స్వామి అసీమానంద
కోల్‌కతా: హైదరాబాద్‌లో 2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన హిందుత్వ బోధకుడు స్వామి అసీమానంద(66)పై పశ్చిమబెంగాల్ బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీని పటిష్టం చేసేందుకు అసీమానంద సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు.
కాగా, ఈ విషయమై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘స్వామి అసీమానంద వ్యక్తిగతంగా నాకు చాలాకాలంగా తెలుసు. బెంగాల్‌కు వచ్చి పార్టీ కోసం పనిచేసే విషయమై ఆయనతో మాట్లాడతాను. అసీమానంద రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో చాలాకాలం పనిచేశారు. ఆయన పార్టీకి చాలారకాలుగా ఉపయోగపడతారు’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment