అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీ.. బైరి నరేష్‌పై కేసు | Eturnagaram: Case Registered Against Bairi Naresh | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీ.. బైరి నరేష్‌పై కేసు

Published Tue, Jan 2 2024 8:36 AM | Last Updated on Tue, Jan 2 2024 10:59 AM

Eturnagaram: Case Registered Against Bairi Naresh - Sakshi

సాక్షి, ములుగు జిల్లా:  అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్‌ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్‌ బస్సులో వెళ్లిపోయారు.

వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. ప్రమాదం జరిగిన అనంతరం మణుగూరు వైపు వెళ్లిన బైరి నరేష్, అయన భార్య, కొడుకు, డ్రైవర్ వెళ్లినట్లు సమాచారం. బైరి నరేష్‌ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు.
 

ఇదీ చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్‌ సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement