Ayyappa devotees
-
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
కేరళ ప్రభుత్వంపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. వివరాల ప్రకారం.. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. పంబా నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో, గంటల తరబడి భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్(ట్రావెన్కోర్ దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది. మకరజ్యోతి వీక్షణం కోసం 50వేల మందికే అనుమతి ఇస్తామని ట్రస్ట్ పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావొద్దని అలర్ట్ చేసింది. అలాగే, ఈనెల 14వ తేదీన 40వేల మందికి, 15వ తేదీన 50వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం అని స్పష్టం చేసింది. சபரிமலை செல்வோர் கவனத்திற்கு.. திடீரென வந்த அறிவிப்பு - ''இதை மீறினால்..' எச்சரிக்கை.. #NewsTamil24x7 | #sabarimala | #kerala | #sabarimalai | #viralvideo | #sabarimalatemple pic.twitter.com/AFxlvutGRr — News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) January 4, 2024 ఇక ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి. @CMOKerala @TheKeralaPolice @BJP4Keralam In Sabarimala Devasthanam this time the crowd has gathered in large numbers and no proper action has been taken for that most of the devotees have faced great hardship as there is no toilet. Action should be taken #Kerala #sabarimalai pic.twitter.com/hBUYcK7DL3 — தயா (Social Worker) (@PresidencyDhaya) January 3, 2024 -
అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీ.. బైరి నరేష్‌పై కేసు
సాక్షి, ములుగు జిల్లా: అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. ప్రమాదం జరిగిన అనంతరం మణుగూరు వైపు వెళ్లిన బైరి నరేష్, అయన భార్య, కొడుకు, డ్రైవర్ వెళ్లినట్లు సమాచారం. బైరి నరేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు. ఇదీ చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్ -
బైరి నరేష్ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత
ములుగు, సాక్షి: ఏటూరు నాగారంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. అందుకు కారణం.. బైరి నరేష్ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలు కావడమే. సోమవారం.. కోరేగావ్ సమావేశం కోసం బైరి నరేష్ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప మీద చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బైరి నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే నరేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో.. నరేష్ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్‌ను అరెస్ట్ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. గతంలో.. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
దేవుని కొలువులోనూ అదే నిర్లక్ష్యమా ?
-
శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనం కాకుండానే వెనక్కి!
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. దర్శనం లేట్ అవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు సమాచారం. వివరాల ప్రకారం.. శబరిమలలో క్యూలైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం వహించారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అయ్యప్ప దర్శనానికి ఎక్కువగా సమయం పడుతుండటంతో కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. VIDEO | Sabarimala pilgrims blocked the Erumeli-Pamba road overnight demanding that their vehicles be allowed to go till Pamba. #Sabarimala pic.twitter.com/IpsOonzRRU — Press Trust of India (@PTI_News) December 13, 2023 మరోవైపు.. శబరిమలకు వెళ్లే రహదారుల్లో మంగళవారం కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. తమ వాహనాలను అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాగా, రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. Extremely dangerous situation at #Sabarimala with unmanageable crowd. Less police force deployed to control the crowd as major force is diverted to CM's and Minister's program.@narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh Kindly intervene and avert a potential disaster🙏🙏 pic.twitter.com/ksoGsa5B0z — നചികേതസ് (@nach1keta) December 12, 2023 ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వెళ్లినట్టు సమాచారం. వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. #SwamiSharanam Salutes to @TheKeralaPolice Team in #Sabarimala. Heavy crowd and they are simply rocking. Helping young Malikappurams inconvenienced in the crowd to get some fresh air pic.twitter.com/mejM0qSWQj — Suresh 🇮🇳 (@surnell) December 12, 2023 Usually we hear Swamy Saranam Ayyappa Nama japam in the queue lines but due to heavy rush and poor management pilgrims were chanting down down police and CM. Yesterday was worst day in life. Never travel with kids. Too much suffocation in Q lanes#Sabarimala pic.twitter.com/1CMFk0NwVD — నేనుఎవరు (@NenuYevaru) December 10, 2023 ప్రత్యేక రైళ్లు.. ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR — South Central Railway (@SCRailwayIndia) December 12, 2023 The Travancore Devaswom Board has completely failed in managing the crowd in Sabarimala. If this continues, it could result in serious issues. #Sabarimala #Kerala pic.twitter.com/blfkwrtyfg — Harish M (@chnmharish) December 10, 2023 -
అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఈ వస్తువులు ఉండాల్సిందే
-
మాల ధారణ సమయంలో నల్ల వస్త్రాలు ధరించడానికి కారణం అదే
-
కన్య స్వాములకు కట్టిన బాణాలు ఏం చేస్తారంటే
-
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్ అరెస్ట్
సాక్షి, వికారాబాద్/వరంగల్: అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో బైరి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శనివారం తెలిపారు. నరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని కోరారు. ఇప్పటికే బైరి నరేశ్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు కోటిరెడ్డి తెలిపారు. అయితే పరారీలో ఉన్న నరేష్ వీడియోలు పోస్టు చేయగా... సోషల్ మీడియా ద్వారా అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా అయ్యప్ప స్వామిపై నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన సభలో దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Hyderabad: నుమాయిష్‌కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే! -
బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ సభలో పాల్గొని చప్పట్లు కొట్టిన రెంజర్ల రాజేశ్ అనే గాయకుడి ఇంటి ముందు అయ్యప్ప భక్తులు శుక్రవారం సాయంత్రం నుంచి సుమారు 6 గంటలపాటు(అర్థరాత్రి వరకు) ధర్నా చేశారు. గతంలోనూ రాజేశ్ అయ్యప్పను కించపరుస్తూ పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టాడని ఆరోపించారు. అయితే అతను ఇంట్లో లేకపోవడంతో వెంటనే పిలిపించాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అతని స్నేహితుడు సుమన్ వచ్చి నిరసన తెలుపుతున్న అయ్యప్ప భక్తులను వీడియో తీస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అయ్యప్ప భక్తులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. రాజేశ్‌తోపాటు సుమన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు అయ్యప్ప భక్తులను సముదాయించారు. రాత్రి 11 గంటల సమయంలో సుమన్ చేత అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పించి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో భక్తులు ఆందోళన విరమించారు. ప్రస్తుతం రాజేష్ నెల్లూరులో ఉన్నట్టు సమాచారం. రాజేష్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ శనివారం కూడా అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. దీంతో రేంజర్లలో పోలీసులు భారీగా మోహరించారు. చదవండి: కొడంగల్: భైరి నరేష్‌పై కేసు నమోదు కోస్గిలో ఉద్రిక్త పరిస్థితి సాక్షి, మహబూబ్‌నగర్: నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన సభలో అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గిలో చేపట్టిన ధర్నా, నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక శివాజీ చౌరస్తాలో పాలమూరు–తాండూరు ప్రధాన రహదారిపై పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు బైఠాయించి నిరసన తెలుపుతుండగా గుండుమాల్‌కు చెందిన బాలరాజు అనే యువకుడు తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో నిరసనకారులు బాలరాజుపై దాడి చేయగా పోలీసులు ఆ యువకుడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా, బైరి నరేశ్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కఠినంగా శిక్షించాలి: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచిన బైరి నరేష్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషాతోపాటు వీహెచ్‌పీ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. -
నిజామాబాద్: అయ్యప్ప స్వాముల ధర్నాలో ఉద్రిక్తత
-
Bairi Naresh: అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు
సాక్షి, నారాయణపేట: హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ భైరి నరేష్‌పై అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం కోస్గి మండల కేంద్రంలో భైరి నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు, రాస్తారోకో చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాలరాజు అనే వ్యక్తిని పరిగెత్తిస్తూ మాలధారులు చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొనగా.. పోలీసులు కలుగుజేసుకుని అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా కనిపించడం, నిలదీస్తే పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోనే అతనిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజుల కిందట కొడంగల్‌లో ఓ సభలో హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు భైరి నరేష్. ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ హిందూ సమాజం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భైరి నరేష్ యూట్యూబ్ ఛానల్‌ను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీడియోలన్నింటిని యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని భైరి నరేష్ భగ్నం కలిగిస్తున్నాడని, కులాల, మతాల మధ్య ద్వేషం రగిలిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, హిందూ దేవతలను అవమాన పరుస్తున్నాడని విమర్శిస్తున్నారు. హిందూ దేవతలను అశ్లీల అసభ్య పదాలతో వర్ణించడంతో యావత్ హిందూజాతి చాలా అవమానం, బాధకు గురవుతుందని నిరసనకారుల్లో పలువురు విమర్శిస్తున్నారు. భైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలిలో అయ్యప్ప స్వాముల ధర్నా చేపట్టారు. మరోవైపు నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు అయ్యప్ప స్వామి భక్తులు. నకిరేకల్ అయ్యప్ప స్వామి భక్త మండలి అద్యర్యం లో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన నరేష్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాళ్లు. -
శబరిమలకు పోటేత్తిన భక్తులు.. రెండేళ్ల తర్వాత వీపరీతంగా రద్దీ
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది శబరిమల. కనీవినీ ఎరుగని రీతిలో శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా భయం మటుమాయం కావడంతో మణికంఠుడ్ని దర్శనం చేసుకునేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజూ లక్షమంది వరకు అయ్యప్ప సన్నిధికి వస్తున్నారు. దీక్షలు విరమిస్తున్నారు. దర్శనం, పార్కింగ్ సమస్యలు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. పోటెత్తిన స్వాములు దాదాపు 12 గంటలపాటు క్యూలైన్లలోనే భక్తులు పడిగాపులుకావాల్సి వస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో నిమిషానికి 80 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో పార్కింగ్ ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. సన్నిధానం, నందపంథల్ ప్రాంతాలైతే భక్తులతో కిటికటలాడుతున్నాయి. భక్తులు రద్దీ పెరగడంతో దర్శన సమయాన్ని కూడా దేవస్థానం బోర్డు 19 గంటల వరకు పొడిగించింది. రద్దీని తగ్గించడానికి వీలుగా వర్చువల్ క్యూ సిస్టమ్‌లో బుకింగ్స్‌పై పరిమితులు పెట్టారు. పంపా నది నుంచి శబరిమల మార్గమంతటా రద్దీ ఉన్నందువల్ల పులిమేడు దారిని ఎంచుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు అధికారులు. రెండేళ్ల తర్వాత వీపరీతంగా రద్దీ రెండేళ్ల తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. కరోనా ఆంక్షలు ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ ఇదే కావడం వల్ల శబరిమలకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ఆన్లైన్ తోపాటు స్పాట్ బుకింగ్ పద్ధతిలోనూ భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ ఈనెల 27తో ముగుస్తుంది. విరామం తర్వాత ఈనెల 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. వచ్చే జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న పడిపూజ తర్వాత మళ్ళీ ఆలయాన్ని మూసేస్తారు. ఆలయంలో ఎంతో ప్రత్యేకమైన నేతి అభిషేకాలను కళ్లారా చూడడం భాగ్యంగా భావిస్తారు భక్తులు. అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వయంగా పాల్గొని తరలించాలని భావించం వల్లే దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు. హుండీపై కరోనా దెబ్బ రూపంలో దేవస్థానానికి వచ్చే ఆదాయమూ బాగా పెరిగింది. కేవలం 28 రోజుల్లో దేవస్థానానికి 148 కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్ ప్రభావం ఆంక్షలు తొలగించినా... మొదట్లో భక్తులు రాక పెద్దగా లేకపోవడంతో గత ఏడాది అంతాకలుపుకుంటే దేవస్థానానికి ఆదాయం 151 కోట్లు వచ్చింది. 201718 సీజన్లో 278 కోట్లు, 201819లో 179 కోట్లు, 201920లో 269 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా వల్ల అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం గణనీయంగా తగ్గింది. కరోనా ఉధృతంగా ఉన్న 202021లో కేవలం 21 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కరోనా నిబంధనల్ని అధికారులు కఠినంగా అమలుచేశారు. దీనికితోడు వైరస్ నిబంధనల వల్ల మణికంఠుడ్ని దర్శించుకునేందుకు వచ్చినవారి సంఖ్య అనూహ్యంగా తగ్గింది. అత్యంత కఠినం అయ్యప్ప దీక్ష అయ్యప్ప దీక్ష చేయడం అంతా ఒక ఎత్తయితే .. శబరిమల యాత్ర మరో ఎత్తు. అత్యంత నియమ,నిష్టలతో బ్రహ్మచర్యం పాటిస్తారు మాలధారులు. సుఖాలకు దూరంగా గడపడమే ఈ దీక్ష ఉద్దేశం. మాలధారణ చేసిన భక్తులు అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లడం దీక్షలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు. శబరి యాత్రలో అత్యంత కీలకమైన ఘట్టం పంబానది స్నానం. ఈ నదిలో స్నానమాచరిస్తే ఇన్ని రోజులు పడిన కష్టం ఒక్కసారిగా మరిచిపోతామని, మనసు తేలికవుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ స్నానమాచరించి స్వామివారి దర్శనానికి భక్తులు బయలుదేరుతారు. ఎంతో పుణ్యం చేస్తేనే మెట్లు ఎక్కే అదృష్టం శబరిమల యాత్ర ఒక్కో దశ ఒక్కొక్క రీతిలో జరుగుతుంది. మొట్టమొదటిసారి మాలధారణ చేసిన వారు కొన్ని దశాబ్దాలుగా మాలధారణ చేసిన స్వాములుగా శబరిగిరికి వస్తారు. తొలిసారి వచ్చిన కన్నెస్వాములు ... గుర్తుగా బాణమును సమర్పించుకుంటారు. మండలం రోజులు దీక్ష. కఠోరమైన నియమాలు. మాలధారణ అనేది జీవితంలో ఒక అపురూపమైన ఘట్టమంటారు. అందుకే ఒక్కసారి స్వామి మాల ధరిస్తే ఏటా ధరించాలనిపిస్తుందని చెబుతారు. అందుకే ఎంతోమంది స్వాములు కొన్ని దశాబ్దాలుగా మాల ధరిస్తూనే ఉన్నారు. 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప దర్శనం పూర్తవుతుంది. అలా స్వాముల్లో ఆధ్యాత్మికతకు పరిపూర్ణత లభిస్తుంది. -
శబరిమలలో పూజలు, భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని సోమవారం తెరిచారు. ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు కొనసాగుతాయని, భక్తులు అనుమతి లేదని దేవాలయ అధికారులు తెలిపారు. నెలవారీ పూజ కార్యక్రమాలు ఆగస్టు 21 సాయంత్రం పూర్తైన తర్వాత ఆలయాన్ని మూసి వేస్తామని తెలిపారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా సబరిమల మినహా దక్షిణ కేరళలోని సుమారు వెయ్యి దేవస్థానాలను ఆగస్టు 27 వరకు తెరిచి ఉంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయింది. శబరిమల ఆలయాన్ని తెరిస్తే పొరుగు రాష్ట్రాల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదని బోర్డు అభిప్రాయపడింది. ఆగస్టు29 నుంచి సెప్టెంబర్2 వరకు ఓనం పూజల కోసం ఆలయం మళ్లీ తెరుచుకుంటుందని టీడీబీ తెలిపింది. ఇటీవల సబరిమల వార్షిక పండుగ తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు పేర్కొన్న విషయం తెలిసిందే. -
శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా జూన్ 14న తెరవనున్న శబరిమల ఆలయాన్ని పూజా కార్యక్రమాల అనంతరం తిరిగి మూసివేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19 నుంచి 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సైతం వాయిదా వేస్తున్నట్టు మంత్రి సురేంద్రన్ వెల్లడించారు. 14 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ఇటీవల ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు అధికారులు, ఆలయ పూజారులు, కేరళ ప్రభుత్వం సమావేశం అయి ఆలయం తెరవాలన్న ఆలోచనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. -
ఆంక్షలపై అసంతృప్తి
నల్ల దుస్తులలో అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. పడిపూజలు జరుగుతున్నాయి. దీక్షలో ఉన్నవారు శబరిమల ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఇదే సమయంలో సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ తాను శబరిమలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించినా, కల్పించకపోయినా సరే, తాను దర్శనానికి వెళ్లేది వెళ్లేదేననికచ్చితంగా చెప్పారామె. మరోవైపు కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్ మాత్రం ‘ఆలయంలోకి ప్రవేశించ డానికి ప్రయత్నించే మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఉండదు’ అంతే కచ్చితంగా చెప్పారు. అయినా తృప్తికి ఏమిటింత పట్టు? ఆమె పట్టుదల వెనుక పరిస్థితులు ఎలాంటివి? భారత రాజ్యాంగంలో మగవాళ్లు, మహిళలు సమానమే అని ఉంది. మరి ధార్మిక సంస్థల్లో ఈ రకమైన లింగ వివక్ష ఎందుకు అనేది తృప్తీ దేశాయ్ ప్రశ్న. దేశాయ్.. దేశానికి ధార్మిక సంస్థల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న కార్యకర్తగానే తెలుసు. కానీ ఆమె అంతకు ముందు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆమెది çపుణెలోని సామాన్య కుటుంబం. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆమె తండ్రి ఇంటిని వదిలి ఆశ్రమాలకు వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలను పెంచి పోషించాల్సిన బాధ్యత తృప్తి తల్లి మీద పడింది. తృప్తి పుణెలో ఉమెన్స్ యూనివర్సిటీలో హోమ్‌సైన్స్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఏడాది తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తృప్తి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి మురికివాడల్లో సేవ చేశారు. పన్నెండేళ్ల కిందట మహారాష్ట్రలోని అజిత్ కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన యాభై కోట్ల కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు తృప్తి. ఆ బ్యాంకు అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ది. అజిత్ పవార్ దిష్టిబొమ్మను తగులబెట్టిన ఆందోళనలో తృప్తి నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణతో ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు అవినీతికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించిన నేపథ్యం కూడా ఉంది. ‘భూమాత బ్రిగేడ్’ స్థాపన ఒక సామాన్యమైన అమ్మాయి.. సామాజిక కార్యకర్తగా మారడానికి, వ్యవస్థలో కరడుగట్టి ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ గళం విప్పడానికి, వివక్షను ఎలుగెత్తుతూ పిడికిలి బిగించడానికి వెనుక పెద్ద మధనమే జరిగి ఉండాలి. అగాధమంత అసంతృప్తి ఏదో ఆమెను ఆవరించి ఉండాలి. తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోవడం, తల్లి కుటుంబ బరువు మోయాల్సి రావడం తృప్తి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. బాధ్యతలను గాలికొదిలేసి సన్యాసం స్వీకరించిన మగవాడికి మాత్రం ఆలయాల్లోకి సగౌరవంగా స్వాగతం పలుకుతూ, ఆడవాళ్ల పట్ల వివక్ష చూపించడాన్ని ఆమె సహించలేకపోయారు. భూమాత బ్రిగేడ్ పేరుతో 2010లో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ధార్మిక ప్రదేశాల్లో అమలవుతున్న లింగ వివక్ష మీద పోరాటానికి సిద్ధమయ్యారు. శని శింగణాపూర్ విజయం మహారాష్ట్రలోని శనిశింగణాపూర్‌లోని శనిదేవుడి ఆలయంలోకి మగవాళ్లకు మాత్రమే ప్రవేశం ఉండేది. తృప్తి లేవదీసిన ఉద్యమంతో సుప్రీంకోర్టు ఆ ఆంక్షను తొలగించింది. తర్వాత 2016 ఏప్రిల్‌లో ముంబయిలోని హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే ఏడాది మే నెలలో ఆమె కట్టుదిట్టమైన భద్రత నడుమ మసీదు గర్భగుడిలోకి మహిళలకు అనుమతి లేని నియమాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఆ మసీదులోని మిగతా భాగంలోకి ప్రవేశించారు. అలాగే నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయంలో మగవాళ్లలాగానే తడివస్త్రాలతో గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే కొల్హాపూర్‌లో మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కొల్హాపూర్ లక్ష్మీదేవిని అర్చించుకోవడానికి మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత తృప్తీదేశాయ్ మరికొందరు కార్యకర్తలతోపాటు ‘విజయ్ ర్యాలీ’ నిర్వహించారు. అయితే భక్తులు ఆ ర్యాలీని అడ్డుకుని తృప్తీదేశాయ్ని గాయపరిచారు. మహాలక్ష్మి ఆలయంలోకి చీరతోనే రావాలనే నియమాన్ని ఉల్లంఘించి సల్వార్ కమీజ్‌తో రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మీద దాడి జరిగింది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నెలలో శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆమెను కొచ్చి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ‘మహిళల గొంతు నొక్కడమే’ ఈ ఏడాది ఆలయం తెరిచిన తర్వాత తిరిగి ప్రవేశానికి ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసులో ఉన్న మహిళల ప్రవేశం మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం మీద న్యాయమూరులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో తీర్పు కోసం విస్తృత ధర్మాసనాన్ని అప్పగించారు గత ఏడాది మహిళలకు రక్షణ కల్పించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఆ ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం రక్షణ బాధ్యత చేపట్టకపోవడం మహిళల గొంతుకను అణచివేయడమే అంటున్నారు తృప్తీదేశాయ్ ఆవేశంగా, ఆవేదనగా. – మంజీర ►తృప్తీ దేశాయ్ నాస్తికురాలని కొందరు, హిందూ వ్యతిరేకి అని కొందరు అభివర్ణించడాన్ని ఆమె భర్త ప్రశాంత్ తప్పు పట్టారు. ఆమె పరమభక్తురాలని, కొల్హాపూర్‌లోని గగన్‌గిరి మహారాజ్ భక్తురాలని చెప్పారాయన. ఆమె తన కొడుకును కూడా ఆస్తికవాదిగానేపెంచుతోందని, ఆమె పోరాటం స్త్రీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మాత్రమేనని అంటారు ప్రశాంత్. ►అయ్యప్ప దర్శనం కోసం శబరిమల చేరుకున్న భక్తులతో శనివారం నాడు కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం. అదేరోజు.. వయోపరిమితి నిబంధనలకు విరుద్ధంగా దర్శనం కోసం వచ్చిన కొంతమంది మహిళా భక్తులను ఆలయ నిర్వాహ కులు ‘పంబ’ ప్రాంతం నుంచే వెనక్కు పంపించేశారు. అలా పంపించడం వివక్షేనని తృప్తీ దేశాయ్ అంటున్నారు. ఎన్ని ఆంక్షలున్నా తను అయ్యప్పను దర్శించుకునే తీరుతానని ఆమె ప్రకటించారు. -
అందరికీ అవే నియమాలు
కార్తీక మాసం వచ్చిందంటే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. కార్తీక దీపాలు వెలుతురు నింపుకుంటాయి. అయ్యప్ప మాలధారులు ఎటు చూసినా కనిపిస్తారు. సూర్యోదయం కంటే ముందుగానే మేల్కొని,వణికే చలిలో చన్నీళ్లతో స్నానం చేసి, ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ, కాళ్లకు పాదరక్షలు లేకుండా 41 రోజుల పాటు నియమాలన్నీ పాటిస్తూ, ఆత్మప్రక్షాళన చేసుకుంటారు. అయ్యప్ప దీక్షలో ఈ నియమాలు అందరికీనా?ఆడవాళ్లకేమైనా సడలింపు ఉందా? సృష్టిలోని ప్రాణులన్నీ పరమాత్ముని సంతానమే. తన బిడ్డలు క్రమశిక్షణలో పెరగాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి మార్గంలో నడచుకోవాలని పరమాత్ముడు ఆశిస్తాడు. హైందవ ధర్మంలో ఇతర దీక్షలతో పోలిస్తే అయ్యప్పస్వామి దీక్షలో భక్తులంతా క్రమశిక్షణ, భక్తి విశ్వాసాలతో మెలగాల్సి ఉంటుంది. దీక్ష స్వీకరించిన ప్రతి ఒక్కరూ 41 రోజులు పూర్తయ్యాక, అడవిమార్గం గుండా కాలినడకన అయ్యప్పను దర్శించుకుంటారు. కొండ మీద కొలువైన స్వామిని కొలవడానికి ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని భక్తుల నమ్మకం. అయ్యప్ప దీక్షలో బాహ్యంగా కనిపించే నియమాల కన్నా ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలను తెలుసుకోవడం మంచిది. దీక్షలో సందేహాలు... అయ్యప్ప దీక్షలో ఉన్నవారికి మాంసాహారం నిషేధం. అలాగని మాంసం విక్రయించే వారు దీక్ష తీసుకోరాదన్న నియమమేమీ లేదు. శుభ్రత ముఖ్యం. పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నవారు సైతం స్వామి మాల వేసుకోవచ్చు. మాల వేసుకున్నవారు మైల, అంటు ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. కాని మైలబట్టలను ఉతికి శుభ్రం చేసే వృత్తిలోని వారు అయ్యప్ప దీక్ష తీసుకోరాదనే నిబంధన ఏమీ లేదు. స్వామిని సేవించుకోవాలన్న కోరిక ఉన్న ప్రతివారు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే స్వామి మాల ధరించవచ్చు. ఋతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం మాల ధరించడానికి వీలు లేదు. ఋతుక్రమం ఇంకా మొదలు కాని బాలికలు, శారీరకంగా ఆ ధర్మం దాటిపోయిన వారు మాలధారణ చేయవచ్చు. అంతరార్థం...అయ్యప్పదీక్షలోని ప్రతి నియమం ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఏర్పరచినవే. చన్నీటి స్నానం – మానసిక ప్రశాంతత lమెడలో ధరించే తులసి లేదా రుద్రాక్ష మాల –రక్తపోటు, మధుమేహం, మానసిక శారీరక రుగ్మతలను దూరం చేయడం ∙ఆహార నియమం – కోరికలను దూరం చేయడం, జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచడం ∙పాదరక్షలను విడిచిపెట్టడం – కష్టాలను ఓర్చుకునే శక్తి ∙నల్ల దుస్తులు – సౌందర్య పిపాస మీద మమకారం పోగొట్టడం ∙విభూతి గంధం ధరించడం – చక్కటి వర్చస్సు, ధైర్యం, బలం ∙భూశయనం – వెన్నెముక గట్టిపడుతుంది. వెన్నుపూస జారడం, వీపునొప్పి వంటి రుగ్మతలను దూరం చేయడం ∙బ్రహ్మచర్య దీక్ష – దంపతుల మధ్య అనురాగం. ఈ నలభై ఒక్క రోజుల దీక్షలో సమయపాలన, ఏకాగ్రత, స్థిరచిత్తం, భగవంతుని మీద దృఢమైన భక్తి విశ్వాసాలు, నిరాడంబరత, మృదుభాషణ వంటి మంచిlలక్షణాలు అలవడతాయి. పూర్ణ సంఖ్య అయిన 18 పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం. స్త్రీలకు కేరళ ప్రభుత్వం ప్రాధాన్యం శబరిమల వచ్చిన భక్తులలో కేరళ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఆడవారికి కల్పిస్తోంది. స్త్రీలకి ఇక్కడ గౌరవ ప్రదంగా ఉంటుంది. కేరళ ప్రభుత్వం నవంబరు 16 నుంచి డిసెంబరు 25 వరకు మండలపూజ ఏర్పాటు చేస్తుంది. జ్యీతి దర్శనం జనవరి 14 వ తారీకు. ఇప్పుడు అక్కడ అన్నసంతర్పణ తగ్గింది. నేను 18 సంవత్సరాలుగా శబరిమల వెళ్తున్నాను. మా పిల్లలిద్దరికీ పది సంవత్సరాలు వచ్చేవరకు తీసుకువెళ్లాను. 50 సంవత్సరాలు దాటిన వాళ్లని కూడా తీసుకువెళ్లాను. సాధారణంగా ఒక బృందంలో పెద్దవాళ్లు, పిల్లలు, ఆడవారు సుమారు పదిహేను మంది దాకా ఉంటారు. వాళ్ల కోసం గదులు బుక్ చేస్తుంటాం. వాళ్లు దీక్ష తీసుకునేటప్పుడు నల్ల చీర, మాల ధరించి వస్తారు. స్త్రీలలో 62 సంవత్సరాల వాళ్లు 11 రోజులుగానీ, 21 రోజులుగానీ దీక్ష తీసుకుంటారు. ఇందులో బ్రహ్మచర్యం ప్రధానం. కొద్దిగా పెద్ద వయసు మహిళలు తెల్లవారుజామునే చన్నీళ్ల స్నానం చేయడానికి ఇబ్బంది పడతారు. కాని వాళ్లకి దేవుణ్ని చూడాలనే కోరిక బలంగా ఉంటుంది. ఇప్పటికి నేను 40 సార్లు వెళ్లాను. అన్నిసార్లు కొత్తవారు తప్పనిసరిగా ఉంటారు. ఇదొక వైజ్ఞానిక, ఆధ్యాత్మిక యాత్ర. తక్కువ ఖర్చుతో వెళ్లేలా చూసుకుంటాను. మాకు వంటవాళ్లు ఉండరు. మేమే చేసుకుంటాం. భయం మనసులో ఉంటే అడుగు వేయలేము. అడవిదారిలో లోయలోకి వెళ్లి చూద్దామంటే భయం వేస్తుంది. జాగ్రత్తగా వెళితే దోమ కూడా కుట్టదు. నాకు భాష రాకపోయినా కూడా తేలికగా తీసుకువెళ్తాను. ఆడపిల్లలను తీసుకువెళ్లడం తప్పు కాదు. నోట్లోకి ముద్ద వెళ్తోందంటే ఆడపిల్లే కారణం. నా భార్యను కిందటి సంవత్సరం తీసుకువెళ్లాను. ఆడపిల్లలు రోజూ తలస్నానం చేయలేకపోతారు. అందువలన కూడా కొందరు ఆడవాళ్లు రాలేకపోతున్నారు. నేను ఒక సంవత్సరమైతే ప్రతి నెలా వెళ్లాను. ప్రతి నెలా ఐదు రోజులు ఈ దేవాలయాన్ని తెరుస్తారు. పంబాలో స్నానం చేస్తే చాలా బావుంటుంది. మళ్లీ రావాలనిపిస్తుంది. ప్రకృతిలో నడిచినప్పుడు వనమూలికల వాసన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ వాసన పీలుస్తూ వెళ్తాం. పారిజాతాల కంటె ఇక్కడి ప్రకృతి మూలికల వాసన చాలా బాగుంటుంది. – వల్లభజోస్యుల వెంకటరత్నం గురుస్వామి, మచిలీపట్నం మా అమ్మాయిలను కూడా తీసుకెళ్లాను నేను ఇప్పటికి 12 సార్లు దీ„ý లోను, నాలుగైదుసార్లు దీక్ష లేకుండానూ శబరిమల అయ్యప్పను దర్శించుకున్నాను. మా అక్కయ్య సుభాషిణి (55), మా పిల్లలు చిన్మయి, శ్రీమణి ఇద్దరూ తొమ్మిది సంవత్సరాలు వచ్చేవరకు నాతోనే వచ్చారు.నేనే గురుస్వామిని కావడం వల్ల ఇరుముడులు కట్టడం, పూజలు చేయడం, అన్నీ మా ఇంట్లోనే. నియమాలలో ఆడవారు, మగవారు అనే తేడా ఉండదు. అక్కడకు వచ్చేవారిలో 90 శాతం మగవారు, కేవలం 10 శాతం మాత్రమే ఆడవారు ఉంటారు. ఆడవారితో వెళ్లేటప్పుడు కనీస సౌకర్యాలు ఉండే రూమ్స్ బుక్ చేసుకుంటాం. పంబ నదికి స్నానానికి వెళ్లినప్పుడు ఆడవారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. మనలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, స్వామిని దర్శించుకోవడం, పెడత్రోవలు పట్టకుండా దీక్షగా ఉండటం ఈ నియమాల లక్ష్యం. – మొక్కపాటి మురళీకృష్ణ,గురుస్వామి, హైదరాబాద్ -
కృష్ణాలో అయ్యప్ప స్వాములు గల్లంతు
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ల వద్ద ఆదివారం ఐదుగురు అయ్యప్పస్వాములు వరద నీటిలో మునిగిపోయారు. ఘాట్‌లో ఉన్న మత్స్యకారులు నలుగురిని రక్షించారు. మరో స్వామి నీటిలో గల్లంతయ్యాడు. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ మధురానగర్‌కు చెందిన పసుపులేటి ధర్మ ముఖేష్, పసుపులేటి నాగకల్యాణ్ అన్నదమ్ములు. శుక్రవారం తమ్ముడు నాగకల్యాణ్ అయ్యప్ప మాల ధరించగా అన్నయ్య ధర్మముఖేష్ శనివారం మాల వేసుకున్నాడు. వీరితో పాటు వారి బంధువులైన పిచ్చేశ్వరరావు, హేమంత్‌కుమార్, నాగరాజు శుక్రవారం మాల ధరించారు. చిరుద్యోగైన ధర్మ ముఖేష్ ఆదివారం తమ్ముడు నాగకల్యాణ్, బంధువులతో కలిసి అమరావతి దేవస్థానానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం 4.30 సమయంలో సీతానగరం పుష్కరఘాట్ వద్ద స్నానం చేసి ఇక్కడే పూజ చేసుకుందామని కృష్ణా నదిలో దిగారు. ఘాట్లకు, పుష్కర కాలువకు మధ్యలో వున్న ఐరన్ పైపులు పట్టుకుని వీరు ఆడుకుంటుండగా మొదట నాగకల్యాణ్ నీటిలోకి జారిపోయాడు. అది గమనించిన ముఖేష్ తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో తాను కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వీరిని కాపాడే ప్రయత్నంలో మిగతా ముగ్గురు కూడా నీటిలో కొట్టుకుపోతూ చేతులు పైకెత్తి కేకలు వేయడంతో.. మత్స్యకారులు గమనించి నలుగురిని కాపాడగలిగారు. ముఖేష్ నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ దొరకలేదు. -
అయ్యప్ప భక్తుల మహా ఉపవాస దీక్ష
-
లోయలో పడిన అయ్యప్ప భక్తుల వాహనం..
తిరువనంతపురం: తమిళనాడులో జరిగిన అయ్యప్ప స్వామి భక్తుల రోడ్డు ప్రమాదం మరువక ముందే మరో ఘటన జరిగింది. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులతో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటన కేరళలలో చోటుచేసుకుంది . బుధవారం ఉదయం సంభవించిన ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా చిన్న మండెం మండలంకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కృష్ణ, క్షతగాత్రులు గోపాలు, కృష్ణయ్య, వెంకటమ్మలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డవారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా తమిళనాడు చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పదిమంది అయ్యప్పభక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కష్టతరంగా పుదుకొట్టై ప్రమాద మృతదేహాల గుర్తింపు
సాక్షి, చెన్నై, మెదక్ : తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా తిరుమయం వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 11మంది ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. ప్రమాదంలో గాయపడ్డ నరేష్ గౌడ్‌ను మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నర్సాపూర్ నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం పుదుకొట్టై మెడికల్ కాలేజీకి చేరుకుంది. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి వారి గ్రామాలకు తరలించనున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ ముగింపుకు సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి మృతదేహాలు నర్సాపూర్ చేరుకోనున్నాయి. రోడ్డు మార్గం ద్వారా మృతదేహాలను నర్సాపూర్ తరలించే ఆలోచన చేస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో వైద్యులు అతన్ని తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురికి పుదుకొట్టై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ నలుగురు కోలుకుంటున్నట్లు చెప్పారు. చికిత్స పొందుతున్న వారు పూర్తిగా కోలుకున్న తర్వాతే వారి గ్రామాలకు వారిని పంపుతామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్ మలైపాండిని మదురైలో అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి : తమిళనాడులో ఘోర ప్రమాదం -
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై/నర్సాపూర్/సిద్దిపేట: భక్తితో 41 రోజులు మండలదీక్ష పూర్తిచేశారు. ఉత్సాహంగా అయ్యప్ప దర్శనానికి శబరిమల బయలుదేరారు. దర్శనం బాగా జరిగిందని ఫోన్ చేసి చెప్పడంతో కుటుంబసభ్యులూ సంతోషించారు. ఇంకేం.. మరో మూడు, నాలుగు రోజుల్లో వచ్చేస్తారంటూ సంతోషిస్తున్న సమయంలోనే ఊహించని వార్త షాక్‌కు గురిచేసింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మృత్యువు ట్రాలీ లారీ రూపంలో కబళించింది. తమిళనాడులోని పుదుకొటై్ట్ట జిల్లా తిరుమయం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పరిధిలోని ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్లకు చెందిన 14 మంది అయ్యప్ప భక్తుల బృందం నాలుగు రోజుల క్రితం శబరిమలైకి వ్యాన్‌లో వెళ్లింది. డ్రైవర్‌తో పాటు 14మంది యాత్రకు బయలుదేరారు. అయ్యప్ప దర్శనానంతరం ఈ భక్తులు రామేశ్వరానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని రామేశ్వరం–పుదుకోట్టై రాష్ట్ర రహదారిలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వీరు పయనిస్తున్న వ్యాన్ తిరుమయం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఓ కంౖటైనర్ అతి వేగంగా దూసుకొచ్చి వీరి వ్యాన్‌ను ఢీకొంది. వేగంగా ఉన్న రెండు వాహనాలు ఢీకొనడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో సమీప గ్రామస్తులు ఏదో ప్రమాదం జరిగిందన్న ఆందోళనతో ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, తిరుమయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ వేగమే ప్రమాదానికి కారణం లారీ ఢీకొన్న వేగంతో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ శకలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే డ్రైవర్ సహా ఎనిమిది మంది ఘటనాస్థలంలోనే విగత జీవులయ్యారు. వారి మృతదేహాల్ని బయటకు తీసి, క్షతగాత్రులను పుదుకొట్టై మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఏడుగురిని ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో మరో ఇద్దరు మరణించారు. తీవ్రగాయాలైన మిగిలిన ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమాచారంతో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీఐజీ లలిత లక్ష్మి, జిల్లా కలెక్టర్ గణేష్, ఎస్పీ సెల్వరాజ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. భాషాపరమైన సమస్యల కారణంగా.. మృతులు, క్షతగాత్రుల వివరాలను సేకరించడం కష్టంగా మారింది. ఎట్టకేలకు తిరుమయం పోలీసులు వివరాలను సేకరించి.. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాల్ని పోస్టుమార్టం తర్వాత స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్ మండలం ఖాజీపేటకు చెందిన బోయిని కుమార్ (21), జుర్రు మహేష్ (25), కర్రె నాగరాజు గౌడ్ (35).. మంతూరుకు చెందిన చీరాల శివసాయి ప్రసాద్ యాదవ్ (22), అయ్యన్నగారి శ్యాంగౌడ్ (22), రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు(42), అంబర్‌పేట క్రిష్ణగౌడ్ (35), చిన్నచింతకుంటకు చెందిన ప్యాట ప్రవీణ్‌గౌడ్ (21), జనుముల సురేశ్ (23) వీరితో పాటు వాహనం డ్రైవర్ సురేశ్ దుర్మరణం పాలయ్యారు. ఖాజీపేటకు చెందిన మస్కూరి రాజు, కర్రె నరేశ్ గౌడ్, దొంతి భూమాగౌడ్, మంతూర్‌కు చెందిన చీరాల శ్రీశైలం యాదవ్, మంగాపూర్‌కు చెందిన దేవులపల్లి వెంకటేశ్‌గౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని అతి వేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మెదక్ జిల్లాలో విషాదం తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. దీంతో మెదక్ జిల్లా నర్సాపూర్, సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్లాలోని మృతుల గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్వామి దర్శనానికి వెళ్లినవారు రెండు, మూడ్రోజుల్లో తిరిగొస్తారునుకుంటున్న సమయంలో.. ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి. సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామాలకు చెందిన 14 మంది 2వ తేదీ బుధవారం అయ్యప్ప దర్శనానికి శబరిమలైకి బయలుదేరారు. హైదరాబాద్‌కు చెందిన టెంపో ట్రావెలర్ వాహనంలో వీరు ప్రయాణమయ్యారు. ఖాజీపేటకు చెందిన బోయిని కుమార్, జుర్రు మహేశ్, మస్కూరి రాజు, కర్రె నాగరాజు గౌడ్, కర్ర నరేశ్ గౌడ్, దొంతి భూమాగౌడ్‌లు, మంతూరు గ్రామానికి చెందిన చీరాల శ్రీశైలం యాదవ్, చీరాల శివసాయి ప్రసాద్ యాదవ్, అయ్యన్నగారి శ్యాంగౌడ్లున్నారు. వారితో పాటు రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు, అబంరి పేట క్రిష్ణగౌడ్లు, చిన్న చింతకుంట గ్రామానికి చెందిన ప్యాట ప్రవీణ్ గౌడ్, జనుముల సురేశ్‌లు కూడా ఈ బృందంలో ఉన్నారు. కాగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామానికి చెందిన దేవులపల్లి వెంకటేశ్ గౌడ్ సైతం వీరితో శబరిమల యాత్రకు బయలుదేరారు. 2వ తేదీన ఖాజీపేటలో ప్రత్యేక పూజలు పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలైకి బయలుదేరి వెళ్లారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సంతాపం తమిళనాడు దుర్ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన పుద్దుకొట్టై కలెక్టర్ ఎస్.గణేశ్‌తో హరీశ్ రావు ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాల్సిందిగా కోరారు. అలాగే మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు సహకరించాలన్నారు. మృతదేహాల తరలింపుపై మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కూడా అక్కడి కలెక్టర్ గణేశ్‌తో మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువచ్చేలా చూడాలని టీఆర్ఎస్ జిల్లా నేత మురళీయాదవ్‌కు హరీశ్ రావు సూచించారు. నర్సాపూర్ తహసీల్దార్ భిక్షపతి, సీఐ సైదులను వెంటనే తమిళనాడు వెళ్లి మృతదేహాలను తీసుకురావటంతోపాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల వివరాలు 1. బోయిని కుమార్ (21): ఖాజీపేటకు చెందిన బోయిని మల్లేశ్, బాలమణి దంపతుల కుమారుడు బోయిని కుమార్ (21). హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చేతికొచ్చిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబలో విషాదం నెలకొంది. 2. మహేశ్ యాదవ్ (25): ఖాజీపేటకు చెందిన జుర్రు సాయిలు, మల్లమ్మ దంపతుల కుమారుడు జుర్రు మహేశ్ యాదవ్. ఆయనకు ఆర్నెల్ల క్రితమే వివాహం జరిగింది. నర్సాపూర్‌లో బైక్ మెకానిక్‌గా పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్నాడు. 3. నాగరాజు గౌడ్ (35): ఖాజీపేటకు చెందిన కర్రె రామాగౌడ్, యాదమ్మ దంపతుల పిల్లలు కర్రె నాగరాజు గౌడ్, కర్రె నరేష్ గౌడ్లు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకుని శబరిమలకి వెళ్లారు. ప్రమాదంతో పెద్దవాడైన నాగరాజు మృతి చెందాడు. తమ్ముడు నరేశ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. నాగరాజుగౌడ్ 15 సార్లు అయ్యప్పస్వామి మాల ధరించాడు. మృతుడికి భార్య లక్ష్మి, పిల్లలు లోహిక, చరణ్‌గౌడ్‌లు ఉన్నారు.లాయన నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు బస్సు డ్రైవర్‌గా ఉన్నారు. 4. చీరాల శివ సాయి ప్రసాద్ (22): మంతూర్ గ్రామానికి చెందిన చీరాల మల్లేశ, మలమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ సాయి ప్రసాద్. హైదరాబాద్‌లోని ఓ కాలేజీ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 5. అయ్యన్నగారి శ్యాంసుందర్‌గౌడ్ (22): మంతూర్‌కు చెందిన అయ్యన్న గారి సంజీవగౌడ్, సుజాత దంపతులకు ఏకైక కుమారుడు శ్యాంసుందర్ గౌడ్. సంజీవ్ గౌడ్ రైతు కాగా.. మృతుడు నర్సాపూర్‌లో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. 6. నక్క ఆంజనేయులు (42): రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు నర్సాపూర్‌లో మోటారు వైండింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, పిల్లలు సాయి, మహాసిరిలు ఉన్నారు. టుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 7. అంబర్‌పేట క్రిష్ణగౌడ్ (35): రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబర్‌పేట క్రిష్ణగౌడ్కు భార్య లత, ఇద్దరు పిల్లలు (అభినవ్, అభిరాం) ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ క్రిష్ణ గౌడ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 8. జనుముల సురేశ్ (23): నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంటకు చెందిన జనుముల సురేశ్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలోనే భర్తను కోల్పోయిన ఆ యువకుడి తల్లి.. ఇప్పుడు కుమారుడు కూడా ఇక రాడని తెలిసి రోదిస్తున్న తీరు కలచివేసింది. 9. ప్రవీణ్ గౌడ్ (21): మెదక్ మండలంలోని గడ్డమోనిపల్లికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, భాగ్యమ్మల కుమారుడైన ప్రవీణ్‌గౌడ్ తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన తన తాత అంజా గౌడ్ ఇంట్లో ఉంటూ నర్సాపూర్‌లో మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. 10. సురేశ్ (వాహనం డ్రైవర్): ఆయన గురించిన వివరాలు తెలియరాలేదు. -
‘శబరిమలను ఘర్షణ జోన్‌గా మార్చారు’
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి బుధవారం ప్రవేశించిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి వచ్చిన మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యతని, రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించిందని చెప్పారు. శబరిమలను ఘర్షణ జోన్‌గా మలిచేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రేరేపించే హింసను కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. శబరిమలలోకి ఇద్దరు మహిళల ప్రవేశం నేపథ్యంలో సెక్రటేరియట్ ఎదుట బీజేపీ, సీపీఎం కార్యకర్తలు బాహాబాహీకి తలపడటంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించిన క్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు ఏడు పోలీస్ వాహనాలు, 79 కేఎస్ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని, 39 మంది పోలీసులపై దాడులకు తెగబడ్డారని సీఎం వెల్లడించారు. అల్లరి మూకలు మహిళలపై దాడులకు పాల్పడ్డాయని, మహిళా మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారని చెప్పారు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి నిరసనగా బంద్ చేయడమంటే సుప్రీం కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించడమేనని వ్యాఖ్యానించారు. కాగా కేరళలో శబరిమల కర్మ సమితి పేరుతో హిందూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా 12 గంటల హర్తాళ్‌కు పిలుపు ఇచ్చాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు మూడు నెలల కిందట ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కనకదుర్గ (44), బిందు (42) అనే ఇద్దరు మహిళలు అన్ని అడ్డంకులు, కట్టుబాట్లను అధిగమిస్తూ ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. వీరి ఆలయ ప్రవేశంపై హిందూ సంఘాలు, బీజేపీ, ఆరెస్సెస్ భగ్గుమంటున్నాయి.