18 మందికి గాయాలు
రియాద్: ముస్లింల పుణ్యక్షేత్రమైన సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. 18 మందికి గాయాలయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది హజ్ యాత్రలో ఇక్కడ తొక్కిసలాటలో 2,000 మందికి పైగా యాత్రికులు చనిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా శుక్రవారం మళ్లీ తొక్కిసలాట జరిగింది. రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని ముస్లింలు పరమ పవిత్ర దినంగా భావిస్తారు.
ఆ రోజున మక్కా మసీదుకు ప్రార్థనలకోసం వచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి అక్కడే చికిత్స అందించారు. ఈ ఏడాది హజ్‌యాత్రకు వచ్చేవారు ఎలక్ట్రానిక్ బ్రేస్‌లెట్లను ధరించి, దానిలో తమ సమాచారాన్ని భద్రపరచుకోవాలని సూచించడం తెలిసిందే.
మక్కా మసీదులో తొక్కిసలాట
Published Sun, Jul 3 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM
Advertisement