టెహ్రాన్ : ఇరాన్‌లో మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు కల్పించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ పిలుపునిచ్చారు. గురువారం టెహ్రాన్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో అష్రాఫీ మృతిపై హసన్ రౌహానీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన పరువు హత్యగా పేర్కొన్నారు. ఇలాంటివి చోటుచేసుకోకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హింస నుంచి మహిళలను రక్షించే బిల్లును "వేగవంతమైన అధ్యయనంగా ధృవీకరించాలంటూ' ఆదేశించారు. మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌కు చెందిన 14 ఏళ్ల అమ్మాయి తండ్రి చేతిలో దారుణహత్యకు గురవడం దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.(ఒక్కరోజే 114 మంది పోలీసులకు కరోనా)
ఇరాన్‌కు చెందిన రోమినా అష్రాఫీ అనే 14 ఏళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి నార్త్ ఇరాన్‌లోని తాలేష్ కౌంటీ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల వ్యక్తిని కలిసింది. విషయం తెలుసుకున్న అష్రాఫీ తండ్రి రోమినాను ఇంటికి ఈడ్చుకొచ్చి కొడవలితో దారుణ హత్యకు పాల్పడ్డాడు. అష్రాఫీ దారుణ హత్యపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా చానెళ్లు ప్రత్యేక కవరేజీ అందించాయి. దీంతో పోలీసులు రోమీనా తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రోమినాను కలిసిన 29 ఏండ్ల వ్యక్తిపై కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియదు.
మరోవైపు ఈ ఘటనను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది.'మహిళలు / బాలికలపై జరుగుతున్నహింస పట్ల శిక్షలను మరింత కఠినతరం చేయాలని మేము ఇరాన్ అధికారులను, చట్టసభ సభ్యులను కోరుతున్నాము. మరణశిక్షను ఆశ్రయించకుండా, నేరం యొక్క తీవ్రతకు అనులోమానుపాతంలో జవాబుదారీతనం ఉండేలా వారు శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 301 ను సవరించాలి' అంటూ అమ్నెస్టీ గురువారం ట్విటర్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment