Ajmer Dargah
-
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఈ చర్య మతసామరస్యానికి శరాఘాతం!
అజ్మీర్ దర్గాకు సంబంధించిన వార్తలు ముస్లింలకు మాత్రమే బాధ కలిగిస్తాయనుకుంటే పొరపాటు. తరతరాలుగా హిందువులు ఆ దర్గాలో ఆరాధనలు జరుపుతున్నారు. ‘చాదర్’ సమర్పిస్తు న్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా ‘గరీబ్ నవాజ్’ అని పిలుచుకునే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎదుట మొక్కులు తీర్చుకుంటున్నారు. భారత దేశంలోని ముస్లింలు, హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్రాన్ని ప్రతి రోజూ 1.5 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. భారతీయ ముస్లింలలో అత్యధికులు అజ్మీర్ దర్గాను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. అజ్మీర్ దర్గా భారతదేశంలోని ముస్లింలకు మక్కా లాంటిదని పలువురు భావిస్తారు. అజ్మీర్ ఖ్వాజాను ‘హిందూస్థాన్ కే వలీ’ లేదా ‘హింద్ వలీ’ అని పిలుస్తారు.కాని ఇటువంటి ఈ సామరస్య కేంద్రం ఇప్పుడు వార్తల్లో అనవసర కారణాలతో నిలవడం బాధాకరం. భారతదేశంలో బాబ్రీ తర్వాత సాగుతున్న హైందవ సంస్కృతి ఆనవాళ్ల వెతుకులాట మసీదుల చుట్టూ ఇంతకాలం ఉండగా... ఇప్పుడు దర్గాలకు చేరడం, అదీ కోట్లాది మంది సెంటిమెంట్‌గా భావించే అజ్మీర్ దర్గాకు చేరడం ఆందోళన కలిగించే అంశం. చినికి చినికి గాలివాన అయినట్టుగా ఇది ఎక్కడకు చేరబోతున్నదో పాలకులకూ, ఈ వివాదాన్ని రేపుతున్నవారికీ అంచనా ఉందా? ఈ వివాదాన్ని లేపేవారు భారతీయ హిందూ– ముస్లింల మధ్య ఎడతెగని అనిశ్చితి, ఘర్షణ, విభజన, ద్వేషం ఆశిస్తున్నారా? ఒక దేశంలో కలిసిమెలిసి ఉండవలసిన రెండు ప్రధాన మతాలు నిత్యం ఘర్షణల్లో ఉంటే ఆ దేశ ప్రగతి ఏ రీతిలో కొనసాగుతుందనేది మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి.అయోధ్యలో ప్రార్థనా స్థలంపై జరిగినట్లుగా అజ్మీర్‌లో దీర్ఘకాలంగా పోరాటం లేదు. ఇది మసీదు వంటి బహిరంగ ప్రదేశం కాదు. ఇది సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి. అజ్మీర్ దర్గాపై ఎటువంటి న్యాయపోరాటం లేనప్పుడు, 800 ఏళ్ల సూఫీ సాధువు సమాధి వద్ద యంత్రాలు, గునపాలు చేరడం చట్టవిరుద్ధం. హిందూసేన కోర్టు సహాయంతో అజ్మీర్ ఖ్వాజా దర్గాను సర్వే చేయాలనుకుంటోంది. ఈ సర్వేను నిలిపివేయాలని ఈ దేశంలో బాధ్యతగల పౌరులెవరైనా ఆశిస్తారు. తాజ్‌మహల్, కుతుబ్మినార్ల విషయంలో చేసినట్లుగా అజ్మీర్ దర్గా సర్వేను తిరస్కరించాలి. వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించవలసిన అవసరం ఏమిటని గౌరవనీయమైన పెద్దలు ముందుకు రావాలి.హిందూ ముస్లింలకు ఇది దర్గా అని తెలుసు. ఇది రెండు మతాలకు చెందినది కాబట్టి వారు దానిని ఒకే దృష్టితో చూశారు. భక్తులు అక్కడ సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారిని భంగపరచి దేశవ్యాప్తంగా ఎందుకు హింసను ప్రేరేపించాలి? శివలింగం ఉందా... లేదా ఉందని వెలికితీయడానికీ, లేదా లేకపోయినా ఉందని వాదించడానికీ పవిత్రమైన 800 సంవత్సరాల నాటి సూఫీ సాధు సమాధిని అన్వేషించడం 140 కోట్ల జనాల మనోభావాలను దెబ్బతీసినట్లే. దర్గా హిందువులు– ముస్లింల మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ వంతెనను దెబ్బ తీస్తే, హిందువులు – ముస్లింల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేసినట్లే. ఇలా చేసి చివరికి ఏమి సాధించబోతున్నారు?గత పాఠాలు బోధించడం, అవగాహన పెంపొందించడంలో చరిత్రకు దాని విలువ ఉంది. ప్రజలను విభజించడానికి లేదా శాంతికి భంగం కలిగించడానికి చరిత్రను ఆయుధంగా వాడకూడదు. చరిత్రను తవ్వకూడదు. చరిత్రకు దానిదైన విలువ ఉంటుంది. చరిత్ర గతిలో గడిచిపోయిన విషయాలను కొన్నింటిని వర్తమానంలోకి తెచ్చినప్పుడు అవి మనం కోరే వ్యాఖ్యానాలు, ఫలితాలు మాత్రమే ఇవ్వవు. తేనెతుట్టెను కదిల్చి తేనెటీగలను ఒక వరుస క్రమంలో ఎగిరి వెళ్లమని కోరడం లాంటిది ఇది. సమాజంలో అన్ని మతాలకూ, వారి పవిత్ర స్థలాలకూ గౌరవం అవసరం. సామరస్యాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసం విభజితం కాకుండా ఏకం కావాలని గుర్తించాలి. ఈ మతాతీత ప్రదేశాలు గౌరవం, ఐక్యతలకు సంబంధించిన స్థలాలుగా ఉండాలి.చదవండి: ఒక అపరిచితుడి దయగత రెండు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘మేము కొన్ని పరిస్థితుల్లో ప్రకృతికి విరుద్ధంగా బాబ్రీ మసీదు సమస్యను లేవనెత్తాము. ఇప్పుడు ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు మరలా ప్రతిరోజూ మసీద్–మందిర్ గొడవలు దేనికని? ఎందుకు అనవసర గొడవలు సృష్టిస్తు న్నారు? ప్రతీ మసీదులో శివలింగం ఉందని వాదించడం సరైనది కాదు. విధానం వేరైనప్పటికి మసీదుల్లో ముస్లింలు చేస్తున్నది కూడా దైవ ఆరాధనే. వారు మనవాళ్ళే, బయట నుండి ఏమి రాలేదు. ఇది అందరూ అర్థం చేసుకోండి’ అని చెబుతూనే వస్తున్నారు. కానీ, జరుగుతున్నది వేరు.సూఫీ సాధువు సమాధి కింద శివలింగం ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. హింసను ప్రేరేపించడానికి అలాంటి కల్పనలను వదిలివేయాలి. భాగవత్ మాటలను గౌరవించమని హిందూ సోదరులకు విజ్ఞప్తి. అలాగే ముస్లిం సోదరులు కూడా సంయమనం పాటించాలి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కలిసి నడుద్దాం. భారతదేశ జెండాను ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లోకి ఎగరవేద్దాం. మేరా భారత్ మహాన్ హై! జై హింద్!!- జహారా బేగంసామాజిక కార్యకర్త (ఇండియా/యు.ఎస్.ఎ) -
భారత్, బంగ్లాదేశ్ రెండూ ఒక్కటే
జమ్మూ: భారత్‌లోని మైనారిటీల పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత కొనసాగుతోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులు అణచివేతకు గురవుతున్నారని వింటున్నాం, మరి మన దేశంలోని మైనారిటీలు కూడా అలాంటి అనుభవాలనే చవిచూస్తున్నారు. రెండూ ఒక్కటే. నాకైతే తేడా కనిపించడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు బాగో లేవన్నారు. ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో ఏఎస్ఐ సర్వే వ్యవహారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దర్గాను కూడా తవ్వేస్తారా. ఇలా ఎంతకాలం?’’ అని ముఫ్తీ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించే శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే 1947 నాటి ఘర్షణలు పునరావృత్తమయ్యే ప్రమాదముంది’’ అన్నారు. -
అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం
అజ్మీర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్ఐ)కి నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఘర్షణ జరిగి నలుగు మృతిచెందిన కొన్ని రోజులకే అజ్మీర్ దర్గాపై కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అజ్మీర్ సైతం మత ఘర్షణలకు కేంద్రంగా మారుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో అలజడి సృష్టించడానికే పిటిషన్ ఇదిలా ఉండగా, అజ్మీర్ దర్గా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. మతాల పేరిట చిచ్చురేపి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని అజ్మీర్ దర్గాను పర్యవేక్షించే అంజుమన్ సయీద్ జద్గాన్ కార్యదర్శి సయీద్ సర్వర్‌చిïÙ్త ఆరోపించారు. మతాలవారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అయిన అజ్మీర్ దర్గా మైనార్టీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని, దీంతో ఏఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం?: అజ్మీర్ దర్గాను సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ నెలలో అజ్మీర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు. సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్ సింగ్ అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మొఘల్ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు: ఒవైసీ అజ్మీర్ దర్గా 800 ఏళ్లుగా ఉందని ఐఎంఐ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉర్స్ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ చాదర్ సమరి్పంచడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానులంతా ఈ సంప్రదాయం పాటించారని వెల్లడించారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలతో దేశానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం–1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని ఒవైసీ తేల్చిచెప్పారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం: కపిల్ సిబల్ అజ్మీర్ దర్గా విషయంలో రగడ జరుగుతుండడం బాధాకరమని ఎంపీ కపిల్ సిబల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇదంతా ఎందుకు? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో కొందరు వ్యక్తులు ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆరోపించారు. సివిల్ కోర్టు ఉత్తర్వును పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్‌గనీ లోన్ తప్పుపపట్టారు. -
నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘ఆమెకు ప్రాణహాని ఉంది నిజమే’
న్యూఢిల్లీ: నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎక్కడా కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మకు ప్రాణహాని ఉన్నది నిజమేనని వ్యాఖ్యానించింది. ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నూపుర్ శర్మపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసే విషయంపై ఆగస్టు 10లోగా స్పందన తెలపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, జుమ్ముకశ్మీర్, అస్సాం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది. జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది. ఆ తర్వాతి నుంచే నూపుర్ శర్మను చంపేస్తామనే బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ ఛిస్తీ, యూపీ చెందిన వ్యక్తి.. నూపుర్ శర్మను హతమారుమాస్తామని బెదిరించిన విషయాలను ప్రస్తావించారు. చదవండి: వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
నూపుర్ శర్మను చంపిన వారికి ఆస్తినంతా రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్
జైపూర్: నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నూపుర్ శర్మ తల తెచ్చిన వారికి తన ఇల్లుతో పాటు ఆస్తినంతా రాసిస్తానని సల్మాన్ ఓ వీడియో విడుదల చేశాడు. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన ఆమెను హతమార్చాలని పిలుపునిచ్చాడు. తాను అజ్మేర్ దర్గా నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. వీలుంటే తానే ఆమెను తుపాకీతో కాల్చి చంపేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు దేశంలోని ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, అనేక చోట్ల తమపై దాడులు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సల్మాన్‌ను అరెస్టు చేశారు. సల్మాన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అజ్మీర్ దర్గా ప్రతినిధులు స్పష్టం చేశారు. దర్గా పవిత్ర స్థలం అని, అలాంటి చోట ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సల్మాన్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని, అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ ఉదయ్పుర్లో కన్నయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు ఇటీవలే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతడిని హత్య చేసిన అనంతరం వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు ఇద్దరు నిందితులను మూడు గంటల్లోనే అరెస్టు చేశారు. -
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్స వాల్లో సమర్పించే చాదర్(గిలాఫ్)ను సీఎం కేసీఆర్ గురువారం పంపారు. ప్రత్యేకంగా రూపొందించిన చాదర్‌ను ముస్లిం మత పెద్దలు కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమిం చాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరో గ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థిం చారు. ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్, ముఫ్తి సయ్యద్ యూసఫ్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అజ్మీర్ దర్గా ఉర్సుకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ ఉర్సు 805వ వార్షిక ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుంచి అజ్మీర్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–అజ్మీర్ (07125/07126) ప్రత్యేక రైలు ఈ నెల 31న మధ్యాహ్నం 3.15కు నాంపల్లి నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 5.15కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6న ఉదయం 9.55కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న రాత్రి 11.15కు నాంపల్లి చేరుకుంటుంది. కాచిగూడ–అజ్మీర్ (07129/07130) ప్రత్యేక రైలు మార్చి 31న రాత్రి 8.40కి కాచిగూడ నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 7.25కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న సాయంత్రం 7.25కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7 ఉదయం 7.30కు కాచిగూడ చేరుకుంటుంది. నెల్లూరు–అజ్మీర్ (07227/07228) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 7.40కి నెల్లూరు నుంచి బయలుదేరి ఏప్రిల్ 1న రాత్రి 9.30కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న రాత్రి 9.40కి అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న మధ్యాహ్నం 1.45కు నెల్లూరు చేరుకుంటుంది. మచిలీపట్నం–అజ్మీర్ (07131/07132) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 10.40కి మచిలీపట్నం నుంచి బయలుదేరి అదేరోజు నెల్లూరు–అజ్మీర్ ప్రత్యేక రైలుకు లింక్ అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 7న విజయవాడ వద్ద అజ్మీర్–నెల్లూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి విడిపోయి ఉదయం 10.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. -
భిక్షగాళ్లకు బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు
మంచి సెంటర్ దొరికితే.. దానికి మించిన బిజినెస్ లేదు. సీజన్‌తో సంబంధం లేకుండా 365 రోజులూ సంపాదన. ఖర్చులు పోగా ప్రతిరోజూ బ్యాంకు ఖాతాల్లో పొదుపు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? రాజస్ధాన్‌లోని అజ్మీర్లోగల ప్రఖ్యాత ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ దర్గా దగ్గర భిక్షగాళ్ల వ్యవహారం. అవును.. అజ్మీర్ దర్గా దగ్గర భిక్షగాళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది. చేతినిండా డబ్బులు పడుతుండటంతో.. చాలామంది భిక్షగాళ్లు బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు కూడా నిర్వహిస్తున్నారట. బిహార్ నుంచి వచ్చిన పప్పు సింగ్ అనే భిక్షగాడు.. ప్రతిరోజూ తన ఖాతాలో కనీసం రూ. 200 అయినా డిపాజిట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడు అనుకోకుండా భిక్షగాడు అయ్యాడు. అతడు గతంలో ఒకసారి ప్రమాదానికి గురైనప్పుడు ఆశీర్వాదాల కోసం అజ్మీర్ దర్గాకు వచ్చాడు. అయితే.. కొంతమంది భక్తులు అతడు భిక్షగాడు అనుకుని భిక్షం వేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఇదేంటని తనకు కోపం వచ్చిందని, కానీ తర్వాత ఇదేదో ఆయన ఆశీర్వాదాలతోనే వచ్చిందని అనుకున్నానని తెలిపాడు. అలా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 200 డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పాడు. త్రిపుర నుంచి వచ్చిన మరో ఇద్దరు భిక్షగాళ్లు సోదరులు. వాళ్లిద్దరికీ కెనరా బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది. రజా ఇస్లాం, సహీదుల్ ఇస్లాం అనే ఈ ఇద్దరూ గత పదేళ్లుగా అజ్మీర్‌లోనే ఈ బెగ్గింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరులో సహీదుల్ అంధుడు. దాంతో రజా అతడికి సాయం చేస్తుంటాడు. నసీమా ఖాను అనే 62 ఏళ్ల మహిళ అజ్మీర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషన్‌గఢ్ నుంచి ప్రతిరోజూ వచ్చి దర్గా దగ్గర భిక్షాటన చేస్తుంది. ప్రతి రెండు మూడు రోజులకోసారి ఆమె తనకు వచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. ఏటీఎం కార్డుతో ఎంత మొత్తం ఉందో సరిచూసుకుంటుంది. ఇలా అజ్మీర్ దర్గా దగ్గర ఉన్న భిక్షగాళ్లలో దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహించుకుంటున్నారు. -
ఆవును రక్షించండి: అజ్మీర్ దర్గా అధిపతి
జైపూర్: హిందువులు పవిత్రంగా భావించే ఆవును రక్షించి ముస్లింలు ఆదర్శంగా నిలవాలని అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక గురువు జైనుల్ అబెదీన్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. బీఫ్‌కు సంబంధించి హింసకు పాల్పడేవారు అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా హిందూ ముస్లింలు ఐకమత్యంతో జీవించాలని హితబోధ చేశారు. ‘బీఫ్ పేరిట కొందరు... హిందువులు, ముస్లింల మధ్య సఖ్యతను చెడగొడుతున్నారు. ఇది దేశ ప్రతిష్టను దిగజార్చుతోంది’ అని అన్నారు. -
ఖ్వాజా బందే నవాజ్ దర్గా గుల్బర్గా
పుణ్య క్షేత్రం ప్రతి మనిషీ దేవుని సంతానమే. ప్రతి మనిషీ ఇంకో మనిషిని ప్రేమించాలి. మతం ఏదైనా కులం ఏదైనా సమూహం ఏదైనా మనుషుల మధ్య ప్రేమ ముఖ్యం... అని బోధించిన మహనీయుడు ఖ్వాజా బందే నవాజ్. ‘బందా’ అంటే ‘మనిషి’. ‘నవాజ్’ అంటే ‘ప్రియమైన’... ఆయన మనుషులకు ప్రియమైన వాడు. మనుషులను ప్రియమైనవారిగా చూసేవాడు. ఆయన మనుషులను అక్కున చేర్చుకునే మహనీయుడు. గుల్బర్గా చీకూ చింతా లేని ఊరు. ఎదగడానికి తొందరపడే ఊరులా కనిపించదు. ప్రశాంతమైన జనం... తీరిగ్గా ఉండే జీవనం. దిగిన వెంటనే మనకు ‘హాఫ్ ఆటో’ అనే మాట వినిపిస్తుంది. ‘షేర్ ఆటో’కు అది అక్కడ సమానార్థకం. ఆఫ్ ఆటోలో ఎక్కితే పది రూపాయలకు కావలసిన దూరంలో దింపుతారు. ‘ఫుల్ ఆటో’ అంటే మనకు మాత్రమే. అప్పుడు మనం బేరం చేసుకుని కావలసిన చోటుకు మాట్లాడుకోవాలి. నలభై రూపాయలకు చాలా దూరం వస్తారు. వంద రూపాయలకు దాదాపు ఊరు చుట్టేయొచ్చు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా 220 కిలోమీటర్ల దూరం. ముంబై వెళ్లే ట్రైన్లన్నీ ఇక్కడ ఆగుతాయి. మధ్యాహ్నం ‘పూణె శతాబ్ది’ ఉంది. ఎక్కితే మూడున్నర గంటల్లో శ్రమ లేకుండా దించుతుంది. స్టేషన్ నుంచి నాలుగడుగుల దూరంలోనే హోటల్స్ ఉన్నాయి. భారీ హోటల్స్ కాదు. మధ్యస్తంవి. ఉండొచ్చు. ఊళ్లో ఒక మంచి హోటల్ ఉంది. దానికి మాత్రం ముందే బుక్ చేసుకొని వెళ్లడం ఉత్తమం. లేకుంటే రూములు దొరకవు. హైదరాబాద్ నుంచి వెహికిల్ మాట్లాడుకుని వెళ్లేవాళ్లే ఎక్కువ. వికారాబాద్, వాడి మీదుగా శ్రమ లేకుండా చేరుకోవచ్చు. కలబురగి.... గుల్బర్గా అసలు పేరు కలబురగి అని అంటారు. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఆ రాజ్యం కింద ఉంది. ఇక్కడ ఆ కాలం నాటి కోట ఉంది. గట్టి రాతితో కట్టిన కోటను ‘కలబురగి’ అన్నారు. అదే ఆ ఊరి పేరైంది. అయితే ఆ తర్వాత వచ్చిన బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. అప్పుడు వారు ఆ ఊరిని అధికారికంగా ‘ఎహసేనాబాద్’ అని పెట్టుకున్నా ‘గుల్’ అనగా పూలతోటలు ఉన్న ఊరు కనుక జనసామాన్యంలో ‘గుల్బర్గా’ అన్నారు. చాలా కాలం అదే పేరు కొనసాగినా తాజా కర్ణాటక ప్రభుత్వం మళ్లీ పాత పేరును అధికారిక పేరుగా మార్చింది. కనుక ఊళ్లో ప్రభుత్వ బోర్డులు కలబురగి అని, ప్రజల బోర్డులు గుల్బర్గా అని ఉంటాయి. దర్గా... గల్బర్గా- దేశం మొత్తానికి అక్కడ ఉన్న దర్గా వల్లే ప్రసిద్ధి. మన దేశంలో ఎక్కువ ప్రాముఖ్యం కలిగిన దర్గాగా రాజస్తాన్‌లో ఉన్న అజ్మీర్ దర్గాను భావిస్తారు. అక్కడ ఉన్న సూఫీ గురువును ఖ్వాజా గరీబ్ నవాజ్ అని పిలుస్తారు. గరీబ్ అంటే పేద. ఆయన పేదల పెన్నిధి. దక్షిణాదిన ఉన్న గుల్బర్గా దర్గాలో ఉన్న సూఫీ గురువును బందే నవాజ్ అని పిలుస్తారు. అసలు పేరు... ఖ్వాజా బందే నవాజ్ అసలు పేరు సయ్యద్ ముహమ్మద్ హుసేని. భక్తులు ఆయనను ‘హజరత్ ఖ్వాజా బందే నవాజ్ గైసు దరజ్’ అని పిలుచుకుంటారు.‘ఖ్వాజా’ అంటే ‘గురువు’ అని అర్థం. బందే నవాజ్ 14-15 శతాబ్దాల కాలంలో జీవించారు. వీరి పూర్వికులది ఇస్లామీయ మహాపురుషులలో ఒకడైన హజరత్ అలీ వంశం అని భావిస్తారు. ఆ వంశానికి చెందినవారు ఢిల్లీకి వచ్చి స్థిరపడగా అక్కడ బందే నవాజ్ జన్మించారు. ఈయనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు వీరి కుటుంబం దౌలతాబాద్ వెళ్లిపోయింది. అక్కడే పదిహేనేళ్ల వరకూ ఉండి ఇస్లామీయ విద్యపై మక్కువతో ఢిల్లీలో ఉన్న సూఫీ గురువు హజరత్ నసీరుద్దీన్ చిరాగ్ దెహల్వి దగ్గర శిష్యరికానికి వచ్చారు. హజరత్ నసీరుద్దీన్ ప్రఖ్యాత సూఫీ గురువు హజరత్ నిజాముద్దీన్‌కు శిష్యులు. ఆగని చదువు... బందే నవాజ్ తన గురువు నసీరుద్దీన్ దగ్గర విద్యను అభ్యసించారు. అది ఒక స్థాయికి చేరుకుంది. ఇక నేను చదువు ఆపవచ్చునా అని గురువును అడిగారట. నిజానికి అంతటితో ఆపితే నష్టం లేదు. కాని ఆ గురువు- లేదు.. కొనసాగించు నీ నుంచి నేను చాలా ఆశిస్తున్నాను అన్నారట. ఆ తర్వాత బందే నవాజ్ తన ఆధ్యాత్మిక చదువును మరింత లోతులకెళ్లి కొనసాగించారు. ఆయన 105 సంవత్సరాలు జీవించారు. తన జీవితకాలంలో 105 విశిష్టమైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. ఏవీ కలం పట్టి రాయలేదు. చెప్తూ ఉండగా సహాయకుడు రాసి పెట్టడమే. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేయనున్నాడని బందే నవాజ్ జోస్యం చెప్పినట్టుగా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేసి ఆ నగరాన్ని సర్వనాశనం చేసినప్పుడు బందేనవాజ్ను బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తన గుల్బర్గాకు వచ్చి ఉండిపోవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. అలా తన 76వ ఏట గుల్బర్గా వచ్చిన బందే నవాజ్ అక్కడే 105 సంవత్సరాల వరకూ జీవించి క్రీ.శ. 1422లో దైవ సన్నిధికి చేరుకున్నారు. మనసును తాకే ప్రశాంతత... గుల్బార్గా దర్గాకు స్టేషన్ నుంచి అరవై రూపాయలు ఆటో చెల్లించి చేరుకోవచ్చు. దర్గా ఊళ్లో కొంచెం లోపలి ప్రాంతంలో ఉంటుంది. దర్గా ఆవరణలో పూల దుకాణాల వారు పూల చాదర్లు అమ్ముతుంటారు. వాటిని కొని దర్గాలో సమర్పించవచ్చు. దేశంలో చాలా దర్గాలు ఉన్నాయి. కాని గుల్బర్గా దర్గా ఎంతో విశాలమైన ప్రశాంతమైన దర్గా అనిపిస్తుంది. గురుసమాధి ఉన్న టూంబ్ ఎంతో విశాలంగా ఏ.సిలు బిగించి తొడతొక్కిడి లేని దర్శనం కలిగి హాయిగా ఉంటుంది. మనసులో ఉన్నది నివేదించుకుంటే నెరవేరుతుందని నమ్మిక. అసలు హోటళ్లు అవసరం లేకుండా దర్గాలోనే నిద్ర చేసే వీలుంది. దర్గా ఆవరణలోని విశాలమైన షెడ్లు రాత్రిళ్లు నిద్రపోవడానికి వీలుగా ఉంటాయి. భక్తుల కోసం స్నానాల గదులు, టాయిలెట్లు ఉన్నాయి. చాలామంది భక్తులు హోటల్ గదుల జోలికి పోకుండా రెండు మూడు రోజులు ఇక్కడే ఉండిపోతారు. అన్ని మతాల కూడలి... గుల్బర్గా దర్గాకి అన్ని మతాల వాళ్లు వస్తారు. ఖ్వాజా బందే నవాజ్ చెప్పినట్టుగా మనిషిని మనిషి ప్రేమించడానికి మతం అడ్డుకాదు అనే భావనకు ఆ తావు ఒక సాక్ష్యం పలికినట్టు ఉంటుంది. గుల్బర్గాలో బస చేసి తెల్లవారు జామున దర్గాను సందర్శించి చూడండి. మీ మనసుకు అమితమైన ప్రశాంతత చేకూరుతుంది. మీ ఆందోళనలన్నీ చెదిరి పోయి మీ ధైర్యం స్థిరపడి ముందుకు వెళ్లే స్థిమితత్వం వస్తుంది. గురుమార్గం- తప్పక అనుసరణీయమైన మార్గం. - కెవికె కుమార్ ఆయన మహిమను చూస్తారా..? బందేనవాజ్ తన గురువుకు సేవ చేసే సమయంలో కురులను పొడవుగా పెంచారట. ఒకసారి గురువును పల్లకీలో మోసుకుంటూ వెళుతూ ఉండగా ఆ కురులు పల్లకీ అంచులో చిక్కుకుపోయాయి. ఎంతో నొప్పి కలుగుతున్నా గురువుకు అంతరాయం కలుగుతుందని ఆ సంగతి చెప్పలేదు. సాధారణంగా మిగిలిన బోయీలు చేయి మార్చుకుంటారు. తన కురులు చిక్కుకుపోవడం వల్ల మరొకరికి భుజం మార్చకుండా అలాగే పల్లకీని మోశారు. ఈ సంగతి తెలిసి గురువు పులకించి పోయి ‘గైసు దరజ్’ బిరుదు ఇచ్చారు. బందే నవాజ్ సమక్షంలో ఒక అనుయాయి ఒక వ్యక్తిని ‘నువ్వు’ అని సంబోధించాడు. దానికి బందే నవాజ్ అభ్యంతరం చెప్పారు. ‘అతడు హిందువు. కనుక నువ్వు అన్నాను’ అన్నాడు అనుయాయీ. ‘దానికంటే ముందు అతడు మనిషి. మనిషిని గౌరవించు’ అని హితవు చెప్పారు బందే నవాజ్. బందే నవాజ్ మహిమాన్వితం పట్ల అనుమానాలున్న ఒక పెద్ద మనిషి ఒకసారి బందేనవాజ్ను దర్శించడానికి వచ్చి ఆ సమయంలో ఆయన చేతిలో ఉన్న విసన కర్రను చూసి ఇది నాకు ఇస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు బందే నవాజ్ ఆ పెద్ద మనిషితో ‘ఒక ఊళ్లో ఒక గాడిదకి దొంగలని పట్టడం తెలుసు. దాని కళ్లకు గంతలు కట్టి అనుమానితుల దగ్గర వదిలేస్తే అది నేరుగా వెళ్లి దొంగ కట్టుకున్న పంచెను పట్టుకుని లాగుతుంది. మహిమలు చూపితే నేనూ ఆ గాడిదతో సమానం అవుతాను. ఇదిగో విసనకర్ర కోరుకున్నావుగా. తీసుకెళ్లు’ అని ఇచ్చేశారు. ఒక ముసలామె బందే నవాజ్ మహిమను ఎగతాళి చేయదలచి జనాజా (శవవాహనం)లో తన కొడుకును పడుకోబెట్టి నలుగురితో కూడి బందే నవాజ్ దగ్గరకు వచ్చి నా కొడుకు చనిపోయాడు... జనాజా నమాజు చదవండి అని ప్రాధేయపడింది. ఆయన నమాజు చదవడం మొదలెడితే కొడుకు నవ్వుతూ లేచి నిలబడి ఆయనను ఎగతాళి చేయాలని ఉద్దేశ్యం. బందే నవాజ్ జనాజా నమాజు చదివారు. నమాజు పూర్తయినా కొడుకు లేవలేదు. తల్లి వెళ్లి చూస్తే చనిపోయి ఉన్నాడు. చేసిన తప్పుకు లెంపలు వేసుకుని ఆమె బందే నవాజ్ కాళ్ల మీద పడింది. బందే నవాజ్ ఆమెను క్షమించిన మరుక్షణం కొడుకు శరీరం ప్రాణంతో కదిలింది. -
జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తా
మౌలిక వసతుల కల్పనకు భూమి కేటాయిస్తాం ♦ సీఎం కేసీఆర్ హామీ ♦ అజ్మీర్ దర్గాకు రాష్ట్రం తరఫున చాదర్, నజరానాలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తామని, దర్గా సందర్శకులకు వసతితోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌లతో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. సమైక్య పాలనలో హిందూ దేవాలయాలతో పాటు ముస్లిం, ఇతర మతస్తుల ప్రార్థనా స్థలాలనూ నిర్లక్ష్యం చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాను అనేక సార్లు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించానని.. అన్ని మతాల వారూ వేల సంఖ్యలో అక్కడికి వెళ్తారని పేర్కొన్నారు. ఎంతో ప్రాశస్త్యం, ఆదరణ ఉన్నా... ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం అందకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, దర్గా సమీపంలోని ప్రభుత్వ భూమిని వసతుల కల్పనకు వినియోగిస్తామని చెప్పారు. దర్గాకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో సూచించాలని ఏసీబీ డీజీ ఏకే ఖాన్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని సీఎం ఆదేశించారు. దర్గా లోపల కూడా సులభంగా మొక్కులు చెల్లించుకునేలా నిర్మాణాలను సరిచేయాలని సూచించారు. అజ్మీర్ దర్గాకు చాదర్ రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గాలో తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పించే చాదర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి పంపించారు. ఐదు రోజుల నుంచి జరుగుతున్న అజ్మీర్ దర్గా ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చాదర్‌తో పాటు ప్రత్యేక నగదు, నజరానాలను కూడా మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా ద్వారా పంపారు. అంతకు ముందు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేశారు. -
అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు
దేశంలోనే కాక విదేశాల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందిన అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు వచ్చింది. 12వ శతాబ్దం నాటి ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో బాంబు పెట్టినట్లు సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో వెంటనే దర్గాను ఖాళీ చేయించారు. ఆ సమయానికి దర్గాలో దాదాపు లక్ష మంది వరకు భక్తులు ఉన్నారు. దర్గాలోకి బాంబు డిటెక్టర్లతో పోలీసు కమాండోలు ప్రవేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. మొత్తం అన్ని గేట్ల నుంచి భక్తులను బయటకు పంపి, మొత్తం ప్రాంగణం అంతటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు అరగంట పాటు తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి బాంబు లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో హై ఎలర్ట్ ప్రకటించి, క్విక్ రెస్పాన్స్ బృందాలు ఆ మార్గాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. తెల్లవారుజామున 6.40 గంటల సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. దర్గాను పేల్చేస్తామని బెదిరింపు రావడంతో ఉదయం 7.45 నుంచి 9.15 వరకు దర్గాను మూసేసినట్లు పోలీసులు తెలిపారు. -
అజ్మీర్ దర్గాకు తెలంగాణ చాదర్
అధికారులను పంపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లోని ప్రఖ్యాత హజరత్ ఖాజా మొయినొద్దీన్ చిస్తీ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సమర్పించనున్న చాదర్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో మైనార్టీ శాఖ అధికారులకు అందజేశారు. దీన్ని హైదరాబాద్ పాతబస్తీలో ప్రత్యేకంగా తయారు చేయించారు. చాదర్‌పై మక్కా మదీనాచిత్రాల ముద్రణతో పాటు, ‘హండ్రెడ్స్ ఆఫ్ రిగార్డ్స్ ఫ్రమ్ కె. చంద్రశేఖర్ రావు’ అని రాయించారు. దీనితో పాటు రూ.2.51 లక్షల నజరానా కూడా దర్గాకు పంపించారు. హైదరాబాద్ రుబాత్పై మాట్లాడాలని అధికారులకు ఆదేశం... తెలంగాణ రాష్టం తరపున అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ రుబాత్ (అతిథి గృహం)పై తాజా స్థితిని అక్కడి అధికారులతో మాట్లాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరగాలని, అందరికి శుభం కలగాలని సీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. జైపూర్‌కు బయలుదేరిన అధికారులు సీఎం కేసీఆర్ అందజేసిన చాదర్‌ను తీసుకొని శుక్రవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర మైనార్టీ శాఖ డెరైక్టర్ జలాలుద్దీన్ అక్బర్ జైపూర్‌కు వెళ్లారు. శనివారం ప్రార్థనల అనంతరం వారు చాదర్‌ను సమర్పించనున్నారు. -
ముస్లింలకు అండగా ఉంటా: మోదీ
న్యూఢిల్లీ: ముస్లింలకు అండగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముస్లింలలోని అన్ని వర్గాల సామాజిక పరిస్థితులను మెరుగుపరుస్తామని, విద్యారంగంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం తనను కలసిన ముస్లింమత నాయకుల ప్రతినిధి బృందానికి ప్రధాని హామీ ఇచ్చారు. జాతి నిర్మాణంలో ముస్లిం యువత పాలు పంచుకోవాలని, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రధాని పేర్కొన్నారు. అలాగే మదర్సాలు, మసీదులు, దర్గాలకు సంబంధించిన ఆస్తుల సమస్యలు పరిష్కరిస్తామని మోదీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా ప్రతినిధితోపాటు, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్‌లోని వివిధ దర్గాలకు చెందిన ప్రతినిధులు ప్రధానిని కలసినవారిలో ఉన్నారు. -
7న అజ్మీర్‌కు డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఈ నెల 7న అజ్మీర్ వెళ్లనున్నారు. కొత్తగా ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పాటైన సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించి మొక్కుతీర్చుకుంటారు. అనంతరం రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింధియాతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి అజ్మీర్‌కు వచ్చే యాత్రికుల వసతి కోసం దర్గా సమీపంలో ప్రత్యేకంగా విశ్రాంతి భవనం నిర్మాణానికి రెండెకరాల భూమి కేటాయింపుకోసం చర్చిస్తారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ రాసిన లేఖను వసుంధరకు అందజేస్తారు. అదేవిధంగా రాజస్థాన్‌లో మైనార్టీ సంక్షేమం, వక్ఫ్‌బోర్డు తదితర సంస్థల పని తీరును పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి న్యూ ఢిల్లీ వెళ్లి ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు. హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీ ఏర్పాటు, హైదరాబాద్ పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు, త్వరగా వక్ఫ్‌బోర్డు విభజన, వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు తదితర అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు. 11న ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ఆగడు రేపు విడుదల కానుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆక్షాంకించారు. బిజినెస్మెన్, దూకుడు, వన్ నేనొక్కడినే చిత్రాలలో హీరోగా నటించిన మహేష్ బాబు విడుదలకు ముందు ఈ దర్గాను సందర్శించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆగడు చిత్రం రూపొందింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. గతంలో వీరి కాంబినేషన్లో దూకుడు చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు విడుదలకానుంది. -
ఆరెస్సెస్ అనుమతితోనే పేలుళ్లు!
స్వామి అసీమానంద చెప్పారంటున్న ఆ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం న్యూఢిల్లీ: సంరత ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ పేలుళ్లకు హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) అనుమతి ఉందంటూ స్వామి అసీమానంద చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం లేపాయి. పేలుళ్లకు సంబంధించిన హిందూ తీవ్రవాద కుట్రకు ఆరెస్సెస్ ఆమోదం ఉందంటూ ఆ పేలుడు కేసుల్లో నిందితుడిగా ఉన్న స్వామి అసీమానంద.. కేరవాన్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఈ అలజడికి కారణమైంది. ఈ వార్తలను బీజేపీ, దాని మిత్రపక్షాలు ఖండించగా, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. ఆ వ్యాఖ్యలు.. - ‘ఆయనేం చెప్పాడో చూద్దాం. ఆయనే విషయాలైనా వెల్లడి చేసి ఉంటే అవి నిజమే కావచ్చు’ - కేంద్ర హోంమంత్రి షిండే - ‘మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు వారు ఏమైనా చేస్తారు’ - కేంద్రమంత్రి బేణిప్రసాద్ వర్మ ‘పేలుళ్లలో పాత్రకు సంబంధించి ఆరెస్సెస్ నాయకత్వంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వాటిని కేంద్రం తేలిగ్గా తీసుకోవద్దు. సీబీఐతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలి’ - బీఎస్పీ అధినేత్రి మాయావతి ‘గతంలో జరిగిన పేలుళ్ల సందర్భంలోనూ ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలి’ - ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ ‘అసీమానంద చెప్పారని చెబ్తున్న విషయాలన్నీ కల్పితం. నిరాధారం. కుట్రపూరితం. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చిల్లర ప్రచారం చేస్తున్నారు. అసీమానంద ఇప్పటికే ఈ వార్తలను ఖండించారు. అలాంటిదేమీ లేదని మెజిస్ట్రేట్ ముందు కూడా స్పష్టంగా చెప్పారు. ఇంటర్వ్యూ ప్రామాణికతపై చాలా అనుమానాలున్నాయి’ - ఆరెస్సెస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్