- సైంటిస్టులు మూఢనమ్మకాలు పాటించడం దురదృష్టకరం
- సీసీఎంబీ డెరైక్టర్ ఆవేదన
తార్నాక,న్యూస్‌లైన్: మతాలు, ధర్మాలు మార్పును కోరవని..సైన్స్ మాత్రమే సమాజంలో నిరంతర మార్పులను స్వాగతిస్తుందని సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఓయూలో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎస్‌ఎస్‌ఎఫ్) దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఎస్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు బైరి నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మోహన్‌రావుతో పాటు ఓయూ వీసీ ప్రొ.సత్యనారాయణ, శాంతిచక్ర ఇంటర్నేషనల్ వ్యస్థాపకులు నర్రా రవికుమార్, శాతవాహనయూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొ.సుజాత, సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్, జయరాజు తదితరులు హాజరై ప్రసంగించారు.
సైంటిస్టులు కూడా మూఢనమ్మకాలను,ఆచారాలను నమ్మడం దురదృష్టకరమని వాపోయారు. సైన్స్ సమాజం అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని ఆకాంక్షించారు. సదస్సు నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎస్‌ఎస్‌ఎఫ్ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రక్త నమోదు, అవయవ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలతోపాటు ఆయా జిల్లాల నుంచి సుమారు 400 మంది హాజరయ్యారు. శాస్త్రీయ ద్పక్పథంతో ఓ ప్రేమజంటకు ఆదర్శవివాహం జరిపించారు.