bairi Naresh
-
అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టిన కేసుపై స్పందించిన భైరి నరేష్
-
అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టిన బైరి నరేష్ వాహనం
-
నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్
సాక్షి, ములుగు: తాను ఎక్కడికి పారిపోలేదు.. ఎవరిపైనా దాడి చేయలేదని నాస్తికుడు బైరి నరేష్ అన్నారు. తాను దాడి చేశానన్న వార్తలో నిజం లేదన్నారు. కాగా, అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. బైరి నరేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీ.. బైరి నరేష్‌పై కేసు
సాక్షి, ములుగు జిల్లా: అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. ప్రమాదం జరిగిన అనంతరం మణుగూరు వైపు వెళ్లిన బైరి నరేష్, అయన భార్య, కొడుకు, డ్రైవర్ వెళ్లినట్లు సమాచారం. బైరి నరేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు. ఇదీ చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్ -
బైరి నరేష్ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత
ములుగు, సాక్షి: ఏటూరు నాగారంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. అందుకు కారణం.. బైరి నరేష్ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలు కావడమే. సోమవారం.. కోరేగావ్ సమావేశం కోసం బైరి నరేష్ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప మీద చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బైరి నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే నరేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో.. నరేష్ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్‌ను అరెస్ట్ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. గతంలో.. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
సాక్షి చేతికి బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్
-
కావాలనే అలా మాట్లాడా.. భైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు!
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప స్వామి పుట్టుకను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్.. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలతో హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహానికి గురయ్యాడు ఓయూ స్టూడెంట్ భైరి నరేష్. అయితే కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇక రిమాండ్‌లో ఉన్న భైరి నరేష్ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. కావాలనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడతను. అలాగే.. నరేష్‌ను తాను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కార్యక్రమానికి పిలిచినట్లు మరో నిందితుడు, సభను నిర్వహించిన హనుమంతు పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు భైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని కొడంగల్ పోలీసులు కోర్టుకు వెల్లడించినట్లు రిమాండ్ కాపీలో ఉంది. మత విద్వేషాలకు పాల్పడే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కొడంగల్ స్థానిక కోర్టుకు తెలిపారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్ స్టేషన్లోనూ భైరి నరేష్‌పై కేసులు ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుత కేసుపై అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. డిసెంబర్19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొడంగల్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంలో ప్రసంగించిన భైరి నరేష్ ఈ క్రమంలోనే హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఉమాపతి గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. సాక్షి చేతిలో బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ -
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత
-
భైరి నరేష్‌కు సపోర్ట్‌గా పోస్టులు.. రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓయూ విద్యార్థి భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భైరి నరేష్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ప్రకటించారు కూడా. ఈ తరుణంలో శనివారం మరో పరిణామం చోటు చేసుకుంది. భైరి నరేష్‌ను కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. భైరి నరేష్‌ను, హనుమంత్లను పరిగి సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప స్వాములు జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు భైరి నరేష్ సమీప బంధువు మరో వివాదాస్పద చర్యకు దిగాడు. భైరి నరేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు అగ్నితేజ్. దీంతో మరో దుమారం చెలరేగింది. అగ్నితేజ్ పోస్టుపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో రంగంలోకి దిగిన పోలీసులు.. అగ్నితేజ్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అగ్నితేజ్ గురించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే తమ కొడుకుతో తమకు మాటలు లేవని, తాము దేవుళ్లను పూజిస్తామని అగ్నితేజ్ తల్లి స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు భైరి నరేష్ తల్లిదండ్రులు, భార్య సుజాత ఇద్దరు పిల్లలు భయంతో ఇల్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్ అరెస్ట్
సాక్షి, వికారాబాద్/వరంగల్: అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో బైరి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శనివారం తెలిపారు. నరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని కోరారు. ఇప్పటికే బైరి నరేశ్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు కోటిరెడ్డి తెలిపారు. అయితే పరారీలో ఉన్న నరేష్ వీడియోలు పోస్టు చేయగా... సోషల్ మీడియా ద్వారా అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా అయ్యప్ప స్వామిపై నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన సభలో దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Hyderabad: నుమాయిష్‌కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే! -
బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ సభలో పాల్గొని చప్పట్లు కొట్టిన రెంజర్ల రాజేశ్ అనే గాయకుడి ఇంటి ముందు అయ్యప్ప భక్తులు శుక్రవారం సాయంత్రం నుంచి సుమారు 6 గంటలపాటు(అర్థరాత్రి వరకు) ధర్నా చేశారు. గతంలోనూ రాజేశ్ అయ్యప్పను కించపరుస్తూ పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టాడని ఆరోపించారు. అయితే అతను ఇంట్లో లేకపోవడంతో వెంటనే పిలిపించాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అతని స్నేహితుడు సుమన్ వచ్చి నిరసన తెలుపుతున్న అయ్యప్ప భక్తులను వీడియో తీస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అయ్యప్ప భక్తులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. రాజేశ్‌తోపాటు సుమన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు అయ్యప్ప భక్తులను సముదాయించారు. రాత్రి 11 గంటల సమయంలో సుమన్ చేత అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పించి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో భక్తులు ఆందోళన విరమించారు. ప్రస్తుతం రాజేష్ నెల్లూరులో ఉన్నట్టు సమాచారం. రాజేష్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ శనివారం కూడా అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. దీంతో రేంజర్లలో పోలీసులు భారీగా మోహరించారు. చదవండి: కొడంగల్: భైరి నరేష్‌పై కేసు నమోదు కోస్గిలో ఉద్రిక్త పరిస్థితి సాక్షి, మహబూబ్‌నగర్: నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన సభలో అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గిలో చేపట్టిన ధర్నా, నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక శివాజీ చౌరస్తాలో పాలమూరు–తాండూరు ప్రధాన రహదారిపై పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు బైఠాయించి నిరసన తెలుపుతుండగా గుండుమాల్‌కు చెందిన బాలరాజు అనే యువకుడు తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో నిరసనకారులు బాలరాజుపై దాడి చేయగా పోలీసులు ఆ యువకుడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా, బైరి నరేశ్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కఠినంగా శిక్షించాలి: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచిన బైరి నరేష్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషాతోపాటు వీహెచ్‌పీ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. -
నిజామాబాద్: అయ్యప్ప స్వాముల ధర్నాలో ఉద్రిక్తత
-
బైరి నరేష్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు
-
కొడంగల్: భైరి నరేష్‌పై కేసు నమోదు
సాక్షి, వికారాబాద్: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై శుక్రవారం కేసు నమోదు అయ్యింది. నరేష్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొడంగల్ పోలీసులు. రెండు రోజుల కిందట ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు, రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో కోస్గిలో వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా వ్యవహరించిన బాలరాజు అనే వ్యక్తిపై అయ్యప్ప మాలధారులు దాడి చేశారు కూడా. అయితే.. ఫిర్యాదుల నేపథ్యంలో భైరి నరేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 295/ఏ, 298, 153ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే.. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు. శాంతికి విఘాతం కలిగించేవాళ్లను సమావేశాలకు పిలవొద్దని ఎస్పీ స్పష్టం చేశారు. -
అయ్యప్పస్వామిపై భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Bairi Naresh: అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు
సాక్షి, నారాయణపేట: హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ భైరి నరేష్‌పై అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం కోస్గి మండల కేంద్రంలో భైరి నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు, రాస్తారోకో చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాలరాజు అనే వ్యక్తిని పరిగెత్తిస్తూ మాలధారులు చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొనగా.. పోలీసులు కలుగుజేసుకుని అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా కనిపించడం, నిలదీస్తే పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోనే అతనిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజుల కిందట కొడంగల్‌లో ఓ సభలో హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు భైరి నరేష్. ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ హిందూ సమాజం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భైరి నరేష్ యూట్యూబ్ ఛానల్‌ను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీడియోలన్నింటిని యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని భైరి నరేష్ భగ్నం కలిగిస్తున్నాడని, కులాల, మతాల మధ్య ద్వేషం రగిలిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, హిందూ దేవతలను అవమాన పరుస్తున్నాడని విమర్శిస్తున్నారు. హిందూ దేవతలను అశ్లీల అసభ్య పదాలతో వర్ణించడంతో యావత్ హిందూజాతి చాలా అవమానం, బాధకు గురవుతుందని నిరసనకారుల్లో పలువురు విమర్శిస్తున్నారు. భైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలిలో అయ్యప్ప స్వాముల ధర్నా చేపట్టారు. మరోవైపు నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు అయ్యప్ప స్వామి భక్తులు. నకిరేకల్ అయ్యప్ప స్వామి భక్త మండలి అద్యర్యం లో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన నరేష్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాళ్లు. -
సైన్స్‌తోనే సమాజాభివృద్ధి
సైంటిస్టులు మూఢనమ్మకాలు పాటించడం దురదృష్టకరం సీసీఎంబీ డెరైక్టర్ ఆవేదన తార్నాక,న్యూస్‌లైన్: మతాలు, ధర్మాలు మార్పును కోరవని..సైన్స్ మాత్రమే సమాజంలో నిరంతర మార్పులను స్వాగతిస్తుందని సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఓయూలో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎస్ఎస్ఎఫ్) దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఎస్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బైరి నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మోహన్‌రావుతో పాటు ఓయూ వీసీ ప్రొ.సత్యనారాయణ, శాంతిచక్ర ఇంటర్నేషనల్ వ్యస్థాపకులు నర్రా రవికుమార్, శాతవాహనయూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొ.సుజాత, సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్, జయరాజు తదితరులు హాజరై ప్రసంగించారు. సైంటిస్టులు కూడా మూఢనమ్మకాలను,ఆచారాలను నమ్మడం దురదృష్టకరమని వాపోయారు. సైన్స్ సమాజం అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని ఆకాంక్షించారు. సదస్సు నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎస్ఎస్ఎఫ్ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రక్త నమోదు, అవయవ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలతోపాటు ఆయా జిల్లాల నుంచి సుమారు 400 మంది హాజరయ్యారు. శాస్త్రీయ ద్పక్పథంతో ఓ ప్రేమజంటకు ఆదర్శవివాహం జరిపించారు.