MP Honour Killing: Couple Murdered, Bodies Thrown Into Crocodile-Infested River - Sakshi
Sakshi News home page

పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు

Published Mon, Jun 19 2023 2:02 PM | Last Updated on Mon, Jun 19 2023 3:05 PM

MP Honor killing: Couple Bodies Recovered Crocodile Infested River - Sakshi

దేశంలో పరువు హత్యల పరంపరం కొనసాగుతోంది. ప్రేమ, డేటింగ్‌ల పేరుతో తిరిగే జంటలనూ.. చివరకు పెళ్లి  చేసుకున్నా కూడా అయినవాళ్లే కనికరించడం లేదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి సంచలనంగా మారిందా రాష్ట్రంలో.. 

ఎంపీ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించుకున్న జంటను నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపిన పెద్దలు.. మొసళ్లు తిరిగే నదిలో మేతగా పడేశారు. పిల్లలు కనిపించకుండా పోయారంటూ యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది.

రతన్‌బసాయ్‌ గ్రామానికి చెందిన శివాని తోమర్‌, పొరుగు గ్రామం బాలూపూర్‌కు చెందిన రాధేశ్యామ్‌ తోమర్‌ పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయి(18) తరపు కుటుంబ సభ్యులు వాళ్ల బంధాన్ని ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జూన్‌ 3వ తేదీన వాళ్లను కాల్చి చంపేసి.. ఆ మృతదేహాలకు బండరాళ్లు కట్టి మొసళ్లు తిరిగే చంబల్‌ నదీ ప్రాంతంలో పడేశారు. 

కొడుకు(21), అతను ప్రేమించిన అమ్మాయి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి  పోలీసులను ఆశ్రయించాడు. తొలుత వాళ్లు ఎక్కడికైనా పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. అయితే.. వాళ్లు వెళ్లిపోవడం ఎవరూ చూడకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులను పిలిచి గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. సిబ్బంది సాయంతో ముక్కలైన వాళ్ల మృతదేహాలను వెలికి తీశారు స్థానిక పోలీసులు.

చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో 2,000 కంటే ఎక్కువ మొసళ్లు ఉంటాయనేది ఒక అంచనా.

ఇదీ చదవండి: ముస్లింలే ఛత్రపతి శివాజీని కొనియాడుతున్నారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement