ఆరెస్సెస్ అనుమతితోనే పేలుళ్లు! | Swami Aseemanand’s “interview” on RSS “role” in terror attacks triggers row | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్ అనుమతితోనే పేలుళ్లు!

Published Fri, Feb 7 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

Swami Aseemanand’s “interview” on RSS “role” in terror attacks triggers row

స్వామి అసీమానంద చెప్పారంటున్న ఆ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
 
 న్యూఢిల్లీ: సంరత ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ పేలుళ్లకు హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) అనుమతి ఉందంటూ స్వామి అసీమానంద చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం లేపాయి. పేలుళ్లకు సంబంధించిన హిందూ తీవ్రవాద కుట్రకు ఆరెస్సెస్ ఆమోదం ఉందంటూ ఆ పేలుడు కేసుల్లో నిందితుడిగా ఉన్న స్వామి అసీమానంద.. కేరవాన్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఈ అలజడికి కారణమైంది. ఈ వార్తలను బీజేపీ, దాని మిత్రపక్షాలు ఖండించగా, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. ఆ వ్యాఖ్యలు..
 -    ‘ఆయనేం చెప్పాడో చూద్దాం. ఆయనే విషయాలైనా వెల్లడి చేసి ఉంటే అవి నిజమే కావచ్చు’    - కేంద్ర హోంమంత్రి షిండే
  -   ‘మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు వారు ఏమైనా చేస్తారు’
 - కేంద్రమంత్రి బేణిప్రసాద్ వర్మ
     ‘పేలుళ్లలో పాత్రకు సంబంధించి ఆరెస్సెస్ నాయకత్వంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వాటిని కేంద్రం తేలిగ్గా తీసుకోవద్దు. సీబీఐతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలి’
     - బీఎస్పీ అధినేత్రి మాయావతి
     ‘గతంలో జరిగిన పేలుళ్ల సందర్భంలోనూ ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలి’    - ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్
     ‘అసీమానంద చెప్పారని చెబ్తున్న విషయాలన్నీ కల్పితం. నిరాధారం. కుట్రపూరితం. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చిల్లర ప్రచారం చేస్తున్నారు. అసీమానంద ఇప్పటికే ఈ వార్తలను ఖండించారు. అలాంటిదేమీ లేదని మెజిస్ట్రేట్ ముందు కూడా స్పష్టంగా చెప్పారు. ఇంటర్వ్యూ ప్రామాణికతపై చాలా అనుమానాలున్నాయి’        - ఆరెస్సెస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement