16న హైదరాబాద్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు రౌహనీ | Iranian President Hassan Rouhani to visit Hyderabad Mecca Masjid | Sakshi
Sakshi News home page

16న హైదరాబాద్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు రౌహనీ

Published Mon, Feb 12 2018 3:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

Iranian President Hassan Rouhani to visit Hyderabad Mecca Masjid - Sakshi

హైదరాబాద్‌ మక్కా మసీదు (ఇన్‌సెట్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ)

సాక్షి, హైదరాబాద్‌: ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ మొట్టమొదటిసారి భారత్‌కు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత మక్కా మసీదును సందర్శించనున్నారు. ఫిబ్రవరి 16న మక్కా మసీదులో జరిగే నమాజ్‌–ఇ–జుమ్మా సామూహిక ప్రార్థనల్లో రౌహనీ పాల్గొంటారని మసీదు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్‌ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రౌహనీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement