Mecca Masjid
-
‘ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు’
రియాధ్: కరోనా వైరస్ మన జీవితాలను తారుమారు చేసింది. ఓ పండగ లేదు.. వేడుక లేదు. కనీసం ఎవరైనా మరణిస్తే.. చూడ్డానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్లేస్‌లలో లాక్డౌన్ విధించాయి. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం లేదు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా మక్కా వెళ్లాలనుకుంటాడు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా హజ్ యాత్రకు అటంకం ఏర్పడింది. ఈ ఏడాది మక్కా దర్శనానికి కేవలం సౌదీ అరేబియాలో ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఏటా దాదాపు 2.5 మిలయన్ల మంది మక్కాను దర్శించుకుంటుండగా ఈ ఏడాది వీరి సంఖ్య కేవలం 10 వేలకు మాత్రమే పరిమితమయినట్లు అల్ జజీరా తెలిపింది. వీరిని కూడా 50 మంది చొప్పున మాత్రమే కాబా దర్శనానికి అనుమతిస్తోన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. కాబా చుట్టు తిరగాలని ఆదేశించింది. (హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం) ఈ క్రమంలో ప్రస్తుతం మక్కాలోని పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను మహ్మద్ అలీ హరిస్సి అనే వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ‘ఈ రోజు మక్కాలో కనిపించిన నమ్మశక్యం కానీ దృశ్యాలు.. కరోనా హజ్ యత్రపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇవి చూస్తే అర్థమవుతోంది’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటల్లో యాత్రికులంతా రంగురంగుల గొడుగులు పట్టుకుని.. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కాబా చుట్టూ తిరుగుతున్నారు. వీరందరిని ఓ వైద్యుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక ప్రతి రోజు ఈ మసీదును శుభ్రం చేయడానికి దాదాపు 35 వేల మంది పని చేస్తున్నారని తెలిపింది. మసీదును శానిటైజ్ చేయడం కోసం 54 వేల లీటర్ల క్రిమి సంహారక మందును, 1050 లీటర్ల ఎయిర్ ఫ్రెషనర్‌ని వినియోగిస్తున్నట్లు తెలిపింది. (కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్) Unbelievable scenes from Mecca today! Historic Hajj amid the threat of coronavirus. @AFP has amazing colorful photos on a very, very sunny day! pic.twitter.com/0RvTVwGWtd — Mohamad Ali Harissi (@aleeharissi) July 29, 2020 గతంలో రోజుకు రెండు, మూడు సార్లు మసీదును శుభ్రం చేస్తుండగా.. ప్రస్తుతం పది సార్లు క్లీన్ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా 40 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలన్నది నిర్దేశం. కరోనా నేపథ్యంలో ఈసారి యాత్ర జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. -
మక్కా సందర్శనపై నిషేధం
రియాద్: సౌదీ అరేబియాలోని మక్కా లేదా మదీనా మసీదు సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు సౌదీ విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేసింది. కోవిడ్-19(కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. మక్కాను సందర్శించేందుకు ఇప్పటికే వీసాలపై తమ దేశం వచ్చిన విదేశీయులను తగిన వైద్య పరీక్షల అనంతరం మక్కా సందర్శనను అనుమతిస్తామని, ఇక ముందు, ముఖ్యంగా కోవిడ్ వైరస్ విస్తరించిన దేశాలకు చెందిన యాత్రికులను ఎంత మాత్రం అనుమతించమని ప్రకటనలో సౌదీ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రతి ఏడాది జరిగే హజ్ యాత్ర సందర్భంగా జూలై నెలలో ప్రపంచంలోని పలు దేశాల నుంచి ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు పవిత్రమైన ప్రధాన ఇస్లాం మత క్షేత్రాల్లో మక్కాను ఒకటిగా భావిస్తారు. అందుకనే ఒక్క జూలై నెలలోనే దాదాపు 30 లక్షల మంది మక్కాను సందర్శిస్తారు. మక్కా సందర్శనపై ప్రస్తుతం విధించిన నిషేధాన్ని జూలై నాటికి ఎత్తి వేస్తారా, కొనసాగిస్తారా? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. (చదవండి: అన్ని వైరస్ల కన్నా ప్రాణాంతకం ఇదే..) -
నాణేల కాలువ
‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని అన్నారు జుబేదా! హారూన్ రషీద్ అనే చక్రవర్తి పరిపాలనా కాలం అది. ఇరాక్ నుంచి మక్కా వెళ్లే మార్గంలో మంచినీటి కటకటతో బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. హజ్ యాత్రకు వెళ్లేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న మంచినీరు అయిపోతే బాటసారులతోపాటు ఒంటెలు, గుర్రాలు దప్పికతో అల్లాడిపోయేవి, మృత్యువాతపడేవి. ప్రజలు, జంతువులు నీటికోసం అల్లాడుతున్నారన్న విషయం ఖలీఫా సతీమణి జుబేదాకు తెలిసి ఆమె హృదయం చలించిపోయింది. ఎడారి ప్రాంతంలో మంచినీటి కాలువ ప్రవహింపజేయాలి అనే యోచనను తన భర్త ఖలీఫా ముందుంచింది. దీనికి ఖలీఫా కూడా సానుకూలంగా స్పందించారు. కాలువ నిర్మాణం కోసం రాజ్యంలో ఉన్న సాంకేతిక నిపుణుల్ని అందరినీ ఆహ్వానించి, హజ్ యాత్రికుల నీటి ఎద్దడిని దూరం చేసేందుకు ఉపాయం ఏమిటో యోచించాలని ఆదేశించిందామె. ఏమాత్రం ఆలస్యం చేయక ప్రయత్నాలు మొదలెట్టారు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ గాలించారు. నీటి వనరులున్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. పథకాలు తయారు చేశారు. ‘‘అమ్మా! సమస్యకు పరిష్కారం గోచరించింది. తాయిఫ్ లోయలో చక్కటి సెలయేరు ఉంది. అది హునైన్ కొండ వైపునకు ప్రవహిస్తుంది. ఆ నీళ్లు అమృతతుల్యంగా ఉన్నాయి. కాని దాన్ని మక్కాకు మళ్లించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎన్నో కొండలు, గుట్టలు, బండరాళ్లు మార్గంలో అడ్డుపడుతున్నాయి. ఈ అవరోధాన్ని తొలగించి కాలువ కట్టవలసి ఉంటుంది. అయితే అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని, బోలెడంత ఖర్చు అవుతుంది’’ అని విన్నవించుకున్నారు. ‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని తన దాతృత్వాన్ని చాటుకుంది. నిపుణులు తాయిఫ్ లోయలో పుట్టిన ఊటను మక్కాకు చేర్చేందుకు కాలువ తవ్వించారు. దారిలో వచ్చిన ఎన్నో చిన్న చిన్న ఊటల్ని ఈ కాలువలో కలుపుకుంటూ వచ్చారు. కాలువ రానురాను నదిగా మారి మక్కాకు చేరింది. నీటి పథకం పూర్తయి ప్రజలకు మంచి నీటి వసతి కలిగింది. జుబేదా సంకల్పం నెరవేరింది. ఒకరోజు మంత్రి ‘‘రాణి గారూ! కాలువ నిర్మాణానికి మొత్తం 17 లక్షల బంగారు నాణేల ఖర్చయ్యింది’’ అని చెప్పి ఖర్చు వివరాల కాగితాలను ఆమెకు అందించాడు. ఆమె చిరునవ్వుతో ఖర్చు వివరాల కాగితాలను కాలువలో పడేశారు. నేటికీ అక్కడి ప్రజలకు, లక్షలాది సంఖ్యలో ఏటా వచ్చే హజ్ యాత్రికులకు నీరు సరఫరా చేస్తోంది జుబేదా కాలవ. ముహమ్మద్ ముజాహిద్ -
పశ్చిమబెంగాల్ బీజేపీలో అసీమానంద!
కోల్‌కతా: హైదరాబాద్‌లో 2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన హిందుత్వ బోధకుడు స్వామి అసీమానంద(66)పై పశ్చిమబెంగాల్ బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు అసీమానంద సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, ఈ విషయమై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘స్వామి అసీమానంద వ్యక్తిగతంగా నాకు చాలాకాలంగా తెలుసు. బెంగాల్‌కు వచ్చి పార్టీ కోసం పనిచేసే విషయమై ఆయనతో మాట్లాడతాను. అసీమానంద రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో చాలాకాలం పనిచేశారు. ఆయన పార్టీకి చాలారకాలుగా ఉపయోగపడతారు’ అని వ్యాఖ్యానించారు. -
మక్కా పేలుళ్లపై పునర్విచారణ
సాక్షి, హైదరాబాద్ : మ క్కా మసీదు పేలుళ్ల కేసు పై పునర్విచారణ జరిపించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అర్ధరాత్రి సైదాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పునర్విచారణ జరపకుంటే కేసు పై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ఐఏ తీరుతో ఐదుగురు నిందితులు సునాయాసంగా బయటపడ్డార న్నారు. వారు నిర్దోషులైతే, మరి పేలుళ్లు జరిపిందెవరని ప్రశ్నించారు. మక్కా ఘటనపై కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం తమకుందని, నిందితులకు వ్యతిరేకంగా ఎన్ఐఏ బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఐఏ తలొగ్గి కేసును నీరుగార్చిందని దుయ్యబాట్టారు. త్వరలో సంజోత కేసులోంచి కూడా నిందితులు బయటపడే అవకాశముందన్నారు. గవర్నర్‌ను కలిసిన ముస్లిం పెద్దలు మక్కా మసీదు పేలుళ్లపై పునర్విచారణ జరిపించాలని, లేదంటే సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయాలని ప్రభుత్వానికి సూచించాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రదర్శించిన తీరును వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. -
రాజీనామా కాదు.. వీఆర్ఎస్ తీసుకుంటా
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల తీర్పునిచ్చి, అనంతరం తన పోస్టు కు రాజీనామా చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కె.రవీందర్‌రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రాజీనా మా విషయంలో పునరాలోచనలో పడ్డ ఆయన, సన్నిహితులతో చర్చించి.. తాను ఇచ్చిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. రాజీనామా లేఖ స్థానంలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం తాజాగా హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు నిబంధనల మేర లేకపోవడంతో హైకోర్టు దానిని వెనక్కి ఇచ్చేసింది. నిర్దిష్ట ఫార్మాట్ ప్రకారం దర ఖాస్తు చేసుకోవాలని రవీందర్‌రెడ్డికి స్పష్టం చేసింది. వీఆర్ఎస్ నిర్ణయం దృష్ట్యా ఆయన గురువారం విధులకు హాజరయ్యారు. మక్కా మసీదు కేసులో ఉదయం తీర్పు వెలువరించిన రవీందర్‌రెడ్డి, సాయంత్రం కల్లా రాజీనామా చేయడం సంచలనం సృష్టించిం ది. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ బహిర్గతం కాలేదు. అవినీతి ఆరోపణల వల్లే రాజీనామా చేశారని జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. 2 రోజుల పాటు తర్జనభర్జన అనంతరం, రాజీనామా చేస్తే, ఇన్నేళ్ల సర్వీసు వృథా అవుతుందని, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడం తో ఆయన పునరాలోచనలో పడ్డారు. అనంతరం రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని, దాని స్థానంలో వీఆర్ఎస్కు అనుమతించాలని హైకోర్టును కోరారు. నిబంధనల ప్రకారం వీఆర్ఎస్కు 3 నెలల నోటీసు తప్పనిసరి. దీంతో ఆయన స్వయంగా హైకోర్టుకు వెళ్లి వీఆర్ఎస్ దర ఖాస్తును సమర్పించారు. పదవీవిరమణ (58 ఏళ్లు)కు సమీపంలో ఉన్న తనకు మరో రెండేళ్ల పొడిగింపు వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్లకు పొడిగింపునిచ్చే విషయంలో హైకోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పొడిగింపును ఇవ్వదలచిన న్యాయాధికారి పనితీరు, నీతి నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుంది. -
రేపు నగరానికి ఇరాన్ అధ్యక్షుడు
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఈ నెల 15న హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. ఆయన భారత దేశ పర్యటనలో భాగంగా తొలుత నగరానికి వస్తున్నారు. సాధారణంగా దేశ పర్యటనకు వచ్చే విదేశీ అధ్యక్షులు మొదట దేశ రాజధానికి వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు వేళ్లడం పరిపాటి. కానీ, నగరంతో ఇరానీలకు ఉన్న అనుబంధం వల్ల మొదట హైదరాబాద్‌కు వస్తున్నట్లు ఇరాన్ కాన్సులేట్ అధికారులు తెలిపారు. అదేవిధంగా నగరంలోని షియా, సున్నీల మధ్య ఐక్యత కోసం ఆయన ఇక్కడ పర్యటించనున్నారని కాన్సులేట్ మీడియా కో ఆర్డినేటర్ వివరించారు. నగరంలో రెండు రోజులు ఉంటారు. ఈ నెల 15న (గురువారం) సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు షియా, సున్నీ మతగురువులు, విద్యావేత్తలు, మేధావులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. అదే రోజు రాత్రి నగరంలోని షియా ప్రముఖులతో బంజారాహిల్స్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో సమావేశం అవుతారు. 16న చారిత్రక మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం ప్రసంగిస్తారు. ఇరాన్‌తో నగరానికి 450 ఏళ్ల అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాన్‌తో 450 ఏళ్ల అనుబంధం ఉంది. నగర నిర్మాణం ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగర నమూనా మాదిరిగా ప్రముఖ అర్కిటెక్ట్ మీర్ మొమిన్ నిర్మించారు. గతంలో హైదరాబాద్ నగరాన్ని పాలించిన కుతుబ్ షాహీ పాలకులు ఇరాన్ నుంచి వచ్చినవారే. ఇంతకు ముందు 2004 జనవరి 28న అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ ఖాతిమీ నగర పర్యటనకు వచ్చారు. ఇప్పటి వరకు నగర పర్యటనకు ఇద్దరు ఇరాన్ అధ్యక్షులు మాత్రమే వచ్చారు. ఇప్పటి వరకు అరబ్బు దేశాలతో పాటు వివిధ ముస్లిం దేశాల అధ్యక్షులు నగర పర్యటనకు వచ్చారు. అయితే మక్కా మసీదులో విదేశీ అధ్యక్షుడు ప్రసంగం చేయడం మాత్రం ఇదే తొలిసారి. నగరంతో పాటు మక్కా మసీదు నిర్మాణం ఇరాన్ దేశస్థులైన కుతుబ్ షాహీ వంశస్థులే నిర్మించినందున విదేశీ అధ్యక్షుడికి మక్కా మసీదులో ప్రసంగించే అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. -
16న హైదరాబాద్‌కు ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ మొట్టమొదటిసారి భారత్‌కు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత మక్కా మసీదును సందర్శించనున్నారు. ఫిబ్రవరి 16న మక్కా మసీదులో జరిగే నమాజ్–ఇ–జుమ్మా సామూహిక ప్రార్థనల్లో రౌహనీ పాల్గొంటారని మసీదు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రౌహనీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
భద్రత గాలికి..
వేతనాలు లేక మక్కా, రాయల్ మసీదు సిబ్బంది అవస్థలు సగం మంది హోంగార్డులు మాతృ విభాగానికి ప్రశ్నార్థకంగా మారిన మక్కా మసీదు భద్రత సిటీబ్యూరో: చారిత్రక మక్కా, పబ్టిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదు సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. నగరంలో ప్రముఖమైన ఈ రెండు మసీదులు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏటా బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తున్నా మక్కా, రాయల్ మసీదుల సిబ్బందికీ గత రెండేళ్లుగా సకాలంలో వేతనాలు అందడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సిబ్బందికి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్న అధికారులు తమపై చిన్న చూపు చూడటం దారుమని వారు పేర్కొన్నారు. ప్రతి నెల వేతనాలు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నామని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, పిల్లలను చదివించుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. మాతృ విభాగానికి హోంగార్డులు ఇదిలా ఉండగా మక్కా, రాయల్ మసీదుల్లో 24 మంది హోం గార్డులు బందోబస్తు విధులు నిర్వహిస్తుంటారు. గతంలో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్లను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం మక్కా మసీదులో 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకుగాను ప్రత్యేకంగా హోంగార్డులను నియమించారు మక్కా, రామల్ మసీదులో మొత్తం 24 మంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు.అయితే గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారిలో 11 మంది మాతృ విభాగానికి వెళ్లి పోయినట్లు మక్కా, రాయల్ మసీదు పర్యవేక్షకుడు ఖాద్రీ తెలిపారు. దీంతో మిగిలిన 13 మందితో మక్కా మసీదులో 6–7 మంది చొప్పున బందోబస్తును కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీ ప్రశ్నార్థకం మక్కా మసీదును సందర్శించడానికి రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. శుక్రవారం, అదివారం, సెలవు దినాల్లో వీరి సంఖ్య భారీగా ఉంటోంది. గతంలో 24 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొంటుండగా, ప్రస్తుతం కేవలం 13 మందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. గతంలో సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మక్కా, రాయల్ మసీదు సిబ్బందికి, హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, బందోబస్తును కట్టుదిట్టం చేయాలని పలువురు ధార్మిక, మైనార్టీ స్వచ్చంధ సంస్థలు ప్రతినిధులు కోరుతున్నారు. -
మక్కా మసీదులో తొక్కిసలాట
18 మందికి గాయాలు రియాద్: ముస్లింల పుణ్యక్షేత్రమైన సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. 18 మందికి గాయాలయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది హజ్ యాత్రలో ఇక్కడ తొక్కిసలాటలో 2,000 మందికి పైగా యాత్రికులు చనిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా శుక్రవారం మళ్లీ తొక్కిసలాట జరిగింది. రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని ముస్లింలు పరమ పవిత్ర దినంగా భావిస్తారు. ఆ రోజున మక్కా మసీదుకు ప్రార్థనలకోసం వచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి అక్కడే చికిత్స అందించారు. ఈ ఏడాది హజ్‌యాత్రకు వచ్చేవారు ఎలక్ట్రానిక్ బ్రేస్లెట్లను ధరించి, దానిలో తమ సమాచారాన్ని భద్రపరచుకోవాలని సూచించడం తెలిసిందే. -
‘బాంబు బ్లాస్ట్’కు తొమ్మిదేళ్లు
ఘటన అనంతరం మక్కా మసీదులో భద్రత పెంపు 23 కెమెరాలు ఏర్పాటు... {పస్తుతం పని చేయని 18 కెమెరాలు పట్టించుకోని అధికారులు చార్మినార్: మే 18వ తేదీ వస్తుందంటే చాలు పాతబస్తీ ప్రజలు ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి తేరుకోలేకపోతున్నారు. 2007 మే 18వ తేదీ వుధ్యాహ్నం 1.18 గంటలకు జరిగిన బాంబు పేలుడు ఘటన ఈ ఏడాదితో తొమ్మిదేళ్లు పూర్తికావస్తోంది. ఆనాటి విషాదకర ఘటనలు గుర్తుకొచ్చి బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. బాంబు పేలుడు తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో వుృతి చెందిన తమ కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరిగిందని వాపో తున్నారు. మక్కా వుసీదులో రౌండ్ ది క్లాక్ భద్రత... 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు అనంతరం మక్కా మసీదులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ భద్రతను పర్యవేక్షించడానికి మూడు షిప్టులలో 18 వుంది హోంగార్డులను ప్రభుత్వం నియుమించింది. వీరు రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటున్నారు. అలాగే, ప్రధాన ద్వారం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. విద్రోహశక్తులు, అనుమానితులు ప్రవేశాన్ని పసిగట్టేందుకు మసీదు ఆవరణ, కొలను, లైబ్రరీతో పాటు ప్రార్థనాలయం ప్రధాన హాలు, కార్యాలయం వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. పని చేయని 18 సీసీ కెమెరాలు.... బాంబు పేలుడు ఘటన అనంతరం మక్కా మసీదులో ఏర్పాటు చేసిన 23 సీసీ కెమెరాలు, స్టాటిక్ కెమెరాలలో ప్రస్తుతం కేవలం 5 మాత్రమే పని చేస్తున్నాయి. ఆరు నెలలుగా 18 కెమెరాలు పని చేయడం లేదు. నిరసన సభలకు అనుమతి లేదు .. మక్కా వుసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాం. దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కడ నిరసన సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ ఎటువంటి అనువుతులు ఇవ్వడం లేదు. - వి.సత్యనారాయణ, దక్షిణ వుండలం డీసీపీ -
మక్కా మసీదు కతీబ్ కన్నుమూత
♦ అనారోగ్యంతో మౌలానా హాఫేజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ మృతి ♦ కేసీఆర్, చంద్రబాబు, మహమూద్ అలీ సంతాపం హైదరాబాద్: మక్కా మసీదు కతీబ్, ఇమామ్ మౌలానా హాఫేజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ అల్ జహాదీ(80) మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ పాతబస్తీ పంచమహాల్లాకు చెందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న పలువురు మత పెద్దలతో పాటు అధికార, అనధికార ప్రముఖులు సంతాపం తెలిపారు. 1935 సెప్టెంబర్ 19న దుండిగల్‌లో జన్మించిన ఆయన గత 24 ఏళ్లుగా మక్కా మసీదు కతీబ్‌గా కొనసాగుతున్నారు. అలాగే జామే నిజామియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా కూడా పని చేశారు. ప్రతి శుక్రవారం ఆయన సామూహిక ప్రార్థనల సందర్భంగా మక్కా మసీదులో కుత్బా నిర్వహించేవారు. అల్ హజ్ అబ్దుల్ రహీంకు రెండో కుమారుడైన అబ్దుల్లా ఖురేషీ మెట్రిక్లేషన్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి, డిగ్రీ ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పూర్తి చేశారు. జామే నిజామియా నుంచి ఫజిల్ కోర్సు పూర్తి చేశారు. ‘దావతుల్ ఇస్లామియా అల్ ముసైరా ఫిల్ హిందూ’పై ఎంఫిల్ చేశారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకున్న ఆయన అంత్యక్రియలు బుధవారం జొహర్ కి నమాజ్ అనంతరం మిశ్రీగంజ్‌లో ముగియనున్నాయి. కేసీఆర్, బాబు సంతాపం... అబ్దుల్లా ఖురేషీ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మక్కా మసీదు ఇమామ్‌గా, జామియా నిజామియా వైస్ ఛాన్సలర్‌గా ఆయన సేవలను కొనియాడారు. అబ్దుల్లా ఖురేషీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఖురేషీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖురేషీ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఖురేషీ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. -
మక్కాలోనే అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లి పవిత్ర మక్కా మసీదు వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. మక్కా మసీదు విస్తరణ పనుల్లో వినియోగిస్తున్న భారీ క్రేన్ కుప్పకూలడంతో గత శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన మచిలీపట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్(38), ఫాతీమాబీ(32) దంపతులు ఈ ఘటనలో మృతిచెందినట్లు ఇప్పటికే ప్రభుత్వం ధ్రువీకరించింది. కాగా, మృతుల్లో కర్ణాటకకు చెందిన షమీమ్ బాను, ఖాదర్ బీ అనే మహిళలు సైతం ఉన్నట్లు సోమవారం గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు టూర్ ఆపరేటర్ ద్వారా హజ్ యాత్రకు వెళ్లడంతో వీరిద్దరినీ నగరవాసులుగా భావించారు. అనంతరం వీరిద్దరూ కర్ణాటకవాసులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాగా, ఈ నలుగురి అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం పవిత్ర మక్కా మసీదులోనే జరపాలని వారి కుటుంబ సభ్యులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంత్యక్రియలకు హాజరు కావడానికి మృతుల బంధువులను మక్కాకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇదే ప్రమాదంలో గాయాలపాలైన నాంపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన మహమ్మద్ హమీద్ ఖాన్, ఆయన భార్య అనీస్‌లు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భవానీ నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ ముజీబ్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి మక్కా ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను హైదరాబాద్‌కు తీసుకురావాలా? అక్కడే అంత్యక్రియలు చేయాలా? అన్న దానిపై హజ్ కమిటీ మృతుల బంధువులతో సంప్రదించిం ది. పవిత్ర మక్కాలో అంత్యక్రియలు జరపడం అదృష్టమనే విశ్వాసంతో అక్కడే అంత్యక్రియలు చేయాలని బంధువులు కోరారు. -
సౌదీ మృతుల్లో పెరిగిన భారతీయుల సంఖ్య
జెడ్డా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన దుర్ఘటనలో భారతీయ మృతుల సంఖ్య 11కు పెరిగింది. 115మంది చనిపోయిన ఈ ఘటనలో భారతీయులను గుర్తించే పనిని విదేశాంగ శాఖ చేపట్టింది. మృతులను గుర్తించేందుకు సౌదీ అధికారులు మార్చురీలోకి యాత్రికుల బంధువులను అనుమతించటంతో.. శనివారం గుర్తించిన ఇద్దరితో పాటు మరో 9 మందిని గుర్తించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ, ఎంపీల నుంచి ముగ్గురు చొప్పున, ఢిల్లీ, బెంగాల్‌ల నుంచి ఇద్దరు చొప్పున, పంజాబ్, బిహార్, అస్సాంల నుంచి ఒక్కొక్కరు గాయపడిన సంగతి తెలిసిందే. భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్వరూప్ వివరించారు. -
తమిళులు క్షేమం
చెన్నై, సాక్షి ప్రతినిధి: మక్కాహజ్‌కు తమిళనాడు నుంచి తరలి వెళ్లిన తమిళులంతా క్షేమంగా ఉన్నారని హజ్ కమిటీ ప్రకటించింది. అయితే కోయంబత్తూరుకు చెందిన ఒక మహిళ మృతి చెందినట్లు సమాచారం అందింది. సౌదీ అరేబియాలో మక్కా మసీదుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు వెళుతుంటారు. భారత్ నుంచి సైతం పెద్ద సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా మసీదును విస్తరించే పనులను చేపడుతున్న తరుణంలో భారీ క్రేన్ దానిపై పడడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 107 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు తెలిసింది. తమిళనాడు నుంచి 3,415 మంది మక్కాకు చేరుకున్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని, సురక్షితమైన ప్రదేశంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారని హజ్ కమిటీ ప్రకటించింది. ఈనెల 24వ తేదీన తమిళనాడు నుంచి మరో బృందం మక్కాకు చేరుకోనుంది.కోవై మహిళ మృతి: ఇదిలా ఉండగా, కోయంబత్తూరుకు చెందిన మహ్మమద్ ఇస్మాయిల్ భార్య బీమాభాను (24) మృతి చెందారు. వివాహం అయిన తరువాత దంపతులిద్దరూ కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపం కల్మండపంలో కాపురం పెట్టారు. పవిత్ర మక్కా మసీదులో ప్రార్థనలు చేయాలన్న తలంపుతో ఇరువురూ ఇటీవలే సౌదీ అరేబియాకు వెళ్లారు. మసీదుపై భారీ క్రేన్ కూలినపుడు దానికింద చిక్కుకుని బీమా భాను కూడా ప్రాణాలు కోల్పోయారు. -
ఖల్నాయక్..
చార్మినార్ కేంద్రంగా నూతన నగరం ఏర్పడిన తర్వాత నగరం గురించి చెప్పిన వారిలో అమీర్అలీ మూడో తరానికి చెందినవాడు. ఈ థగ్గు ప్రత్యేకత ఏమిటి? ముందు తరాలు చెప్పిన ‘ఉద్యానవన నగరి’ వైనాలు నిజమేనని ధ్రువీకరించుకున్నాం.‘రోమాంచిత సాహసాలు’ ఇతడికే ప్రత్యేకం! అమీర్ అలీ అనే థగ్గు మాత్రమే బంజారాహిల్స్‌ను తొలిసారి వర్ణించాడు. ‘కుడివైపున కఠిన శిలల గుట్టలు. ఎడమవైపు మైదానప్రాంతం. ఆకాశంలో కలుస్తోందా అన్నట్టు ఆ మైదానం చాలా విశాలంగా ఉంది. మధ్యలో చిన్నిలోయ. అక్కడో నది (మూసి). తీరం వెంబడి అడవిని తలపించే వృక్షాలు. మధ్యలో సూర్యకాంతిలో తెల్లటి నివాసాలు. ధగధగా మెరుస్తున్నాయి. వీటన్నిటి మధ్య వీటన్నికంటే ఎత్తులో చార్మినార్.. పక్కనే మక్కామసీదు.. తలెత్తుకుని నిల్చున్నాయి. నూరు చిన్నచిన్న మసీదులు శ్వేతవర్ణంలో కాంతులీనుతున్నాయి. దూరం నుంచి ఈ నగరం చొరబడలేని అడవి. దగ్గరకు చేరేకొద్దీ తోటలు. తీర్చిదిద్దినట్టు.. వీధులు,నివాసాలు. దూరం నుంచి చూస్తే.. ఇక్కడ నరమానవులు ఉన్నారా..? అని అనిపించేది. నగరంలోకి ప్రవేశిస్తే తెలిసింది.. ఇది చిక్కని జనసముద్రం! చార్-మినార్ల మొనలు మేఘాలను చీల్చుకుని ఆకాశాన్ని అందుకున్నాయి. ఈ ఒక్క దర్శనం చాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫలితం దక్కింది’ అని హైదరాబాద్ గురించి రాసుకున్నాడు అమీర్ అలీ. బందీని విడిపించాడు! కుతుబ్‌షాహీ సమాధులను తొలిసారి వర్ణించిన క్రెడిట్ కూడా అమీర్అలీదే! ఇక్కడకు రావడంలో ‘అందం’ ఉంది.‘ప్రతాపం’ ఉంది. అమీర్ అలీ గుర్రంపై అటుగా వెళ్తున్నాడు. అజీమా అనే అందమైన యువతి బాల్కనీలో విశ్రాంతిగా కన్పించింది. ఓ ముసలి, వ్యసనపరుడు ఆమెను ఇంటి బందీని చేశాడు! అమీర్‌అలీని అజీమా చూపులు కలిశాయి. సహాయకురాలిని అమీర్అలీ దగ్గరకు పంపింది, విముక్తం చేయాలని కోరుతూ! కథను క్లుప్తం చేస్తే, వాళ్లు లేచిపోదామనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కుతుబ్‌షాహీ సమాధుల దగ్గరలోని షావలీ దర్గా దగ్గర కలుసుకోవాలని అనుకుంటారు. అనుకున్న వేళకు అమీర్ అలీ వచ్చేస్తాడు. అజీమాకు ఆలస్యం అవుతుంది. దిక్కులు చూస్తోన్న అమీర్అలీకి దర్గా కుడివైపు కుతుబ్‌షాహీ సమాధులు కనిపిస్తాయి. కొంచెం దూరం నుంచి చూసి చెప్పినా ‘కుతుబ్‌షాహీలు శాశ్వతనిద్రపోతున్న అచ్చోట అడవి పావురాళ్లూ, గబ్బిలాలు చేసే సవ్వడిని పెద్దపెద్ద గుమ్మటాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడి శబ్దమూ, నిశ్శబ్దమూ, వెలుతురూ, చీకటి చిత్రమైన భావాలను కలిగించాయి’ అని అన్నాడు. బంధం తెంచుకుంది! కొంచెం ఆలస్యంగానైనా అజీమా అనుకున్న చోటికి వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పిల్లవాడిని కన్నారు. చాలా సుఖంగా జీవించారు. పదేళ్లు రివ్వున గడిచాయి. అమీర్ అలీ పట్టుబడ్డాడు! జైలు పాలయ్యాడు! అజీమా ఎటువంటి మానసికస్థితికి లోనైఉంటుంది..? రోజుకు పలుమార్లు ‘దిగ్భ్రాంతి’ చెందినట్లుగా ప్రకటనలు ఇచ్చే ‘పెద్దవాళ్ల’లా కాదు, ఆమె నిజంగానే దిగ్భ్రాంతి చెందింది! తనను రక్షించిన కథానాయకుడు థగ్గు అని.. చుక్కనెత్తురు చిందకుండా వందల మందిని హత్యచేశాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆత్మహత్య చేసుకుంది! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఫోన్ నంబర్: 7680950863 -
అద్భుత రాతి కట్టడం మక్కా మసీదు
మక్కా మసీదు నిర్మాణంలో మట్టి వాడలే, చార్మినార్ కట్టడంలో రాయి వాడలే. ఈ పత్యేకత ఎప్పుడైనాగమనించారా? ఈసారి వెళ్ళినప్పుడు తప్పక పరిశీలించండి!! మన దేశంలోని అతి పెద్ద పురాతన, చారితక విశిష్టత గల మసీదుల్లో మక్కా మసీదు ప్రధానమైంది. మక్కా మసీదు నిర్మాణానికి 1617లో శంస్థాపన జరిగింది. కులీ కుబ్షా రాజు, సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా మక్కా మసీదు కోసం శంస్థాపన చేశాడు. కుతుబ్షాల పాలన అంతమయ్యాక మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పాలనలో, 1694 నాటికి ఈ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి. ఔరంగజేబు ఈ మసీదును ప్రారంభించాడు. ఈ బృహత్తర మసీదు నిర్మాణం 77 సంవత్సరాలు కొనసాగింది. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల మక్కా మసీదు నిర్మాణ వైశిష్ట్యం చూసిన వారు నేటికీ అబ్బురపడతారు. మహ్మద్ పవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్ళు, మట్టి తీకొచ్చి ఇక్కడ మసీదు నిర్మాణంలో వాడారని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. అందుకనే ఈ మసీదుకు ‘మక్కా మసీదు’ అనే పేరు వచ్చిందని చెబుతారు. మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడా మట్టి వాడలే. రాళ్ళూ-రాతి పొడిని మాత్రమే ఉపయోగించారు. మహబ్నగర్ జిల్లా షాద్‌నగర్‌కు దగ్గర్లోలోని ఒక పెద్ద రాతికొండ తొలచి, అక్కడ్నుంచి తీసుకొచ్చిన అతిపెద్ద బండరాళ్ళతో మసీదు నిర్మాణం చేపట్టారు. ఈ కొండ నుంచి 170 అడుల పొడవు గల ఏకశిలలు 1400 జతల ఎడ్ల బండ్లపై ఎంతో శమకోర్చి ఇక్కడకు రవాణా చేశారని, ఆనాడు తన కళ్లారా చూసిన విదేశీ పర్యాటకుడు టావెర్నియర్ రాతల వల్ల తెలుస్తోంది. చార్మినార్ ఎత్తు 180 అడుగులు. కాగా, మక్కా మసీదు ఎత్తు 170 అడుగులు ఉండేలా నిర్మించారు. మసీదు లోపల 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల ఎత్తు గల విశాలమైన ప్రార్థనా హాలు ఉంది. సుమారు 3 వేలమంది ఒకేసారి కూర్చుని పార్థ్ధన జరుపుకొనే వీలుంది. ప్రార్థనా హాలుకు వెలుపల మరో పది వేలమంది ఏక కాలంలో కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చు. ప్రధాన పార్థనా మందిరం 20 పిల్లర్ల సపోర్టుతో ఉంది. మసీదు నిర్మాణంలో 12 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు వరకు పునాదులు తీసారని స్థానిక అధికారి చెప్పారు. ప్రధాన మసీదు ప్రాంగణానికి దక్షిణాన అసఫ్‌జాహీ రాజు, వారి కుటుంబ సభ్యుల సమాధులు మొత్తం 14 ఉన్నాయి. మసీదు శంకుస్థాపన 1617లో మక్కా మసీ శంస్థాపన కార్యకమాన్ని సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. ముస్లిం పెద్దలు, ఉలేమా, ఇతరులు అనేక మందిని అనేక దేశాల నుంచి ప్రత్యేకంగా ఈ కార్యకమానికి ఆహ్వానించారు. శంకుస్థాపన కార్యకమానికి హాజరైన పెద్దలందరినీ ఉద్దేశించి ‘రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తున్న వారెవరైనా ఉంటే వారే ముందుగా శంకుస్థాపన కార్యకమంలో పాల్గొనాలని కుతుబ్ షా ఆహ్వానించాడు. వేలాదిమంది ఆనాడు హాజరయినా, వాళ్ళలో ఒక్కరైనా దీనికి ముందుకు రాలే. దాంతో కులీకుతుబ్ షా లేచి తాను పన్నెండేళ్ల వయస్సు నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఐదుసార్లు నమాజు చేస్తున్నానని, కాబట్టి మసీదు శంస్థాపనకు తానే అన్నివిధాలా అర్హుడనని గర్వంగా ప్రకటించి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాడు. సుల్తాన్ తన ఆస్థానంలో పనిచేస్తున్న డారోగా మీర్ ఫయజుల్లా బేగ్, చౌదరి రంగయ్యలకు మసీదు నిర్మాణ పనుల పర్యవేక్షణ భాద్యత అప్పగించాడు. ఇందుకోసం తొలివిడతగా ఎనిమిది లక్షలు ఖజానా నుంచి మంజూరు చేశాడు. సుమారు 8000 మంది కార్మికులు రాత్రింపగళ్ళు ఈ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. అయితే, సుల్తాన్ మహ్మద్ కుత్బ్షా 1626లో అస్వస్థతకు గురై మరణించాడు. అప్పటికి ఆయన వయ్స కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. మసీదు నిర్మాణానికి తొమ్మిదేళ్లు ఆటంకం ఏర్పడింది. అయితే, ఆ తర్వాత సింహాసనం అధిష్టించిన కుతుబ్‌షాహీ రాజు మసీదు నిర్మాణ పనులను ఆపకుండా కొనసాగించాడు. ఆ దరిమలా ఏడున్నర దశాబ్దాలు నిరంతరాయంగా కొనసాగిన ఈ చరిత్రాత్మక మసీదులో ప్రతిరోజూ మహ్మదీయ సోదరులు ఐదుసార్లు నమాజు పార్థన జపుకునే ఏర్పాటు చేశారు. మసీదు ప్రాంగణంలో ఒక పక్కగా నల్లని రాతితో చేసిన డబుల్‌కాట్ సైజులోని రాతి మంచం ఒకటి ఉంది. దీన్ని ఆనాటి ఇరాన్ దేశపు రాజు ఔరంగజేబుకు బహుమతిగా ఇచ్చాడని స్థానికులు చెబుతారు. రాతి మంచంపై కూర్చుని కొద్దిసేపు సేద తీరితే మక్కా మసీదును తిరిగి సందర్శించే అవకాశం కలుగుతుందని, అలాగే మన్సలో కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతారు. మసీదు లోపల అతి పురాతన గడియారం వుంది. నమాజు చేయాల్సిన సమయాన్ని సూచించే ఐదు రకాల ప్రత్యేక గడియారాలు వున్నాయి. ఇవి కాకుండా మసీ ప్రాంగణంలో గడియారాల కనుగొనక పూర్వం ఔరంగజేబు కాలంనాటి టైం కొలిచే ‘‘కాలమానచక్రాన్ని’’ మక్కామసీదు సందర్శకులు తప్పక చూడాలి. రంజాన్ పండుగ సమయంలో ఈద్ కంటె ముదుంగా వచ్చే శుక్రవారం మసీదు పాంగణమంతా మహ్మదీయ సోదరులతో నిండిపోంది. మసీదు ప్రాంగణంలో వందల కొలది పావురాలున్నాయి. ఎలాంటి భయం బెరుకూ లేకుండా కన్పించే ఆ పావురాల గుంపు సందర్శకులకు ఒక పత్యేక ఆకర్షణ. ఈ అద్భు రాతి కట్టడం వైభవాన్ని ఆనాటి శిల్పకళాకాడు తన ఉలి కదలికలతో చేసిన అద్భుత కళావిన్యాసాన్ని ప్రతి ఒక్కరు తప్పక చూసి తీరాలి. -
ఇటు విలీనం.. అటు నిమజ్జనం..
చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు భాగ్యనగరం పులకించిపోయింది. దేశభక్తికి దైవశక్తి తోడైందనిపించింది. ఓ వైపు ‘జై బోలో భారత్ మాతాకీ..’ అంటూ నినాదాలు.., మరోవైపు ‘గణపతి బప్ప మోరియూ..’ నినాదాలతో హైదరాబాద్ మార్మోగిపోయింది. 1948 సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం భారతావనిలో విలీనమైన రోజు. ఆ రోజు బొల్లారంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా తెలంగాణ వ్యాప్తంగా ‘జై బోలో భారత్ మాతాకీ.. జై’ అంటూ నినాదాలు మిన్నంటాయి. తెలంగాణ చరిత్రలో వురిచిపోలేని ఈ రోజుకు వురో ప్రత్యేకత కూడా ఉంది. ఆ రోజు అనంత చతుర్దశి. హైదరాబాద్‌లో ఒకేరోజు రెండు పండుగలు. భాగ్యనగర వీధులు కోలాహలంగా ఉన్నారు. నవరాత్రులు లంబోదరుడికి స్వేచ్ఛగా వీడ్కోలు పలికారు సిటీవాసులు. రజాకార్ల దురాగతాలు ఇక ఉండవని తెలిసి ఆనందంతో పండుగ చేసుకున్నారు. సావుూహిక నివుజ్జన వేడుకల్లో వుుస్లిం సోదరులు కూడా పాల్గొని వుతసావురస్యానికి అసలైన చిరునావూ హైదరాబాదే అని ఆనాడే చాటి చెప్పారు. అందరి ఉత్సవం.. ఒక మతం ధార్మిక వేడుకల్లో మరో మతానికి చెందిన వారు పాల్గొనడం హైదరాబాద్‌కు కొత్తకాదు. మూసీ వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తి మృత్యుఘోష వినిపించిన సమయంలో నాటి నిజాం చార్మినార్ చెంతనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి చీర-సారె పంపి స్నేహగీతాన్ని వినిపిస్తే.. వినాయక నిమజ్జనోత్సవాల్లో ముస్లింలు మంచినీటి శిబిరాలు ఏర్పాటు చేసే సంప్రదాయూన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. మక్కామసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు మొదలుకాగానే, అప్పటి వరకు భక్తిగీతాలు, భజనలతో కోలాహలంగా సాగిపోయే శోభయూత్ర నిశ్శబ్దంగా వుుందుకు వెళ్తుంది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చే పలువురు ముస్లింలు వినాయక ఊరేగింపునకు తిరిగి స్వాగతం పలకడంతో మళ్లీ నినాదాల హోరు మిన్నంటుతుంది. అడపాదడపా కొన్ని అసాంఘిక శక్తుల ప్రేరణతో ఊరేగింపులో ఉద్రిక్తతలు నెలకొన్నా.. దాదాపు వందేళ్లుగా సాగుతున్న సామూహిక నిమజ్జనోత్సవాలన్నీ ప్రశాంతంగా సాగాయి. -
‘మక్కా’ నిందితుడి హత్య కేసులో చార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన పేలుడు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ సునీల్ జోషీ హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ పూర్తి చేసింది. మహారాష్ట్రలోని మాలెగావ్ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న ఠాకూర్ ప్రజ్ఞాసింగ్ సాధ్వీ సహా నలుగురిపై అభియోగాలు నమోదు చేస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2007 మే 18న చోటు చేసుకున్న ‘మక్కా’ పేలుడు కేసులో సునీల్‌జోషీ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కుట్ర మొత్తం ఇండోర్ కేంద్రంగా... ఇతని నేతృత్వంలోనే జరిగినట్లు ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ గుర్తించింది. కేసు మిస్టరీ తేలకపోవటంతో ప్రభుత్వం 2010లో ఎన్ ఐఏను రంగంలోకి దింపింది. ప్రజ్ఞాసింగ్‌ను లైంగికంగా వేధించడంతో పాటు మాలెగావ్ పేలుళ్ల కుట్రను బహిర్గతం చేస్తాడనే అనుమానం నేపథ్యంలోనే సునీల్ హత్య జరిగినట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ మేరకు ప్రజ్ఞాసింగ్, మరో ముగ్గురిపై అభియోగపత్రాలు దాఖలు చేసింది. -
అల్ విదా రంజాన్...
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: జుమ్మతుల్ విదాను పురస్కరించుకొని మక్కా మసీదులో శుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. మక్కామసీదు ప్రాంగణంతో పాటు చార్మినార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, చార్మినార్ బస్ టెర్మినల్ రోడ్లపై ఏర్పాటు చేసిన కార్పెట్లపై ప్రార్థనలు నిర్వహించారు. ఈ సామూహిక ప్రార్థనలకు ‘అజాన్’ను మహ్మద్ హనీఫ్ పలుకగా... మక్కా మసీదు ఇమామ్ హఫేజ్ మహ్మద్ రిజ్వాన్ ఖురేషీ నమాజ్ చేయించారు. అనంతరం మక్కా మసీదు కతీబ్ హఫేజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి దువా చేశారు. జుమ్మతుల్ విదా కోసం ఆయా మసీదుల్లో ప్రముఖ మతగురువులు జుమా ఖుత్బ పఠించారు. జుమా నమాజ్ అనంతరం ఆయా మసీదుల్లో రంజాన్, ఉపవాసాలు, జకాత్, లైలతుల్ ఖదర్ ప్రాముఖ్యత గురించి ముఫ్తిలు, ఉలేమాలు ప్రసంగించారు. ఈ ప్రార్థనలలో గ్రేటర్ మేయర్ మాజిద్ హుస్సేన్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ మహ్మద్ అల్తాఫ్ రిజ్వీతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఘనంగా షబే ఖదర్ షబే ఖదర్ సందర్భంగా నగరంలోని అన్ని మసీదులలో శుక్రవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నగరంలోని మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. ముస్లింలు సోదరులు షబే ఖదర్ను పురస్కరించుకొని తరావీ నమాజ్‌లు, నఫీల్ నమాజ్, తాహజుద్ నమాజ్‌లను సామూహికంగా నిర్వహించారు. అనంతరం మసీదుల్లో తరావీ నమాజుల్లో ఖురాన్ పఠించిన హఫెజ్‌లకు సన్మనించారు. ఈ సందర్భంగా మత పెద్దలు షబే ఖదర్ ప్రాముఖ్యత గూర్చి తెలిపారు. రంజాన్‌మాసంలో షబ్బే ఖదర్ రాత్రి దివ్య ఖురాన్ అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని మసీదుల్లో ఖురాన్ ప్రాముఖ్యతను మతగువులు, ముఫ్తీలు వివరించారు. ఈ రాత్రి చేసిన కర్మలకు వెయ్యి రెట్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని భావించి ఎక్కువగా దైవ స్మరణలో గడుపుతారని ముఫ్తీ మస్తాన్ అలీ తెలిపారు. -
దీపకాంతుల్లో మక్కా మసీద్
-
మూడో కన్ను మూసుకుందా?
అంతటా దర్శనమిస్తున్న నిఘా నేత్రాలు పనిచేసేవి కొన్నే అందులోనూ స్పష్టత కరవు పాతబస్తీలో నిరుపయోగంగా సీసీ కెమెరాలు చార్మినార్: పాతబస్తీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లు సత్ఫలితాలివ్వడం లేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ ఫుటేజీ ల్లోనూ దృశ్యాలు స్పష్టంగా కన్పించడం లేదు. ఇక కూడళ్లలో ఏర్పాటు చేసినవి మొక్కుబడిగా అన్నట్టుగా మారాయి. ఆదివారం మక్కా మసీదు వద్ద డీఆర్డీఓ రీజనల్ డెరైక్టర్‌పై దాడి జరిగిన నేపథ్యంలో సీసీ కెమెరాల పని తీరు తెరపైకి వచ్చింది. చార్మినార్ పరిసరాల్లో.. దక్షిణ మండలంలోని చార్మినార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా, మీర్‌చౌక్ ఠాణాల పరిధిలోని శాలిబండ పిస్తాహౌస్ నుంచి మదీనా చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డులో లాఅండ్ ఆర్డర్ పోలీసులు ఏర్పాటు చేసిన 16 కెమెరాల్లో 13 మాత్రమే పని చేస్తున్నాయి. చార్మినార్ కట్ట డం నలువైపులా (లాడ్‌బజార్ వైపు, మక్కా మసీ దు, సర్దార్ మహాల్, చార్‌కమాన్ వైపు) ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దిశ సక్రమంగా లేదనే విషయం ఆదివారం మక్కా మసీదు వద్ద ఒడిశా డీఆర్డీఓ ఆర్డీ సత్యపతిపై జరిగిన దాడి నేపథ్యంలో స్పష్టమైంది. దాడి దృశ్యాలు వీటిలో నమోదైనా.. స్పష్టంగా లేకపోవడంతో పోలీసులకు నిరాశే మిగి లింది. నిజానికి అవాంఛనీయ ఘటనలు జరిగినపుడు సీసీ కెమెరాల ఫుటేజీలే కీలకంగా మారుతాయి. కేసుల పురోగతికి ఇవే ఆధారమవుతాయి. చార్మినార్ కట్టడంలో పని చేయని సీసీ కెమెరాలు.. చార్మినార్ కట్టడంపై బిగించిన 4 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చార్మినార్‌ను సందర్శించడానికి వచ్చే పర్యాటకుల రక్షణతోపాటు అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన వీటిలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో పని చేయకపోవడం గమనార్హం. -
మక్కామసీదు వద్ద శాస్త్రవేత్తపై దాడి!
హైదరాబాద్: పాతబస్తీలో ఆదివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీలోని మక్కామసీదు వద్ద డీఆర్ డీఓ కు చెందిన శాస్త్రవేత్తపై కత్తితో దుండగుడు దాడి చేశారు. గుర్తుతెలియని వ్యక్తి శాస్త్రవేత్త శతపదిపై దాడి చేసినట్టు సమాచారం. దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని అడ్డుకోవడంతోనే శతపదిపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. అంగతకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన శతపదిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శతపది పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. -
మక్కా.. లుక్కేద్దాం ఎంచక్కా
రంజాన్‌కు ముస్తాబవుతున్న మక్కా మసీదు నగరాన్ని చరిత్ర పుటల్లో నిలిపిన అద్భుత కట్టడం దేశంలోని పురాతన మసీదుల్లో ప్రత్యేక గుర్తింపు చార్మినార్: రంజాన్ మాసం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంభానికి ఇక రెండు వారాలే మిగిలి ఉంది. రంజాన్ మాసానికి ముందు వచ్చే షబ్-ఏ-బరాత్ భక్తి శ్రద్ధలతో ముగిసింది. దీంతో ఈ నెల 30నుంచి రంజాన్ మాసం ప్రారంభం కావచ్చునని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. సామూహిక ప్రార్ధనలు, ఖురాన్ పఠనంతో పాటు ఉపవాస దీక్షలను సైతం మక్కా మసీదు ప్రాంగణంలో ముగిస్తారు. రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం చేసే ఇఫ్తార్ విందులకు మక్కా మసీదు వేదికగా మారుతుంది. రంజాన్ మాసంలో మక్కా మసీదు విద్యుత్ దీప కాంతులతో కళకళలాడుతుంది. సాధారణ రోజుల కంటే రంజాన్ మాసంలో మసీద్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నగరంతోపాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో మక్కా మసీదు సందర్శించి ప్రార్ధనలు నిర్వహిస్తారు. దీనికోసం మక్కా మసీదు అందంగా ముస్తాబవుతోంది. అవసరమైన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నారు. మక్కా నుంచి రాళ్లు తెప్పించి కట్టినందుకే... దేశంలో గల అతి పెద్ద పురాతన మసీదుల్లో నగరంలో ఉన్న మక్కా మసీదు ఒకటి. చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడానికి అతి సమీపంలో దక్షిణం వైపున సుమారు 100 గజాల దూరంలో మక్కా మసీదు ఉంది. మహ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు తీసుకొచ్చి ఈ మసీదు నిర్మాణానికి ఉపయోగించారని చెబుతుంటారు. అందుకే దీనికి మక్కా మసీదని పేరొచ్చినట్లు చరిత్రకారుల అభిప్రాయం. మక్కా మసీదులోని ఆవరణలో ఎడమ వైపు ఉన్న బల్లపై ఒకసారి కూర్చుంటే మక్కా మసీదు సందర్శన కోసం మళ్లీ వస్తారనేది నమ్మకం. నిర్మాణంలో మట్టికి బదులు రాళ్ల పొడి... మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడా మట్టిని వాడలేరు. రాళ్ల పొడిని మాత్రమే ఉపయోగించారు. మక్కా మసీదు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ పెద్ద రాతి కొండను ఎంపిక చేశారు. కొండను తొలిచి తెచ్చిన ఎత్తై రాళ్లతో మక్కా మసీదు నిర్మాణం జరిగింది. ఆ రాళ్లను ఎండ్ల బండ్ల ద్వారా మక్కా మసీదుకు తీసుకొచ్చారు. ఒకేసారి 3వేల మందికి ప్రార్థన చేసుకునే విధంగా... దాదాపు ఒకేసారి 3 వేల మంది ఈ హాల్లో ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మక్కా మసీదు ఎత్తు 176 అడుగులు, మక్కా మసీదు లోపల 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల ఎత్తు గల విశాలమైన ప్రార్థనా మందిరం ఉంది. మక్కా మసీదు నిర్మాణం 1617లో ప్రారంభమై 1690 నాటికి పూర్తి నిర్మాణం రూపుదిద్దుకుంది. మసీదుకు దక్షిణంలో ఐదుగురు ఆసఫ్జాహీ రాజులు, వారి కుటుంబ సభ్యుల సమాధులు 14 ఉన్నాయి. -
స్వల్ప ఉద్రిక్తత మినహా..సామూహిక ప్రార్థనలు ప్రశాంతం
పోలీసులపై అల్లరిమూక రాళ్ల దాడి రెండు వాహనాల ధ్వంసం శాలిబండ, న్యూస్‌లైన్: స్వల్ప ఉద్రిక్తత మినహా మక్కా మసీదులోశుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రార్థనల అనంతరం బయటికి వచ్చిన కొందరు యువకులు నారే తక్బీర్ అంటూ నినాదాలు చేస్తూ మక్కా మసీదు ముందు గుమిగూడారు. వారిని పో లీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో వారు మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ వైపు వెళ్లి.. నినాదాలు చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు. రెచ్చిపోయిన ఆ అల్లరిమూక రోడ్లపై ఉన్న రెండు వాహనాలను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి గుంపులుగా బయలుదేరి ఆస్రా ఆసుపత్రి ముందున్న ఐడీబీఐ బ్యాంక్ అద్దాలను పగులగొట్టారు. దీంతో చార్మినార్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీ సులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఏం జరుగుతుందోనన్న భయంతో వ్యా పారులు తమ దుకాణాలను మూసివేశారు. ఎమ్మెల్యే అటుగా రావడంతో... సామూహిక ప్రార్థనల అనంతరం యువకులు బయటకు వచ్చారు. అదే సమయంలో మక్కా మసీదు వైపు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాహనం వచ్చింది. ఓవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండటం, ఎంఐఎం హై దరాబాద్ ఎంపీ అభ్యర్థి మొదటి రౌండ్లో వె నుకబడటంతో నిరాశకు గురైన ఆ యువకులు నారే తక్బీర్ అంటూ నినాదాలు చేస్తూ గుమిగూడరు. దీంతో అక్బరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం యువకులు మొఘల్‌పురా వైపు వెళ్తూ రాళ ్ల దాడికి పాల్పడ్డారు. ప్రార్థనలకు గట్టి బందోబస్తు... కిషన్‌బాగ్‌లో ఘర్షణలు, ఎన్నికల కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం మక్కా మసీదు లో జరిగిన సామూహిక ప్రార్థనలకు దక్షిణ మండలం పోలీసులు బీఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్, టాస్క్‌ఫోర్స్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. నగర అదనపు కమిషనర్ అంజనీ కుమార్, దక్షిణ మం డలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠీ బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, ఐడీబీఐ బ్యాంక్ అద్దాల ను అల్లరి మూకలు ధ్వంసం చేసిన ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.