Honor killing
-
కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో నరికి
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందని, అక్కపై కక్ష పెంచుకున్న తమ్ముడు ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. స్కూటీపై వెళుతున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. కిందపడిపోయిన ఆమె మెడ, చెంప భాగంలో వేట కొడవలితో దాడి చేశాడు. రక్తపు మడుగులో విలవిల్లాడిన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. రాయపోల్‌కు చెందిన కొంగర నాగమణి (27) హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఏడేళ్ల క్రితమే ఈమెకు వివాహం జరగగా, కొద్దిరోజులకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ను ప్రేమించి గత నెల 10న యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకుంది. ముందుజాగ్రత్తగా తమకు రక్షణ కల్పించాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చజెప్పారు. అనంతరం దంపతులు మన్సురాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఊరిలో తమ కుటుంబ పరువు తీసిందని నాగమణిపై కక్ష పెంచుకున్న ఆమె తమ్ముడు పరమేశ్ అవకాశం కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు. విధులకు వెళ్తుండగా.. తన తల్లిదండ్రులు హంసమ్మ, సత్తయ్యను చూసేందుకు శ్రీకాంత్ రెండురోజుల క్రితం భార్య నాగమణితో కలిసి రాయపోల్ వచ్చాడు. సోమవారం ఉదయం హయత్‌నగర్ పీఎస్‌లో విధులకు హాజరయ్యేందుకు నాగమణి ఒక్కరే స్కూటీపై బయలుదేరారు. ఊరు దాటగానే అప్పటికే దారికాచిన పరమేశ్ కారులో వెంబడించాడు. మన్నెగూడ సబ్ స్టేషన్ జంక్షన్ వద్ద స్కూటీని కారుతో వేగంగా ఢీకొట్టి, కిందపడిన ఆమెపై దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరమేశ్ వెంటాడుతున్నాడని చెప్పింది నాగమణి, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాలుగేళ్లు హాస్టల్లో ఉండి చదువుకుందని, ఆ సమయంలో అన్నీ తానై చూసుకున్నానని శ్రీకాంత్ తెలిపారు. యాదగిరిగుట్టలో తమ వివాహం జరిగిందని, నాగమణి పేరున ఉన్న ఎకరా భూమి తమకు వద్దని చెప్పామని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా కనికరం లేకుండా అక్కను చంపాడని రోదించారు. పరమేశ్ తనను వెంటాడుతున్నాడని నాగమణి ఫోన్ చేసి చెప్పిందని, వెంటనే తన సోదరుడిని పంపించినా అప్పటికే దారుణం జరిగిపోయిందని వాపోయారు. మా కుమారుడికి ప్రాణహాని ఉంది సొంత అక్కనే చంపిన పరమేశ్‌తో తమ కుమారుకు శ్రీకాంత్‌కు ప్రాణహాని ఉందని హంసమ్మ, సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను కూడా పరమేశ్ చంపేస్తాడంటూ రోదించారు. అతనికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సీపీఎం నేతలు వీరికి మద్దతు తెలిపారు. కాగా పరారీలో ఉన్న పరమేశ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. స్కూటీని ఢీ కొట్టినప్పుడు కారు నంబర్ ప్లేట్ ఘటనా స్థలంలో పడిపోయిందని, హత్యకు వాడిన కత్తి (వేట కొడవలి)తో పాటు నంబర్ ప్లేట్‌ను స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారాలే హత్యకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నామని సీఐ స్పష్టం చేశారు. అయితే నాగమణిని హత్య చేసిన తర్వాత పరమేశ్ నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడని చెబుతుండటం గమనార్హం. -
నెల్లూరు జిల్లాలో పరువు హత్య
కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.పూడ్చిపెట్టి.. పైన కంప వేసి.. శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు. తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.దీంతో తహసీల్దార్ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు. -
అవును.. అమ్మే భార్గవికి ఉరేసింది
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం దండుమైలారంలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా తేల్చారు. భార్గవి(19)ని తల్లే చంపిందని.. ప్రియుడితో కలిసి కూతురు కనిపించేసరికి భరించలేక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు నిర్ధారించారు. దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య, జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్గవి హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల భార్గవి తల్లిదండ్రులు మేనబావను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తాను స్థానికంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. అతన్నే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మూడు రోజులపాటు భార్గవి కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సదరు యువకుడు.. భార్గవి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తెపై తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిందని, చీరతో ఉరి వేసి హతమార్చింది. ఈలోపు భర్త, కొడుకు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయినట్లు నటించి.. కూతురిని ఎవరో చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. అక్కను తల్లే చంపి ఉంటుందని భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తాను చంపలేదని జంగమ్మ, తన భార్య చంపి ఉండకపోవచ్చని ఆమె భర్త వాదించారు. ఈ క్రమంలో ప్రియుడి పాత్రపైనా పోలీసులు అనుమానాలు మళ్లాయి. అయితే.. తమదైన శైలిలో ఈ కేసును విచారించగా.. చివరకు కూతురిని తానే ఉరేసి చంపిటనట్లు జంగమ్మ అంగీకరించింది. -
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో పరువు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సం చదువుతున్న భార్గవి, శశి అనే యువకుడు కొద్ది రోజలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక, వీరి ప్రేమ విషయమై గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శశితో మాట్లాడటం, కలవడం మానేయాలని తన తల్లి జంగమ్మ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భార్గవి ఇంట్లో ఉన్న ఉండగా శశి ఇటీవలే ఆమె ఇంటికి వచ్చాడు. ఈ విషయం భార్గవి తల్లికి తెలియడంతో వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్బంగా శశినే పెళ్లిచేసుకుంటానని భార్గవి చెప్పడంతో జంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈలోపు.. సోమవారం భార్గవి తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. భార్గవిని ఎవరో చీరతో ఉరి వేసి చంపినట్టు ఆనవాళ్లను ఆమె సోదరుడు గుర్తించాడు. తన తల్లే భార్గవిని చంపినట్టు అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి జంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, శశి మృతిపై ఆయన తండ్రి మాట్లాడుతూ.. కన్న తల్లి ఎక్కడైనా కూతురును చంపుకుంటుందా?. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. భార్గవి మాత్రం శశిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. నిన్న శశి మా ఇంటికి వచ్చాడు. నా భార్యను చూసిన వెంటనే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాతే ఇలా జరిగింది అని చెప్పారు. -
చెల్లెలి భర్తను నరికి చంపిన యువకుడు
సాక్షి, చైన్నె: తన సోదరిని కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని ఓ అన్న తన స్నేహితులతో కలిసి హతమార్చాడు. ఈ పరువు హత్య చైన్నె శివార్లలో కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని పళ్లికరణై పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. స్థానిక అంబేడ్కర్ వీధికి చెందిన ప్రవీణ్(26) ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఎలిటియన్ పేటకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో ఈ ప్రేమ జంట గత ఏడాది చివర్లో ఇంటి నుంచి పారిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. తమ కుటుంబ పరువును బజారు కీడ్చిన ప్రవీణ్‌పై ఆ యువతి కుటుంబం కక్ష పెంచుకుంది. ఆమె సోదరుడు దినేష్(24) తన మిత్రులతో కలిసి ప్రవీణ్ కదలికలపై నిఘా పెట్టాడు. శనివారం రాత్రి వేళచ్చేరి నుంచి పళ్లికరణై టాస్మాక్ రోడ్డు వైపుగా వెళ్తున్న ప్రవీణ్‌ను దినేష్ తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టాడు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి పడేసి ఉడాయించారు. రక్తపు మడుగులో పడి ఉన్న దినేష్‌ను ఆ పరిసర వాసులు 108లో క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పళ్లికరణై ఇన్స్పెక్టర్ నెడుమారన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. అతడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించింది. ఆ పరిసరాలలోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు పారి పోయిన మార్గంలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయాన్నే దినేష్‌తో పాటు అతడి స్నేహితులు చిత్తాల పాక్కం శ్రీరాం(23), స్టీఫన్(24), విష్ణు రాజు(23), జ్యోతిలింగం(23) మాంబాక్కం వద్ద ఓ చోట తలదాచుకుని ఉండడంతో వారిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. తన చెల్లెల్ని కులాంతరం వివాహం చేసుకున్నందుకే ప్రవీణ్‌ను మట్టుబెట్టినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
ప్రేమ వివాహం.. కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు
తమిళనాడు: తిరుపూర్ జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన పెరుమాళ్ కూతురు ఐశ్వర్య (19). పూవలూరుకు చెందిన భాస్కర్ కుమారుడు నవీన్ (19). డిప్లమో చదివాడు. చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడిన వీరిద్దరూ తిరుపూర్ జిల్లా అరవప్పాలయంలోని ఓ ప్రైవేటు బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు వర్గాలకు చెందిన వీరిద్దరూ గత డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయమై ఐశ్వర్య తండ్రి పెరుమాళ్ పల్లడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ తేదీన పోలీసులు ఐశ్వర్యను తన కుటుంబీకులతో పంపారు. ఈ స్థితిలో గత 3వ తేదీన ఐశ్వర్యని ఆమె తండ్రి, బంధువులు కొట్టి వేధించి హత్య చేసి దహనం చేసినట్లు నవీన్‌కు అతని స్నేహితులు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. ఒరత్తనాడుకు వచ్చిన నవీన్ ఈ విషయాన్ని వట్టతిక్కోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెయ్‌వడుతి, పూవలూరు గ్రామంలో బుధవారం తంజావూరు ఎస్పీ అసిస్రావత్ ఆధ్వర్యంలో పోలీసులు ఐశ్వర్య మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటికను సందర్శించారు. మృతదేహాన్ని దహనం చేసిన తరువాత బూడిద కూడా లేకపోవడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఐశ్వర్య తండ్రి పెరుమాళ్, భార్య రోజా, ఐశ్వర్య అమ్మమ్మ మలర్, అతని సోదరి అగదాసి, 16 ఏళ్లబాలిక సహా 11 మందిని అరెస్టు చేసి విచారణ కోసం వట్టతిక్కోట్టై పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పరారీలో వున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
పరువుహత్య చేసి మొసళ్లకు మేతగా పడేశారు
దేశంలో పరువు హత్యల పరంపరం కొనసాగుతోంది. ప్రేమ, డేటింగ్‌ల పేరుతో తిరిగే జంటలనూ.. చివరకు పెళ్లి చేసుకున్నా కూడా అయినవాళ్లే కనికరించడం లేదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి సంచలనంగా మారిందా రాష్ట్రంలో.. ఎంపీ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించుకున్న జంటను నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపిన పెద్దలు.. మొసళ్లు తిరిగే నదిలో మేతగా పడేశారు. పిల్లలు కనిపించకుండా పోయారంటూ యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. రతన్‌బసాయ్ గ్రామానికి చెందిన శివాని తోమర్, పొరుగు గ్రామం బాలూపూర్‌కు చెందిన రాధేశ్యామ్ తోమర్ పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయి(18) తరపు కుటుంబ సభ్యులు వాళ్ల బంధాన్ని ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన వాళ్లను కాల్చి చంపేసి.. ఆ మృతదేహాలకు బండరాళ్లు కట్టి మొసళ్లు తిరిగే చంబల్ నదీ ప్రాంతంలో పడేశారు. కొడుకు(21), అతను ప్రేమించిన అమ్మాయి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తొలుత వాళ్లు ఎక్కడికైనా పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. అయితే.. వాళ్లు వెళ్లిపోవడం ఎవరూ చూడకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులను పిలిచి గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. సిబ్బంది సాయంతో ముక్కలైన వాళ్ల మృతదేహాలను వెలికి తీశారు స్థానిక పోలీసులు. చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో 2,000 కంటే ఎక్కువ మొసళ్లు ఉంటాయనేది ఒక అంచనా. ఇదీ చదవండి: ముస్లింలే ఛత్రపతి శివాజీని కొనియాడుతున్నారు! -
నా కూతురినే పెళ్లి చేసుకుంటావా.. నీకు ఎంత ధైర్యం
తమిళనాడు: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని కత్తులతో నరికి హత్య చేసిన సంఘటన కృష్ణగిరిలో సంచలనం కలిగించింది. కృష్ణగిరి సమీపంలో వున్న కిడామ్‌పట్టికి చెందిన చిన్నయ్యన్ కుమారుడు జగన్ (28) టైల్స్ అతికించే పనిచేస్తుంటాడు. ఇతను కృష్ణగిరి జిల్లా ములంగళ్‌కు చెందిన శంకరన్ కుమార్తె శరణ్య (21)ను ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారి ప్రేమను ఒప్పుకోలేదు. ఆమెకు మరొక యువకుడితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో జగన్, శరణ్య ఒక క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో శరణ్య కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై కక్ష పెంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జగన్ మోటారు సైకిల్‌పై ధర్మపురి, కృష్ణగిరి రోడ్డులో వెళుతుండగా శరణ్య తండ్రి శంకరన్, తన బంధువుతో కలిసి అతన్ని అడ్డగించారు. కత్తులతో దాడి చేశారు. జగన్ గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కావేరి పట్టణం పోలీసులు అక్కడికి చేరుకుని జగన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. యువకుడి తల్లిదండ్రులు లీసులను అడ్డుకుని న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఎస్పీ సరోజ్‌కుమార్ ఠాగూర్, సహాయ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ తమిళరసి అక్కడికి చేరుకుని హంతకులను త్వరలోనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత మృతదేహాన్ని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్ మామ శంకరన్, బంధువులు అరులు, గోవిందరాజు, తిమ్మరాయ కోసం గాలింపు చర్యలు చేపట్టగా శంకరన్ మంగళవారం రాత్రి కృష్ణగిరి అదనపు మహిళా పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. -
మహారాష్ట్రలో పరువు హత్య
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో వైద్య విద్యార్థిని పరువు హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారంతో తమ పరువు తీసిందనే కోపంతో తండ్రి, సోదరుడు ఇతర కుటుంబసభ్యులు కలిసి ఆమెను ఉరి వేసి చంపి, ఆపై దహనం చేశారు. లిబ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామంలో ఈ నెల 22వ తేదీన ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్) మూడో సంవత్సరం చదువుతున్న శుభాంగి జొగ్‌దండ్‌కు ఇటీవల కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే, తను గ్రామానికే చెందిన మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని శుభాంగి వరుడికి తెలిపింది. పెళ్లి ఆగిపోవడంతో గ్రామంలో పరువు పోయిందని కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 22 రాత్రి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబసభ్యులు కలిసి శుభాంగిని తమ పొలానికి తీసుకెళ్లి తాడుతో ఉరివేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసి, మిగిలిన ఆనవాళ్లను నీళ్లలో పడవేశారు. ఈ మేరకు ఐదుగురిపై హత్య, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఐదేళ్ల కిందటి నాటి అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు. ఐదు సంవత్సరాల కిందట.. 2017 మే నెలలో నరేష్ హత్యకు(పరువు హత్య?) గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ తాజాగా ఈ కేసును కొట్టేశారు జడ్జి బాల భాస్కర్. దీంతో సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక తీర్పుపై నరేశ్ తండ్రి వెంకటయ్య అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, తన పాతికేళ్ల కొడుకును కోల్పోయానంటూ ఆవేదనగా మాట్లాడారాయన. కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ ఘోరంగా హత్యకు గురయ్యాడు. అది స్వాతి తండ్రి పనేనన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా జరిగింది. ఆపై స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రేమకథ విషాదాంతమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ కాలేజీ రోజుల్లో.. లింగరాజుపల్లికి చెందిన స్వాతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో స్వాతి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో ముంబైలో ఉంటున్న నరేష్ తన తల్లిదండ్రుల వద్దకు స్వాతిని తీసుకెళ్లి కులాంతర వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి.. భువనగిరికి రావాలని, ఇక్కడ వివాహం జరిపిస్తానని ప్రేమతో కూతురిని నమ్మించాడు శ్రీనివాసరెడ్డి. అలా వచ్చిన స్వాతి-నరేశ్‌లు వేరయ్యారు. నరేష్ ఏమయ్యాడో.. ఆ తర్వాత జాడ లేకుండా పోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు జూన్ 1 కల్లా నరేష్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది. కాగా నరేష్ హతమార్చినట్టు పోలీసు ఇంటరాగేషన్‌లో స్వాతి తండ్రి అంగీకరించాడు. బంధువు సాయంతో నరేశ్‌ను స్వాతికి చెందిన పొలంలోనే చంపి, దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడని తేలడంతో వాళ్లు గుండెలు పలిగేలా రోదించారు. ఆపై మే 16వ తేదీన నరేశ్ ప్రేయసి స్వాతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె మృతి కేసులోనూ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీళ్లే చేశారనేందుకు సాక్ష్యాలేవి? నరేశ్ హత్య కేసులో నిందితులుగా స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఏ1గా,ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డి ఏ2గా ఉన్నారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నేరం అంగీకరించారు కూడా. అయితే.. కేసు విషయమై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు ఈనెల 9న పూర్తి కావడంతో బుధవారం కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ కేసులో 2018 జులై 31న కేసు అభియోగపత్రాలు పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులే హత్య చేశారనేందుకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటిస్తూ భువనరిగి కోర్టు తీర్పును వెలువరించింది. పోలీసుల దర్యాప్తులో.. 2017 మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్‌లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్‌తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్‌ను తగులబెట్టిన శ్రీనివాస్‌రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగింది కూడా. -
యువకుణ్ణి హతమార్చి.. ఆనక నిప్పంటించారు
కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన గాడిబండ ఆమోస్(26) దారుణ హత్యకు గురయ్యాడు. కల్లూరు మండలం శరీన్ నగర్ శివారులోని హంద్రీ నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమోస్ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. పరువు హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేక మొదట్లో ఘర్షణలు జరిగాయి. దీంతో ఆమోస్ దంపతులు ఊరు వదిలి వచ్చేసి కొన్నాళ్లు ఆదోని, మరికొన్నాళ్లు ఎమ్మిగనూరులో కాపురం చేశారు. రెండేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి కల్లూరు ఎస్టేట్‌లో నివాసముంటూ సిటీ స్క్యేర్ మాల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదృశ్యమైన రెండు రోజులకే.. ఆమోస్ రెండు రోజుల క్రితం అదృశ్యం కాగా.. శనివారం ఉదయం శరీన్‌నగర్ శివారులోని హంద్రీనది ఒడ్డున శవమై కనిపించాడు. జనసంచారం లేని ముళ్లపొదల చాటున మృతదేహం పడివుండగా.. బహిర్భూమికి వెళ్లినవారు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ కేవీ మహేష్, సీఐ శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పరువు హత్యకు మరో ప్రేమ జంట బలి
బస్తీ(ఉత్తరప్రదేశ్): పరువు హత్యకు మరో ప్రేమ జంట బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని పదారియా చేట్‌సింగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వేరే మతం వ్యక్తిని ఇష్టపడిందని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ జంటను హతమార్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజిబుల్లా వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే 18 ఏళ్ల దళిత టీనేజర్ అంకిత్.. ముజిబుల్లా కూతురు అమీనాను ప్రేమించాడు. ప్రేమ వ్యవహారం ఇష్టంలేని అమీనా తండ్రి ముజిబుల్లా కూతురిని వారించాడు. ఎంతకీ వినకపోవడంతో అంకిత్‌ను, అమీనాను హతమార్చారు. రుధౌలీ ప్రాంతంలోని చెరకు తోటలో అమీనాను పాతిపెట్టారు. అంకిత్ మృతదేహాన్ని గుర్తించిన పరాస్నాథ్ చౌదరి పోలీసులకు సమాచారమిచ్చారు. చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. వరుడు దుర్మరణం, వధువుకు తీవ్ర గాయాలు -
సూర్యాపేటలో పరువు హత్య
-
హైదరాబాద్ బేగంబజార్ లో దారుణం
-
హైదరాబాద్‌లో మరో పరువు హత్య? వెంటాడి కత్తులతో..
-
రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!
ఇటీవల దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరువు హత్యల పేరుతో వందలాది మంది యువతీ, యువకులను హత మారుస్తున్నారు. వర్ణం, కులం రెండూ కల్పించబడినవే. మానవుల నుండి మానవులే ఆవిర్భవిస్తారని మానవ పరిణామ శాస్త్రం చెబుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఈ విషయం మీద అనంత పరిశోధన చేశారు. మానవ పుట్టుక మీదా, మానవ పరివర్తన మీదా ఆయన అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. మనుస్మృతి నిర్మించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ కల్పితమైనదని రుజువు చేశారు. 1927 డిసెంబర్ 25వ తేదీ ‘మహద్ చెరువు’ పోరాటంలో భాగంగా మనుస్మృతిని దహనం చేశారు కూడా! ప్రత్యామ్నాయంగా, భారత రాజ్యాంగంలో కులం, మతం, ప్రాంతం, జాతి, భాషలకు సంబంధించి భేద భావం లేకుండా ఎవరు ఎవరినైనా వివాహం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, రిజర్వేషన్లు వంటివాటిని అనుభవిస్తున్నవారే తమ పిల్లలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే సహించలేక వారిని చంపివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కారణం మతవాదులు, కుల వాదులు రాజ్యాంగ సంస్కృతికి భిన్నంగా చేసే ప్రబోధమే కారణం. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని పారశీకుడైన ఫిరోజ్‌ను ప్రేమించి పెళ్లాడింది. కరమ్ చంద్ గాంధీ వారి వివాహాన్ని నిర్వహించారు. అయితే నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనల్లో గానీ, ఆ తర్వాత వచ్చిన పాలకుల కాలంలో కానీ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించలేదు. భారత దేశాన్ని పాలించిన రాజ వంశీకులు మౌర్యులు, మొగలాయీలు, గుప్తులు – అందరూ వర్ణాంతర వివాహితులే. అలాగే హిందూ మతానికి పునాదులు వేసిన వైదిక రుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వంటి వారందరూ వర్ణాంతర వివాహితులే. అయితే వారు సమాజంలో కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించకపోవడం గమనార్హం. ప్రస్తుత కాలంలో సినిమా, పారిశ్రామిక, కళా, క్రీడా రంగాలలో ఉన్నవారు వర్ణాంతరులైనా, కులాంతరులైనా అభినందనీయులే అవుతున్నారు. భారతీయ సినిమా మార్కెట్ విస్తరణ కోసం బ్రాహ్మణ నాయకి, ఒక ముస్లిం హీరోల కెమిస్ట్రీని పెద్ద పెద్ద పోస్టర్లు ఆవిష్కరించి హిందూ, ముస్లిం వర్గాలను థియేటర్‌కు తేగలుగుతున్నారు. అదే వాస్తవ జీవితంలో హిందూ, ముస్లిం వివాహ సందర్భం వస్తే దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం, దళిత కులాల వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటే దళిత యువకుడిని హత్య జేశారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యార్జనావకాశం వల్ల ఈ 70 ఏళ్లలో చదువుకుని అన్ని రంగాల్లో పైకి వస్తున్న దళితులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే స్థాయికి వస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరగడానికి... దళిత, బహుజన, మైనారిటీ వర్గాల్లో పెరుగుతున్న రాజ్యాంగ స్ఫూర్తి; వర్ణ, కులాధిపత్య భావజాలంలో కొట్టు మిట్టాడుతున్న వారి మూఢత్వాల మధ్య తలెత్తుతున్న ఘర్షణే కారణం. ఇప్పటికీ రాజ్యమేలుతున్న మనుస్మృతికి వ్యతిరేకంగా భారతదేశం సెక్యులర్‌గా ఎదగాలంటే బౌద్ధ జీవన వ్యవస్థను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి. కరుణ, ప్రేమ, ప్రజ్ఞ అనే సూత్రాలను ప్రజల మెదళ్లలోకి వెళ్ళేటట్లు చూడాలి. రాజకీయమంటే ఆధిపత్యం కాదు. ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద భావజాల ఆచరణ అని ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో కులాంతర వివాహితులకు పది లక్షల నగదు కానుక, ఉద్యోగావకాశం, భూవసతి, నివాస వసతి కల్పిస్తున్నారు. దీని కొరకు చట్టం తెచ్చారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కులాంతర వివాహితులకు రక్షణ గృహాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కులాంతర, మతాంతర వివాహాలు విస్తరిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగ స్పూర్తితో కులాంతర, మతాంతర వివాహాల వేదికలను ప్రభుత్వమే నిర్వహించవలసిన బాధ్యత ఉంది. అంతే కాకుండా దీని కొరకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. పరువు హత్యలకు పాల్పడిన వారిని ప్రత్యేక కోర్టులో విచారించి మరణ శిక్షను విధించడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తితో కుల నిర్మూలనా భావజాల ఆచరణ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలి. (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) - డా. కత్తి పద్మారావు -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి..
భువనగిరి క్రైం/కొండపాక (గజ్వేల్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్ కుమారుడు ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి ) పలుమార్లు బెదిరించినా ఫలితం లేక.. రామకృష్ణ, భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రెండు నెలల్లోనే రెండుసార్లు వెంకటేశం తన కుమార్తెను వదిలిపెట్టాల్సిందిగా రామకృష్ణను బెదిరించాడు. ఈ క్రమంలో భార్గవి ఆస్తిలో వాటా అడగనంటూ తండ్రికి ఓ పత్రం కూడా రాసిచ్చింది. భువనగిరి తాతానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణ దంపతులకు ఓ పాప (ప్రస్తుతం ఆరు నెలలు) కూడా పుట్టింది. సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుని.. రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది నెలల క్రితమే అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు చెల్లించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా పనిచేయలేదు. మరుసటి రోజు కూడా రామకృష్ణ ఆచూకీ లేకపోవడంతో భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోనె సంచిలో కట్టి, వాహనంలో తరలించి.. లతీఫ్, అమృతయ్యలు రామకృష్ణను గుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు. ఐదు నెలల క్రితమే వ్యూహరచన రామకృష్ణను హత్య చేసేందుకు ఐదు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు సుపారీ కిల్లర్ లతీఫ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11మంది భాగస్వాములు కాగా, లతీఫ్, గోలి దివ్య, అఫ్జల్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు, ఆస్తిలో వాటా కావాలని రామకృష్ణ ఒత్తిడి చేస్తుండడంతోనే అతడిని హత్య చేయాలని వెంకటేశం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రామకృష్ణ హత్యోదంతం బయటకు రాగానే యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లో ఉంటున్న వెంకటేశం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. (చదవండి: బంజారాహిల్స్‌లో భూకబ్జా ముఠా హల్చల్) పూడ్చిన గొయ్యి తవ్వి.. భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు లకుడారం గ్రామ శివారులో శవాన్ని పూడ్డి పెట్టినట్టుగా అందిన సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం లకుడారం శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రైల్వే పనులు జరుగుతున్న చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాల్వలో గొయ్యి తీసి పూడ్చివేసినట్టు అనుమానం రావడంతో సాయంత్రం రామకృష్ణ చిన్నమ్మ కుమారుడు జహంగీర్‌గౌడ్ సమక్షంలో కుకునూరుపల్లి పోలీసులతో కలిసి తవ్వించారు. మృతదేహం కన్పించడంతో బయటకు తీశారు. అది రామకృష్ణదేనని జహంగీర్ నిర్ధారించాడు. కాగా తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ తల్లి కలమ్మ డిమాండ్ చేసింది. నా తండ్రే హత్య చేయించాడు నేను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో నా తండ్రే డబ్బులిచ్చి హత్య చేయించాడు. నా బంధువు మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను నా భర్తకు పరిచయం చేశాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారు. – భార్గవి -
చిత్తూరు జిల్లా పలమనేరులో పరువు హత్య
-
ఒక్కదాన్నే ఉన్నా.. నువ్వు రా; ఇంటికి పిలిపించి కాటికి పంపారు
మండ్య: ప్రేమ పాశంలో చిక్కుకున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలిక చేత తల్లిదండ్రులు ఫోన్ చేసి పిలిపించి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘోరం బుధవారం అర్ధరాత్రి సమయంలో మండ్య నగరంలోని కల్లజళ్ళి లేఔట్‌లోని విశ్వేశ్వర నగరలో చోటు చేసుకుంది. బాధిత యువకుడు అదే ప్రదేశానికి చెందిన సతీష్ కుమారుడు దర్శన్ (17). అదే ప్రాంతంలో ఉండే 10వ తరగతి బాలికతో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తరచూ ఫోన్లతో మాట్లాడడం, బయట కలుస్తూ ఉండేవారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు మండ్య నగరసభ 7వ వార్డు సభ్యుడు, స్థాయి సమితి అధ్యక్షుడైన శివలింగ, ప్రభుత్వ టీచర్ అనురాధ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతనికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలని పథకం వేశారు. ఇంట్లో ఎవరూ లేరని చెప్పించి.. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో బాలిక తల్లిదండ్రులు ఆమె చేత యువకునికి ఫోన్‌చేయించి మా ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు రా అని చెప్పించారు. నిజమేనని నమ్మి దర్శన్ వెళ్లాడు. అతని కోసం కాచుకుని కూర్చున్న బాలిక కుటుంబీకులు అతన్ని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దర్శన్ అరుపులు విన్న చుట్టుపక్కలవారు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పరుగున వచ్చారు. వారి ముందే మళ్లీ కొట్టడంతో అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కల వారితో కలిసి మండ్య మిమ్స్ ఆస్పత్రికి తరలిచారు. కొంతసేపటికి అక్కడ దర్శన్ చనిపోయాడు. దర్శన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండ్య పశ్చిమ విభాగం పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుని మృతికి కారణం అయినవారిని అరెస్టు చేయాలని స్థానికులు డిమాండు చేశారు. చదవండి: దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు -
ప్రేమలో పడితే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రేమలో పడ్డందుకు యువతీయువకుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని ఆటవిక సమాజం అడుగడుగునా జడలువిప్పుతోంది. ప్రేమలో పడిన కారణంగా ఏ వ్యక్తినీ శిక్షించే అర్హత ఎవరికీ లేదంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు విస్పష్టంగా తేల్చి చెప్పింది. ప్రేమలో పడినందుకు దండించడం నేరమని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానం... ఒకరినొకరు ప్రేమించి, జీవితాన్ని పంచుకోవాలని భావించిన యువతీయువకులను దండించడం కోర్టు దృష్టిలో శిక్షార్హమైన నేరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం అత్యంత దారుణమైన నేరమని వ్యాఖ్యానించారు. అసలేం జరిగింది? ప్రేమలో పడ్డ ఓ జంట, ఇల్లు వదిలి పారిపోయారు. వారికి ఓ దళిత బాలుడు సహాయపడ్డాడు. పెద్దల కోపం చల్లారిందని భావించిన ఆ ప్రేమికులు తిరిగి ఊరికి రావడంతో సనాతనవాదులు వారిద్దరినీ, వారికి సాయపడిన బాలుడినీ చెట్టుకి వేలాడదీసి, ఉరివేశారు. ఉరితీసే ముందు ఈ ఇద్దరు బాలురి మర్మాంగాలను కాల్చివేయడం ఆటవిక సమాజపు ఆనవాళ్ళను గుర్తుకు తెస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా మెహ్రాణా గ్రామంలో 1991లో జరిగింది. ఖాప్ పంచాయితీల క్రూరత్వం... ప్రేమించుకొని, పెళ్ళి చేసుకోవాలని భావించి, ఇల్లువదిలి పారిపోయిన బాలికను, ఆమె ప్రియుడినీ, వీరిద్దరికీ సాయపడిన మరో దళిత బాలుడినీ చెట్టుకి ఉరివేసి చంపిన నేరానికి ఎనిమిది మందికి కోర్టు మరణశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవిత ఖైదుని విధించింది. ఆ తరువాత 2016లో అలహాబాద్ హైకోర్టు మరణశిక్ష ను కూడా జీవిత ఖైదుగా మార్చింది. ఈ కేసులో ఖాప్ పంచాయితీకి చెందిన 11 మంది సభ్యుల బెయిలు కోసం పెట్టుకున్న పిటషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ.బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. ‘‘మెహ్రాణా పరువు హత్య’’ఖాప్ పంచాయితీల నేరపూరిత వైఖరిని పరాకాష్టకు చేర్చింది. ఇదే విషయంలో బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్లను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. కోర్టు ఏం చెప్పింది? ఖైదీలతో ముఖాముఖి మాట్లాడాలని ఆగ్రా, మథుర సెంట్రల్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. జైలులో దోషుల ప్రవర్తనపై రికార్డులను రెండు వారాల్లోగా సమర్పించాలని కోరింది. రిపోర్టులో శిక్షాకాలాన్ని కూడా నమోదుచేయాలని తెలిపింది. వీటిని బట్టి ఖైదీలను బెయిలుపై విడుదల చేయడంవల్ల ఏదైనా నష్టమున్నదా అనే విషయాన్ని పరిశీలించనుంది. రైతులకు రక్షణ ఉందా? సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతులను కోవిడ్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశి్నంచింది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పుడు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని తబ్లిగీ జామాత్ లో భారీ సంఖ్యలో జనం సమావేశం అవడం, అలాగే ఆనంద్ విహార్ బస్ టెరి్మనల్‌వద్ద వలస కారి్మకులు గుమిగూడిన అంశాల్లో సీబీఐ దర్యాప్తు తదితర విషయాలపై విచారించిన సుప్రీంకోర్టు కోవిడ్ నుంచి రైతుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. -
ప్రేమించి పరువు తీసిందని..
సాక్షి, బెంగళూరు : మాగడి తాలూకా బెట్టహళ్లి గ్రామానికి చెందిన హేమలత (18) అనే యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. పరువు హత్యగా నిర్ధారించారు. ఆమె తండ్రి కృష్ణప్ప(48), పెదనాన్న కుమారుడు చేతన్(21)ను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. (చెక్‌పోస్టులో కరెన్సీ కట్టలు) ఏం జరిగిందంటే... హేమలత కుదూరు కళాశాలలో బీకాం చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న అన్యమతస్తుడయిన యువకున్ని మూడేళ్లుగా ప్రేమిస్తోంది. ఈ విషయంపై ఇరువైపుల పెద్దల పంచాయితీ కూడా జరిగింది. అయితే అన్యమతస్తుడిని ప్రేమించి తమ పరువు తీసిందంటూ హేమలతపై ఆమె తండ్రి కోపంతో ఉండేవారు. ఈక్రమంలో హేమలత కనిపించకుండా పోయింది. ఈనెల 11న తోటలో పూడ్చిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ప్రియుడే హత్య చేశాడని వదంతులు పుట్టించారు. పోలీసుల విచారణలో తండ్రి, సోదరుడు, మరో బాలుడు కలిసి ఆమెను అంతమొందించారని వెల్లడైంది. సామూహిక హత్యాచారం కాదని తేల్చారు. -
సూత్రధారి రాజు.. అమలు యుగంధర్‌రెడ్డి
గచ్బిబౌలి(హైదరాబాద్): చింత యోగా హేమంత్ కుమార్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయినవారిలో సూత్రధారి సోమయాల రాజు, సాయన్నతోపాటు హత్యలో పాల్గొన్న ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా ఉన్నారు. యుగంధర్ రెడ్డిని బావ లక్ష్మారెడ్డి, అక్క అర్చన కలిసి హేమంత్ అడ్డు తొలగించాలని అభ్యర్థించారు. దీంతో వట్టినాగులపల్లికి చెందిన సోమయాల రాజు(52), ఎరుకల కృష్ణ(33), మహ్మద్ పాషా అలియాస్ లడ్డూ(32), ఐడీఏ బొల్లారం నివాసి, రౌడీషీటర్ బ్యాగరి సాయన్న(48)లతో కలిసి హత్యకు పక్కా స్కెచ్ వేశాడు. రూ.10 లక్షల సుపారీకి రూ.50 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. హేమంత్‌కు సంబంధించిన ఐదున్నర తులాల బంగారు బ్రాస్లెట్, చైన్‌ను ఎరుకల కృష్ణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యుగంధర్ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరు రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. అల్లుడు హేమంత్‌ను అడ్డు తొలగించేందుకు రూ.30 లక్షలైనా ఖర్చు చేసేందుకు లక్ష్మారెడ్డి సిద్ధపడ్డట్టు విచారణలో వెల్లడైంది. లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చి అవంతి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అవంతి సోదరుడు అశీష్‌రెడ్డి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభిస్తే అశీష్‌రెడ్డిపై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. ఏ7 విజయేందర్ రెడ్డి, ఏ8 అర్థం రంజిత్ రెడ్డి, ఏ9 అర్థం రాకేష్ రెడ్డి, ఏ11 ఎల్లు సంతోష్‌రెడ్డి, 12 కైలా సందీప్ రెడ్డి, ఏ15 షేక్ సాహెబ్ పటేల్‌తోపాటు గూడూరు సందీప్‌రెడ్డిలను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: హేమంత్ హత్య కేసు: తొలిరోజు విచారణ) అమ్మకు బాగాలేదని... నిందితులు విజయేందర్‌రెడ్డి, స్పందన, రాకేష్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీలో హేమంత్, అవంతిలను రెండుసార్లు కలిశారు. ‘నీవు ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేద’ని నమ్మించారు. పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ ప్రేమ ఉన్నట్లు నటించారు. మరోవైపు హేమంత్ హత్యకు లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి ప్లాన్ చేశారు. హత్యకు ముందు మరో గ్యాంగ్‌తో లక్ష్మారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆ ముఠా నుంచి స్పందన రాకపోవడంతో యుగంధర్‌రెడ్డి ద్వారా ప్లాన్ చేసినట్లు సమాచారం. మరో గ్యాంగ్‌తో మాట్లాడిన విషయంపైనా విచారణ చేపట్టనున్నారు. ఎస్‌హెచ్‌వోతోపాటు మరో ఇద్దరికి కరోనా హేమంత్ హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్‌హెచ్‌వో ఆర్.శ్రీనివాస్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో డీఐ క్యాస్ట్రో ఐవోగా ఉంటాడని డీసీపీ తెలిపారు. హత్యకేసులో నిందితులైన ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషాలకు టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని తేలినట్లు సామాచారం. (చదవండి: మొదటి భార్యకు విడాకులు.. రెండో భార్య కుమార్తెపై కన్ను) -
అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలన్నహేమంత్ భార్య అవంతి విజ్ఞప్తి మేరకు సజ్జనార్ స్పందించారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’) ఇదిలాఉండగా.. హేమంత్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోపన్ పల్లి వద్ద హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. సుపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. (చదవండి: హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
హేమంత్ హత్య: 6 నెలలు అవంతి హౌజ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ కుట్రకు రెండు నెలల క్రితమే పథకం రచించినట్టు నిందితుల విచారణలో వెల్లడైంది. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో కలిసి అవంతి మేనమామ యుగందర్‌రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి హత్య చేయించారని విచారణలో నిందితులు అంగీకరించారు. హేమంత్, అవంతి కలుసుకోకుండా.. లక్ష్మారెడ్డి క్రూరంగా వ్యవహరించినట్టు తెలిసింది. పెళ్లికి ముందు తనను నెలలు నిర్బంధంలో ఉంచారని అవంతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. (చదవండి: హేమంత్ హత్య: చందానగర్‌లో ఉద్రిక్తత) అప్పట్లో మిస్సింగ్ కేసు విచారణలో వెలుగు చూసిన సమాచారం ప్రకారం.. హేమంత్‌ని కలుసుకోకుండా లక్ష్మారెడ్డి ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడు. జూన్ 10న ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో హేమంత్‌కి కాల్ చేసిన అవంతి, అతనితో కలిసి బైక్ పైన పారిపోయింది. అయితే ఆ సమయంలో పవర్ లేకపోవడం, సీసీ కెమెరాల్లో రికార్డ్ కాకపోవడంతో.. అవంతి తల్లిదండ్రులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ నమోదైంది. ఆ తరువాత రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ చేసి పోలీసులు పంపించేశారు. తర్వాత హేమంత్, అవంతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక అదే పగతో రగిలిపోతున్న అవంతి తల్లి, హేమంత్ హత్య చేయడానికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసులో మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించగా, మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో కేసులో లోతైన దర్యాప్తు కోసం నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను ఆధారాలతో సహా విచారణ చేయాలని భావిస్తున్నారు. ఇక జహీరాబాద్‌లో ఓఆర్ఆర్ మీద సీసీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్ రీ కన్‌స్ట్రక్చన్ చేయాలనీ భావిస్తున్నారు. హంతకుల ఇళ్ల వద్ద రక్షణ ఇక హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ అవంతి తరుపు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర మీడియాకు తెలిపారు. హంతకుల ఇంటి వద్ద పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారని, బాధితుల ఇంటి దగ్గర పోలీసులు లేకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అవంతి, హేంమంత్ సోదరుడు సుమంత్, అతని స్నేహితులు ఆందోళనకు దిగారు. హేమంత్ ఇంటినుంచి లక్ష్మారెడ్డి ఇంటివైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోడంతో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో చందానగర్‌లో కొంత ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) -
హేమంత్ హత్య: చందానగర్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి కారణంగా దారుణ హత్యకు గురైన హేమంత్‌కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు స్పష్టం చేశారు. హేమంత్ నివాసం వద్ద సోమవారం సాయంత్రం వారంతా నిరసన చేపట్టారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తమకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో హేమంత్ భార్య అవంతి, సోదరుడు సుమంత్, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈక్రమంలో హేమంత్ ఇంటినుంచి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి నివాసం వైపు నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, చందానగర్‌కు చెందిన అవంతిరెడ్డి, హేమంత్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకోగా.. అవంతి తల్లిదండ్రులు హేమంత్‌ను కిరాతకంగా హత్య చేయించారు. అవంతి మేనమామ యుగేందర్‌రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇప్పటికే 14 మందిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించగా.. మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం మరువకపముందే.. హేమంత్ హత్య సంచలనంగా మారింది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) వైఫల్యం కనిపిస్తోంది ‘జస్టిస్ ఫర్ హేమంత్’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని జూన్ 16 తర్వాత అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు. హేమంత్ హత్యకు గురవడంలో పోలీసు శాఖ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హేమంత్‌ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు) -
హేమంత్ హత్య: కారులో చిత్రహింసలు
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ కుమార్ హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి, హేమంత్ హత్య కోసం పది లక్షల రూపాయల సుఫారీతో ఇద్దరు వ్యక్తులను రంగంలోకి దించినట్లు పోలీసుల విచారణలో తేలింది. యుగంధర్ రెడ్డి చందానగర్‌కు చెందిన ఆ ఇద్దరు కిరాయి హంతకులతో కలిసి హేమంత్ హత్యకు ప్లాన్ రచించాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు గచ్చిబౌలి ఎన్జీవో కాలనీలో హేమంత్‌ను బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో వేసుకెళ్లిపోయాడు. గోపన్ పల్లికి వెళ్లాక, ఆ కారులో నుంచి దింపి మరో కారులో ఎక్కించారు నిందితులు. తాడుతో చేతులు, కాళ్లు కట్టి కారు వెనక సీట్లో పడేసి చిత్రహింసలు పెట్టారు. ( మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి ) ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డికి తరలించారు. తాడుతో హేమంత్ మెడను బిగేసి హత్య చేశారు. రాత్రి 7:30కే హత్య చేసి సంగారెడ్డి మల్కాపూర్‌లో పడేశారు. కాగా, హేమంత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కుటుంబసభ్యులు మృతదేహం పాడవకుండా ఉండేందుకు గచ్చిబౌలిలోని కాన్‌టినెంటల్ హాస్పత్రికి తరలించారు. రేపు చందా నగర్లో అంతక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో యూకేలో ఉంటున్న హేమంత్ తమ్ముడు సుమంత్ అన్నయ్య కడసారి చూపుకోసం బయలుదేరాడు. సినిమాలో హీరోగా హేమంత్ మృతుడు హేమంత్ కుమార్ ఓ సినిమాలోనూ నటించాడు. అందమైన మాయ అనే సినిమాలో హీరోగా చేశాడు. 2015 డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిందితుల్లో ఒకరి కరోనా హేమంత్ హత్య కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శుక్రవారం నిందితులకు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. -
నర్సీపట్నంలో పరువుహత్య కలకలం!
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నంలో కలకలం రేగింది. స్థానిక పెద్ద చెరువులో దుప్పటితో కట్టిన మృతదేహాన్ని స్తానికులు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం చెరువులో పడేసి నాలుగు రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడిని నర్సీపట్నంకు చెందిన గారా కిషోర్ గా గుర్తించారు. ఘటనను పరువుహత్యగా భావిస్తున్నారు. కిషోర్ గత కొంతకాలంగా ఓ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని, ఇది ఇష్టం లేకే పరువుహత్య చేశారని కిషోర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, అబ్బాయి అడ్డు తొలిగించేందుకే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్య: విస్తుపోయే నిజాలు
లక్నో: సినిమాను తలపించే తరహా హత్యోదంతం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ప్రేమజంటను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన యూపీలోని సంభల్ జిల్లాలోని గధా గ్రామంలో వెలుగులోకి వచ్చింది. జూలై 1న పొలాల్లో ఓ ప్రేమ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు సుఖియా, బంటి ఆత్మహత్య చేసుకున్నారని మొదట పోలీసులు భావించారు. మరో 6 రోజుల తర్వాత సుఖియా సోదరుడు కుల్దీప్ కూడా అక్కడే చెట్టుకు ఉరివేసుకోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుల్దీప్ది ఆత్మహత్య కాదని హత్య అని తేలింది. అదేవిధంగా ఆ ప్రేమజంటది కూడా ఆత్మహత్య కాదని, హత్యని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ ముగ్గురి చంపింది సుఖియా, బంటిల అన్నయ్య వినీత్. (చదవండి: కరోనా : యూపీ సర్కార్ కీలక నిర్ణయం) కుటుంబ గౌరవం కోసం ఈ ముగ్గురిని హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వినీత్ వెల్లడించాడు. సుఖియా, బంటి ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలనుకున్నారని చెప్పాడు. వీరిద్దరూ వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందన్న భయంతో తన ముగ్గురు స్నేహితులకు రూ. 2.5 లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించినట్టు తెలిపాడు. సుఖియా, బంటిల హత్యను కుల్దీప్ తీవ్రంగా వ్యతిరేకించాడు. జరిగిన విషయం పోలీసులకు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. తమ్ముడు నిజం చెబితే తన బండారం బయటపడుతుందన్న భయంతో అతడిని కూడా హత్య చేసి అక్కడే చెట్టుకు ఉరివేసినట్లు వినీత్ చెప్పాడు. అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే హతం) -
ప్రియురాలి ఇంట్లో ప్రియుడి దారుణహత్య
సాక్షి, చెన్నై: ప్రియురాలి కోసం వెళ్లి అడ్డంగా బుక్కైన ప్రియుడు ఆమె ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబీకులు అతడ్ని నరికి చంపేశారు. చిదంబరంలో ఈ ఘటన కలకలం రేపింది. రాష్ట్రంలో సాగుతున్న కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. కోర్టులు హెచ్చరించినా, పోలీసులు కఠినంగా వ్యవహరించినా, భరోసా ఇచ్చే రీతిలో ముందుకు సాగుతున్నా హత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో కడలూరులో తాజాగా ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడ్ని కుటుంబీకులు దారుణంగా హతమార్చడం కలకలం రేపింది. కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన ఆర్ముగం కుమారుడు అన్భళగన్(21). స్థానికంగా ఓ కిరాణ దుకాణం నడుపుతున్నాడు. చిదంబరం అరంగనాథన్ వీధి లో ఉన్న బాబు కుమార్తె శ్వేత (18) తో పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. లాక్డౌన్ పుణ్యమా ప్రియురాల్ని చూడలేని పరిస్థితుల్లో పడ్డ, ఈ ప్రేమికుడు గత నెల ఆమె ఇంటి వద్దకు వెళ్లి బుక్కయ్యాడు. శ్వేత కుటుంబీకులు తీ›వ్రంగా మందలించి పంపించారు. ఈ పరిస్థితుల్లో ప్రియురాల్ని చూడలేకపోతున్న మనో వేదనతో ఉన్న అన్భళగన్ గత వారం ఓ మారు ఆ వీధిలోకి వెళ్లి చితక్కొట్టించుకు వచ్చాడు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం ఆ ఇంట్లో ఎవరు లేరన్న సమాచారంతో శ్వేత కోసం వెళ్లి బుక్కైయ్యాడు. చదవండి: ఆమెకు 25.. అతడికి 18.. ఇంట్లో ఎవరు లేదన్న ఉత్సాహంతో వెళ్లిన అన్భళగన్‌కు అక్కడ ఆమె తండ్రి, తల్లి, సోదరుడు ఉండడంతో షాక్ తప్పలేదు. ఇంట్లోకి వచ్చిన అతడ్ని ఆ కుటుంబం నరికి చంపేసింది. రక్తపు మడుగులో సంఘటన స్థలంలోనే అన్భళగన్ మరణించాడు. తమ పరువును బజారు కీడ్చే రీతిలో వ్యవహరిస్తున్నాడన్న ఆగ్రహంతోనే హతమార్చినట్టుగా ఓలేఖను అక్కడ పడేసి ఆ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. ఆ ఇంటి నుంచి రక్తం వాసన వస్తుండడాన్ని గుర్తించిన పక్కింటి వారు లోనికి వెళ్లి చూడగా, మృతదేహం పడి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అక్కడ లభించిన లేఖ ఆధారంగా ప్రేమ పరువు హత్యగా తేల్చారు. బాబు(40), ఆయన భార్య సత్య (37), కుమారుడు జీవ(17), శ్వేత(18)పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఈ నలుగురి కోసం గాలిస్తున్నారు. చదవండి: మంచి మనసుకు మన్నన -
'వారిని రక్షించాలంటే కఠిన చట్టాలు రావాల్సిందే'
టెహ్రాన్ : ఇరాన్లో మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు కల్పించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ పిలుపునిచ్చారు. గురువారం టెహ్రాన్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో అష్రాఫీ మృతిపై హసన్ రౌహానీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన పరువు హత్యగా పేర్కొన్నారు. ఇలాంటివి చోటుచేసుకోకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హింస నుంచి మహిళలను రక్షించే బిల్లును "వేగవంతమైన అధ్యయనంగా ధృవీకరించాలంటూ' ఆదేశించారు. మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌కు చెందిన 14 ఏళ్ల అమ్మాయి తండ్రి చేతిలో దారుణహత్యకు గురవడం దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.(ఒక్కరోజే 114 మంది పోలీసులకు కరోనా) ఇరాన్‌కు చెందిన రోమినా అష్రాఫీ అనే 14 ఏళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి నార్త్ ఇరాన్‌లోని తాలేష్ కౌంటీ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల వ్యక్తిని కలిసింది. విషయం తెలుసుకున్న అష్రాఫీ తండ్రి రోమినాను ఇంటికి ఈడ్చుకొచ్చి కొడవలితో దారుణ హత్యకు పాల్పడ్డాడు. అష్రాఫీ దారుణ హత్యపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా చానెళ్లు ప్రత్యేక కవరేజీ అందించాయి. దీంతో పోలీసులు రోమీనా తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రోమినాను కలిసిన 29 ఏండ్ల వ్యక్తిపై కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియదు. మరోవైపు ఈ ఘటనను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది.'మహిళలు / బాలికలపై జరుగుతున్నహింస పట్ల శిక్షలను మరింత కఠినతరం చేయాలని మేము ఇరాన్ అధికారులను, చట్టసభ సభ్యులను కోరుతున్నాము. మరణశిక్షను ఆశ్రయించకుండా, నేరం యొక్క తీవ్రతకు అనులోమానుపాతంలో జవాబుదారీతనం ఉండేలా వారు శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 301 ను సవరించాలి' అంటూ అమ్నెస్టీ గురువారం ట్విటర్లో తెలిపింది. -
టీనేజ్ యువతుల్ని కుటుంబ సభ్యులే కాల్చిచంపారు!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో దారుణం చోటుచేసకుంది. ఓ యువకుడితో సన్నిహితంగా మాట్లాడిన కారణంగా ఇద్దరు యువతులను వారి కుటుంబసభ్యులే అతి కిరాతకంగా కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే..16,18 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు టీనేజీ యువతులు ఓ యువకుడితో సన్నిహితంగా మెలిగిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి ఇది ఏడాది క్రితం తీసిన వీడియా. అయితే ఆ వీడియాలో బాలికలు యువకుడితో సన్నిహితంగా కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఇద్దిరినీ గ్రామ శివారులో కాల్చి చంపినట్లు పోలీసులు జరిపిన విచారణలో తేలింది. తండ్రి, సోదరుడే ఈ పరవు హత్యకు పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ వీడియోలో మరొక యువతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా యువకుడి ప్రాణాలకు కూడా హానీ ఉందని అందుకే ప్రస్తుతం వారిద్దరికీ భద్రత కల్పిస్తాం అని పోలీసు అధికారి తెలిపారు. ఇక పాకిస్తాన్లో మహిళలు, బాలికలపై హింస తీవ్రత ఎక్కువగా ఉందని నివేదికలో వెల్లడైంది. ప్రతీ సంవత్సరం ఆ దేశంలో 1000కి పైగా పరువు హత్యలు జరుగుతాయని నివేదికలో తేలింది. -
కూతురి అక్రమ బంధం.. పరువు హత్య !
సాక్షి, కర్ణాటక, బళ్లారి: వివాహేతర సంబంధం పర్యవసానంగా పరువు హత్య చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కూతురి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బళ్లారి తాలూకా గోడేహళ్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు గోపాలరెడ్డి కాగా, హతురాలు అతని కుమార్తె కవిత (22). పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం...గోడేహళ్ గ్రామంలో నివసించే రైతు గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు. అయితే కవితకు అక్కడే ప్రకాశ్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల నుంచి భర్తను వదలి ప్రియునితో ఉంటోంది. కవిత భర్త.. భార్య కనిపించడం లేదని తోరణగల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కవిత పుట్టింటికి వచ్చింది. ప్రియుడు కూడా వచ్చి కవితను తనతో రావాలని గొడవకు దిగడం జరిగింది. ఈ సంఘటనతో తండ్రి గోపాలరెడ్డి ఎంతో మథన పడ్డారు. సోమవారం రాత్రి కూతురితో ఆయన ఘర్షణ పడ్డాడు. ఈ గొడవలో ఆమె విగతజీవిగా మారింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. -
చెల్లెలి వరుసయ్యే యువతితో ప్రేమ పెళ్లి
కర్ణాటక, బనశంకరి: రాష్ట్రంలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఓ మామ అల్లున్ని దారుణంగా హత్య చేయించినట్లు వెల్లడైంది. హాసన్ జిల్లా హొళెనరసీపుర హేమావతి నదిలో లభించిన మృతదేహం మిస్టరీ వీడింది. ఈ హత్య కేసును ఛేదించిన హాసన్ పోలీసులు 6 మందిని ఆదివారం అరెస్ట్ చేశారు. హాసన్‌కు చెందిన మంజునాథ్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన దేవరాజ్ కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ వరుసకు అన్నా చెల్లెలు కావడంతో ఈ పెళ్లిని యువతి తండ్రి దేవరాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో యువకుడు, యువ తి ఇంటి నుంచిపారిపోయి మూడుముళ్లు వేసుకుని మండ్యలో కాపురం పెట్టారు. సెప్టెంబరు 9వ తేదీన వివాహం కాగా నవంబరు 9న సాయంత్రం మంజునాథ్ అదృశ్యమయ్యాడు. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో కుట్ర బట్టబయలు ఇటీవల హొళెనరసిపుర సమీపంలోని హేమావతి కాలువలో మృతదేహం లభించడంతో హాసన్ పోలీసులు ఆరా తీయగా అది మిస్సయిన మంజునాథ్‌గా గుర్తించారు. మృతదేహంపై ఉన్న గుర్తును బట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు తేల్చారు. అన్న వరుసయ్యే వ్యక్తితో కూతురి పెళ్లి జరగడం దేవరాజ్ తట్టుకోలేకపోయాడు. సమాజంలో తలెత్తుకుని తిరగడం ఎలాగంటూ ఆగ్రహావేశానికి గురై, ఏకంగా మంజునాథ్ హత్యకు కుట్ర చేశాడు. అల్లున్ని చంపడం కోసం రూ.5 లక్షలు సుపారిని ఓ హంతక ముఠాకు అందించి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితులైన దేవరాజ్‌తో పాటు యోగేశ్, మంజు, చెలువ, నందన్, సంజయ్ అనేవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
దారుణం : వారి ప్రేమకు కులం అడ్డు.. అందుకే
సాక్షి, విజయవాడ : ప్రేమకు కులం అడ్డురావడంతో ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆముదాలపల్లి పంచాయితీ శివారు జయపురానికి చెందిన రాహుల్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ రెండోసంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో ముదినేపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని హారికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ మైనర్లే, కులాలు కూడా వేరుకావటంతో పెద్దలు విడదీస్తారని భయపడి పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యుల ఫిర్యాదులతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు వీరి జాడ దొరికింది. ఇద్దరినీ తీసుకొచ్చి పంచాయితీ పెట్టి విడదీశారు. కులం తక్కువ వాడితో వెళతావా అంటూ హరికను మందలించారు. ఒకరినొకరు కలవకుండా ఆంక్షలు విధించారు. అయితే, కొద్దిరోజుల తర్వాత పనిమీద బయటకొచ్చిన రాహుల్ అదృశ్యమయ్యాడు. అదేసమయంలో హారిక కూడా కనిపించకుండా పోయింది. ఇద్దరి కోసం ఎంత ఎంత గాలించినా లాభం లేకపోయింది. మళ్లీ ఎటైనా పారిపోయారేమోనని అందరూ భావించారు. కానీ, ఎడబాటును తట్టుకోలేక పోయిన ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. జయపురంలోని రాహుల్ అమ్మమ్మ ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు ఇద్దరూ శవాలై కనిపించారు. ఇంట్లోని బెడ్‌పై హారిక మృతదేహం ఉండగా రాహుల్ శవం ఉరికి వేలాడుతూ దర్శనమిచ్చింది. ఘటన జరిగి నాలుగు రోజులలై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లోపల ఆత్మహత్యలకు పాల్పడితే బయట తాళం వేసి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది పరువు హత్యా, ఆత్మ హత్యా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. -
‘చందన’ కేసులో నమ్మలేని నిజాలు..
చిత్తూరు జిల్లా వరుస పరువు హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలిసీతెలియని వయసులో తప్పటడుగులు వేస్తున్న పిల్లలను దారిలోపెట్టాల్సిన తల్లిదండ్రులు పగ, ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. పరువు పేరుతో అభంశుభం తెలియని పసి హృదయాలను నులిమేస్తున్నారు. కాటికి పంపి కన్నపేగును దూరం చేసుకుంటున్నారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచి జైలుపాలవుతున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. సాక్షి, చిత్తూరు : జిల్లాలో పరువు హత్యలు పెచ్చుమీరుతున్నాయి. మొన్న పలమనేరు ఘటన మరువక ముందే తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రెడ్లపల్లి చందన కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని తండ్రే ఆమెను అమానుషంగా కడతేర్చాడు.చందన ఆత్మహత్య చేసుకుందని నమ్మించడమే కాకుండా ఆనవాళ్లు మిగలకుండా మృతదేహాన్ని కాల్చివేసి, బూడిదను చెరువులో కలిపేశాడు. అది హత్య కాదు.. పరువు హత్య శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రెడ్లపల్లిలో ఎనిమిది రోజుల క్రితం డిగ్రీ చదువుతున్న చందన(17) హత్యకు గురైంది. తొలుత ఇది ఆత్మహత్యగా భావించారు. పోలీసు విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. రెడ్లపల్లికి పొరుగున ఉన్న దళిత కాలనీకి చెందిన ప్రభు అలియాస్ నందకుమార్(18) ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం చందన ఇంట్లో తెలిసి ఆమెను తల్లిదండ్రులు మందలించారు. దీంతో చందన, నందకుమార్ ఈ నెల 11న ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన చందన తండ్రి వెంకటేశ్ తన బంధువులతో కలిసి వెళ్లి...కూతుర్ని ఇంటికి తీసుకువెళ్లాడు. నందకుమార్‌ని స్వగ్రామానికి పంపించివేశారు. ఆ తర్వాత తాము చెప్పినా వినకుండా దళితుడిని పెళ్లి చేసుకుంటావా అంటూ...చందనను చితకబాదాడు. ఆవేశంలో గొంతుకు తాడు బిగించి హతమార్చాడు. అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు భార్యతో కలిసి చందన ఇంట్లో ఉరి వేసుకున్నట్లు గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రాత్రికి రాత్రే ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఆపై శవాన్ని కాల్చి బూడిదను గోనె సంచుల్లో నింపి కర్ణాటకలోని క్యాసంబళ్లి చెరువులో పడేశాడు. పోలీసుల విచారణలో కుటుంబ సభ్యుల ఘాతుకం వెలుగులోకి వచ్చింది. కన్నకూతుర్ని కిరాతకంగా హతమార్చిన తండ్రితో పాటు, అతడికి సహకరించినవారంతా జైలుపాలయ్యారు. -
కూతురిని చంపి గంగలో పడేశారు!
సాక్షి, పశ్చిమ బెంగాల్: పరువు కోసం కన్న కూతురిని చంపిన కిరాతక తల్లిదండ్రులను పశ్చిమ బెంగాల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 16 ఏళ్ల కుతురి ప్రేమ వ్యవహారం తెలియడంతో సొంత తల్లిదండ్రులే పరువు పోతుందని ఈ దారుణానికి ఒడిగట్టారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక, పొరుగూరికి చెందిన అచింత్య మొండల్ అనే యువకుడిని ప్రేమించింది. దీంతో కుతురి ప్రేమ విషయం తెలిసి ఆమెను తల్లిదండ్రులు వారించారు. అతనితో కలిసి తిరగవద్దని హెచ్చరించారు. అయినా వారు మాట వినకపోవడంతో తల్లిదండ్రులు ఈ మేరకు పరువు హత్యకు ఒడిగట్టారు. కూతురిని చంపి మృతదేహాన్ని బ్యాగ్‌లో కుక్కి గంగానదిలో పడేశారని పోలీసులు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసినట్లు సూపరిండెంట్ ఇఫ్ పోలీస్ అలోక్ రాజోరియా పేర్కొన్నారు. -
నవ దంపతుల్ని నరికి చంపారు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకే చోట చేస్తున్న ఉద్యోగం వారిద్దరినీ స్నేహితుల్లా చేతులు కలిపింది. క్రమేణా మనసులు కూడా కలవడంతో ప్రేమికులుగా మారారు. కులమతజాతి భేదాలను పక్కనపెట్టి ఐదేళ్లపాటూ ప్రేమను పెంచుకున్నారు. ఒకరికొకరు పంచుకున్నారు. మూడునెలల క్రితం మూడుముళ్లతో ఆ ఇద్దరూ ఒకటయ్యారు. అయితే ఐదేళ్ల ప్రేమ, మూడు ముళ్ల బంధాన్ని కులోన్మాద కర్కశులు నిర్ధాక్షిణ్యంగా తెంచేశారు. పసుపు పారాణి ఇంకా ఆరిందోలేదో.. నవ దంపతులను నరికి చంపేశారు. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూత్తుకూడి జిల్లా కుళత్తూరు పెరియార్ నగర్ కాలనీకి చెందిన ముత్తుమారికి శోలైరాజ్ (23) సమీపంలోని ప్రైవేటు ఉప్పు తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. కుమార్తె శోలైరతి (19) కోవిల్‌పట్టిలోని ఒక మిల్లులో ఉద్యోగం చేస్తోంది. శోలైరాజ్ పనిచేస్తున్న ఉప్పు తయారీ కేంద్రంలో కుళత్తూరుకు చెందిన జ్యోతి (20) అనే యువతితో కూడా పనిచేస్తోంది.ఒకేచోట పని కారణంగా ఇద్దరి మధ్య సహజంగానే పరిచయం ఏర్పడింది. క్రమేణా ఈ పరిచయంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గాలకు చెందిన వారుకావడంతో గత ఐదేళ్లుగా తమ ప్రేమను పంచుకుంటూ, పెంచుకుంటూ వస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబాల వారికి తెలియడంతో తీవ్రంగా ఖండించారు. సామాజిక వర్గం ఒకటే అయినా తెగవేరని తెలుస్తోంది. వేర్వేరు తెగలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమను అనుమతించేది లేదని పెద్దలు తేల్చిచెప్పారు. అయినా వారిద్దరూ తమ ప్రేమను కొనసాగించారు. ఒక దశలో పెద్దలు వీరి ప్రేమకు తీవ్రంగా అడ్డుపడటంతో మూడునెలల క్రితం స్నేహితులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి చర్చలు జరిపగా ఇరు కుటుంబీకులు ససేమిరా అన్నారు. యువతీ యువకులు మేజర్లు, చట్టపరంగా వారి ప్రేమ, పెళ్లి అడ్డుకునే హక్కు లేదని పోలీసులు పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే యువతీ యువకుని తల్లిదండ్రులు ఎంతకూ అంగీకరించకపోవడంతో పోలీసులే వారిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి తరువాత శోలైరాజన్ కుటుంబీకులు కొంత దిగివచ్చినా జ్యోతి తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసుల సాక్షిగా పెళ్లి చేసుకున్న జంట పెరియార్ నగర్లోనే వేరుగా కాపురం పెట్టి కలిసి జీవించసాగారు. బుధవారం రాత్రి భోజనాలు ముగిసిన తరువాత దంపతులిద్దరూ గాలి కోసం ఆరుబయట చాపవేసుకుని నిద్రించారు. గురువారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు గోడదూకి లోనికి ప్రవేశించి కత్తులు, వేటకొడవళ్లతో దంపతులపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరి గొంతుకలు తెగిపోయి, చేతులు ముక్కలై తీవ్రమైన రక్తస్రావం కావడంతో విలవిల కొట్టుకుంటూ దంపతులు శోలైరాజన్, జ్యోతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. దంపతుల దారుణహత్య ఉదంతం తెల్లారేసరకి గ్రామమంతా పొక్కడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి ప్రజలు, శోలైరాజన్ బంధువులు పోలీసులను అడ్డుకుని నిందితులను అరెస్ట్ చేసేవరకు శవాలను తరలించరాదని ఆందోళనకు దిగారు. పోలీసులు చర్చలు జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో శవాలను పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి ప్రేమ వివాహానికి అబ్బాయి వైపువారు అంగీకరించినా అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో ఇది పరువు హత్యగా భావిస్తూ ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, యువతి తండ్రిని పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఆ యువతి కూడా రవి ప్రేమలో..
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో యువకుడిని హత్య చేసిన సంఘటన మాగడి తాలూకా మానగల్ గ్రామంలో చోటుచేసుకుంది. మానగల్ గ్రామానికి చెందిన రవి (24) హత్యకు గురయ్యాడు. పరువు హత్యకు సంబంధించి వివరాలు... చిన్నచిన్న సబ్ కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న రవి ఇదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా రవి ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు రవిని పలుసార్లు హెచ్చరించారు. అయినా రవిలో మార్పు రాలేదు. దీంతో యువతి కుటుంబ సభ్యులు బంధువులు కొందరు రవితో మాట్లాడాలని ఆటోలో గ్రామం శివారులోకి తీసికెళ్లి దాడిచేసి హత్య చేసి, గుడేమారనహళ్లి వద్ద పొదల్లో శవాన్ని విసిరేసి వెళ్లిపోయారని రవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పరువు హత్యపై ఆగ్రహం
పలమనేరు (చిత్తూరు): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య ఉదంతంపై ప్రజా, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేశాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఊసరపెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకుందనే కసితో పచ్చి బాలింత అన్న కనికరం లేకుండా కన్నకూతురినే కుటుంబం అంతా కలసి కిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత, ప్రజా సంఘాల నేతలు శనివారం పలమనేరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాలు సాగిస్తున్న మారణహోమాన్ని రూపుమాపాలని, పరువు హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసేదాకా అంత్యక్రియలు నిర్వహించమంటూ బాధితులు, బంధువులు భీష్మించుకున్నారు. వారితో పోలీసులు జరిపిన మంతనాలు ఫలించలేదు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ నారాయణ గుప్త ఆదేశాలతో మదనపల్లి సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల డిమాండ్లను విని వారికి ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం, భర్త కేశవకు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి, నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బాధితులు హేమావతికి అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, స్థానిక సీఐ ఈద్రుబాష, సత్యవేడు, మదనపల్లి సీఐలు రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు చర్యలు తీసుకున్నారు. కేసులో కీలకంగా మారిన వీడియో రికార్డింగ్ పరువు హత్య కేసులో బాధితుని బంధువులు పోలీసులకు పంపిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. సంఘటన జరిగిన రోజు హేమావతి, ఆమె భర్త కేశవులు వారి వారం రోజుల పసిబిడ్డతో కలసి దొమ్మరిపాపమ్మ ఆలయం వద్ద బస్సు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న హేమలత తల్లిదండ్రులు భాస్కర్ నాయుడు, వరలక్ష్మి, సోదరులు భానుప్రకాష్, చరణ్, సోదరి నిఖిలలు ఒక్కసారిగా వారివద్దకొచ్చి హేమలతను బలవంతంగా బైక్‌పైకి ఎక్కించుకున్నారు. వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించగా దౌర్జన్యం చేశారు. అక్కడే ఉన్న కేశవులు మామ తన మొబైల్లో జరుగుతున్న తంతును వీడియో తీసి స్థానిక పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనే లోపే హత్య జరిగిపోయింది. ఈ కేసులో హతురాలి తల్లి, సోదరి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా తండ్రి, సోదరులు పరారీలో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు. -
నమ్మించి చంపేశాడు
ఘట్కేసర్: ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి తన కుమార్తె, మనుమడిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు మచ్చల రమేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి తల్లి కోమల డిమాండ్ చేసింది. జనగామ జిల్లా, పాలకుర్తి మం డలం గూడూరుకు చెందిన మచ్చల రమేష్, వరంగల్ రూరల్ జిల్లా బొల్లికుంటకు చెందిన దళిత యువతి శుశ్రుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు (4 నెలలు) ఉన్నాడు. శనివారం రాత్రి రమేష్ తన భార్య, కుమారుడిని ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ ప్రభాకర్ ఎన్క్లేవ్ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. దీనిపై సమాచారం అందడంతో çశుశ్రుత తల్లి కోమల, మేనమామ ప్రమోద్, బంధువులు సోమవారం ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పథకం ప్రకారమే.. శుశ్రుత అడ్డు తొలగిన్తేనే ఇంటికి రానిస్తామని రమేష్ తల్లితండ్రులు, బాబాయి, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో అందరూ కలిసి తన కుమార్తెను అంతమొందించారని మృతురాలి తల్లి కోమలి ఆరోపించింది. దళితులమైనందుకే చంపేశారని, ఇది ముమ్మాటికి పరువు హత్యేనని ఆమె పేర్కొంది. కుట్రలో పాల్గొన్న నిందితులందరిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. -
పిల్లలను కౌన్సెలింగ్‌తో మార్చుకోవాలి
ప్రకాశం, తాళ్లూరు: పరువు హత్యలో కొత్తపాలెం గ్రామంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి వైష్ణవి కుటుంబాన్ని జాతీయ మహిళా కమిటీ సభ్యురాలు తమ్శిశెట్టి రమాదేవి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ విశాలక్ష్మి బృందం మంగళవారం కలిశారు. వారి నివాసం వద్దకు వెళ్లి పరిస్థితులను ఆరా తీశారు. వైష్ణవి తాతయ్య అంజిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైష్ణవి పోస్టుమార్టం పూర్తికావటంతో దహన ప్రక్రియలు పూర్తి చేశామని తెలిపారు. అనంతరం సీఐ శ్రీనివాసరావుతో పోలీస్‌స్టేషన్‌లో సమావేశమై కేసు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయంలో మహిళా కమిటీ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించామని తెలిపారు. తల్లిదండ్రులు క్షణికావేశాన్ని మాని మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను కౌన్సెలింగ్ ద్వారా మార్చుకోవాలే కానీ ఇలా క్రూరంగా వ్యవహరించటం తగదని అన్నారు. ఐసీడీఎస్ జిల్లా పీడీ విశాలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు విద్యార్థి దశ నుంచే మంచి చెడ్డల విచక్షణను తల్లిదండ్రులు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. యాంత్రిక యుగంలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయిందని, సెల్ ఫోన్ టీవీల కాలక్షేపంతో పిల్లలకు, తల్లిదండ్రులకు దూరం పెరుగుతోంద న్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా మానవతా విలువలపై విద్యార్థులను నిత్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేటి సమాజంలో ఇటువంటి పరువు హత్యలు జరగటం తీవ్ర పరిణామమని అన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధిత మహిళల కోసం స్త్రీ, శిశు సంక్షేమం ద్వారా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో సఖీ పథకం కూడా ఒకటి అన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ కేవీపీ రాజకుమారి, జీసీడీఓ జ్యోతి సుప్రయ, గృహ హింస చట్టం లీగల్ కౌన్సెలర్ సరళ, వన్ స్టెప్ సఖీ కౌన్సెలర్ సాహిన్ తదితరులు పాల్గొన్నారు. -
పరువు తీస్తోందనే కోపంతో కుమార్తెను..
ఆస్పత్రికి వెళ్లాలంటూ కాలేజి బస్సు దిగిన ఓ యువతి ప్రియుడి సూచన మేరకుతల్లిదండ్రులకు తెలియకుండా తిరుపతి వెళ్లిందోరోజు. ఆచూకీ తెలుసుకొని ఇంటికితీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చాక వారి కళ్లుగప్పి ఇంటి నుంచి పరారైంది ఇంకోరోజు.ప్రేమలొద్దు బుద్దిగా చదువుకోమని కన్నవారు, బంధువులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిందని, ప్రవర్తన మార్చుకోకుండా కుటుంబ పరువు తీస్తోందనే కోపంతో డిగ్రీ చదువుతున్న కుమార్తెను హతమార్చారు. సోమవారం వేకువజామున తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాళ్లూరు: చెప్పిన మాట పెడచెవిన పెట్టి, ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినకుండా కుటుంబ పరువు తీస్తోందన్న కోపంతో కుమార్తె గొంతు నులిమి చంపాడు ఓ తండ్రి. ప్రకాశం జిల్లాలో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె వైష్ణవి (20) జిల్లా కేంద్రం ఒంగోలులోని ఓ ప్రవేట్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోజూ కళాశాలకు చెందిన బస్సులోనే వెళ్లేది. అదే కళాశాలలో చదివే లింగసముద్రం గ్రామానికి చెందిన యువకుడితో వైష్ణవి ప్రేమలో పడింది. గత గురువారం కళాశాల బస్సులో వస్తూ ఆస్పత్రికి వెళ్లాలని తోటివారికి చెప్పి మధ్యలో దిగిన వైష్ణవి ప్రియుడి సూచన మేరకు తిరుపతి చేరుకుంది. తెలుసుకున్న కుటంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కౌల్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఆ మర్నాడే స్నానం చేయడానికి అని చెప్పి స్నానాల గదికి వెళ్లిన వైష్ణవి అక్కడి నుంచి మాయమైంది. మార్కాపురంలో ఉందని తెలుసుకుని మళ్లీ తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా వైష్ణవి పద్దతి మార్చుకోక పోవటం, మంచి చెప్పిన బంధువులపై కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆదివారం రాత్రి తండ్రి, కూతురి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున వైష్ణవికి ఆరోగ్యం బాగా లేదంటూ తల్లిదండ్రులు ఆర్ఎంపీ వైద్యుడ్ని ఇంటికి పిలిపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ దాచేపల్లి రంగనాథ్, దర్శి సీఐ శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. యువతి ముఖంపై గాయాలు, మెడపై కమిలినట్టు ఉండటం గమనించారు. గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్ఓ యలమందారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రకాశం జిల్లాలో ప్రరువు హత్య?
-
గుంటూరులో ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
-
యువకుడి ప్రాణం తీసిన కులాంతర వివాహం
-
హైదరాబాద్‌లో పరువు హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో పరువు హత్య చోటు చేసుకుంది. నందకిషోర్ అనే వ్యక్తిని భార్య తరపున బంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా కొట్టి చంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం తిరిమలగిరిలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో పథకం ప్రకారం కిషోర్‌ని హత్య చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
పసికందు.. పరువు హత్య
కొందరికి మమత, మానవత కంటే పరువు ప్రతిష్టలే ఎక్కువైపోతున్నాయి. పరువు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న కొడుకు కోడలును చూసి ఆనందించాల్సిన అత్తమామలు.. పగ పెంచుకుని రగిలిపోయారు. తమ మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని కుతకుతలాడిపోయారు. మానవత్వం మంట గలిసేలా మనవడిని చంపడానికీ వెనుకాడలేదు. దీంతో కవల బిడ్డల్లో ఒకరికి నెలరోజులకే నూరేళ్లు నిండాయి. ఈ అమానుషం ఎక్కడో కాదు, సిలికాన్ నగరంలోనే జరిగింది. కృష్ణరాజపురం: తన భర్త తల్లిదండ్రులు, మరిది కలిసి తన చిన్నారి కొడుకును గొంతుపిసికి హత్య చేశారని స్టెల్లా అనే యువతి బెంగళూరు అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు.. నీలసంద్రకు చెందిన చిత్తరాజు, విజయలక్ష్మీ దంపతులకు కార్తీక్, అరవింద్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్దకొడుకైన కార్తీక్ అదే ప్రాంతానికి చెందిన స్టెల్లా అనే యువతి ప్రేమించుకున్నారు. కార్తీక్ తల్లిదండ్రులు వీరి ప్రేమను నిరాకరించినప్పటికీ, కొద్దికాలం క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. కార్తీక్ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి ఎదురుగానే బాడుగ ఇంట్లో కాపురం పెట్టాడు. వీరికి నెల కిందటే ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. తమకు ఇష్టం లేని పెళ్లిని చేసుకోవడంతో పాటు తమ కళ్ల ఎదుట ఇద్దరూ అన్యోన్యంగా ఉండడాన్ని చిత్తరాజు, విజయలక్ష్మిలు జీర్ణించుకోలేకపోయారు. దీంతోపాటు తనకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వారి రెండవ కుమారుడు అరవింద్ కూడా అన్న వదినలపై పగ పెంచుకున్నాడు. కక్ష తీర్చుకోవడానికి కుట్రలు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలంటూ తరచూ కార్తీక్, స్టెల్లాతో ముగ్గురూ గొడవ పడుతుండేవారు. అయినప్పటికీ వారు బెదరకపోవడంతో మరింత రగిలిపోయిన ముగ్గురూ.. ఏదో ఒకటి చేసి కక్ష తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న ముగ్గురూ ఈ నెల 21వ తేదీ కార్తీక్ ఇంట్లో లేకపోవడాన్ని గమనించి తమ పథకాన్ని అమలు చేయడానికి ఉపక్రమించారు. పెళ్లయిన రోజు నుంచి ఎప్పుడూ స్టెల్లాతో మాట్లాడని విజయలక్ష్మి.. వారి ఇంటికి వెళ్లి ప్రేమగా మాట్లాడుతున్నట్లు నటించింది. చిన్నారి గొంతుకు టవల్ బిగించి.. కవలల్లో్ల ఒకరికి జ్వరం రావడంతో కార్తీక్ మందులు తేవడానికి అప్పుడు బయటికి వెళ్లి ఉన్నాడు. మరో గదిలో ఉన్న జ్వరం వచ్చిన పసిబిడ్డ వద్దకు స్టెల్లా వెళ్లగా, సమయం కోసం ఎదురు చూస్తున్న విజయలక్ష్మి హాల్లో ఆడుకుంటున్న మరో బిడ్డను టవల్‌తో గొంతునులిమి చంపి, మంచం కింద దాచేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి హాల్లోకి వచ్చి చూడగా బిడ్డ కనిపించకపోవడంతో స్టెల్లా వెంటనే భర్త కార్తీక్‌తో కలసి అత్తమామలు,మరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్‌నగర్ పోలీసులు స్టెల్లా అత్తమామలు,కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారించగా బిడ్డ మృతదేహం బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది. -
మంచిర్యాల జిల్లాలో పరువు హత్య
-
కన్నీటి సాగరమైన గార్లదిన్నె
అనంతపురం,గార్లదిన్నె: బోసినవ్వులు, అమాయకపు చూపులతో అందరినీ సంతోష సాగరంలో ముంచిన ఆ చిన్నారులు.. తెల్లటి వస్త్రంలో నిస్తేజంగా ఉండడాన్ని చూసిన జనం కన్నీటిసాగరంలో మునిగిపోయారు. చిన్నారులను చంపడానికి చేతులెలా వచ్చాయంటూ శాపనార్థాలు పెట్టారు. దారుణహత్యకు గురైన మీనాక్షి, ఆమె పిల్లలు కీర్తి, వితేష్ మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం గురువారం మండల కేంద్రానికి తరలించారు. స్థానికులు మృతదేహాలను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారి మృతదేహాలను చూసి చలించిపోయారు. మీనాక్షి తల్లిదండ్రులు కుమార్తె, మనమడు, మనమరాలును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. త్వరలో కేసు ఛేదిస్తాం మీనాక్షి, ఆమె పిల్లల హత్య కేసును త్వరలో ఛేదిస్తామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మృతురాలి భర్త నల్లప్ప ఫిర్యాదు మేరకు అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మీనాక్ష్మి చిన్నాన్న కుమారుడు హరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే మీనాక్షిని హత్య చేశానని నిందితుడు చెప్పినట్లు సమాచారం. మీనాక్షి, ఆమె పిల్లలను చంపుతానని ఆమె భర్తను నిందితుడు హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
బూడిదైన కొత్త జంట ..
రాయచూరు రూరల్: అదృశ్యమైన దంపతులు శవాలుగా మారి గడ్డివామిలో కాలిబూడిదైన ఘటన కలబుర్గి జిల్లా చించోళి తాలుకా నిడగుందిలో వెలుగు చూసింది. ఇదో రకం పరువు హత్యగా ప్రచారం జరుగుతోంది. గత నవంబర్ 2న అజయ్ (30), జ్యోతి(25) అనే దంపతులు అదృశ్యమయ్యారు. గుర్తుతెలియని దుండగులు వారిరువురిని హతమార్చి గడ్డివాములో పడేసి దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అజయ్, జ్యోతిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 19 నెలలుగా వారి కాపురం సజావుగా సాగుతుండేది. కన్యాశుల్కం ఇవ్వడం అనే ఆచారం పార్థి వర్గీయుల్లో ఉంది. ప్రేమించింది కదా అని జ్యోతి పుట్టింటి వారు అజయ్‌తో ఆమెకు పెళ్లి చేశారు. జ్యోతి సోదరుడు రవి తమకు వధు దక్షిణ ఇవ్వాలని అజయ్‌తో తరచు గొడవపడుతుండేవాడని తెలిసింది. కిడ్నాప్ చేసి హత్య, దహనం అయితే అజయ్ ఇవ్వకపోవడంతో పగ పెంచుకున్నారు. రవి పథకం ప్రకారం వీరిద్దరిని కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడని అజయ్ తల్లి ఆరోపించింది. వీరిద్దరూ అదృశ్యమైన విషయంపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలబుర్గిలోని సుళేపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసు విచారణలో దంపతులిద్దరినీ గడ్డివామిలో పడేసి కాల్చినట్లు తేలిందని, విచారణ పూర్తి అయిన అనంతరం అన్ని వివరాలు ప్రకటిస్తామని కలబుర్గి అదనపు ఎస్పీ జయప్రకాష్ తెలిపారు. -
గులాబీ తోటలో పరువు హత్య
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రేమకు చిహ్నమైన గులాబీ తోటలో గులాబీ పొదలు ప్రేమికుని రక్తంతో తడిసిపోయాయి. గులాబీ తోటల్లో విహరించాల్సిన వరుడు అక్కడే విగతజీవిగా మారిపోవడంతో కొత్త కాపురంలో శాశ్వతంగా విషాదం తాండవిస్తోంది. ఐటీ సిటీ శివార్లలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. యువకుణ్ని ‘గుర్తు తెలియని దుండగులు’ గొంతుకోసి దారుణంగా హత్యచేసిన సంఘటన దేవనహళ్లి తాలూకా నల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే తాలూకా అరిశినకుంట గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన హరీష్ నాయక్ (30) హత్యకు గురైన యువకుడు. ఆరు నెలల క్రితం నల్లూరు గ్రామానికి చెందిన బీసీ వర్గం యువతిని హరీష్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. స్థానికంగా ఇతడు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసవాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. అమ్మాయి తరఫువారు సమాజంలో పలుకుబడి ఉన్నవారని తెలిసింది. అప్పటి నుంచి హరీష్‌కు బెదిరింపులు వస్తున్నట్లు బంధుమిత్రులు చెబుతున్నారు. బుధవారం ఉదయం.. ఇలా ఉండగా మంగళవారం రాత్రి నల్లూరు వద్ద ఒక గులాబీ తోటలో హరీష్ హత్యకు గురయ్యాడు. గొంతు కోసి ఉంది. హత్య ఎవరు చేశారు, ఎలా, ఎందుకు చేశారనే విషయాలు తెలిసిరాలేదు. బుధవారం పొద్దున శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలాన్ని చెన్నరాయపట్టణ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు నిఘా వేశారు. -
ప్రణయ్ ఇంట్లోకి ఆగంతకుడు!
సాక్షి, మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఇంటి ఆవరణలోకి ఆదివారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు గోడ దూకి ప్రవేశించాడు. సీసీ కెమెరా ఫుటేజీలో ఆగంతకుడు గోడ దూకి వచ్చినట్టు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో అతను సుమారు 8 నిమిషాలు అటూ ఇటూ తచ్చాడినట్టు గుర్తించారు. ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించిన ఆగంతకుడు , ఓ గదికి ఉన్న కిటికీ తలుపును తెరిచి చూశాడని, అనంతరం తిరిగి గోడ దూకి చర్చిరోడ్డు వైపు వెళ్ళినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో ఉందని ప్రణయ్ తండ్రి బాలస్వామి తెలిపారు. అలికిడి విని లేచిన పోలీసులు ఆగంతకుడు వచ్చిన సమయంలో ప్రణయ్ కుటుంబ సభ్యులకు రక్షణగా ఉన్న పోలీసులు పైన గదిలో ఉన్నారు. తిరిగి వెళ్లే సమయంలో గోడ దూకిన అలికిడి విన్న పోలీసులు వెంటనే కిందకు వచ్చి బాలస్వామిని లేపారు. అనుమానం వచ్చిన బాలస్వామి వెంటనే సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఆగంతకుడు గోడ దూకి ఇంటి ఆవరణలో తిరిగిన దృశ్యాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని వన్‌టౌన్ స్టేషన్‌కు చేరవేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేపడతామని ప్రణయ్ కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసులు లేకుంటే? ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడి నడుముకు నల్లని బెల్ట్ మాదిరిగా ఉందని, ఆ బెల్ట్‌కు ఏముందో అని.. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న ఎస్పీ ముందు జాగ్రత్తగా ఇద్దరు సాయుధ పోలీసులతో ప్రణయ్ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత ఉందని తెలిసినా ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడంటే పక్కా ప్రణాళికతోనే వచ్చాడా..? అనే అనుమానం కలుగుతోందని ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆగంతకుడిని గుర్తిస్తే కాని అనుమానాలు నివృత్తి కావని అంటున్నారు. -
ఆవేశంలో కొట్టిన తండ్రి.. విగతజీవిగా కుమార్తె
వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు.ఈ వ్యవహారం నచ్చని యువతి తల్లిదండ్రులు తమ కుమార్తెకు మరో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది తెలిసిన ఆమె ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వారిద్దనీ పట్టుకొచ్చిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇంటికి తిరిగి వచ్చాక కూడా ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టుపట్టి తిండి మానేయడంతో ఆగ్రహించిన తండ్రి కుమార్తెపై చేయి చేసుకున్నాడు. ఆ రాత్రి ఏం జరిగిదో.. తెల్లవారేసరికి ఆ యువతి చనిపోయిందంటూ హడావుడిగా మృతదేహాన్ని దహనం చేశారు. కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో సోమవారం వెలుగు చూసినఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. తన కుమార్తె ఉరివేసుకుని చనిపోయిందని మృతురాలి తల్లి చెబుతున్నప్పటికీ ఈ ఘటనపై భిన్న వాదనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోపాటు, తనపై చేయిచేసుకున్నాడని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందా..? లేక తల్లిదండ్రులే పరువు హత్య చేశారా.. అనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం, కొమరోలు(గిద్దలూరు): మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పందనబోయిన ఆవులయ్య, అంజనమ్మ దంపతుల కుమార్తె ఇంద్రజ (20) ఇంద్రజ ఇంటర్ వరకు చదువుకుని ఖాళీగా ఉంటోంది. గ్రామానికి చెందిన దళిత యువకుడు చైతన్య డిగ్రీ చదువుతూ మధ్యలో చదువు ఆపేసి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరిద్దరి మధ్య మూడేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంద్రజ తండ్రి సీఆర్పీఎఫ్ జవానుగా పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇంద్రజ హైదరాబాద్‌లోనే ఉంటోంది. గతేడాది ఇంద్రజను సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది తెలిసిన చైతన్య హైదరాబాద్ వెళ్లి ఇంద్రజను ఇంటి నుంచి తనతో తీసుకెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరినీ గుర్తించి తీసుకొచ్చారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తాను చైతన్యనే వివాహం చేసుకుంటానని ఇంద్రజ అన్నం కూడా తినకుండా ఉందని గ్రహించిన ఆవులయ్య 10 రోజుల క్రితం ఆమెను స్వగ్రామం నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చాడు. చైతన్యపై గిద్దలూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు తాను ఇంద్రజను పెళ్లిచేసుకోనని, ఆమె జోలికి రానని చెబుతూ పెద్దల సమక్షంలో అంగీకరించాడు. స్థానికుల సమాచారంతో వెలుగులోకి.. పోలీసులు, పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిన తర్వాత కూడా ఇంద్రజ తన పట్టు వీడకుండా కడుపు మాడ్చుకుని ఉండటంతో ఆగ్రహించిన తండ్రి ఆదివారం రాత్రి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో సోమవారం ఉదయం యువతి మృతి చెందిందంటూ తండ్రి ఆవులయ్య దగ్గర్లోని శ్మశానంలో హడావుడిగా దహనం చేస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న గిద్దలూరు ఎస్సై కె.మల్లికార్జున మృతురాలి ఇంటిని, దహన సంస్కారాలు చేసిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వీఆర్వో ఖాదర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కాల్చివేయడంతో ఎలాంటి ఆధారాలు లభ్యం కావడం లేదు. ఘటనపై అనుమానాలెన్నో.. ఇంద్రజ మృతి సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన యువకున్ని ప్రేమించడం వలన కొట్టడంతో చనిపోయిందా, మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా అనేది గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. తమ కుమార్తె వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని పరువు కోసం కొట్టి హత్య చేశారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారంలో గత 15 రోజులుగా జరుగుతున్న సంఘటనల వలన ఆదివారం రాత్రి ఇంద్రజకు, ఆమె తండ్రికి మధ్య మరోసారి గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తన తండ్రి కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెంది ఉండొచ్చని కొందరు, ప్రేమికునితో కాకుండా తన బంధువుతో వివాహం చేస్తారేమోనన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని, కేసు అవుతుందని భయంతోనే కాల్చేశారని మృతురాలి తల్లి అంజనమ్మ చెబుతోంది. దీనిపై ఎస్సై మల్లిఖార్జున వివరణ ఇస్తూ ప్రేమ వ్యవహారం వాస్తవమేనన్నారు. ఇంద్రజకు ఆమె బావతో నిశ్చితార్థం అయిందని, అతనినే వివాహం చేసుకోవాలని తండ్రి ఒత్తిడి తేవడం వలన ఆత్మహత్య చేసుకుందా, లేక కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందా అనేది విచారిస్తున్నామన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. -
పరువు హత్యల నేపథ్యంలో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కోటేంద్ర దుద్యాలను దర్శకునిగా పరిచయం చేస్తూ, కె.ఎం.డి.షఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. పరువు హత్యల నేపథ్యంలో ఉంటుంది. ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి. తాజాగా జరిగిన పరువు హత్య ప్రణయ్ విషయంలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన పద్ధతిలో ముగింపు ఎలా ఉండాలో మావంతు ప్రయత్నంగా ఈ సినిమాలో చూపించాం. మంచి ప్రేమ కథ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్ మరువలేనిది’’ అన్నారు. -
కరీంనగర్ జిల్లాలో పరువు హత్య?
సాక్షి, శంకరపట్నం (మానకొండూర్): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పరువు హత్య మంగళవారం కలకలం సృష్టించింది. తమ కూతురును ప్రేమ పేరిట వేధిస్తున్నాడని భావించిన యువతి తల్లిదండ్రులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హతుడి ప్రియురాలు, బంధువుల కథనం ప్రకారం.. తాడికల్‌కు చెందిన గడ్డి సారయ్య, మల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు గడ్డి కుమార్ (23) హుజూరాబాద్‌లోని ఓ సెల్ పాయింట్లో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అంతకుముందే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు.. కుమార్‌ను మందలించారు. పైగా తమ కూతురును కుమార్ కిడ్నాప్ చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు కుమార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా ఇద్దరి వైఖరిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 6న ప్రేమికులిదరూ నిజామాబాద్‌కు పారిపోయారు. 7న శంకరపట్నంలో దిగారు. అనంతరం బాలికను తాడికల్ పంపించిన కుమార్.. హుజూరాబాద్ వెళ్లిపోయాడు. అప్పటికే కుమార్‌పై కక్ష పెంచుకున్న బాలిక తల్లిదండ్రులు ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు. అదేరోజు రాత్రి కుమార్ తాడికల్‌కు రాగానే.. బాలిక తండ్రి నర్సయ్య, మేనమామ మొల్గూరి శ్రీనివాస్, తాత సత్తయ్య, పెద్దనాన్నలు శ్రీనివాస్, సమ్మయ్య కుమార్‌ను చింతగుట్ట శివారులోని గుట్టల్లోకి తీసుకెళ్లారు. కీడును శంకించిన కుమార్ ఈ విషయాన్ని సదరు బాలికకు ఫోన్లో చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన బాలిక వెంటనే కుమార్ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అప్పటికే రాత్రి 11 గంటల సమయం కావడం.. కుమార్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బంధువులు అదేరాత్రి చింతగుట్ట శివారులో వెదికారు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో బంధువులు తాడికల్ వద్ద ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం ఎంగిలి పూల కోసం అదే గ్రామానికి చెంది న ఓ మహిళ పత్తి చేనులోకి వెళ్లగా మృతదేహం కనిపించింది. విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అది కుమార్ మృతదేహంగా తేలింది. ఆదివారం రాత్రే హత్య చేసి.. మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి పత్తి చేనులో పడేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యంలో యాసిడ్ కలిపి తాగించి హత్య చేసినట్లు నిర్ధారించారు. పొట్టనబెట్టుకున్నారు: ప్రియురాలు కుమార్ మృతదేహం వద్ద బాలిక తీవ్రంగా రోదించింది. ‘లే నాని లే..’అంటూ ఆ అమ్మాయి ఏడ్వడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. కుమార్‌ను తన తల్లిదండ్రులు.. మేనమామ కలిసే హతమార్చారని ఆరోపించింది. ఎస్సైపై దాడి.. పోలీసు వాహనం ధ్వంసం మృతదేహాన్ని పరిశీలించేందుకు ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకోగా.. మృతుడి బంధువులు దాడికి దిగారు. తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితుల నుంచి రూ.4 లక్షలు తీసుకున్నావని దాడి చేయడంతో ఎస్ఐ గాయపడ్డాడు. అక్కడే ఉన్న పోలీస్ వాహనాన్ని బంధువులు ధ్వంసం చేశారు. అన్ని కోణాల్లో విచారణ: ఏసీపీ కుమార్ హత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని ఏసీపీ కృపాకర్ తెలిపారు. కుమార్, అదే గ్రామానికి చెందిన బాలిక ఏడాది కాలంగా ప్రేమించుకున్నట్లు చెప్పారు. ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు కుమార్‌పై కేసు నమోదైందన్నారు. ఈ నెల 6న హుజూరాబాద్‌కు వెళ్లిన బాలికను కుమార్ నిజామాబాద్ తీసుకెళ్లి.. మరుసటి రోజు ఇంటికి పంపినట్లు సమాచారం. అదేరోజు రాత్రి కుమార్ కనిపించడం లేదని అతడి తండ్రి సారయ్య ఫిర్యాదు చేయడంతో కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు చేశామని వివరించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోన్ కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. విచారణ అధికారిగా హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్‌ను నియమించామని, దోషులెవరైనా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అన్ని కోణాల్లో విచారణ: ఏసీపీ హైదరాబాద్‌లో మరో మారుతీరావు -
భాస్కర్‌ది కూడా పరువు హత్యేనా..?
పంజగుట్ట: తన కుమారుడి మరణంపై ఎన్నో సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తిచేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న భాస్కర్ తల్లిదండ్రులు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మృతుడి తండ్రి సత్యనారాయణ, తల్లి దీవెన, సోదరుడు సుదర్శన్, సోదరి సులోచన వివరాలు వెల్లడించారు. బోరబండ శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న భాస్కర్ (24) ఘట్కేసర్లోని నల్ల నర్సింహ్మా రెడ్డి కాలేజీలో బీఫార్మసీ పూర్తిచేశాడు. కాలేజీలో అతడికి మహబూబ్ నగర్ జిల్లా ఎనుగొండ గ్రామానికి చెందిన కర్రె నిషిత అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గత ఆగస్టులో నిషిత తన ప్రేమ విషయాన్ని వారి ఇంట్లో చెప్పింది. దీంతో ఆగస్టు 19న నిషిత బాబాయ్ కొర్రమోని వెంకటయ్య భాస్కర్‌కు ఫోన్‌చేసి బెదిరించాడన్నారు. 20న నగరానికి వచ్చిన అతను తమను బోరబండ కమ్యునిటీహాల్‌కు పిలిపించి నిషితను మర్చిపోవాలని బెదిరించినట్లు తెలిపారు. మరుసటి రోజే నిషిత భాస్కర్‌కు ఫోన్‌చేసి మహబూబ్‌నగర్ వచ్చి తన కుటుంబ సభ్యులను ఒప్పించాలని కోరడంతో భాస్కర్ అక్కడికి వెళ్లాడన్నారు. మర్నాడు ఉదయం వెంకటయ్య తమకు ఫోన్‌చేసి భాస్కర్ మహబూబ్‌నగర్‌లో అపస్మారకస్థితిలో ఉన్నాడని, అతడిని తీసుకువెళ్లాలని చెప్పడంతో తాము అక్కడికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తెలిపారు. భాస్కర్ ఆగస్టు 23న మళ్లీ మహబూబ్ నగర్ వెళ్లాడని, అదేరోజు సాయంత్రం నిషిత బాబాయ్ ఫోన్ చేసి భాస్కర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పడంతో తాము అక్కడకు వెళ్లేసరికి అతను మృతి చెంది ఉన్నాడన్నారు. ముమ్మటికీ హత్యే .. భాస్కర్‌ది ఆత్మహత్య కాదని..ముమ్మటికీ హత్యేనని వారు అరోపించారు. నిషిత కుటుంబం మున్నూరు కాపులని, తాము మాదిగ కులానికి చెందిన వారం కావడంతోనే పిలిపించి హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. వెంకటయ్య టీఆర్ఎస్ నాయకుడని, అతని భార్య కొర్రమోని వనజ కౌన్సిలర్‌గా కొనసాగుతందని, వారికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నందునే దర్యాప్తును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆగస్టు 23న భాస్కర్ మరణిస్తే సెప్టెంబర్ 3న పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారని, ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
వెతకబోయిన కత్తి చేతికి దొరికి..!
సాక్షి, సిటీబ్యూరో: ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో పాటు తనను నిర్లక్ష్యం చేస్తోందనే కక్షతో కన్న కూతురి పైనే కత్తి కట్టిన మనోహరాచారి ఆమెపై దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని చోరీ చేసి తీసుకువచ్చాడు. ఈ కేసుకు సంబంధించి కీలకాధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్‌లను ఎస్సార్‌నగర్ పోలీసులు సేకరించారు. ఎర్రగడ్డ ప్రాంతంలో గత బుధవారం తన కుమార్తె మాధవిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు మనోహరాచారిని తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. హత్యాయత్నానికి రెండు రోజుల ముందు నుంచి మనోహరాచారి ముభావంగా ఉండటంతో పాటు విపరీతంగా మద్యం తాగుతున్నాడు. గత బుధవారం ఉదయం మాధవికి ఫోన్ చేసి వస్త్రాలు ఖరీదు చేసుకోవడానికి ఎర్రగడ్డకు రావాలని సూచించాడు. అనంతరం అమీర్‌పేటలోని దుకాణం నుంచి నేరుగా బైక్‌పై ఎస్సార్‌నగర్ వెళ్ళిన మనోహరాచారి అక్కడ ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లి మద్యం తాగాడు. మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరిన అతను మాధవిని చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అక్కడి నుంచి మైత్రీ వనం వైపు వస్తూ.. మైత్రీ వైన్స్ పక్కన ఉన్న ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్ద ఉన్న కత్తిని తస్కరించారు. ఈ దృశ్యాలు కొబ్బరి బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మాధవి, సందీప్‌లపై దాడి జరిగింది. -
స్త్రీలోక సంచారం
♦ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో 2019 ఆస్కార్ పోటీలకు భారతదేశం నుంచి అధికారికంగా ప్రవేశం పొందిన అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్’ దర్శకురాలు రీమా దాస్.. తన చిత్రం ప్రచారం కోసం డబ్బుల వేటలో పడ్డారు. సొంత గిటార్ సంపాదించుకుని, స్థానిక బాలురతో మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేయాలని కలలుగన్న ధను అనే పదేళ్ల బాలికలోని తపనను కథాంశంగా తీసుకుని, చేత్తో పట్టుకుని తీసే కెమెరాతో అస్సాంలోని పల్లె ప్రాంతాలలో రీమా దాస్ చిత్రీకరించిన ‘విలేజ్ రాక్‌స్టార్’ ఇప్పటివరకు కనీసం 40 దేశాలలో ప్రదర్శనకు, అభినందనలకు నోచుకుంది. ♦ ఒక కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారం జరిపి, అసహజమైన లైంగిక అకృత్యాలకు పాల్పడిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కేరళ కోర్టు ఇచ్చిన రెండు రోజుల పోలీసు కస్టడీ ఈరోజు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ముగుస్తోంది. బిషప్ అప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నందున అతడికి ఈ రెండు రోజుల కస్టడీ నుంచి మినహాయింపును ఇవ్వాలని లాయర్లు కోరగా.. ఆ మూడు రోజులూ బిషప్కు సామర్థ్య నిర్ధారణ పరీక్ష చేయడానికి, అతడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, దుస్తులు స్వాధీనం చేసుకోడానికి సరిపోయినందున.. అనంతర విచారణ కోసం మళ్లీ ఒకసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరఫు న్యాయవాదులు చేసిన వాదనకు అనుకూలంగా మేజిస్ట్రేట్ స్పందించారు. ♦ తెలంగాణలో పరువు హత్యల కలకలం ఇంకా సద్దుమణగకుండానే తాజాగా హైదరాబాద్‌కు 80 కి.మీ. దూరంలోని జనగామ పట్టణానికి చెందిన 18 ఏళ్ల అగ్రకుల యువతి, జనగామకు 20 కి.మీ. దూరంలోని పరిపడిగ ప్రాంత ఎరుకల కులస్తుడైన 25 ఏళ్ల యువకుడు.. గుర్తు తెలియని ఒక అటవీ ప్రాంతంలో తామిద్దరూ ఉన్న చోటు నుంచి ఒక వీడియో తీసి.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో ఈ జంటకు వారి కుటుంబాల నుంచి ప్రాణహాని పొంచి ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదే ఇంటర్ పూర్తి చేసిన యువతి, రెండు నెలల క్రితం ఆ యువకుడిని కులాంతర వివాహం చేసుకుని జనగాం నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడి నుంచి అతడితో కలిసి అటవీ ప్రాంతంలో తలదాచుకుని, తన తల్లిదండ్రుల నుంచి, గ్రామస్తుల నుంచి తమను కాపాడాలని ఆ వీడియోలో విజ్ఞప్తి చేయగా, గ్రామస్తులు మాత్రం ఆ యువకుడు ఇప్పటికే ముగ్గురు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, యువతిని అతడి బారిన పడనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కొన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు రాశాయి. ♦ అగ్రకుల కుటుంబానికి చెందిన ఓ పదేళ్ల బాలిక చెయ్యి తాకుతూ, చాక్లెట్ ఇచ్చిన పదమూడేళ్ల బాలుడిని ఆ బాలిక బంధువులు అతడి ఇంటి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు.. ఒంటి మీద బట్టలు తీసి, కొట్టుకుంటూ, దిగంబరంగా నడిపించుకుంటూ వెళ్లిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే బాలిక బంధువులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్సీ యాక్ట్ 1989 లోని సెక్షన్ 452, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ¯ð లకొంది. ♦ 2022లో అంతరిక్షంలోకి మనిషిని పంపే భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్’కు డైరెక్టర్‌గా వి.ఆర్.లలితాంబిక ఎంపిక అయ్యారు. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో వంద మిషన్ల అనుభవం ఉన్న సీనియర్ సైంటిస్ట్ లలిత (56) 2017 ఫిబ్రవరి 15న భారతదేశం రికార్డు స్థాయిలో నింగిలోకి 104 ఉపగ్రహాలను పంపించిన ప్రాజెక్టులో కూడా కీలక పాత్ర పోషించారు. ♦ రుడాలి, చింగారి, ఏక్ ఫల్ దామన్ : ఎ విక్టిమ్ ఆఫ్ మార్షల్ వయలెన్స్‌తో పాటు ఇంకా అనేక స్త్రీవాద చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన బాలీవుడ్ దర్శకురాలు కల్పనా లజ్మీ (61) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. 2006లో మిథున్ చక్రవర్తి, అంజు సహానీ, సుస్మితా సేన్లతో తన ఆఖరి సినిమా ‘చింగారి’ని తీసిన కల్పన ఏడాది కాలంగా కిడ్నీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, కరణ్ జోహార్, ఆలియాభట్, సోనీ రాజ్‌ధాన్, నీనా గుప్తా ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. ♦ భారతదేశపు తొలి మహిళా విమానయాన ఫైర్ ఫైటర్‌గా 26 ఏళ్ల తానియా సాన్యాల్ తన జన్మస్థల మైన కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్‌లో బాధ్యతలు స్వీకరించారు. విధినిర్వహణలో భాగంగా తానియా.. 161 మందితో కూడిన పురుష బృందంతో జూనియర్ అసిస్టెంట్‌గా కలిసి పని చేయడంతో పాటు.. కోల్‌కతా సమీపంలోని నారాయణపూర్‌లో ఉన్న ‘ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్’ (ఎఫ్.ఎస్.టి.సి.)లో 25 ఏళ్ల అంజలీ మీనా (జైపూర్) అనే ఒకే ఒక యువతి సహా 133 మంది యువకులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ♦ లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియానికి అనుబంధంగా ప్రపంచ దేశాలలోని ముఖ్యనగరాలతో పాటు ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇటీవల తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే ఆ మ్యూజియంలో ఉన్న షారుక్‌ఖాన్, విరాట్ కోహ్లీ, కత్రీనా కైఫ్ వంటి వారితో పాటు తన విగ్రహం కూడా ఉండటంపై సన్నీ లియోన్ ఆనందం వ్యక్తం చేస్తూ, విగ్రహం పక్కన నిలబడి తీసుకున్న ఫొటోను ‘ది క్రేజీనెస్ అండ్ హిస్టీరియా’ అనే కామెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ‘షి ఈజ్ ది మోస్ట్ గూగుల్డ్ ఎంటర్టైనర్ ఇన్ ఇండియా’ అని పేర్కొంటూ విగ్రహంతో ఉన్న ఆమె వీడియోను ఇంగ్లండ్‌లోని హఫింగ్టన్ పోస్ట్ ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. -
చూడాలనుందని పిలిచి మరీ దాడి
సాక్షి, హైదరాబాద్: కులతత్వం, దురహంకార హత్యలపై ఒకవైపు తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిరోడ్డుపై పట్టపగలే నవదంపతులపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై కన్నతండ్రే హత్యాప్రయత్నం చేశాడు. దీంతో మాధవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. కూతుర్ని చూడాలని ఉందని చెప్పి మరీ కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై పాశవికంగా దాడిచేయడం కలకలం రేపింది. బోరబండకుచెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్ సెప్టెంబర్ 12న బోయిన్పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని తండ్రి మాధవిపై వేటకొడవలితో అతి దారుణంగా దాడిచేసాడు. మెడపైన, చేతిపై తీవ్ర గాయాలు కావడంతో సోమాజగూడలోని యశోద ఆసుపత్రిలో మాధవి ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెడ నరాలు బాగా దెబ్బతిన్నాయనీ, రెండు మూడరోజు గడిస్తే తప్ప ఏమీచెప్పలేమని వైద్యులు ప్రకటించారు. అటు సందీప్ పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. అమ్మాయిని చూడాలని పిల్చి మరీ హత్యాయత్నం చేశారని అబ్బాయి స్నేహితుడు ఒకరు తెలిపారు. చంపేద్దామనే వచ్చారనీ, అయితే సందీప్ తృటిలో తప్పించుకున్నాడని చెప్పాడు. మరోవైపు సందీప్‌కు తండ్రి లేడు. తల్లి కష్టపడి సందీప్‌ను పెంచి పెద్ద చేసిందనీ, పెళ్లి తరువాత ఇద్దరూ సందీప్ ఇంటివద్దనే ఉంటున్నారని తెలిపారు. వీరికి న్యాయం చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. పెళ్లి జరిగిన వారం రోజుల్లోపునే ఈ హత్యాయత్నం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు మండిపడుతున్నారు. కులాంతర వివాహమే ఈ దాడికి కారణమై ఉండవచ్చని ప్రాథమింగా పోలీసులు అంచనావేశారు. ఇది ఇలా ఉంటే నిందితుడు, మాధవి తండ్రి మనోహరాచారి పోలీసులకు ముందు లొంగిపోయాడు. -
ఇలా ఆలోచిస్తారు అని ఎప్పుడు అనుకోలేదు: అమృత
-
ప్రణయ్ హత్య : కౌసల్య శంకర్ ఏమన్నారు?
సాక్షి,హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ (24) ఘోరమైన హత్యలాంటిదే తమిళనాడులో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడు శంకర్ (22) హత్య. ప్రణయ్ హత్య జరిగిన వెంటనే కౌసల్య, శంకర్ల విషాద గాథ అందరి మదిలో మెదిలింది. కేవలం తమ అమ్మాయి కౌసల్యను కులాంతర వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో శంకర్‌ను కౌసల్య తండ్రి కిరాయి హంతకుల ద్వారా అతిదారుణంగా పట్టపగలే నరికి చంపించిన వైనం అప్పట్లో కలకలం రేపింది. 2016 మార్చిలో తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చం ప్రణయ్ హత్య తరహాలోనే, మాటువేసి వెనుకనుండి దాడిచేసి పట్టపగలే నడిరోడ్డులో కత్తులతో నరికి చంపారు. ఈ హత్య కూడా సీసీ టీవీలో రికార్డు అయింది. ప్రణయ్ హత్యోదంతాన్ని తెలుసుకున్న కౌసల్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై ఇలాంటి భయానక హత్యలకు చరమగీతం పాడాలంటే కుల వ్యవస్థ మొత్తం నాశనం కావాలని కౌసల్య పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక మహిళ మరొక కులంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటే కులం నాశనమవుతుందని భావిస్తారు. ప్రత్యేకంగా, అబ్బాయి అణచివేత కులానికి చెందిన వాడైతే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. తమ కుమార్తె గర్భంలో మరొక కులానికి చెందిన శిశువు ఎలా ఉంటుందని రగిలిపోతారు. భారతీయ సమాజం మొత్తం కులతత్వ సమాజం. కులతత్వం ఉన్నంతకాలం ఈ భయంకరమైన కుల నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ప్రభుత్వాలు చొరవ తీసుకుని కులతత్వాన్ని సమూలంగా నాశనం చేసే మార్గాన్ని కనుగొంటే తప్ప, వీటికి అడ్డుకట్ట పడదని ఆమె చెప్పింది. హింస నుండి మహిళలను కాపాడడానికి చట్టాలున్నాయి కాబట్టే కొంతమేరకు పోరాడగలుగుతున్నాం. కానీ పరువు హత్యలపై ఇప్పటికీ ఎలాంటి చట్టాలు లేవు. ఇలాంటి పటిష్టమైన చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకు రావాల్సి ఉంది. కఠినచట్టాలు, రక్షణ లేకుండా , కేవలం నోటిమాటలతో ఈ హత్యల్ని ఆపలేం. ఇలాంటి వివాహాలు తప్పు కాదని చెప్పే చట్టాలు రావడంతోపాటు ఆయా జంటలకు ప్రోత్సాహన్నందించాలని కౌశల్య ఆకాంక్షించారు. మా తరువాత చాలా జంటల్ని కులం పొట్టన పెట్టుకుంది. మహిళలను శిశువులను తయారుచేసే యంత్రాలుగానే సమాజం చూస్తోంది. కేవలం కులాన్ని కాపాడే దేవతలుగా మాత్రమే మహిళల్ని గౌరవిస్తున్నారని కౌశల్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తమ తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు పోలీస్ స్టేషన్ల నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు. వారికిష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు అంటూ ఆ జంటను విడదీయడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు ఇలా ఎందుకు చేయాలి? చట్ట ప్రకారం, న్యాయం వైపు వారు ఎందుకు వుండరు? పోలీసులు హింసనుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఏ ఆఫీసర్ అలా చేయడం లేదని కౌశల్య ఆరోపించారు. పెరియార్, అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళల విముక్తి లేకుండా కులవ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు. ఈ రోజుల్లో కులాలు ఎక్కుడున్నాయని అందరూ అంటారు. కానీ, ప్రతిరోజూ అనుభవిస్తున్న వారికి మాత్రమే ఆ వివిక్ష తాలూకు బాధేంటో తెలుసునని కౌశల్య వ్యాఖ్యానించారు. కాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త కన్నవాళ్ల చేతుల్లోనే దారుణంగా హత్య కావడంపై కౌసల్య న్యాయపోరాటం చేసారు. నేరస్తులకు ఉరిశిక్షపడేదాకా మొక్కవోని ధైర్యంతో పోరాడారు. ప్రస్తుతం కులనిర్మూలన కోసం పోరాటం చేస్తున్నారు.. మరోవైపు కౌశల్య తరహాలోనే అమృత ప్రణయ్ కూడా కులనిర్మూలనకోసం ఉద్యమిస్తానని చెప్పడం గమనార్హం. -
ప్రేమ.. పరువు.. హత్య
-
ప్రణయ్ హత్య : మంచు మనోజ్ ట్వీట్ వైరల్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యపై సినీ హీరో మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కులం, మతోన్మాదంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఈ ఘటనపై ట్విటర్ ద్వారా మంచు మనోజ్ తన మనసులోని ఆవేదనను, బాధను వ్యక్తం చేసారు. ప్రణయ్ హంతకులనుద్దేశించి ఈ ట్వీట్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. కులాల పేరుతో ఎందుకీ వివక్ష, హత్యలు అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. మానవత్వం కంటే మతం కులం ఎక్కువా? మనమంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పటికి గుర్తిస్తుందంటూ ఆవేదనతో ప్రశ్నించారు. కుల దురహంకార హత్యలను తీవ్రంగా దుయ్యబట్టిన మనోజ్ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతకు, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కులం, మతం పిచ్చోళ్లు సమాజంలో ఉండటం వల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుల అహంకారాన్ని తలకెక్కించుకుని కుల మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతీ వ్యక్తి ప్రణయ్ హత్యకు బాధ్యులేనన్నారు. అందుకే ఓ బిడ్డ ఇంకా లోకం చూడకుండానే తన తండ్రి స్పర్శను కోల్పోయింది. ఇంతకంటే విషాదం ఎవరి జీవితాల్లోనైనా ఏముంటుందని వ్యాఖ్యానించారు. కులోన్మాదుల్లార సిగ్గుపడండి.. గుర్తుంచుకోండి..కులాన్ని సమర్ధిస్తున్న మీరందరూ ప్రణయ్ హత్యకు బాధ్యులే. ఇకనైనా కళ్లు తెరవండి. మనుషులుగా బతుకండి..కులవ్యవస్థ నాశనం కావాలి. ఆ అంటురోగాన్ని ముందుగానే నిరోధించాలి. హృదయపూర్వకంగా మీ అందరినీ అడుగుతున్నా.. మన బిడ్డలకు మెరుగైన సమాజాన్ని అందిద్దాం అంటూ ఉద్వేగంతో చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. కాగా మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కలకలం రేపింది. పట్టపగలే కిరాయి గుండాలతో అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్‌ను పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పరువు పేరుతో కన్న కూతురి జీవితాన్ని అతలాకుతలం చేసిన వైనంపై దళిత, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మారుతీరావు సహా నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. To everyone who murdered Pranay🙏 #RIPPranay pic.twitter.com/idHfVK38eS — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 17, 2018 -
పరువు తీసిందని పొట్టన పెట్టుకున్నాడు
పెద్దఅంబర్‌పేట (ఇబ్రహీంపట్నం): ‘పరువు’కు మరో ఆడ కూతురు బలయ్యింది. తనను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందని, తమ పరువు తీసిందని నిండు గర్భిణి అని కూడా చూడకుండా కూతురును కిరాతకంగా హత్య చేశాడో తండ్రి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుందీ ఘటన. తల్లి చనిపోయిందని రావడంతో.. అబ్దుల్లాపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఎల్లంకి కిష్టయ్య కుమారుడు ఎల్లంకి సురేశ్, పక్కింట్లో ఉండే మంగలిపల్లి నర్సింహ కూతురు విజయలక్ష్మి (27) ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఇంట్లో వారిని ఎదిరించిన విజయలక్ష్మి 2014లో సురేశ్‌ను వివాహం చేసుకుంది. భద్రాచలంలో కాపురం పెట్టింది. సురేశ్ తాపీ పని చేస్తూ విజయలక్ష్మిని పోషించుకుంటున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విజయలక్ష్మి ప్రస్తుతం ఏడు మాసాల గర్భిణి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న సురేశ్ తల్లి సుక్కమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అంత్యక్రియల కోసం సురేశ్ దంపతులు గ్రామానికి వచ్చారు. ఎప్పటి నుంచో విజయలక్ష్మి మీద పగ పెంచుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హత్యచేసేందుకు పన్నాగం పన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు గ్రామపెద్దల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలతో మాట్లాడారు. విజయలక్ష్మి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురాగా గురువారం ఊరి నుంచి పంపిస్తామని గ్రామపెద్దలు చెప్పా రు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి.. మెడ కోసి.. గురువారం ఉదయం తల్లి నర్సమ్మ, చిన్నమ్మలు వనమ్మ, లావణ్య, మంగమ్మ, యాదమ్మ, రాములమ్మ.. విజయలక్ష్మిని తమ వెంట తీసుకువెళ్లేందుకు వచ్చారు. వారిని చూసిన విజయలక్ష్మి ఇంట్లోకి వెళ్లగా ఆమెను బలవంతంగా సమీపంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్లోకి లాక్కెళ్లారు. సురేశ్ కుటుంబసభ్యులు అడ్డుకుని బతిమిలాడినా పట్టించుకోకుం డా విజయలక్ష్మీని కొడుతూ తీసుకెళ్లారు. కమ్యూనిటీ హాల్లో కత్తితో సిద్ధంగా ఉన్న నర్సింహ ఆమె మెడను కోశాడు. చీరతో విజయలక్ష్మి గొంతును గట్టిగా చుట్టి కుటుంబ సభ్యుల సహాయంతో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. నర్సింహాతోపాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ మునితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భార్యను హత్యచేసిన నర్సింహతోపాటు అతనికి సహకరించిన కుటుంబసభ్యులపై పోలీసులకు సురేశ్ ఫిర్యాదు చేశాడు. -
నేను కెవిన్లా చనిపోవాలనుకోవడం లేదు..
-
‘మమ్మల్ని చంపితే మీకేం వస్తుంది..?’
తిరువనంతపురం : ‘మమ్మల్ని చంపితే మీకేం వస్తుందం’టూ ఓ నవ వధువు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. కేరళకు చెందిన హ్యారిసన్ (క్రిస్టియన్), షహానా (ముస్లిం)లు రెండు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకున్నారు. వివాహానంతరం భార్యతో కలిసి దిగిన ఫొటోను హ్యారిసన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కాసేపటి తర్వాత.. మతాంతర వివాహం చేసుకున్న కారణంగా తమను చంపుతామంటూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ హ్యారిసన్ వీడియోను పోస్ట్ చేశాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను కెవిన్లా చనిపోవాలనుకోవడం లేదు.. పరువు హత్యల గురించి మాట్లాడుతూ... ‘మేము రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి మాకు బెదిరింపులు మొదలయ్యాయి. ఓ తీవ్రవాద భావాలు గల సంస్థ(ఎస్డీపీఐ) చంపేస్తామని బెదరిస్తోంది. నాతో పాటు మా అమ్మానాన్నల్ని కూడా చంపేస్తారట. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా కెవిన్(ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన వ్యక్తి)లా జీవితాన్ని కోల్పోలేనంటూ’ హ్యారిసన్ పేర్కొన్నాడు. కుల, మతాలకు అతీతంగా.. షహానా మాట్లాడుతూ.. ‘ప్రేమ, పెళ్లి అనేది మనసుకు సంబంధించినవి. మేము మా కులం, మతం గురించి ఆలోచించలేదు. కానీ నా కుటుంబ సభ్యులే ఇప్పుడు నన్ను, నా భర్త కుటుంబాన్ని చంపేస్తామంటున్నారు. కానీ జీవితాంతం అతడితో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మమ్మల్ని చంపితే మీకేం వస్తుందంటూ’ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ వీడియో గురించి గానీ, ఆ జంట గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
యూపీలో పరువు హత్య కలకలం...
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న ఓ తండ్రి ప్రేమ జంటను తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూర్వ జంగ్లా అంబేద్కర్ నగర్‌కు చెందిన జైశ్‌రాజ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె వందన(19) ఉంది. సవారా గ్రామానికి చెందిన యువకుడు శశికాంత్‌ను ప్రేమించిన వందన.. అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గురువారం కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేని సమయంలో తనను తీసుకు వెళ్లాల్సిందిగా శశికాంత్‌ను కోరింది. అదే సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన జైశ్‌రాజ్.. వందనతో మాట్లాడుతున్న శశికాంత్‌ను చూసి కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే తన వద్ద ఉన్న డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్‌తో వందన, శశికాంత్‌లను కాల్చగా వారు అక్కడిక్కడే మరణించారు. కాగా శశికాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు జైశ్‌రాజ్ , అతడి కుమారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరం అంగీకరించిన జైశ్‌రాజ్ హత్యకు ఉపయోగించిన తుపాకీతో సహా స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని, అతడి కుమారులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. -
ముమ్మాటికీ పరువు హత్యే
ఆళ్లగడ్డ: లక్ష్మిదేవిది ముమ్మాటికీ పరువు హత్యేనని మానవహక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు జగన్నాథరావు, జయశ్రీ పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మైనర్ కూతురును కన్నతండ్రే కిరాతకంగా హత్య చేసిన ఘటనపై సాక్షిలో మంగళవారం ‘కన్న తండ్రే కాలయముడు’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన మానవహక్కుల వేదిక సభ్యులు శుక్రవారం కోటకుందుకూరు చేరుకుని లక్ష్మిదేవిని ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మిదేవిని తల్లిదండ్రులు నర్సమ్మ, నరసింహులు, బాబాయి బాలకృష్ణ కొట్టి చంపి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు్ల చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితురాలిని జువైనల్ హోంలో ఉంచి రక్షణ కల్పించి ఉంటే హత్య జరిగి ఉండేదికాదన్నారు. ప్రభుత్వం స్పందించి పరువు హత్యలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి దేవంద్రబాబు ఉన్నారు -
ప్రేమికులకు ప్రొ'టెక్'షన్
మళ్లీ ఒక పరువు హత్య! అగ్రకులానికి చెందిన అమ్మాయి దళితుడిని ప్రేమించి, కుటుంబాన్ని ఎదురించి పెళ్లి చేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకొని కుటుంబ పరువు గంగలో కలిపిందని అగ్రహోదగ్రులయ్యారు కుటుంబసభ్యులు. అమ్మాయిని వెదికి, నయానా, భయానా ఇంటికి తీసుకొచ్చి, మూడో కంటికి తెలియకుండా అమ్మాయిని చంపేసి, అబ్బాయి మీద కిడ్నాప్ కేస్ పెట్టారు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన గురించి తమిళ పేపర్లో వార్తగా వచ్చింది. ఇలాంటివి ఈ మధ్య బాగా వింటోంది చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వసుమతి వాసంతి. కుల వివక్ష మీద పెరియార్ రామస్వామి యుద్ధం ప్రకటించిన నేల మీద పరువు హత్యలా? ఇవి అనాగరికమని, ఇలాంటి హత్యలకు పాల్పడిన వాళ్లకు తగిన శిక్ష ఉంటుందని 2006లో అపెక్స్ కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది. అయినా ఆగలేదే?! 2013 నుంచి 2017 వరకు నాలుగేళ్లలో 187 పరువు హత్యలు జరిగాయని ఓ రిపోర్ట్ చెప్తోంది. అన్యాయం! ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో వాళ్లను విడదీయడమే కాకుండా చంపడం ఏమిటి? వసుమతి మనసు కలత చెందింది. ఏదైనా చేయాలి... సహపంక్తి భోజనాల ద్వారా కాదు, కులాంతర వివాహాల ద్వారా కులం నశిస్తుంది అని చెప్పాడు అంబేద్కర్. ప్రేమ ఆ పని చేస్తోంది. కానీ సమాజం అడ్డుకుంటోంది. తను అలాంటి ప్రేమికులకు రక్షణ కల్పించాలి. ఏం చేయాలి? ఆలోచించింది. ఈ కాలంలో దేన్నయినా మేడ్ ఈజీ చెస్తున్నవి యాప్సే. గడప దాటకుండానే ప్రపంచాన్ని ఇంట్లో పెడుతున్నాయి. ఈ ప్రేమ పక్షులకు అలాంటి సురక్షితమైన యాప్ గూడును అల్లేస్తే? యెస్.. తట్టింది ఆమెకు. ఆపరేషన్‌లో మునిగింది. పెళ్లి చేస్తారు.. ఇల్లూ చూస్తారు! వసుమతి డెవలప్ చేసిన యాప్ పేరు.. కాదల్ అరణ్. అంటే ప్రొటెక్టర్ ఆఫ్ లవ్. ఇదెలా పనిచేస్తుందంటే.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వలంటీర్స్ ఉంటారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే యూజర్ తన కాంటాక్ట్ వివరాలన్నీ అందులో పొందుపర్చాలి. అలాగే ఆ జంట ఎలాంటి సహాయం కోరుకునుందో కూడా అందులో నమోదు చేయాలి. ఆ సమాచారాన్ని అనుసరించి వలంటీర్స్ ఆ జంటకు ఫోన్ చేస్తారు. వాళ్లున్న పరిస్థితిని బట్టి వారికి అవసరమైన న్యాయ సంబంధమైన, పోలీసుల సహకారం,షెల్టర్.. అంటే అద్దెకు ఇల్లు చూపెట్టడం వంటివి సహాయాన్ని అందిస్తారు. ఇవన్నీ కాక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంలోని ముందుంటారు. ‘‘తమిళనాడులోని దాదాపు అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఉన్నారు. ఇలా కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు స్వచ్ఛందంగా సహాయం అందించాల నుకునే వాళ్లు మా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇస్తాం’’ అని చెబుతున్నారు వసుమతి వాసంతి. ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో ప్రేమికులను విడదీయడమే కాక చంపిపారేయడం ఏంటి? వసుమతి మనసు కలత చెందింది. ఆ కలతలోంచి వచ్చిన ఆలోచనే.. కాదల్ అరణ్ యాప్! -
పెళ్లి చేసుకుందనే కోపంతో
ముంబై: వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ తండ్రి కూతురిని నరికి చంపాడు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నింఖాడే గ్రామానికి చెందిన బాలు షివారే తన కుమార్తె మనీషా హింగానేకు పెళ్లి సంబంధం ఖరారు చేశాడు. ఏప్రిల్ 20న పెళ్లి చేయాల్సి ఉంది. అయితే, మనీషా గ్రామానికే చెందిన గణేష్‌ను ప్రేమించి.. అతనితో కలిసి ఎటో వెళ్లిపోయింది. మార్చి 23వ తేదీన గణేష్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, బాలు కూతురిని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు. దీంతో మనీషా భర్తతో కలిసి ఇటీవలే గ్రామానికి వచ్చి అతని కుటుంబంతో కలిసి ఉంటోంది. బుధవారం సాయంత్రం కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన బాలు.. ఆమెను వెంట తెచ్చుకున్న గొడ్డలితో మెడపై నరికాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చిన గణేష్ రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించాడు. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, నిందితుడు బాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరాయి కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే చంపానని ఒప్పుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
హర్యానాలో పరువు హత్య
-
ప్రకాశం జిల్లాలో పరువు హత్య?
బెస్తవారిపేట: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో గురువారం వెలుగుచూసింది. మండలంలోని సలకలవీడు గ్రామానికి చెందిన స్వాతి(24) ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కాగా స్వాతి మరణించిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకుండా అత్తింటివారే దహన సంస్కారాలు పూర్తి చేశారు. దీంతో విషయం తెలుసుకున్న స్వాతి తల్లిదండ్రులు సలకలవీడుకు చేరుకుని తమ కూతురు ఏదని నిలదీయడంతో ఆత్మహత్య చేసుకుందని.. దహన సంస్కారాలు చేశామని.. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వాతికి ఐదేళ్ల క్రితమే వివాహమైంది. ఆమె భర్త ఆర్మీలో పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా స్వాతి తీరు సరిగ్గా ఉండేది కాదని భర్త ఉద్యోగానికి వెళ్లిన తర్వాత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని స్ధానికులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పలుమార్లు ఆమెను హెచ్చరించినా.. తీరు మార్చుకోకపోవడంతో అత్తింటి వారే హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య
-
పరువు హత్యపై విచారణ ప్రారంభించిన చెల్లప్ప కమిషన్
నేరుడుగొండలో జరిగిన పరువు హత్యపై విచారణ జరపడానికి చెల్లప్ప కమిషన్ సభ్యులు ఆదివారం నేరుడుగొండ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషన్ సభ్యులు హెచ్ కే నాగు, ఐటీడీఏ పీఓ ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ ఆర్డీఓ సుధాకర్ రెడ్డిలు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు..తమ కుమార్తె ప్రవర్తన కారణంగా కుటుంబం పరువుపోతోందని భావించిన తల్లిదండ్రులు కన్నకూతుర్నే కడతేర్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలకేంద్రంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. నేరడిగొండకు చెందిన అఖిల(17) అనే యువతి, తహశీల్ధార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేందర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో పరువుపోతుందని భావించిన యువతి తల్లిదండ్రులు గురువారం రాత్రి యువతిని చున్నీతో ఉరివేసి చంపి అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులను రిమాండ్‌కు తరలించారు. చెల్లప్ప కమిషన్ సభ్యులు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
నా కూతురు తప్పు చేసింది.. చంపేశాను
కరాచీ: పాకిస్తాన్లో ప్రేమ అన్నది పెద్ద నేరంగా మారుతోంది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారిని వేటాడి చంపేస్తారు. అక్కడ పరువుహత్యలు సాధారణమవుతున్నాయి. తాజాగా ఓ తల్లి కన్నకూతురును దారుణంగా చంపేసింది. అనంతరం వీధిలోకి వచ్చి తన కూతురు తప్పు చేసిందని, అందుకే చంపానని ఆమె ఏడుస్తూ చెప్పింది. లాహోర్‌లో ప్రవీణ్ రఫిక్ అనే మహిళకు 18 ఏళ్ల కూతురు జీనత్ ఉంది. జీనత్ హాసన్ ఖాన్ అనే మెకానిక్‌ను ప్రేమించింది. జీనత్ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పినా గత నెలలో కోర్టు మేజిస్ట్రేట్ ముందు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత జీనత్ నాలుగు రోజులు భర్త ఇంట్లో ఉంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి జీనత్‌కు ఎలాంటి హానీ తలపెట్టమని, విందు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. జీనత్‌కు ఇష్టం లేకపోయినా భయపడుతూ పుట్టింటికి వచ్చింది. ప్రేమపెళ్లి చేసుకున్నందుకు జీనత్‌ను కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. హాసన్‌ను మరచిపోవాలని తల్లి బెదిరించగా, జీనత్ అంగీకరించలేదు. దీంతో జీనత్ తల్లి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టింది. అనంతరం వీధిలోకి వచ్చి గట్టిగా అరుస్తూ తన కూతురును చంపేసినట్టు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లో ప్రతిఏటా దాదాపు 1000 మంది మహిళలు పరువుహత్యలకు బలవుతున్నారు. తాము కుదిర్చిన వివాహాన్ని చేసుకోకపోయినా, తమకు ఇష్టంలేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న అమ్మాయిలను కుటుంబ సభ్యులు చంపుతున్నారు. -
మండ్యలో పరువు హత్య?
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య జిల్లాలో దళిత యువతిని ప్రేమించాడనే కారణంతో ఓ యువకుడు హత్యకు గురయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇది హత్య కాదని, ఆత్మహత్య అని చెబుతున్నారు. వివరాలు... మండ్య జిల్లాలోని కె.ఆర్.పేట తాలూకాలో సిందఘట్ట గ్రామానికి చెందిన నాగేష్, అదే ప్రాంతానికి చెందిన దళిత యువతి భవ్యా ప్రేమికులు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రేమను నాగేష్ కుటుంబం వ్యతిరేకిస్తూనే వస్తోంది. కాగా, ఈనెల 17న మండ్యలో మతాంతర వివాహం జరిగిన సమయంలో నాగేష్, భవ్యాల ప్రేమను సైతం విమర్శిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని సంఘాలు కరపత్రాలను ముద్రించి పంచాయి. దీంతో నాగేష్ కుంగుబాటుకు గురయ్యాడు. అంతేకాక ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న భవ్యా, నాగేష్ తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కె.ఆర్.పేట పోలీస్ స్టేషన్లో పదిహేను రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నాగేష్ మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో గ్రామ శివార్లలో కనిపించింది. దళిత యువతితో ప్రేమ, ఆపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వంటి ఘటనలతో గ్రామంలో తమ పరువు పోయిందని భావించిన నాగేష్ కుటుంబసభ్యులు అతడిని హత్య చేశారన్న వాదన గ్రామంలో వినిపిస్తోంది. -
స్నేహం కోసమే హత్య
తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో చోటుచేసుకున్న పరువు హత్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డులో వందలాది మంది సమక్షంలో సినీ పక్కీలో హతమార్చి దర్జాగా ఉడాయించిన నిందితుల్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కూతురి కోసం ఓ తండ్రి అనుభవిస్తున్న మనోవేదనకు చలించే తామీ హత్య చేసినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. సాక్షి, చెన్నై : ఉడుమలైలలో ఆదివారం నడిరోడ్డులో సాగిన ప్రేమ కులచిచ్చు పరువు హత్య ఘాతకం గురించి తెలిసిందే. వందలాది మంది చూస్తుండగా రోడ్డును దాటుతున్న దంపతులపై జరిగిన ఈ ఘాతుకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో కౌశల్య తండ్రి చిన్నస్వామి ఈ ఘాతకానికి సూత్రదారి అని తేలింది. అయితే న డిరోడ్డులో అందరూ చూస్తుండగా హత్యలు చేయడంలో తాము దిట్టా అని చాటుకునే విధంగా నరరూప రాక్షసుల్లా వ్యవహరించి, దర్జాగా మోటారు బైక్ ఎక్కి ఉడాయించిన ఆ నిందితుల కోసం పోలీసులు తీవ్ర వేట సాగించారు. తిరుప్పూర్‌లో తమ పథకం అమలు కావడంతో నిందితులు మోటార్ సైకిల్‌పై దిండుగల్‌కు ఉడాయించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేయగా, సోమవారం అర్ధరాత్రి నిందితుల్ని పళని సమీపంలోని ఓ గ్రామంలో పోలీసులు చుట్టుముట్టారు. వీరిలో మణిగండన్, మదన్, సెల్వకుమార్, జగదీశన్ అని గుర్తించా రు. వీరంతా దిండుగల్‌కు చెందిన వారే. వీరిలో మణిగండన్ మినహా తక్కిన వాళ్లంతా నేరగాళ్లే. అయితే మణిగండన్ చిన్నస్వామికి సన్నిహితుడని విచారణలో తేలింది. చిన్నస్వామి పడుతున్న వేదనను చూసిన మణిగండన్ తనకు సన్నిహితులైన మదన్, సెల్వకుమార్, జగదీశన్‌ల ద్వారా కౌశల్యను బుజ్జగించే యత్నం చేసినట్టు, పలు మార్లు శంకర్‌ను బెదిరించినట్టు తెలిసింది. శంకర్‌కు నగదు ఆశ చూపించి కౌశల్య నుంచి దూరం చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఈ నలుగురు చిన్న స్వామిని సంప్రదించి పథకం రచించా రు. స్నేహం కోసం అన్నట్టుగా చిన్నస్వా మి పడుతున్న వేదనను చూసే, తాము శంకర్‌ను కడతేర్చామని, అడ్డొచ్చిన కౌశల్యను కూడా కడతేర్చే యత్నం చేశామని, ఆమె గాయాలతో తప్పించుకున్న ట్టు పోలీసులకు వాంగ్ములం ఇచ్చారు. చిన్నస్వామితో ఉన్న స్నేహం కోసం పరువు హత్య చేశామంటూ నిందితులు పేర్కొంటున్నా, వారి నుంచి నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని ఉండడం బట్టి చూస్తే, కిరాయికే పథకం అమలు చేసినట్టు స్పష్టం అవుతోంది. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. భద్రత నడుమ అంత్యక్రియలు : పోస్టుమార్టం అనంతరం శంకర్ మృతదేహాన్ని స్వగ్రామం తిరుప్పూర్ మడత్తుకులం కుమర తంగచావడికి పోలీసులు తీసుకెళ్లారు. మృతదేహాన్ని నేరుగా శ్మశా న వాటిక కు తరలించే యత్నం చేయడం వివాదానికి దారి తీసింది. శంకర్ ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ఒత్తిడి తెచ్చినా పోలీసు ముందు జాగ్రత్త చర్యగా, శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా మృతదేహాన్ని శ్మశానంకు తరలించే యత్నం చేశారు. ఈ సమయంలో వాగ్యుద్ధం, ఆందోళనలు బయలుదేరాయి. ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు బంధువులు, ఆప్తుల్ని బుజ్జగించి మృతదేహానికి అంత్యక్రియల్ని పోలీసులు జరిపించారు. సర్వత్రా ఆగ్రహం : హత్య దృశ్యాలు వాట్సాప్, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షం కావడంతో పరువు హత్యలపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కులాంతర వివాహాల కారణంగా జరుగుతున్న ఈ పరువు హత్యల్ని నిరోధించాలని డిమాండ్ చేశాయి. ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే నేత విజయకాంత్, వీసీకే నేత తిరుమావళవన్ ఈ హత్యలపై మండిపడుతూ, గతం పునరావృతం కాకుండా ఇకనైనా చర్యలు వేగవంతం చేయాలని పట్టుబట్టాయి. ఇన్నాళ్లు కులాంతర వివాహాల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పీఎంకే అధినేత రాందాసు ఎన్నికల నేపథ్యంలో మాట మార్చడం గమనార్హం. ప్రేమ వివాహాలకు తాము వ్యతిరేకం కాదు అని, పరువు హత్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
గుంటూరులో పరువు హత్య
గుంటూరు : నగరంలోఆదివారం జరిగిన పరువు హత్య తీవ్ర కలకలం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందని కుమార్తెను తల్లి దండ్రులే కసాయిలుగా మారి దారుణంగా హత్య చేసిన ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. పెళ్లి పారాణి ఆరకముందే దీప్తి అనే యువతిని తల్లి దండ్రులే హత్య చేసి పరారైయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భార్యను అత్తా మామ హత్య చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన అనంతపల్లి నాగ సత్యనారాయణ, అరుశ్రీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో హెచ్‌సిఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ ఫిబ్రవరి 1న అమెరికా వెళ్ళాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే సమయంలో 2011లో అదే కంపెనీలో పని చేస్తున్న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడికి చెందిన పచ్చల దీప్తితో పరిచయం ఏర్పడింది. ఇరువురు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు కిరణ్‌కుమార్ తన తల్లి దండ్రులను ఒప్పించాడు. అయితే ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో దీప్తి తల్లి దండ్రులు పెళ్ళికి అంగీకరించలేదు. దీప్తికి తల్లి దండ్రులు పెళ్ళి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. వేరొకరిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని దీప్తి కిరణ్‌కుమార్‌కు ఫోన్ చేసి తనను పెళ్ళి చేసుకోకుంటే చనిపోతానని హెచ్చరించింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన కిరణ్‌కుమార్ దీప్తిని వివాహం చేసుకున్నాడు. ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించని తల్లి దండ్రులు ఆసరాగా ఉంటామని నమ్మించి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.