బైరి నరేష్‌ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత | Bairi Naresh Vehicle Hits Ayyappa Devotee In Mulugu, Devotees Started Protests Against Him - Sakshi
Sakshi News home page

బైరి నరేష్‌ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు.. ములుగులో తీవ్ర ఉద్రిక్తత

Published Mon, Jan 1 2024 3:42 PM | Last Updated on Mon, Jan 1 2024 6:09 PM

Bairi Naresh Vehicle Dash Ayyappa Devotee Mulugu - Sakshi

ములుగు, సాక్షి: ఏటూరు నాగారంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. అతన్ని అరెస్ట్‌ చేయాలని ఆందోళన చేపట్టారు. అందుకు కారణం.. బైరి నరేష్‌ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలు కావడమే.

సోమవారం.. కోరేగావ్‌ సమావేశం కోసం బైరి నరేష్‌ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప మీద చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బైరి నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.

అయితే నరేష్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో.. నరేష్‌ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్‌ను అరెస్ట్‌ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. 

గతంలో..
ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్‌ అంగీకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement