అజ్మీర్ దర్గా ఉర్సుకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ ఉర్సు 805వ వార్షిక ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుంచి అజ్మీర్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–అజ్మీర్ (07125/07126) ప్రత్యేక రైలు ఈ నెల 31న మధ్యాహ్నం 3.15కు నాంపల్లి నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 5.15కు అజ్మీర్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6న ఉదయం 9.55కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న రాత్రి 11.15కు నాంపల్లి చేరుకుంటుంది. కాచిగూడ–అజ్మీర్ (07129/07130) ప్రత్యేక రైలు మార్చి 31న రాత్రి 8.40కి కాచిగూడ నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 7.25కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న సాయంత్రం 7.25కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7 ఉదయం 7.30కు కాచిగూడ చేరుకుంటుంది. నెల్లూరు–అజ్మీర్ (07227/07228) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 7.40కి నెల్లూరు నుంచి బయలుదేరి ఏప్రిల్ 1న రాత్రి 9.30కు అజ్మీర్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న రాత్రి 9.40కి అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న మధ్యాహ్నం 1.45కు నెల్లూరు చేరుకుంటుంది. మచిలీపట్నం–అజ్మీర్ (07131/07132) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 10.40కి మచిలీపట్నం నుంచి బయలుదేరి అదేరోజు నెల్లూరు–అజ్మీర్ ప్రత్యేక రైలుకు లింక్ అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 7న విజయవాడ వద్ద అజ్మీర్–నెల్లూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి విడిపోయి ఉదయం 10.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.