చెప్పడంతో సంజీవప్ప తన ఎక్స్ఎల్ సూపర్ బైక్‌లో యల్లప్ప, హనుమంతరాయుడులను ఎక్కించుకొని తహసీల్దార్ కార్యాలయం నుంంచి బయలు దేరాడు. ఆలూరు గ్రామం దాటాక చిన్న ఆటోను ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఆటో వెనుకభాగంలో ద్విచక్ర వాహనం తగిలి కింద పడ్డారు. అదే సమయంలో కణేకల్లుక్రాస్ నుంచి ఆలూరుకు వస్తున్న ట్రాక్టర్ వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో సంజీవప్ప, యల్లప్పత లలు పగిలి అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ యువరాజు, తహసీల్దార్ ఆర్.వెంకటశేషు ఘటన స్థలాన్ని పరిశీలించారు. యల్లప్పకు భార్య సుశీలమ్మతోపాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. సంజీవప్పకు భార్య ప్రమీలమ్మ ఇద్దరు కొడుకులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఓవర్టేక్ చేశాడని ఎస్సైనే కొట్టారు
సుల్తాన్‌బజార్: తమ వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని ఎస్ఐపై ఇద్దరు యువకులు దాడి చేశారు. సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. చెంగిచెర్లలో నివాసముండే రాజశేఖర్ ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆయన కోఠి ప్రాంతంలో తన ముందు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను ఓవర్టేక్ చేసి సిగ్నల్ దగ్గర ఆగాడు. వెనుక నుంచి వచ్చిన యువకులు మమ్మల్నే ఓవర్టేక్ చేస్తావా ? అంటూ ఎస్ఐని అసభ్య పదజాలంతో దూషించారు. దాడి చేసి గాయపర్చారు. తాను ఎస్ఐనని చెప్పినా వారు వినిపించుకోకుండా కిందపడేసి మరీ కొట్టారు. వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరొకడు పరారయ్యాడు. ఈ మేరకు బాధితుడు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఎస్పై దాడి చేసి పట్టబడిన యువకుడు చాదర్‌ఘాట్‌కు చెందిన వ్యాపారి మజారుద్దీన్(25) గా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో యువకుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
ఎంత పని చేశావు అయ్యప్పా..
లారీని ఓవర్టేక్ చేస్తుండగా కారును ఢీకొన్న మరో లారీ అక్కడికక్కడే ఆరుగురు మృతి మరో నలుగురికి తీవ్ర గాయూలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల వేసి.. ఇరుముడితో శబరిమలై వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించారు.. అందరినీ చల్లగా చూడాలని వేడుకుని తిరుగు ప్రయూణమయ్యూరు.. కాసేపట్లో ఇల్లు చేరుకుంటారనగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.. మృతులు ఆరుగురూ వారి కుటుంబాల్లో ఒకే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మా ఇంటి దీపాలార్పేశావు అయ్యప్పా.. అంటూ కన్నీరు మున్నీరయ్యూరు. చెళ్లకెర రూరల్, తోరణగల్లు: చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు తాలూకా బీజీ కెరె వద్ద మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో లారీ-కారు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో ఆరుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అంకారెడ్డి(38), తిరుమలేష్(25), సణ్ణహొన్నూరుస్వామి(30), సతీష్‌గౌడ(22), రామాంజనేయులు(24), మురళి(28) ఉన్నారు. వీరిని బళ్లారి నగర శివార్లలోని బత్రి ప్రాంతవాసులుగా గుర్తించారు. వీరు గత బుధవారం శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ మరోగంట సేపట్లో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న టవేరా వాహనం ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేస్తుండగా, అదే సమయంలో ఎదురుగా దూసుకు వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్‌కుమార్, వీరేష్, కేశవ, రవికుమార్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గం జిల్లా ఎస్పీ అనుచేత్, ఏఎస్పీ శాంతరాజ్, డీఎస్పీ ఎం.శ్రీనివాస్, మొళకాల్మూరు ఎస్ఐ లోకేష్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మొళకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బత్రిలో విషాదఛాయలు మరో గంటలో ఇల్లు చేరుకోవాల్సింది. అయితే అంతలో విధి వక్రీకరించింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు అయ్యప్ప భక్తులను కబలించింది. ప్రమాద దుర్ఘటన తో బళ్లారి నగర శివారులోని బత్రి ప్రాంతంలో ఉద యం నుంచే విషాదఛాయలు అలుముకున్నాయి. మృ తులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువుల రో దనలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే మొళకాల్మూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను మొళకాల్మూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. గాయపడిన వారిని బళ్లారి విమ్స్‌కు తరలించా రు. కాగా మృతుల్లో నలుగురు పెళ్లి కాని యువకులు ఉ న్నారు. మృతి చెందిన ఆరుగురు.. వారి తల్లిదండ్రులకు ఒక్కరే కొడుకులు కావడంతో బంధువులు, తల్లిదండ్రులు విమ్స్ వద్ద హృదయవిదారకంగా విలపించారు. బత్రిలో ఒకేసారి 45 మంది అయ్యప్ప మాల వేయడం ఇదే మొదటిసారని బత్రి ప్రాంత వాసులు తెలిపారు