శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మొత్తం 128 ప్రత్యే రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాన పౌరసంబంధాల అధికారి (సీపీఆర్వో) కె. సాంబశివరావు ఈ విషయాన్ని ఓప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు హైదరాబాద్, కాకినాడ టౌన్, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నరసాపురం, సిర్పూర్ కాగజ్నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోలా నుంచి కొల్లాం వరకు వెళ్తాయని ఆయన తెలిపారు.
అలాగే తిరిగి వచ్చేటప్పుడు డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 18 వరకు అటునుంచి ఇటు వస్తాయని వివరించారు. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లు నడుపుతున్నామని, ఈనెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 25వ తేదీ వరకు రిజర్వేషన్లు చేయించుకోవచ్చని సీపీఆర్వో సాంబశివరావు చెప్పారు.
అయ్యప్ప భక్తుల కోసం 128 ప్రత్యేక రైళ్లు
Published Thu, Nov 21 2013 6:52 PM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement