Swami Aseemanand
-
సంఝౌతా కేసులో స్వామి అసీమానందకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో స్వామి అసీమానందతో పాటు నలుగురిని ఎన్ఐఏ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది. 12 ఏళ్ళ తరువాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ళ కేసులో హర్యానా లోని పంచకుల ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. బాంబు పేలుళ్లలో నిందితుల హస్తం ఉందని నిరూపించే సాక్షాలు సమర్పించడంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విఫలమవడంతో స్వామి అసీమానంద సహా నలుగురు నిందితులకు పంచకుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ ఊరట కల్పించింది. 2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ఐఈడీ పేలుడులో 63 మంది ప్రయాణికులు మరణించారు. బాధితులు పాకిస్తాన్‌కు చెందిన వారు కావడం గమనార్హం. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం అఠారీకి వెళుతుండగా హర్యానాలోని పానిపట్ జిల్లా దీవానా రైల్వేస్టేషన్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు కేసుపై దర్యాప్తునకు ఫిబ్రవరి 20, 2007న సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2010లో కేసును ఎన్ఐఏకు బదలాయించింది. కాగా దర్యాప్తులో భాగంగా 290 మంది సాక్షులను ఎన్ఐఏ విచారించింది. ఈ కేసులో స్వామి అసీమానంద, సునీల్ జోషి, లోకేష్ శర్మ, సందీప్ డాంగే, రామచంద్ర కలసాంగ్ర, రాజేంద్ర చౌదరి, కమల్ చౌహాన్లను దోషులుగా ఎన్ఐఏ తన చార్జిషీట్లో ఆరోపించింది. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న సునీల్ జోషి 2007 లో మధ్యప్రదేశ్ దీవాస్ లో మరణించగా, ఇతర నిందితులు రామచంద్ర కలసాంగ్ర, సందీప్ డాంగేల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం -
పశ్చిమబెంగాల్ బీజేపీలో అసీమానంద!
కోల్‌కతా: హైదరాబాద్‌లో 2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన హిందుత్వ బోధకుడు స్వామి అసీమానంద(66)పై పశ్చిమబెంగాల్ బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు అసీమానంద సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, ఈ విషయమై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘స్వామి అసీమానంద వ్యక్తిగతంగా నాకు చాలాకాలంగా తెలుసు. బెంగాల్‌కు వచ్చి పార్టీ కోసం పనిచేసే విషయమై ఆయనతో మాట్లాడతాను. అసీమానంద రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో చాలాకాలం పనిచేశారు. ఆయన పార్టీకి చాలారకాలుగా ఉపయోగపడతారు’ అని వ్యాఖ్యానించారు. -
‘మక్కా’ నిందితులకి బెయిల్
హైదాబాద్ : పాతబస్తీలోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులుగా ఉన్న నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద, భరత్ భాయ్లకు బెయిల్ మంజూరైంది. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అసిమానందను 2010లో పోలీసులు అరెస్టు చేశారు. అశిమానందకు ఇప్పటికే ‘అజ్మీర్’ ,‘సంఝౌతా ఎక్స్ ప్రెస్‌లో పేలుడు’ కేసుల్లో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ చెందిన అసిమానంద బోటనీలో పోస్టుగ్యాడ్యూషన్ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ భావాలను వ్యతిరేకించి తన మకాంను గుజరాత్‌కు మార్చాడు. బెంగాల్‌ను వదిలే ముందు కొంత కాలం పాటు రామకృష్ణ మిషన్‌లో పని చేశాడు. గుజరాత్‌లోని దాంగ్స్ జిల్లాలో ఆశ్రమాన్ని నెలకొల్పిన సర్కార్ తన పేరును స్వామి అసిమానందగా మార్చుకున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారి ఓ వర్గానికి చెందిన వారితో సభలు, సమావేశాలు నిర్వహించేవాడు. -
స్వామి అసిమానందకు విముక్తి
జైపూర్: అజ్మీర్ దర్గా బాంబు పేలుడు కేసులో స్వామి అసిమానందకు విముక్తి లభించింది. జైపూర్ లోని ప్రత్యేక ఎన్ ఐఏ కోర్టు బుధవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. మరో ఇద్దరికి క్లీన్ చీట్ ఇచ్చింది. మరో ముగ్గురు నిందితులు దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్, సునీల్ జోషి(మృతి చెందాడు)లను దోషులుగా నిర్ధారించింది. దేవేంద్ర, భవేశ్ లకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ నెల 16న శిక్ష ఖరారు చేయనుంది. నిర్దోషులుగా ప్రకటించిన వారిలో ఆర్ ఎస్ ఎస్ సీనియర్ సభ్యుడు ఇంద్రేశ్ కుమార్ కూడా ఉన్నారు. అజ్మీర్ లోని సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిష్టి దర్గాలో 2007, అక్టోబర్ 11న ఉదయం 6.15 గంటలకు సంభవించిన బాంబు పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో 149 సాక్షులను కోర్టు విచారించింది. 451 పత్రాలను న్యాయస్థానం పరిశీలించింది. జనవరి మొదటి వారంలోనే కేసు విచారణను కోర్టు పూర్తి చేసింది. -
ఆరెస్సెస్ అనుమతితోనే పేలుళ్లు!
స్వామి అసీమానంద చెప్పారంటున్న ఆ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం న్యూఢిల్లీ: సంరత ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ పేలుళ్లకు హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) అనుమతి ఉందంటూ స్వామి అసీమానంద చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం లేపాయి. పేలుళ్లకు సంబంధించిన హిందూ తీవ్రవాద కుట్రకు ఆరెస్సెస్ ఆమోదం ఉందంటూ ఆ పేలుడు కేసుల్లో నిందితుడిగా ఉన్న స్వామి అసీమానంద.. కేరవాన్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఈ అలజడికి కారణమైంది. ఈ వార్తలను బీజేపీ, దాని మిత్రపక్షాలు ఖండించగా, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. ఆ వ్యాఖ్యలు.. - ‘ఆయనేం చెప్పాడో చూద్దాం. ఆయనే విషయాలైనా వెల్లడి చేసి ఉంటే అవి నిజమే కావచ్చు’ - కేంద్ర హోంమంత్రి షిండే - ‘మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు వారు ఏమైనా చేస్తారు’ - కేంద్రమంత్రి బేణిప్రసాద్ వర్మ ‘పేలుళ్లలో పాత్రకు సంబంధించి ఆరెస్సెస్ నాయకత్వంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వాటిని కేంద్రం తేలిగ్గా తీసుకోవద్దు. సీబీఐతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలి’ - బీఎస్పీ అధినేత్రి మాయావతి ‘గతంలో జరిగిన పేలుళ్ల సందర్భంలోనూ ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలి’ - ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ ‘అసీమానంద చెప్పారని చెబ్తున్న విషయాలన్నీ కల్పితం. నిరాధారం. కుట్రపూరితం. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చిల్లర ప్రచారం చేస్తున్నారు. అసీమానంద ఇప్పటికే ఈ వార్తలను ఖండించారు. అలాంటిదేమీ లేదని మెజిస్ట్రేట్ ముందు కూడా స్పష్టంగా చెప్పారు. ఇంటర్వ్యూ ప్రామాణికతపై చాలా అనుమానాలున్నాయి’ - ఆరెస్సెస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్