
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా 90 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి డిసెంబర్ 9 నుంచి జనవరి 18 వరకు ఈ రైళ్లు నడుపనున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్–కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైలు (నం.07109) డిసెంబర్ 11, 15, 19, 24, జనవరి 3, 6, 10, 13 తేదీల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.55కు బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07110) డిసెంబర్ 15, 24, 26, జనవరి 5, 8, 12, 15వ తేదీల్లో కొల్లంలో తెల్లవారుజామున 3కు బయలుదేరి మర్నాడు ఉదయం 10.30కు హైదరాబాద్ చేరుతుంది. రైలు (నం.07141) డిసెంబర్ 12, 16, జనవరి 2, 5, 8, 9, 12, 14 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 4.15కు బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07142) డిసెంబర్ 14, 18, జనవరి 4, 7, 10, 11, 14, 16ల్లో కొల్లంలో తెల్లవారుజామున 3కు బయలుదేరి మర్నాడు ఉదయం 10.35కు హైదరాబాద్ చేరుతుంది. రైలు (నం.07133) డిసెంబరు 20, జనవరి 16 తేదీల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.30కు బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07134) డిసెంబర్ 22, 31, జనవరి 2, 18 తేదీల్లో కొల్లంలో తెల్లవారుజామున 3కు బయలుదేరి మర్నాడు ఉదయం 10.30కు హైదరాబాద్ చేరుతుంది. రైలు (నం.07611) జనవరి 1న మధ్యాహ్నం 3.40కు కాచిగూడలో బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07612) జనవరి 3న ఉదయం 3కి కొల్లంలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.15కు కాచిగూడ చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment