hassan Rouhani
-
శాస్త్రవేత్త దారుణ హత్య.. ట్రంప్‌పై అనుమానం!
టెహ్రాన్ : ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అణు పితామహుడు మొషిన్ ఫక్రజాదే దారుణ హత్య కలకలం రేపుతోంది. శాస్త్రవేత్త హత్యను ఆ దేశ ప్రధాని హసన్ రౌహనీ తీవ్రంగా ఖండించారు. ఇది పరికిపందల చర్యగా వర్ణించారు. దాడికి పాల్పడిన వారిపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. సైనికపరంగా తమను ఎదుర్కోలేక మొషిన్ అత్యంత దారుణంగా హతమార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శాస్త్రవేత్త హత్యతో ఇరాన్ అణ్వాయుధ సంపత్తిని, సైనిక బలాన్ని ఎవరూ అడ్డుకోలేరని సరైన సయమంలో స్పందించి తీరుతామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సైతం రౌహానీ అనుమానం వ్యక్తం చేశారు. (ఇరాన్ శాస్త్రవేత్త దారుణహత్య) ఈ దారుణ హత్య వెనకున్న హస్తలన్నీ తమకు తెలుసని పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్‌పై వ్యాఖ్యలు చేశారు. కాగా ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమాని హత్యకు కారణం కూడా అమెరికానే అంటూ హసన్ రౌహానీ బహిరంగంగా ఆరోపించిన విషయం తెలిసిందే. 2012 నుంచి 2016 మధ్య నలుగురు ఇరాన్ శాస్త్రవేత్తలు హత్యకు గురైయ్యారు. వీరివెనుక ఇజ్రాయెల్ హస్తముందని రౌహానీ బలంగా వాదిస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్త హత్యపై ఇరాన్ వ్యాప్తంగా నిరసన ఆగ్రహం పెల్లుబికుతోంది. దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి నివాదాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగమంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ఇజ్రాయెల్‌పై ఆరోపణలు గుప్పించారు. (సీఐఏకు సమచారమిచ్చాడు.. ఉరి ఖాయం: ఇరాన్) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘మొహిన్ పేరును గుర్తుపెట్టుకోండి. ఇరాన్లో చాలా గొప్ప, బలమైన శాస్త్రవేత్త. భవిష్యత్‌లో మరోసారి ఆయన పేరును మనం వినే అవకాశం ఉందంటూ’ చేసిన వ్యాఖ్యలను జావేద్ గుర్తుచేశారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని ఇరాన్ రక్షణ విభాగానికి చెందిన ముఖ్య అధికారి వెల్లడించారు. మరోవైపు మొహిన్ మరణంపై ఇజ్రాయెల్ మోనం వీడింది. ఆయన మృతి ఇరాన్‌కు తీవ్ర నష్టం చేకూర్చుతుందని పేర్కొంటూ ఓట్వీట్ చేసింది. దీనిని డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేయడం గమనార్హం. కాగా ఇరాన్- అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందం నుంచి కూడా ట్రంప్ వైదిలిగారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. సులేమాని హత్య అనంతరం మాటల యద్ధం తారా స్థాయికి చేరింది. -
ఇరాన్లో మళ్లీ కఠిన నిబంధనలు
టెహ్రాన్: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో మరోసారి కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉందని ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహాని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగాలంటే హెల్త్ ప్రొటోకాల్ తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో మరోసారి లాక్డౌన్ విధిస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడుతూ.. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రావిన్స్‌ల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. (త్వరలోనే అతడికి ఉరిశిక్ష అమలు: ఇరాన్) అదే విధంగా ఇరాన్లో కోవిడ్ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న షియా ముస్లింల పవిత్ర స్థలం ఇమామ్ రెజా ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరుకావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా శనివారం ఒక్కరోజే ఇరాన్లో 2410 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 71 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఇరాన్లో కరోనా బాధితుల సంఖ్య 1,84,955 దాటగా, మృతుల సంఖ్య 8730కి చేరింది. ఏప్రిల్ రెండో వారం నుంచి లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో అన్ని ప్రార్థనా స్థలాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.(అమెరికాకు ఇరాన్ వార్నింగ్) -
'వారిని రక్షించాలంటే కఠిన చట్టాలు రావాల్సిందే'
టెహ్రాన్ : ఇరాన్లో మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు కల్పించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ పిలుపునిచ్చారు. గురువారం టెహ్రాన్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో అష్రాఫీ మృతిపై హసన్ రౌహానీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన పరువు హత్యగా పేర్కొన్నారు. ఇలాంటివి చోటుచేసుకోకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హింస నుంచి మహిళలను రక్షించే బిల్లును "వేగవంతమైన అధ్యయనంగా ధృవీకరించాలంటూ' ఆదేశించారు. మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌కు చెందిన 14 ఏళ్ల అమ్మాయి తండ్రి చేతిలో దారుణహత్యకు గురవడం దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.(ఒక్కరోజే 114 మంది పోలీసులకు కరోనా) ఇరాన్‌కు చెందిన రోమినా అష్రాఫీ అనే 14 ఏళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి నార్త్ ఇరాన్‌లోని తాలేష్ కౌంటీ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల వ్యక్తిని కలిసింది. విషయం తెలుసుకున్న అష్రాఫీ తండ్రి రోమినాను ఇంటికి ఈడ్చుకొచ్చి కొడవలితో దారుణ హత్యకు పాల్పడ్డాడు. అష్రాఫీ దారుణ హత్యపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా చానెళ్లు ప్రత్యేక కవరేజీ అందించాయి. దీంతో పోలీసులు రోమీనా తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రోమినాను కలిసిన 29 ఏండ్ల వ్యక్తిపై కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియదు. మరోవైపు ఈ ఘటనను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది.'మహిళలు / బాలికలపై జరుగుతున్నహింస పట్ల శిక్షలను మరింత కఠినతరం చేయాలని మేము ఇరాన్ అధికారులను, చట్టసభ సభ్యులను కోరుతున్నాము. మరణశిక్షను ఆశ్రయించకుండా, నేరం యొక్క తీవ్రతకు అనులోమానుపాతంలో జవాబుదారీతనం ఉండేలా వారు శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 301 ను సవరించాలి' అంటూ అమ్నెస్టీ గురువారం ట్విటర్లో తెలిపింది. -
ఇరాన్ ఉపాధ్యక్షురాలికి సోకిన కరోనా
కరోనా వైరస్(కోవిడ్-19) ఇరాన్‌ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు కరోనా సోకడంతో ఇరాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. రిపోర్టులు శనివారం వచ్చే అవకాశం ఉందని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. చదవండి: అన్ని వైరస్ల కన్నా ప్రాణాంతకం ఇదే.. ఎబ్తేకర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమెకు కోవిడ్-19 సోకిందనే వార్త బయటికి రావడానికి ఒకరోజు ముందు ఆమె ప్రభుత్వ కేబినెట్ మీటింగ్‌లో పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్‌లో దేశాధ్యక్షుడు హసన్ రౌహానీకి చాలా దగ్గరగా ఆమె కూర్చున్నారు. దీంతో రౌహానీ ఆరోగ్యంపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు ఇరాన్లో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం కరోనా సోకిన వారి సంఖ్య 245కు చేరుకుందని, వీరిలో 106 మంది ఒక్క రోజులోనే కరోనా వైరస్ బారిన పడినట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. చదవండి: ఎట్టకేలకు భారత్ చేరుకున్న జ్యోతి -
క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్
టెహ్రాన్: ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసి క్షమించరాని తప్పు చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక్కరి వల్ల జరిగిన తప్పిదం కాదని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ దుర్ఘటనకు ఇరాన్ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చి వేసిన విషయం విదితమే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్ పౌరులు, 10 మంది స్వీడిష్ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్ పౌరులు, 63 మంది కెనడియన్లు) దుర్మరణం పాలయ్యారు. కాగా తొలుత ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇరాన్.. కెనడా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాధినేతల నుంచి విమర్శలు ఎదుర్కొంది.(అసలు ఆ ప్రమాదం జరిగేదే కాదు!) ఈ క్రమంలో ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణి కూలుస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో విమానాన్ని కూల్చింది తామేనని ఇరాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మంగళవారం మాట్లాడుతూ..‘ ఈ విషాదకర ఘటనకు కారణమైన వారిని విచారిస్తున్నాం. నిజానికి ఇది క్షమించరాని తప్పు. మాటలకు అందని విషాదం. అయితే దీనికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయాలనుకోవడం లేదు. విమానాన్ని తామే కూల్చేశామని ఇరాన్ సైన్యం తమ తప్పిదాన్ని అంగీకరించడం మంచి విషయం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పని చేయగలరనే నమ్మకం ఉంది. విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఇరాన్ పౌరులు, వివిధ దేశాల పౌరుల కుటుంబాలకు మేం జవాబుదారీగా ఉంటాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు మా వైపు చూస్తోంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఘటనకు బాధ్యులైన వారిని విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో జడ్జితో పాటు పలువురు న్యాయ నిపుణులు కూడా ఉంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.... హసన్ ప్రసంగం ముగిసిన వెంటనే... 176 మంది మృతికి కారణమైన విమాన ప్రమాదంలో పలువురిని అరెస్టు చేసినట్లు ఇరాన్ న్యాయ శాఖ అధికారి వెల్లడించారు. ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం -
ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం
టెహ్రాన్: అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గాలనే తాము కోరుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. శాంతి నెలకొనేందుకు ముందు ఉద్రిక్తతలు తగ్గడం అవసరమేనని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. అయితే, అగ్రరాజ్యంతో చర్చలు మాత్రం అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసిన తరువాతేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానిల మధ్య టెహ్రాన్‌లో సోమవారం చర్చలు జరిగాయి. ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలంటే ఉద్రిక్తతలు తొలగాలని, చర్చ లు జరగాలని భావిస్తున్నట్లు ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ‘ఉద్రిక్తతలు తగ్గేందుకు, చర్చలు జరిగేందుకు అంతా కృషి చేయాలి. అదొక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం’ అని ఖతార్ ఎమిర్ వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రాంత రక్షణను దృష్టిలో పెట్టుకుని సంబంధిత వర్గాలతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించాం’ అని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ పేర్కొన్నారు. ఖతార్ అమెరికాకు, ఇరాన్‌కు నమ్మకమైన మిత్రదేశం. ఈ ప్రాంతంలో అమెరికా అతి పెద్ద మిలటరీ బేస్ ఖతార్‌లోనే ఉంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రితోనూ రౌహానీ సమావేశమయ్యారు. ఇరాన్, యూఎస్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇటీవల పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో చర్చలకే అధ్యక్షుడు ట్రంప్ మొగ్గు చూపుతున్నారని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు. రాయబారి అరెస్ట్‌పై బ్రిటన్ సీరియస్ టెహ్రాన్‌లో తమ రాయబారిని అదుపులోకి తీసుకోవడంపై బ్రిటన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు నిరసనగా సోమవారం బ్రిటన్‌లోని ఇరాన్ రాయబారిని పిలిపించి, సంజాయిషీ కోరింది. తమ రాయబారిని అదుపులోకి తీసుకోవడం దౌత్య నిబంధనల ఉల్లంఘన అని ప్రధాని బోరిస్ జాన్సన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఉక్రెయిన్ విమాన ప్రమాద మృతులకు నివాళి అర్పించేందుకు ఆమిర్ కబిర్ యూనివర్సిటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఇరాన్‌లోని బ్రిటన్ రాయబారి రాబ్ మెక్ కెయిర్ను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాను నిరసనల్లో పాల్గనలేదని, నివాళి కార్యక్రమంలో పాల్గొనేందుకే వెళ్లానని ఆదివారం రాబ్ మెక్‌కెయిర్ ట్వీట్ చేశారు. కాగా, ఉక్రెయిన్ విమానాన్ని కూల్చిన విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించలేదని ఇరాన్ ప్రకటించింది. -
పొరపాటున కూల్చేశాం
టెహ్రాన్/వాషింగ్టన్: ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్ ఎట్టకేలకు శనివారం అంగీకరించింది. మానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్ ఇన్నిరోజులూ చెప్పింది. ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో వరుస దాడులు జరపడం.. ఆ వెంటనే కొంత సమయానికే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది. శత్రువని అనుకున్నాం... శత్రువులకు సంబంధించిన విమానం అనుకోవడం వల్లనే పొరబాటున ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణులతో కూల్చేయాల్సి వచ్చిందని ఇరాన్ మిలటరీ వర్గాలు అంగీకరించాయి. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వెల్లడించారు. ఈ తప్పుకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మృతుల్లో అధికులు ఇరాన్– కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కాగా, ఉక్రెయిన్ దేశస్తులు కొందరు ఉన్నారు. కెనడా ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. అతన్నీ చంపాలనుకుంది ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని చంపిన రోజే మరో ఇరాన్ కమాండర్‌ను కూడా అమెరికా చంపాలనుకుందని, అయితే ఆ వ్యూహం విఫలమైందని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ కమాండర్ అబ్దుల్ రెజా షహ్లైని అమెరికా తుదముట్టించాలనుకుంది. ఈ గ్రూపును కూడా అమెరికా ఇప్పటికే ఉగ్రవాద జాబితాలో చేర్చింది. ఇద్దరు నాయకుల మరణాలు ఒకేరోజు జరిగితే ఇరాన్ బలగాలు నీరుగారిపోతాయని అమెరికా భావించింది. అందుకే అబ్దుల్ రెజాను కూడా చంపేందుకు అమెరికా అధ్యక్షుడు అనుమతి ఇచ్చారు. అయితే యెమెన్‌లో ఉన్న ఆయన అమెరికా నుంచి తప్పించుకోగలిగారు. షియా మిలిటెంట్ గ్రూపులకు అబ్దుల్ రెజా ఆయుధాలు, నిధులు సమకూర్చుతున్నట్లు అమెరికా ప్రకటించింది. అతడు చేస్తున్న వ్యవహారాల గురించి చెప్పిన వారికి భారీ మొత్తం ఇస్తామని కూడా ప్రకటించింది. అమెరికాకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు స్వర్గధామమైన యెమెన్‌లో అబ్దుల్ రెజాను చంపేందుకు తమ దేశం వేసిన ప్రణాళికను తాము చూశామని, అయితే అది విఫలమైనందున మరిన్ని విషయాలు చెప్పడంలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి, నేవీ కేడర్‌కు చెందిన రెబెకా రెబరిచ్ తెలిపారు. -
52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్!
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాక్‌లో జరిపిన రాకెట్ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ సులేమానీ అంతిమయాత్రకు కోట్లాది మంది తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. ఈ సందర్భంగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ సహా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రతిన బూనారు. అంతేగాకుండా ట్రంప్ తలపై సుమారు రూ. 575 కోట్ల రివార్డు ప్రకటించినట్లు స్థానిక ప్రభుత్వ మీడియా పేర్కొంది. అదే విధంగా అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో తాము సైతం భీకర ప్రతీకారానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. దీంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ట్రంప్‌ను మరోసారి హెచ్చరించారు. 52 ప్రదేశాలు లక్ష్యంగా దాడులకు పాల్పడతామన్న ట్రంప్ బెదిరింపులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇరాన్‌ను బెదిరించే సాహసం చేయొద్దని హితవు పలికారు. ఈ మేరకు.. ‘ఎవరైతే నంబరు 52 గురించి మాట్లాడుతున్నారో.. వారు 290 గురించి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివి ఇరాన్ జాతిని బెదిరించలేవు’ అంటూ 1988లో అమెరికా ఇరాన్లో సృష్టించిన మృత్యుఘోషను గుర్తుచేశారు. ట్రంప్ 52 ప్రదేశాల్లో దాడి జరిపితే... తాము 290 టార్గెట్లు పెట్టుకుంటామని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. (ట్రంప్ తలపై రూ.575 కోట్లు) ఎందుకు 52.... 290? ఇరాన్ ప్రతీకార హెచ్చరికల నేపథ్యంలో... ‘అమెరికన్లపై కానీ, అమెరికా ఆస్తులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ దాడులకు దిగితే ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన 52 ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాలు లక్ష్యంగా చేసే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా 1979-81 మధ్య 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టింది. ఈ ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ఉటంకిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో హసన్ రౌహానీ సైతం అదే రీతిలో IR655 హ్యాష్‌ట్యాగ్‌తో ట్రంప్‌నకు బదులిచ్చారు. 1988 జూలై 3న టెహ్రాన్ నుంచి దుబాయ్ బయల్దేరిన ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655 ను అమెరికా నౌకాదళ క్షిపణి కూల్చివేసింది. దాడి సమయంలో విమానంలో ఉన్న మొత్తం 290 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 66 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇది అనుకోకుండా జరిగిన దాడి అని అమెరికా చేతులు దులుపుకుంది. 1988 ఇరాన్- ఇరాక్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాక్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా... పర్షియన్ గల్ఫ్‌లో షిప్పింగ్ మార్గాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పొరబాటున పౌర విమానాన్ని కూల్చివేశామని పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం అంత తేలికగా ఈ ‘నరమేధాన్ని’ మరచిపోలేదు. సులేమాని అంత్యక్రియల్లో సైతం ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ.. అమెరికాకు ఇక చావే అంటూ నినదించింది. తాజాగా ఈ ఘటనను గుర్తుచేస్తూ హసన్ ట్రంప్‌నకు కౌంటర్ ఇచ్చారు.(‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’) Those who refer to the number 52 should also remember the number 290. #IR655 Never threaten the Iranian nation. — Hassan Rouhani (@HassanRouhani) January 6, 2020 -
‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’
టెహ్రాన్: ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలేమన్‌ను హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధినాయకుడు అయాతోల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. సోలేమన్‌ను అంతం చేసినా.. ఆయన చూపిన బాటలో నడవకుండా ఎవరినీ కట్టడి చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా శుక్రవారం రాకెట్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోలేమన్ సహా మరో 8 మంది మృతి చెందారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగానే అమెరికా రాకెట్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ... స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా ఇరాన్ మంచి కోసం అవిశ్రాంత కృషి చేసిన సోలేమన్‌కు నేడు అమరత్వం సిద్ధించింది. ఆయన వెళ్లిపోయాడు గానీ ఆయన చూపిన దారిలో సాగడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన రక్తంతో చేతులు తడుపుకొన్న నేరగాళ్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరతాం. మా శత్రువులు ఒక విషయం తెలుసుకోవాలి. మీరిలా చేసినందుకు జీహాద్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. పవిత్ర యుద్ధంలో మాకోసం విజయం ఎదురుచూస్తోంది’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా సోలేమన్‌తో పాటు అమరులైన మరికొందరు అధికారుల తరఫున ప్రతీకారం తీర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మాట్లాడుతూ... ఇస్లామిక్ విలువలను పరిరక్షించేందుకు తమతో పాటు స్వాత్రంత్యం కోరుకునే మరికొన్ని దేశాలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోలేమన్ అమరత్వం తమను ఇందుకు కార్యోన్ముఖుల్ని చేసిందని వ్యాఖ్యానించారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి) చదవండి: ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
ఒక్క బుల్లెట్ తగిలినా మసే
టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ ఇంకా మాట లు తూటాలు విసురుకుంటూనే ఉన్నాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించి మరీ ఆఖరి నిముషంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమపై యుద్ధంప్రకటిస్తే మధ్యప్రాచ్య దేశాలన్నీ ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. ‘ఇరాన్‌కి ఒక్క బుల్లెట్ గాయమైనా ఈ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలన్నీ మంటల్లో కలుస్తాయి‘‘ అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు. ‘‘మా శత్రువులు ఎవరైనా ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర పక్షాలు ఈ ప్రాంతంలో సైనికచర్యలకు దిగితే ఈ ప్రాంతం అంతా మండిపోతుంది‘‘ అని అన్నారు. గత ఏడాది ఇరాన్‌తో అణు ఒప్పందా న్ని అమెరికా ఏకపక్షంగా రద్దు చేసుకోవడంతో పాటు వివిధ దేశాలపై ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు వద్దంటూ ఆంక్షలు విధించిన దగ్గర్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్‌ని ఇరాన్ కూల్చి వేసిన అవి మరింత పెరిగిపోయాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాల్ని పంపించిన అధ్యక్షుడు ట్రంప్ 150 మంది ప్రాణాలు కోల్పోతారని తెలిసే ఆఖరి క్షణంలో వెనకడుగు వేశారని కథనాలు వెలువడ్డాయి. అమెరికా సిబ్బందికి భద్రత పెంపు అమెరికా, ఇరాన్ ఒకరికొకరు కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండడంతో ఇరాక్ కూడా అప్రమత్తమైంది. ఇరాక్‌లోని అతి పెద్ద వైమానిక స్థావరం బాలాద్లో అమెరికా సిబ్బందికి భద్రతను పెంచింది. రాత్రి పూట నిఘా పెంచింది. తనిఖీలు చేపడుతోంది. ఇరాన్‌కు ప్రాణస్నేహితుడినవుతా: ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలను త్యజిస్తే గొప్ప దేశంగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అణ్వాయుధాలను వదిలిస్తే ఇరాన్‌కు ప్రాణ స్నేహితుడిని అవుతా. ఇదే జరిగితే ఇరానియన్లు ధనవంతులుగా మారి సంతోషంగా ఉంటారు. ఇరాన్‌ను మళ్లీ గొప్పగా చేద్దాం’ అని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలుండటాన్ని అంగీకరించబోమన్నారు. యుద్ధపిపాసి అన్న వారే తనను ఇప్పుడు శాంతి కపోతంగా అభివర్ణిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. విమానాలు దారి మళ్లిస్తున్న భారత్ న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇరాన్ గగనతలంలోకి మన దేశానికి చెందిన విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించారు. ఆ విమానాలన్నింటినీ దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. ‘‘అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే అన్ని విమానయాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన శాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విమానాలను దారి మళ్లిస్తాం‘‘ అని ట్వీట్ చేశారు. బాలాకోట్ దాడుల తర్వాత ఇప్పటికే పాకిస్తాన్ గగనతలం మీదుగా మన విమానాలేవీ ప్రయాణించడం లేదు. ఇప్పుడు ఇరాన్ మీదుగా వెళ్లకుండా నియంత్రణలు విధిస్తే అమెరికా, యూరోప్ దేశాలు, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల పరిస్థితి గందరగోళంలో పడుతుందని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని లోహాని వ్యాఖ్యానించారు. -
‘మీరు యుద్ధం ప్రారంభిస్తే.. మేం ముగిస్తాం’
టెహ్రాన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతకొంత కాలంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ట్విటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇరాన్ సైన్యాధికారి మేజర్ జనరల్ (ఎలైట్ రివల్యూషనరీ గార్డ్) ఖ్వాసీం సోలిమని డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను కించపిరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్రం పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. అతను శుక్రవారం మీడియా మాట్లాడుతూ...‘అమెరికా మాకు చాలా దగ్గరగా ఉంటుంది, మీరు ఉహించని రీతిలో మా సైన్యం మీ ముందుంటుంది. మీరు యుద్ధం ప్రారంభిస్తే మేం ముగిస్తాం. ఇరాన్ యుద్ధం చేస్తే మీరు సర్వం కోల్పోతారన్న విషయం మీకు బాగా తెలుసు. ఇరాన్‌పై మీరు చేస్తున్న బెదిరింపు వ్యాఖ్యలపై ఓ సైన్యాధికారిగా స్పందించాల్సిన అవసరం నాకుంది. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలనుంటే నాతో మాట్లాడండి. మా దేశ అధ్యక్షుడితో కాదు. మీతో మాట్లాడితే మా దేశ అధినేతకి గౌరవంగా ఉండదు’ అంటూ సోలిమాని ట్రంప్‌ను హెచ్చరించాడు. ఇరాన్‌కు వ్యతిరేకంగ ట్రంప్ కుట్ర పన్నుతున్నారని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు హాసన్ రౌహానీ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పులితో ఆటలొద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే యుద్దాల తల్లితో పోరాడటమే అంటూ ట్రంప్‌ను హెచ్చరించారు. నేనేమే తక్కువ తినలేదంటూ ట్రంప్ కూడా అంతే రీతిలో స్పందించారు. అమెరికాను ఇప్పటికి, ఎప్పటికి ఎవ్వరు ఏం చేయలేరని, అమెరికాతో జాగ్రత్తగా ఉండాలంటూ రౌహానీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ప్రచ్చన యుద్ధం కొనసాగుతూనే ఉంది. -
40 ఏళ్లుగా సహించాం.. ఇక చాలు!
టెహ్రాన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీలు వరుస ట్వీట్లతో పరస్పరం హెచ్చరికలు చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జావేద్ జరీఫ్ స్పందించారు. బీ కేర్‌ఫుల్... ‘అస్సలు నచ్చడం లేదు.. కొన్ని నెలల క్రితం సంభవించిన అతి పెద్ద పేలుడు శబ్దాన్ని ప్రపంచ మొత్తం విన్నది. ఇరానియన్లు కూడా ఆ శబ్దాలను విన్నారు. నాగరిక ప్రపంచంలో 40 ఏళ్లుగా ఇలాంటి శబ్దాలు వింటూనే ఉన్నాం. ఇక చాలు.. ఎన్నో సామ్రాజ్యాలు కుప్పకూలి పోవడం మేము కళ్లారా చూశాం. అంతేకాదు మేము తలచుకోవడం వల్ల కొన్ని దేశాలు ఉనికి లేకుండా పోయాయి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు. కాగా పెద్దపులితో ఆటలు వద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంతతేలిక కాదని హసన్ రౌహానీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. COLOR US UNIMPRESSED: The world heard even harsher bluster a few months ago. And Iranians have heard them —albeit more civilized ones—for 40 yrs. We’ve been around for millennia & seen fall of empires, incl our own, which lasted more than the life of some countries. BE CAUTIOUS! — Javad Zarif (@JZarif) July 23, 2018 -
బయపెట్టాలని చూడకు : ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికాను బెదిరించాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీని ట్విటర్లో హెచ్చరించాడు. పులితో ఆటలు వద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంత సులువైనది కాదని ఆదివారం హసన్ రోహనీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. హసన్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. ‘అమెరికాను బెదిరించాలని చూడకండి. మీరు బెదిరిస్తే భయపడే దేశం కాదు మాది. అమెరికా ఎప్పటికి, ఎవరికి బయపడదు. మాజోలికి వస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామలు చూడాల్సి వస్తుంది. అమెరికాతో జాగ్రత్తగా వ్యవహరించడండి’ అంటూ ట్రంప్ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇరాన్ ఉగ్రవాదుల ముఠాకు సహకరిస్తోందన్న ఆరోపణలతో 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించి, రాజకీయంగా ఒత్తిడి తేచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇరాన్ యుద్దాలకు పుట్టినిళ్లలని.. ఇరాన్‌తో యుద్ధ అంతసులువైనది కాదని ఇటీవల రౌహనీ అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే. -
పులితో ఆటలొద్దు.. ట్రంప్‌కు వార్నింగ్
టెహ్రాన్ : పులితో ఆటలు వద్దని ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కొనసాగిస్తున్న విరుద్దమైన విధానాలకు స్వస్తి చెప్పాలని రౌహనీ పేర్కొన్నారు. ఇరానియన్ దౌత్యవేత్తల సమావేశంలో ఆదివారం రౌహనీ ప్రసంగిస్తూ.. ‘ఇరాన్‌తో యుద్దం అంటే యుద్దాల తల్లితో పారాడమే. మాతో యుద్దం అంత సులువైనది కాదు. శాంతికి మారుపేరు ఇరాన్ అన్న విషయం అమెరికాకు తెలుసు. యుద్దానికి ప్రతీరూపం కూడా ఇరాన్ అనే విషయం ట్రంప్ తెలుసుకుంటే మంచిది’ అని రోహనీ పేర్కొన్నారు. 2015లో ఇరాన్ ప్రవేశపెట్టిన న్యూక్లియర్ ఒప్పందాన్ని అమెరికా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా ఇరాన్‌పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించి, రాజకీయంగా ఒత్తిడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ భద్రత, ప్రయోజనాలను ప్రేరేపించే స్థితిలో అమెరికా లేదని రోహనీ అన్నారు. ఇస్లామిక్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వాషింగ్టన్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాగా ఇరాన్ మిలిటెంట్ గ్రూప్స్‌కు సహకరిస్తోందని గతంలో అమెరికా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానికి వ్యతిరేకంగానే ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుందని వైట్‌హౌస్ గతంలో ప్రకటించింది. -
బలపడవలసిన బంధం
భారత్–ఇరాన్‌ల మధ్య చిరకాల స్నేహబంధం ఉన్నా తరచుగా వచ్చిపడే సమస్య లతో అది ఒడిదుడుకులే ఎదుర్కొంటున్న దశలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ మూడు రోజులు భారత్‌లో పర్యటించడంతోపాటు వివిధ రంగాల్లో తొమ్మిది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మన దేశం ఆధ్వర్యంలో ఇరాన్లో చాబహార్ ఓడరేవు నిర్మాణం తొలి దశ గత డిసెంబర్లో పూర్తయింది. దాని కార్యకలాపాల నిర్వహణలో పాలుపంచుకోవడం, సరుకులపై ద్వంద్వ పన్నుల నివారణ, వైద్యం, ఇంధన రంగాల్లో సహకారం, నేరస్తుల అప్పగింత తదితర ఒప్పందాలు ఇప్పుడు కుదిరాయి. మన దేశంతో ఉన్న చెలిమికి ఇరాన్ ఆదినుంచీ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఉగ్రవాదం విషయంలో మన దేశం వైఖరికి మద్దతు పలుకుతోంది. భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం రావాలని కోరుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో ఆ దేశంలో పర్యటించాక దానికి కొనసాగింపుగా రౌహాని ఇక్కడికొచ్చారు. ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చి వెళ్లిన నెల రోజులకు ఈ పర్యటన జరిగింది. పరస్పరం శత్రు దేశాలుగా భావించుకుంటున్న రెండు దేశాలతో ఏకకాలంలో మిత్రత్వం నెరపడం కాస్త కష్టమైన విషయమే. లౌక్యంగా వ్యవహరించడం, ఎవరి దగ్గర వారి మాట మాట్లాడటం, సర్ది చెప్పడానికి ప్రయత్నించడం వంటివి ఎల్ల కాలమూ ఉపయోగపడవు. దానికి పరిమితులు ఉండి తీరతాయి. అటు పాకి స్తాన్తోనూ, ఇటు భారత్‌తోనూ స్నేహాన్ని కొనసాగించడం... అదే సమయంలో పాక్‌కు సైనిక సాయం అందిస్తుండటం, ఇద్దరికీ ఆయుధాలు అమ్మడం ఒక్క అమెరికాకే చెల్లింది. ఇరాన్‌కు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఇరాక్, సిరియా, టర్కీ, అజర్బైజాన్లు ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్నాయి. ఇరాక్‌తో కొన్ని దశాబ్దాల క్రితం ఇరాన్‌కు పొరపొచ్చాలు రావడం... అవి యుద్ధానికి దారి తీయడం చరిత్ర. ఇప్పుడవి మిత్ర దేశాలే. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమ న్‌లకూ... ఇరాన్‌కూ మధ్య పర్షియన్ జలసంధి ఉంది. అయితే పరస్పరం సరి హద్దుల్లేని ఇజ్రాయెల్‌తో, అసలు పశ్చిమాసియాకు దరిదాపుల్లోనే లేని అమెరికాతో దానికి శత్రుత్వం అధికం. ఈ శత్రుత్వం అన్ని ప్రపంచ దేశాలతోపాటు మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. సమస్యంతా ఇదే. జార్జి బుష్ పాలనలో, ఒబామా తొలి దశ పాలనా కాలంలో ఇరాన్‌తో మన దేశం చెలిమికి అమెరికా నుంచి ఆటం కాలెదురయ్యాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి పూనుకుంటున్నదని ఆరో పించి అమెరికా ఆంక్షలకు దిగింది. అనంతరకాలంలో భద్రతామండలి ద్వారా కూడా వాటిని అమలు చేయించింది. మన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ఈ ఆంక్షలు పెద్ద ఆటంకంగా మారాయి. అలాగే మన దేశం నుంచి ఇరాన్‌కు అందాల్సిన సాయాన్ని అడ్డుకున్నాయి. చమురు, గ్యాస్, పెట్రో కెమికల్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు కూడా అవి అవరోధమయ్యాయి. వీటి పర్యవసానంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతోపాటు అక్కడి ప్రజానీకం పడరాని పాట్లు పడ్డారు. ఔషధాలు, వైద్య పరికరాలపై ఆంక్షలు లేవని చెప్పినా, చెల్లింపుల మార్గాలన్నీ మూతపడటంతో అవి కూడా నిలిచిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. చాబహార్ ఓడరేవు నిర్మాణానికి మన దేశం దాదాపు ఒప్పందం ఖరారు చేసుకోబోతుండగా అది కాస్తా నిలిచిపోయింది. ఇలాంటి సమ యంలో సైతం ఇరాన్ మన దేశాన్ని అర్ధం చేసుకుంది. ఒబామా తన పాలన ముగు స్తున్న దశలో మరో అయిదు దేశాలను కలుపుకొని ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆంక్షల సడలింపు మొదలైంది. ఇరాన్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు లభించాయని ప్రపంచ దేశాలతోపాటు మన దేశం కూడా అంచనా వేస్తున్న తరుణంలో ఒబామా అనంతరం అమెరికాలో ట్రంప్ ఏలుబడి ప్రారంభమైంది. మళ్లీ అనిశ్చిత వాతావరణం అలుముకుంది. ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని సవరించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. అందుకు అంగీకరిం చకపోతే ఒప్పందం నుంచి వైదొలగుతామని బెదిరిస్తున్నారు. ఒకప్పుడు అమెరికా చెప్పినదానికల్లా వంతపాడే అలవాటున్న బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు ఇప్పటికైతే ట్రంప్ తీరును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అకారణంగా పేచీకి దిగి పెట్టుబడులు పెట్టడానికొచ్చిన విస్తృత అవకాశాలకు ఆయన గండి కొడుతున్నారని ఆరోపిస్తున్నాయి. అయితే ఆ ఒప్పందానికి రేపు మే నెలలో ట్రంప్ మంగళం పాడితే ఏం చేస్తాయన్నది చూడాలి. మాట నిలకడలేని ట్రంప్ వెనక చేరి నష్టపోవడానికి అవి సిద్ధపడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తన మిత్రులెవరో, గోడ మీద పిల్లివాటంగా మిగిలేదెవరో తేల్చుకోవడానికి ఇరాన్ సమాయత్తమవు తోంది. అందుకే రౌహానీ భారత్ పర్యటనకొచ్చారు. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. ఇటీవల తన ఎఫ్–16 విమానాన్ని సిరియా కూల్చేశాక ఆగ్రహించిన ఇజ్రాయెల్... దీని వెనక ఇరాన్ హస్తమున్నదని ఆరోపించింది. ఇక సిరియాతో కాక నేరుగా ఇరాన్‌తోనే తల పడతామంటున్నది. ఉన్నకొద్దీ ఈ ఘర్షణ వాతావరణం పెరిగేలా ఉంది తప్ప చక్క బడే సూచనలు కనిపించడం లేదు. కారణాలు వేరే కావొచ్చుగానీ చాబహార్ పనులు నత్తనడకన సాగడం వెనక అమెరికా ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానం ఇరాన్‌కు కలి గింది. మన దేశం వెనకడుగేస్తే సాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉంది. అలాగే చైనా, రష్యాలు పాక్ సహకారంతో అఫ్ఘాన్‌లో శాంతి స్థాపనకు చేస్తున్న యత్నాలపైనా ఇరాన్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం స్వీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమీయాలి. ఇరాన్‌తో మనకున్న సంబంధాల విషయంలో అమెరికాకు అసం తృప్తి ఉన్నా, ఇజ్రాయెల్, సౌదీలకు అభ్యంతరాలున్నా ఆదినుంచీ మనతో చెలిమికి ప్రాధాన్యమిస్తున్న ఇరాన్‌తో దౌత్యబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం అన్ని విధాలా అవసరం. రౌహానీ పర్యటనతో ఇరు దేశాల మధ్యా అపోహలన్నీ తొలగి, దృఢమైన సంబంధాలకు పునాది పడిందని ఆశించాలి. -
భారత్‌కు పెట్రోల్, గ్యాస్ అమ్మేందుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి పెట్రోల్, గ్యాస్ విక్రయించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రకటించారు. తమ దేశంలో చబహార్ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రౌహనీ శుక్రవారం చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా నంటూ రౌహనీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐక్యత లేకపోవడం వల్లే.. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించే సాహసం చేసిందని రౌహనీ విమర్శించారు. ముస్లింల మొదటి కిబ్లా(నమాజ్ చేసే వైపు) ఇప్పుడు ఇజ్రాయెల్ అధీనంలో ఉండటానికి ఇస్లామిక్ దేశాల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమన్నారు. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేనందున అమాయక పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంద న్నారు. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికాలో మానవత్వం మంటగలుస్తోందని, అమెరికాలోని విద్యాలయాలు, వ్యాపార సంస్థల్లో అమాయకులపై దాడులు సర్వసాధారణం అయ్యాయన్నారు. ఇస్లామిక్ దేశాలు తమ వ్యక్తిగత విశ్వాసాలు, నమ్మకాలను పక్కన పెట్టి ఇస్లాం ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూస్తున్నాయని ఇది సరికాదన్నారు. ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని పాటించే వారని, ఇస్లాం వైషమ్యాలను, భయాందోళలను సృష్టించే మతం కాదని చెప్పారు. ఇరు దేశాల మధ్య కొత్త శకం.. భారత్–ఇరాన్ మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమవుతోందని రౌహనీ చెప్పారు. భారత్–ఇరాన్ మధ్య దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు ఉన్నాయని, భారత్‌తో వ్యాపార, దౌత్య సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు వెస్ట్రన్ ఆసియా దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల ఎదుగు దలకు దోహదం చేస్తాయన్నారు. భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటి దని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నా యని పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని రౌహనీ సూచించారు. భారత్‌లో అన్ని వర్గాల మధ్య శాంతి, సామరస్యం ఎప్పటికీ కొన సాగాలని ఆకాంక్షించారు. పలు దేశాలు ఇరాన్ ప్రజలకు వీసాల జారీలో జాప్యం చేస్తున్నాయని, ఇరాన్ మాత్రం అన్ని దేశాలు ప్రత్యే కించి భారత ప్రజలకు వీసాల జారీని సులభతరం చేసిందన్నారు. -
కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శించిన రౌహానీ
సాక్షి, హైదరాబాద్ : ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ రెండో రోజు నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రౌహనీ సందర్శించారు. కుతుబ్‌షాహీ సమాధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్కామసీదుకు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. స్వాతంత్ర్యం అనంతరం మక్కామసీదును సందర్శించిన తొలి విదేశీ దేశాధినేత హసన్ రౌహానీయే కావడం విశేషం. రెండురోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ముస్లిం ప్రముఖులు, రాజకీయనాయకులు, విద్యావేత్తలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహనీ రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం, శుక్రవారం ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు గల ప్రాంతాలు: - గురువారం మధ్యాహ్నం 3.55 నుంచి 4.40 గంటల వరకు బేగం పేట విమానాశ్రయం- హాటల్ తాజ్‌కృష్ణ మధ్య - శుక్రవారం ఉదయం 10.15 నుంచి 11 గంటల వరకు హాటల్ తాజ్‌కృష్ణ- సాలార్జంగ్ మ్యూజియం మధ్య, - శుక్రవారం మధ్యాహ్నం 12.15 నుంచి 12.50 గంటల వరకు సాలార్జంగ్ మ్యూజియం-మక్కా మసీదు - శుక్రవారం మధ్యాహ్నం 1.15 నుంచి 2.05 వరకు మక్కా మసీదు-హోటల్ తాజ్ కృష్ణ - శుక్రవారం సాయంత్రం 5.35 నుంచి 5.50 వరకు తాజ్‌కృష్ణ- బేగంపేట విమానాశ్రయం మధ్య ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. నేడు ఇరాన్ అధ్యక్షుడు రాక ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. హసన్ రౌహాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మక్కా మసీదులో శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో పర్యటించనున్న ఇరాన్ ప్రసిడెంట్
-
ఇరాన్ అధ్యక్షుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అధ్యక్షుడు డా.హసన్ రౌహనీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో(15, 16 తేదీల్లో) రౌహనీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయంలో కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ జోషి ఆదేశించారు. రౌహనీకి బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్ స్వాగతం పలుకుతారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇరానియన్లతో సమావేశం.. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్మద్ హఘ్బిన్ ఘోమీ మాట్లాడుతూ, తమ దేశాధ్యక్షుడి పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అతితక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి పర్యటనలో 21 మంది ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఇరానియన్లతో రౌహనీ సమావేశమవుతారని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, నగర పోలీస్ కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, హైదరాబాదు కలెక్టర్ యోగితారాణా, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్ డీజీ అంజనీ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ ఈ.విష్ణువర్థన్‌రెడ్డి, ఫైర్ సర్వీసెస్ డీజీ రాజీవ్ రతన్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు నగరానికి ఇరాన్ అధ్యక్షుడు
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఈ నెల 15న హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. ఆయన భారత దేశ పర్యటనలో భాగంగా తొలుత నగరానికి వస్తున్నారు. సాధారణంగా దేశ పర్యటనకు వచ్చే విదేశీ అధ్యక్షులు మొదట దేశ రాజధానికి వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు వేళ్లడం పరిపాటి. కానీ, నగరంతో ఇరానీలకు ఉన్న అనుబంధం వల్ల మొదట హైదరాబాద్‌కు వస్తున్నట్లు ఇరాన్ కాన్సులేట్ అధికారులు తెలిపారు. అదేవిధంగా నగరంలోని షియా, సున్నీల మధ్య ఐక్యత కోసం ఆయన ఇక్కడ పర్యటించనున్నారని కాన్సులేట్ మీడియా కో ఆర్డినేటర్ వివరించారు. నగరంలో రెండు రోజులు ఉంటారు. ఈ నెల 15న (గురువారం) సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు షియా, సున్నీ మతగురువులు, విద్యావేత్తలు, మేధావులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. అదే రోజు రాత్రి నగరంలోని షియా ప్రముఖులతో బంజారాహిల్స్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో సమావేశం అవుతారు. 16న చారిత్రక మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం ప్రసంగిస్తారు. ఇరాన్‌తో నగరానికి 450 ఏళ్ల అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాన్‌తో 450 ఏళ్ల అనుబంధం ఉంది. నగర నిర్మాణం ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగర నమూనా మాదిరిగా ప్రముఖ అర్కిటెక్ట్ మీర్ మొమిన్ నిర్మించారు. గతంలో హైదరాబాద్ నగరాన్ని పాలించిన కుతుబ్ షాహీ పాలకులు ఇరాన్ నుంచి వచ్చినవారే. ఇంతకు ముందు 2004 జనవరి 28న అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ ఖాతిమీ నగర పర్యటనకు వచ్చారు. ఇప్పటి వరకు నగర పర్యటనకు ఇద్దరు ఇరాన్ అధ్యక్షులు మాత్రమే వచ్చారు. ఇప్పటి వరకు అరబ్బు దేశాలతో పాటు వివిధ ముస్లిం దేశాల అధ్యక్షులు నగర పర్యటనకు వచ్చారు. అయితే మక్కా మసీదులో విదేశీ అధ్యక్షుడు ప్రసంగం చేయడం మాత్రం ఇదే తొలిసారి. నగరంతో పాటు మక్కా మసీదు నిర్మాణం ఇరాన్ దేశస్థులైన కుతుబ్ షాహీ వంశస్థులే నిర్మించినందున విదేశీ అధ్యక్షుడికి మక్కా మసీదులో ప్రసంగించే అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. -
16న హైదరాబాద్‌కు ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ మొట్టమొదటిసారి భారత్‌కు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత మక్కా మసీదును సందర్శించనున్నారు. ఫిబ్రవరి 16న మక్కా మసీదులో జరిగే నమాజ్–ఇ–జుమ్మా సామూహిక ప్రార్థనల్లో రౌహనీ పాల్గొంటారని మసీదు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రౌహనీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
హింసాత్మకంగా మారిన ఇరాన్
టెహరాన్: ఇరాన్లో తాజాగా మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇస్ఫహాన్ రాజధాని క్వాడెరిజన్ సోమవారం రాత్రి జరిగిన అల్లర్లలో 13 మంది మరణించారు. సాయుధులైన కొందరు ఆందోళనకారులు సైనిక శిబిరాలు, పోలీస్స్టేషన్లపై దాడికి దిగడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ ఘటనతో ఇప్పటివరకూ చనిపోయినవారి సంఖ్య 21కి చేరుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను నిరోధించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. కాగా, 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు ఇరాన్లో పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తూ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు రావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కొంతమంది ప్రభుత్వం గద్దెదిగి పోవాలంటూ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా.. సోషల్‌మీడియాలో అది విపరీతంగా చక్కర్లు కొట్టింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. ఇలాఉంచితే 2013లో అధికారంలోకి వచ్చిన రౌహాని...ఆర్ధిక వ్యవస్థను తీర్చిదిద్దుతానని, సామాజిక సంఘర్షణలు తగ్గుముఖం పట్టేలా చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ఒకవైపు ప్రజల జీవన వ్యయంతోపాటు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. ఇదే దేశంలో అశాంతికి కారణమైంది. 450 మంది అరెస్టు ఇలాఉంచితే గడచిన మూడురోజుల వ్యవధిలో ఇరాన్ ప్రభుత్వం 450 మందిని అరెస్టు చేసింది. రాజధానిలో అల్లర్లకు పాల్పడేవారి విషయంలో జోక్యం చేసుకోవాల్పిందిగా రెవల్యూషనరీ గార్డులను అదుపులోకి తీసుకొచ్చింది. -
12 మంది మృతి.. అట్టుడుకుతున్న ఇరాన్
టెహ్రాన్ : ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలంటూ ఆందోళనకారులు రోడ్డెక్కగా.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పటంతో పోలీసులు కాల్పులకు దిగారు. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో 12 మంది పౌరులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇజే పట్టణంలో శనివారం పోలీస్ కాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్లు ఎంపీ హదయాతుల్లా ఖదెమి వెల్లడించారు. కాగా, 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు ఇరాన్లో పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తూ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు.. ప్రభుత్వం గద్దెదిగి పోవాలంటూ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా.. సోషల్‌మీడియాలో అది విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో నిరసనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన వస్తోంది. ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ ఆపై మీడియాతో మాట్లాడారు. నిరసనలు తెలపటం తప్పు కాదని.. అలాగని శాంతి భద్రతలకు భంగం కలిగించటం, ప్రభుత్వ- ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం చూస్తూ సహించే ప్రసక్తే లేదని రౌహానీ ఆందోళనకారులను హెచ్చరించాడు. అమెరికా హెచ్చరిక ఇక ఇరాన్ లో నెలకొన్న ప్రతిష్టంభనపై అమెరికా స్పందించింది. పరిణామాలు చక్కబెట్టుకోకపోతే అంతర్జాతీయ సమాజం తరపున తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని యూఎస్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇక ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్ కూడా ఈమేరకు ట్వీట్ కూడా చేశారు. ప్రపంచం మిమిల్ని గమనిస్తోంది.. ప్రజలకు శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. Many reports of peaceful protests by Iranian citizens fed up with regime’s corruption & its squandering of the nation’s wealth to fund terrorism abroad. Iranian govt should respect their people’s rights, including right to express themselves. The world is watching! #IranProtests — Donald J. Trump (@realDonaldTrump) 30 December 2017 -
‘చాబహర్’ను ప్రారంభించిన ఇరాన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక సాయంతో ఇరాన్లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఆదివారం ప్రారంభించారు. ఈ వ్యూహాత్మక పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలుకలుగుతుంది. ఈ పోర్టు వల్ల ఇరాన్, భారత్, అఫ్గాన్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. ఇరాన్‌లోని సిస్టాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. అలాగే చైనా పెట్టుబడులతో పాకిస్తాన్లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు ఇది కౌంటర్‌గా కూడా ఉపయోగపడనుంది. చాబహర్ ప్రారంభోత్సవంలో షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. అలాగే భారత్–ఇరాన్–అఫ్గాన్ మంత్రుల స్థాయి సమావేశం చాబహర్లో జరిగింది. పోర్టులు, రోడ్, రైల్ సహా అనుసంధానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.