సాక్షి, వికారాబాద్/వరంగల్: అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో బైరి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శనివారం తెలిపారు. నరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని కోరారు.
ఇప్పటికే బైరి నరేశ్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు కోటిరెడ్డి తెలిపారు. అయితే పరారీలో ఉన్న నరేష్ వీడియోలు పోస్టు చేయగా... సోషల్ మీడియా ద్వారా అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
కాగా అయ్యప్ప స్వామిపై నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన సభలో దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: Hyderabad: నుమాయిష్‌కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment