ఓవర్‌టేక్ చేశాడని ఎస్సైనే కొట్టారు
Published Fri, Aug 26 2016 11:37 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
సుల్తాన్‌బజార్: తమ వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని ఎస్‌ఐపై ఇద్దరు యువకులు దాడి చేశారు. సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. చెంగిచెర్లలో నివాసముండే రాజశేఖర్ ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆయన కోఠి ప్రాంతంలో తన ముందు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను ఓవర్‌టేక్ చేసి సిగ్నల్ దగ్గర ఆగాడు. వెనుక నుంచి వచ్చిన యువకులు మమ్మల్నే ఓవర్‌టేక్ చేస్తావా ? అంటూ ఎస్‌ఐని అసభ్య పదజాలంతో దూషించారు. దాడి చేసి గాయపర్చారు.
తాను ఎస్‌ఐనని చెప్పినా వారు వినిపించుకోకుండా కిందపడేసి మరీ కొట్టారు. వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరొకడు పరారయ్యాడు. ఈ మేరకు బాధితుడు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఎస్‌పై దాడి చేసి పట్టబడిన యువకుడు చాదర్‌ఘాట్‌కు చెందిన వ్యాపారి మజారుద్దీన్(25) గా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో యువకుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement