Uma Shankar Kumar
-
అయ్యప్ప భక్తులకోసం 90 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా 90 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి డిసెంబర్ 9 నుంచి జనవరి 18 వరకు ఈ రైళ్లు నడుపనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్–కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు ప్రత్యేక రైలు (నం.07109) డిసెంబర్ 11, 15, 19, 24, జనవరి 3, 6, 10, 13 తేదీల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.55కు బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07110) డిసెంబర్ 15, 24, 26, జనవరి 5, 8, 12, 15వ తేదీల్లో కొల్లంలో తెల్లవారుజామున 3కు బయలుదేరి మర్నాడు ఉదయం 10.30కు హైదరాబాద్ చేరుతుంది. రైలు (నం.07141) డిసెంబర్ 12, 16, జనవరి 2, 5, 8, 9, 12, 14 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 4.15కు బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07142) డిసెంబర్ 14, 18, జనవరి 4, 7, 10, 11, 14, 16ల్లో కొల్లంలో తెల్లవారుజామున 3కు బయలుదేరి మర్నాడు ఉదయం 10.35కు హైదరాబాద్ చేరుతుంది. రైలు (నం.07133) డిసెంబరు 20, జనవరి 16 తేదీల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.30కు బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07134) డిసెంబర్ 22, 31, జనవరి 2, 18 తేదీల్లో కొల్లంలో తెల్లవారుజామున 3కు బయలుదేరి మర్నాడు ఉదయం 10.30కు హైదరాబాద్ చేరుతుంది. రైలు (నం.07611) జనవరి 1న మధ్యాహ్నం 3.40కు కాచిగూడలో బయలుదేరి మర్నాడు రాత్రి 11.55కు కొల్లం చేరుతుంది. రైలు (నం.07612) జనవరి 3న ఉదయం 3కి కొల్లంలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.15కు కాచిగూడ చేరుతుంది. -
పట్టాలపైకొస్తే కటకటాలే..!
సాక్షి, హైదరాబాద్: సెక్షన్ 147 భారత రైల్వే చేతిలో బ్రహ్మాస్త్రం. పట్టాలపైకి అనుమతి లేకుండా ఎవరైనా వచ్చినా.. ఎంతటివారినైనా అరెస్టు చేసే అధికారాన్ని కల్పించే చట్టం. దీని అమలు విషయంలో ఇంతకాలం కాస్త పట్టువిడుపుగా వ్యవహరించారు. అయితే, ఇటీవల అమృత్‌సర్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో అన్ని రైల్వే జోన్లలో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఏమిటీ చట్టం? భారత రైల్వే చట్టంలోని సెక్షన్ 147.. 1989లో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రైల్వే పరిసరాలు, ఆస్తులకు సమీపంలో అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించినా శిక్షార్హులు. వీరికి రూ. 1000 జరిమానాతోపాటు 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. పరిస్థితులను బట్టి రెండింటినీ ఒకేసారి అమలు చేసే అవకాశాలున్నాయి. ఉద్య మ సమయంలో రైలు రోకోలో పాల్గొన్న చాలామంది నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం మనకు తెలిసిందే. సివిక్ సెన్స్ లేకపోవడమే అసలు సమస్య.. పట్టాలపై నడవడం, సంచరించడం నేరమన్న విషయాన్ని రైల్వే నిరంతరం ప్రచారం చేస్తూనే ఉంది. అయినా, కొందరు వీటిని చెవికెక్కించుకోవడం లేదు. పౌరులు రైలు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధానకారణమని రైల్వే పోలీసులు స్పష్టంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 2015 నుంచి 2017 వరకు దాదాపు 50 వేలమంది రైలు పట్టాలు దాటుతూ మృతి చెందడం గమనార్హం. కఠిన చర్యలుంటాయి.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పట్టాలపై ఇష్టానుసారంగా సంచరిస్తే కఠిన చర్యలుంటాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్యూబీ, ఆర్వోబీ, సబ్వే, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు వాడుకోవాలని స్పష్టంచేశారు. నేరుగా పట్టాలు దాటేవారికి, పట్టాలపై నిరసనలు, ధర్నాలు చేసినా, సామూహికంగా గుమిగూడినా, రైళ్ల ఆలస్యానికి కారణమైనా అరెస్టులు తప్పవన్నారు. పట్టాలపై సెల్ఫీలు తీసుకున్నా, ఫోన్లు మాట్లాడుతూ పట్టాలు దాటినా.. కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రయాణికులు, పౌరుల భద్రత కోసమే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. -
రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ–సికింద్రాబాద్, సంత్రగాచి–చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమశంకర్కుమార్ బుధవారం తెలిపారు. కాకినాడ– సికింద్రాబాద్ (82715/ 82716) ప్రత్యేక రైలు ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు కాకినాడలో బయలుదేరి మర్నాడు ఉదయం 4.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 22న ఉదయం 5.50కు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 6కు కాకినాడ చేరుకుంటుంది. సంత్రగాచి– చెన్నై సెంట్రల్ (02841/02842) ప్రత్యేక రైలు ఈ నెల 12, 19, 26, నవంబర్ 2 తేదీల్లో ఉదయం 12.40 గంటలకు సంత్రగాచిలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.40 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. తిరిగి ఈ నెల 13, 20, 27, నవంబర్ 3వ తేదీల్లో సాయంత్రం 6.20 కు చెన్నై సెంట్రల్లో బయలుదేరి మర్నాడు రాత్రి 11.30 గంటలకు సంత్రగాచి చేరుకుంటుంది. -
సికింద్రాబాద్–జబల్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–జబల్పూర్, జబల్పూర్–తిరునల్వేలిల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జబల్పూర్–సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (1704) ఈ నెల 8, 15, 22, 29 నవంబర్ 5, 12 తేదీల్లో రాత్రి 8కి జబల్పూర్లో బయల్దేరి మర్నాడు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్–జబల్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (1703) ఈ నెల 9, 16, 23, 30, నవంబర్ 6, 13 (సోమవారాల్లో) తేదీల్లో రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.15 గంటలకు జబల్పూర్ చేరుతుంది. తిరునల్వేలి– జబల్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (02194) ఈ నెల 11, 18, 25, నవంబర్ 1, 8 తేదీ(గురువారాలు)ల్లో ఉదయం 9.30 గంటలకు జబల్పూర్లో బయల్దేరి తిరునల్వేలికి శనివారాల్లో ఉదయం 4.45 గంటలకు చేరుతుంది. జబల్పూర్–తిరునల్వేలి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (02193) ఈ నెల 13, 20, 27, నవంబర్ 3, 10 తేదీ(శనివారాలు)ల్లో తిరునల్వేలిలో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి సోమవారాల్లో ఉదయం 11.15 గంటలకు జబల్పూర్ చేరుతుంది. -
హైదరాబాద్–నాగర్సోల్ ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా హైదరాబాద్–నాగర్సోల్ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్–నాగర్సోల్ ( 07064/07063) ప్రత్యేక రైలు ఈ నెల 26న మధ్యాహ్నం 3.15కు హైదరాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 5.50కి నాగర్సోల్ చేరుకుంటుంది. తిరిగి 29వ తేదీ సాయంత్రం 5.30కు నాగర్సోల్లో బయలుదేరి మర్నాడు ఉదయం 8.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–బికనీర్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు... సికింద్రాబాద్–బికనీర్ (17034/17038) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 22 నుంచి హిస్సార్ వరకు పొడిగించనున్నారు. రైలు ప్రతి మంగళ, బుధవారాల్లో రాత్రి 11.55కు సికింద్రాబాద్‌లో బయలుదేరి గురు, శుక్రవారాల్లో రాత్రి 11.05 గంటలకు హిస్సార్ చేరుకుంటుంది. తిరిగి ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9.25కు హిస్సార్‌లో బయలుదేరి ఆది, మంగళవారాల్లో ఉదయం 8.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ సోమవారం తెలిపారు. కాచిగూడ–విశాఖపట్టణం (07016) ప్రత్యేక రైలు ఆగస్టు 7, 14, 21, 28, సెప్టెంబర్ 4, 11, 18, 25, అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కి విశాఖ చేరుకుంటుంది. తిరుపతి–కాచిగూడ (07146) ప్రత్యేక రైలు ఆగస్టు 9, 16, 23, 30, సెప్టెంబర్ 6, 13, 20, 27, అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. లింగంపల్లి–విశాఖ (07148/07147) ప్రత్యేక రైలు ఆగస్టు 3, 10, 17, 24, 31, సెప్టెంబర్ 7, 14, 21, 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 4, 11, 18, 25, సెప్టెంబర్ 1, 8, 15, 22, 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10.15కు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి 11.10కి లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి–కాకినాడ (07075/07076) ప్రత్యేక రైలు ఆగస్టు 5, 12, 19, 26, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30, అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 4.55 కు బయలుదేరి అదేరోజు సాయంత్రం 4.45కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45కు లింగంపల్లి చేరుకుంటుంది. -
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ నుంచి కాకినాడ, అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుస టి రోజు ఉదయం 5.45కు కాకినాడ చేరుకుంటుంది. తిరు గుప్రయా ణంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 కి నాంపల్లి చేరుకుంటుంది. అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు..: హైదరాబాద్–అహ్మదాబాద్ (07018/07017) ప్రత్యేక రైలు ఈ నెల 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 6.20 కి హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 12.30కు అహ్మదాబాద్ చేరుకుంటుం ది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 6.15కు అహ్మదాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
అజ్మీర్ దర్గా ఉర్సుకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ ఉర్సు 805వ వార్షిక ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుంచి అజ్మీర్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–అజ్మీర్ (07125/07126) ప్రత్యేక రైలు ఈ నెల 31న మధ్యాహ్నం 3.15కు నాంపల్లి నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 5.15కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6న ఉదయం 9.55కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న రాత్రి 11.15కు నాంపల్లి చేరుకుంటుంది. కాచిగూడ–అజ్మీర్ (07129/07130) ప్రత్యేక రైలు మార్చి 31న రాత్రి 8.40కి కాచిగూడ నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 7.25కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న సాయంత్రం 7.25కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7 ఉదయం 7.30కు కాచిగూడ చేరుకుంటుంది. నెల్లూరు–అజ్మీర్ (07227/07228) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 7.40కి నెల్లూరు నుంచి బయలుదేరి ఏప్రిల్ 1న రాత్రి 9.30కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న రాత్రి 9.40కి అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న మధ్యాహ్నం 1.45కు నెల్లూరు చేరుకుంటుంది. మచిలీపట్నం–అజ్మీర్ (07131/07132) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 10.40కి మచిలీపట్నం నుంచి బయలుదేరి అదేరోజు నెల్లూరు–అజ్మీర్ ప్రత్యేక రైలుకు లింక్ అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 7న విజయవాడ వద్ద అజ్మీర్–నెల్లూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి విడిపోయి ఉదయం 10.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12796) వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.30కి బయలుదేరి, 9.40కి గుంటూరు చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ తర్వాత మళ్లీ బయలుదేరి ఉదయం 10.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. -
సికింద్రాబాద్-విశాఖ మధ్య సువిధ రైళ్లు
ప్రయాణికుల రద్దీ రీత్యా ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ. రైల్వే సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-విశాఖల మధ్య సువిధ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ-సికింద్రాబాద్ (08501/08502) వీక్లీ సువిధ ట్రైన్ జూలై 5, 12, 19, 26, ఆగస్టు 2, 9, 23, 30 తేదీల్లో విశాఖ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో జూలై 6, 13, 20, 27, ఆగస్టు 3, 10, 24, 31 తేదీల్లో సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 కి విశాఖ చేరుకుంటుంది. విశాఖ-తిరుపతి (08573 / 08574) సువిధ ట్రైన్ జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1, 8, 29 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 5, 12, 19, 26 ఆగస్టు 2, 9, 30 తేదీల్లో మధ్యాహ్నం 3.30 కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 కి విశాఖ చేరుకుంటుంది. కాచిగూడ-టాటానగర్ (07438/ 07439) స్పెషల్ ట్రైన్ జూలై 4, 11, 18, 25 తేదీల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు 5 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.50 గంటలకు టాటానగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-గౌహతి (07149/ 07150) స్పెషల్ ట్రైన్ జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో (శుక్రవారాల్లో) ఉదయం 7.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 కు గౌహతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 4, 11, 18, 25 ఆగస్టు 1 (సోమవారాల్లో) ఉదయం 6.15 కు గౌహతిలో బయలుదేరి బుధవారం ఉదయం 9.15 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-కొచ్చువెలి (07115 / 07116) స్పెషల్ ట్రైన్ జూలై 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 9 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారుజామున 3.20కి కొచ్చువెలి చేరుకుంటుంది. జూలై 4, 11, 18, 25 ఆగస్టు 1 తేదీల్లో రాత్రి 8.15కి కొచ్చువెలిలో బయలుదేరి 2వ రోజు తెల్లవారు జామున 3.30కి నాంపల్లి చేరుకుంటుంది.