( ఫైల్ ఫోటో )
సాక్షి, వికారాబాద్: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై శుక్రవారం కేసు నమోదు అయ్యింది. నరేష్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొడంగల్ పోలీసులు.
రెండు రోజుల కిందట ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు, రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో కోస్గిలో వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా వ్యవహరించిన బాలరాజు అనే వ్యక్తిపై అయ్యప్ప మాలధారులు దాడి చేశారు కూడా. అయితే..
ఫిర్యాదుల నేపథ్యంలో భైరి నరేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 295/ఏ, 298, 153ఏ, 505(2) సెక్షన్‌ల కింద కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే.. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది.
మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు. శాంతికి విఘాతం కలిగించేవాళ్లను సమావేశాలకు పిలవొద్దని ఎస్పీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment