ఆవును రక్షించండి: అజ్మీర్ దర్గా అధిపతి | Cow, Ajmer Dargah, Zainul abedin Ali Khan, Muslims | Sakshi
Sakshi News home page

ఆవును రక్షించండి: అజ్మీర్ దర్గా అధిపతి

Published Fri, Jul 29 2016 1:28 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

Cow, Ajmer Dargah, Zainul abedin Ali Khan, Muslims

జైపూర్: హిందువులు పవిత్రంగా భావించే ఆవును రక్షించి ముస్లింలు ఆదర్శంగా నిలవాలని అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక గురువు జైనుల్ అబెదీన్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. బీఫ్‌కు సంబంధించి హింసకు పాల్పడేవారు అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా హిందూ ముస్లింలు ఐకమత్యంతో జీవించాలని హితబోధ చేశారు. ‘బీఫ్ పేరిట కొందరు... హిందువులు, ముస్లింల మధ్య సఖ్యతను చెడగొడుతున్నారు. ఇది దేశ ప్రతిష్టను దిగజార్చుతోంది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement