శబరిమలకు ప్రత్యేక రైళ్లు
డిసెంబర్ 5 నుంచి జనవరి 17 వరకు శుక్రవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్
సిటీబ్యూరో : శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే వివిధ మార్గాల్లో 132 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది. భక్తుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా డిసెంబర్ 5వ తేదీ నుంచి వచ్చే జనవరి 17వ తేదీ వరకు ఈ రైళ్లు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రైళ్ల కోసం శుక్రవారం ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్, నిజామాబాద్, కాకినాడ, విజయవాడ,మచిలీపట్నం, సిరిపూర్‌కాగజ్‌నగర్,కరీంనగర్, ఔరంగాబాద్, అకోల,ఆదిలాబాద్,తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
► హైదరాబాద్-కొల్లాం (07109/07110) ప్రత్యేక రైలు డిసెంబర్ 11,15,16,19,23,జనవరి 3,4,5,6,8,10,11,12,13,14,15 తేదీలలో సాయంత్రం 4.05 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 12,16,17,20,24 జనవరి 4,5,6,7,9,11,12,13,14,15,16 తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 5.25 కు నాంపల్లికి చేరుకుంటుంది.
► హైదరాబాద్-కొల్లాం (07115/07116) ప్రత్యేక రైలు డిసెంబర్ 12, 20,30, జనవరి 2,16 తేదీలలో సాయంత్రం 3.50 కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 13,21,31 జనవరి 3,17 తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు 5.25 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.
► కాచిగూడ-కొల్లాం (07623/07624) ప్రత్యేక రైలు డిసెంబర్ 31,జనవరి 7 తేదీలలో సాయంత్రం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 1,8 తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
► నిజామాబాద్-కొల్లాం (07613/07614) ప్రత్యేక రైలు డిసెంబర్ 5,10,17 తేదీలలో మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 6,11,18 తేదీలలో రాత్రి 11.50 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి రెండ వ రోజు ఉదయం 7.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది.
► కాకినాడ-కొల్లాం (07211/07212) ప్రత్యేక రైలు డిసెంబర్ 12,13,15,18,19,21,22,25,26,జనవరి 1,2,4,5,7,8,10,11,14,15 తేదీలలో రాత్రి 10.10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14,15,17,20,21,23,24,27,28, జనవరి 3,4,6,7,9,10,12,13,16,17 తేదీలలో తెల్లవారు జామున 2.15 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
► నర్సాపూర్-కొల్లాం (07217/07218) ప్రత్యేక రైలు డిసెంబర్ 30,31 తేదీలలో రాత్రి 8.50 కి నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 1,2 తేదీలలో తెల్లవారు జామున 2.15 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు నర్సాపూర్ చేరుకుంటుంది.
► విజయవాడ-కొల్లాం (07219/07220) ప్రత్యేక రైలు డిసెంబర్ 7,11 తేదీలలో రాత్రి 10.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9,16,30 తేదీలలో తెల్లవారు జామున 2.15 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
► మరో రైలు (07213/07214) జనవరి 3వ తేదీ రాత్రి 11.55 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 8,14 తేదీలలో ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 కు విజయవాడ చేరుకుంటుంది.
► మచిలీపట్నం-కొల్లాం (07215/07216) ప్రత్యేక రైలు జనవరి 6,12 తేదీలలో రాత్రి 11.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 5వ తేదీ ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
► మరో రైలు (07235) డిసెంబర్ 21వ తేదీ రాత్రి 8 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది. అలాగే రైలు (07236) డిసెంబర్ 28వ తేదీ సాయంత్రం 6.50 కి మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 కు కొల్లాం చేరుకుంటుంది.-విజయవాడ-కొల్లాం-మచిలీపట్నం (07231/07232) ప్రత్యేక రైలు డిసెంబర్ 18,జనవరి 9 తేదీలలో రాత్రి 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 కు కొల్లాం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 19,22, తేదీలలో రాత్రి 11.50 కి కొల్లాం నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3 గంటలకు మచిలీపట్నం వరకు వస్తుంది.
► సిరిపూర్‌కాగజ్‌నగర్-కొల్లాం (07111) ప్రత్యేక రైలు జనవరి 4,9 తేదీలలో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.45 కు కొల్లాం చేరుకుంటుంది.
► కొల్లాం-సికింద్రాబాద్ (07112) ప్రత్యేక రైలు డిసెంబర్ 30,జనవరి 6,11 తేదీలలో ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
► కరీంనగర్-కొల్లాం (07113) ప్రత్యేక రైలు డిసెంబర్ 28 రాత్రి 9.15 కు కరీంనగర్ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 కు కొల్లాం చేరుకుంటుంది.
► ఔరంగాబాద్-కొల్లాం (07505) డిసెంబర్ 6,20 తేదీలలో ఉదయం 10.15 కు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.25 కు కాచిగూడకు,రెండవ రోజు తెల్లవారు జామున 3.45 కు కొల్లాం చేరుకుంటుంది.
► అకోల-కొల్లాం (07507) డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30 కు అకోల నుంచి బయలుదేరి రాత్రి 9.25 కు కాచిగూడకు చేరుకుంటుంది. రెండవ రోజు ఉదయం 3.45 కు కొల్లాం చేరుకుంటుంది.
► ఆదిలాబాద్-కొల్లాం (07509) డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.25 కు కాచిగూడకు, రెండవ రోజు తెల్లవారు జామున 3.45 కు కొల్లాం చేరుకుంటుంది.
►కొల్లాం-తిరుపతి (07506) డిసెంబర్ 8,15,22,29 తేదీలలో ఉదయం 6 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 11.45 కు తిరుపతికి చేరుకుంటుంది.
► తిరుపతి-అకోల (07408) డిసెంబర్ 17న ఉదయం 9.15 కు బయలుదేరి రాత్రి 10.15 కు కాచిగూడ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు అకోల చేరుకుంటుంది.
► తిరుపతి-ఔరంగాబాద్ (07410) డిసెంబర్ 10,24 తేదీలలో తేదీలలో ఉదయం 9.15 కు బయలుదేరి రాత్రి 10.15 కు కాచిగూడకు మరుసటి రోజు ఉదయం 8.10 కి ఔరంగాబాద్ చేరుకుంటుంది.
► తిరుపతి-ఆదిలాబాద్ (07407) డిసెంబర్ 31న ఉదయం 9.15 కు బయలుదేరి రాత్రి 10.15 కు కాచిగూడకు,మరుసటి రోజు ఉదయం 7.15కు ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది.