‘మక్కా’ నిందితులకి బెయిల్
హైదాబాద్ :
పాతబస్తీలోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులుగా ఉన్న నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద, భరత్ భాయ్లకు బెయిల్ మంజూరైంది. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అసిమానందను 2010లో పోలీసులు అరెస్టు చేశారు. అశిమానందకు ఇప్పటికే ‘అజ్మీర్’ ,‘సంఝౌతా ఎక్స్ ప్రెస్లో పేలుడు’ కేసుల్లో బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ చెందిన అసిమానంద బోటనీలో పోస్టుగ్యాడ్యూషన్ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ భావాలను వ్యతిరేకించి తన మకాంను గుజరాత్‌కు మార్చాడు. బెంగాల్‌ను వదిలే ముందు కొంత కాలం పాటు రామకృష్ణ మిషన్‌లో పని చేశాడు. గుజరాత్‌లోని దాంగ్స్ జిల్లాలో ఆశ్రమాన్ని నెలకొల్పిన సర్కార్ తన పేరును స్వామి అసిమానందగా మార్చుకున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారి ఓ వర్గానికి చెందిన వారితో సభలు, సమావేశాలు నిర్వహించేవాడు.