- అంతటా దర్శనమిస్తున్న నిఘా నేత్రాలు
- పనిచేసేవి కొన్నే
- అందులోనూ స్పష్టత కరవు
- పాతబస్తీలో నిరుపయోగంగా సీసీ కెమెరాలు
చార్మినార్: పాతబస్తీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లు సత్ఫలితాలివ్వడం లేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ ఫుటేజీ ల్లోనూ దృశ్యాలు స్పష్టంగా కన్పించడం లేదు. ఇక కూడళ్లలో ఏర్పాటు చేసినవి మొక్కుబడిగా అన్నట్టుగా మారాయి. ఆదివారం మక్కా మసీదు వద్ద డీఆర్‌డీఓ రీజనల్ డెరైక్టర్‌పై దాడి జరిగిన నేపథ్యంలో సీసీ కెమెరాల పని తీరు తెరపైకి వచ్చింది.
చార్మినార్ పరిసరాల్లో..
దక్షిణ మండలంలోని చార్మినార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా, మీర్‌చౌక్ ఠాణాల పరిధిలోని శాలిబండ పిస్తాహౌస్ నుంచి మదీనా చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డులో లాఅండ్ ఆర్డర్ పోలీసులు ఏర్పాటు చేసిన 16 కెమెరాల్లో 13 మాత్రమే పని చేస్తున్నాయి. చార్మినార్ కట్ట డం నలువైపులా (లాడ్‌బజార్ వైపు, మక్కా మసీ దు, సర్దార్ మహాల్, చార్‌కమాన్ వైపు) ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దిశ సక్రమంగా లేదనే విషయం ఆదివారం మక్కా మసీదు వద్ద ఒడిశా డీఆర్‌డీఓ ఆర్‌డీ సత్యపతిపై జరిగిన దాడి నేపథ్యంలో స్పష్టమైంది. దాడి దృశ్యాలు వీటిలో నమోదైనా.. స్పష్టంగా లేకపోవడంతో పోలీసులకు నిరాశే మిగి లింది. నిజానికి అవాంఛనీయ ఘటనలు జరిగినపుడు సీసీ కెమెరాల ఫుటేజీలే కీలకంగా మారుతాయి. కేసుల పురోగతికి ఇవే ఆధారమవుతాయి.
చార్మినార్ కట్టడంలో పని చేయని సీసీ కెమెరాలు..
చార్మినార్ కట్టడంపై బిగించిన 4 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చార్మినార్‌ను సందర్శించడానికి వచ్చే పర్యాటకుల రక్షణతోపాటు అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన వీటిలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో పని చేయకపోవడం గమనార్హం.