
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: తమిళనాడులో జరిగిన అయ్యప్ప స్వామి భక్తుల రోడ్డు ప్రమాదం మరువక ముందే మరో ఘటన జరిగింది. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులతో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటన కేరళలలో చోటుచేసుకుంది . బుధవారం ఉదయం సంభవించిన ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
వైఎస్సార్ కడప జిల్లా చిన్న మండెం మండలంకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కృష్ణ, క్షతగాత్రులు గోపాలు, కృష్ణయ్య, వెంకటమ్మలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డవారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా తమిళనాడు చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పదిమంది అయ్యప్పభక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.