Chambal river
-
వాళ్లు చెయ్యరు.. ఇతరుల్ని చెయ్యనివ్వరు..!
జైపూర్: రైతులకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. వాస్తవానికి అన్నదాతల కోసం ఏమీ చేయలేదని, ఇతరులను కూడా చేయనివ్వరని ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి బదులుగా ఆ పార్టీ రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ) ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈఆర్సీపీ అసంపూర్తిగా ఇంతకాలం నిలిచిపోవడానికి కాంగ్రెస్సే కారణన్నారు. చంబల్ నదీ పరివాహక ప్రాంతం నుంచి రాజస్తాన్లోని 13 జిల్లాలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘నీటి వివాదాలకు పరిష్కారం వెదకాలని కాంగ్రెస్ ఏనాడూ భావించలేదు. మన నదుల్లోని నీరు సరిహద్దులు దాటి వెళుతోంది. కానీ, మన రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనికి పరిష్కారం చూపడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి పంపకం వివాదాలను ప్రేరేపిస్తోంది’అని ఆయన అన్నారు. రాజస్తాన్లోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం జైపూర్లో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పైవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రూ.46,300 కోట్ల విలువైన ఇంధనం, రహదారులు, రైల్వేలు, జల సంబంధం 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గుజరాత్ సీఎంగా ఉండగా నర్మదా నదీ జలాలను సద్వినియోగం చేసుకునేలా పలు ప్రాజెక్టులను తలపెడితే కాంగ్రెస్, కొన్ని ఎన్జీవోలు వాటిని అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాయన్నారు. -
చంబల్ నదిలో 900 చిరు మొసళ్ల సందడి
మొసలి... ఈ పేరు వినగానే మనకు దాని రూపం గుర్తుకు వచ్చి, మనసులో భయం కలుగుతుంది. భారీ మొసలి రూపాన్ని పక్కన పెడితే, చిరు మెసలిని చూసినప్పుడు ఎంతో కొంత ముచ్చటేస్తుంది. మరి వందల సంఖ్యలో చిరు మొసళ్లు ఒకేసారి కనిపిస్తే..ఆసియాలోని అతిపెద్ద మొసళ్ల అభయారణ్యం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా బాహ్లో ఉంది. ఇక్కడ ఇప్పుడు వందలకొద్దీ చిరు మొసళ్లు సందడి చేస్తున్నాయి. మహుశాల, నంద్గావాన్, హత్కాంత్ ఘాట్ల మీదుగా సుమారు 900 చిరు మొసళ్లు భారీ మగ మొసళ్లను అనుసరిస్తూ చంబల్ నదికి చేరుకున్నాయి.అటవీ రేంజ్ నుండి వస్తున్న శబ్ధాన్ని విన్న అటవీ శాఖ అధికారుల బృందం చంబల్ నది సమీపానికి చేరుకుంది. అక్కడి దృశ్యాన్ని చూసిన అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. మొసళ్లు పిల్లలను కనే ప్రక్రియ దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అంతరించిపోయే స్థితికి చేరుకున్న మొసలి జాతిని 1979 నుండి చంబల్ నదిలో సంరక్షిస్తున్నారు. ఈ నది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల గుండా పాలి (రాజస్థాన్) మీదుగా ప్రవహిస్తుంది.2008లో బాహ్, ఇటావా, భింద్, మోరెనాలలోని చంబల్ నదిలో వందకుపైగా మొసళ్లు మృతి చెందాయి. ఆ సమయంలో మొసళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విదేశీ నిపుణులను సంప్రదించాల్సి వచ్చింది. అప్పట్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి కారణంగా మొసళ్లు చనిపోయాయని గుర్తించారు. అయితే ఆ తరువాత నుంచి మొసళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చంబల్ నదిలో 2,456 మొసళ్లు ఉన్నాయి. -
పరువుహత్య చేసి మొసళ్లకు మేతగా పడేశారు
దేశంలో పరువు హత్యల పరంపరం కొనసాగుతోంది. ప్రేమ, డేటింగ్ల పేరుతో తిరిగే జంటలనూ.. చివరకు పెళ్లి చేసుకున్నా కూడా అయినవాళ్లే కనికరించడం లేదు. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి సంచలనంగా మారిందా రాష్ట్రంలో.. ఎంపీ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించుకున్న జంటను నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపిన పెద్దలు.. మొసళ్లు తిరిగే నదిలో మేతగా పడేశారు. పిల్లలు కనిపించకుండా పోయారంటూ యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. రతన్బసాయ్ గ్రామానికి చెందిన శివాని తోమర్, పొరుగు గ్రామం బాలూపూర్కు చెందిన రాధేశ్యామ్ తోమర్ పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయి(18) తరపు కుటుంబ సభ్యులు వాళ్ల బంధాన్ని ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన వాళ్లను కాల్చి చంపేసి.. ఆ మృతదేహాలకు బండరాళ్లు కట్టి మొసళ్లు తిరిగే చంబల్ నదీ ప్రాంతంలో పడేశారు. కొడుకు(21), అతను ప్రేమించిన అమ్మాయి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తొలుత వాళ్లు ఎక్కడికైనా పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. అయితే.. వాళ్లు వెళ్లిపోవడం ఎవరూ చూడకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులను పిలిచి గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. సిబ్బంది సాయంతో ముక్కలైన వాళ్ల మృతదేహాలను వెలికి తీశారు స్థానిక పోలీసులు. చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో 2,000 కంటే ఎక్కువ మొసళ్లు ఉంటాయనేది ఒక అంచనా. ఇదీ చదవండి: ముస్లింలే ఛత్రపతి శివాజీని కొనియాడుతున్నారు! -
విషాదం.. నదిలో మొసలి దాడిలో భక్తులు మృతి!
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నది దాటుతున్న భక్తులపై నీటిలో ఉన్న మొసలి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన ఎనిమిది మంది భక్తులు రాజస్థాన్లోని కైలా దేవీ ఆలయానికి వెళ్లి మొక్కలు చెల్లించుకునేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో శివపురి జిల్లాలోని చిలవాడ్ గ్రామంలో ఉన్న చంబల్ నది వద్దకు చేరుకున్నారు. అయితే, వారు అక్కడికి వెళ్లిన సమయానికి నది దాటేందుకు వంతెన, పడవ అందుబాటులో లేకపోవడంతో వారు చంబల్ నదిని దాటేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారంతా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నదిలోకి దిగి గట్టు దాటేందుకు ముందుకు సాగారు. ఇంతలో అక్కడే నాచులో నక్కి ఉన్న మొసలి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. దీంతో, వారంతా భయంతో నదిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సయమంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న వారు మొసలి దాడిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్.. ఎనిమిది మందిలో ముగ్గురు మృతదేహాలను వెలికి తీసింది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే, వారిలో మొసలి ఎంత మందిని పొట్టనపెట్టుకుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతయ్యారు. -
హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి..
-
హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి..
భోపాల్: ఇంట్లో పిల్లలు ఉంటే నిత్యం వారిని ఓ కంట గమనించుకుంటూ ఉండాలి. అందరూ ఉన్నారు కదా చూసుకుంటారనే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అన్నిజాగ్రత్తలు చెబుతూ, ఎప్పుకప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే క్షణకాలపు అజాగ్రత్త జీవిత కాలపు బాధను మిగిలిస్తుంది. అచ్చం ఇలాగే మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. షియోపూర్లోని చంబల్ నదిలో సోమవారం స్నానం చేస్తున్న బాలుడిపై మొసలి దాడి చేసి, నదిలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నది వద్దకు చేరుకొని బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు. కర్రలు, తాడు, వల సాయంతో నదిలో ఉన్న మెసలిని బంధించి బయటకు లాగారు. మొసలిని చంపి బాలుడిని రక్షించాలని గ్రామస్తులు భావించారు. ఇంతలో సమాచారం అందుకున్న మొసళ్ల సంరక్షణ బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని గ్రామస్తుల బారినుంచి రక్షించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించారు. అయితే ఇందుకు కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు అస్సలు అంగీకరించలేదు. మొసలి కడుపులో బిడ్డ బతికే ఉంటుందని ఆశగా ఎదురు చూశారు. పిల్లాడిని బయటకు తీసినప్పుడే వదిలేస్తామని చెప్పారు. చదవండి: వరద బీభత్సం.. హెలికాప్టర్ రాకపోతే ప్రాణాలు పోయేవే! అయితే మొసలి కడుపులో ఉన్న పిల్లవాడు బతికే అవకాశం లేదని పిల్లాడి తల్లిదండ్రులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసు అధికారులు, మొసళ్ల సంరక్షణ విభాగం ఒప్పించడంతో గ్రామస్థులు మొసలిని విడిచిపెట్టారు. ఈ ఘటనపై రఘునాథ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శ్యామ్ వీర్ సింగ్ తోమర్ మాట్లాడుతూ.. బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్ళాడని తెలిపారు. చిన్నారిని మొసలి మింగేయడంతో వల, కర్రలతో మొసలిని పట్టుకున్నట్లు గ్రామస్తులు చెప్పారని వెల్లడించారు. కాగా మాయదారి మొసలి కన్న కొడుకుని దూరం చేసి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. #MadhyaPradesh: 10-year-old boy swallowed by crocodile while bathing in Chambal river pic.twitter.com/iSzcJtWdWw — Neha Singh (@NehaSingh1912) July 12, 2022 -
నదిలో పడిపోయిన పెళ్లి బృందం వాహనం
కోట(రాజస్తాన్): రాజస్తాన్లోని కోట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం నదిలో పడిపోవడంతో వరుడితో సహా 9 మంది మృతిచెందారు. ఈ పెళ్లి బృందం ఆదివారం తెల్లవారుజామున సవై మాధోపూర్ జిల్లాలోని చౌత్ కా బర్వారా గ్రామం నుంచి ఎర్టిగా వాహనంలో బయలుదేరింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం 5.30 గంటలకు బ్రిడ్జిపై వెళ్తూ చంబల్ నదిలో పడిపోయింది. నిద్రమత్తు కారణంగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ దుర్ఘటనలోవరుడు అవినాశ్ వాల్మీకి(23), అతడి సోదరుడు కేశవ్(30), కారు డ్రైవర్ ఇస్లాం ఖాన్(35), బంధువులు కుశాల్(22), శుభం(23), రోహిత్ వాల్మీకి(22), రాహుల్(25), వికాశ్ వాల్మీకి(24), ముకేశ్ గోచర్(35) చనిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందడం పట్ల కోట–బుండీ ఎంపీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, ప్రతి మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం అశోక్ గహ్లోత్ ట్విట్టర్లో తెలిపారు. -
అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా 9 మంది మృతి
-
కాసేపట్లో వివాహం.. పెళ్లి కొడుకుతో సహా 9 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. Rajasthan | 9 bodies have been recovered after a car fell into the Chambal river in Kota. Among those who have lost their lives including a groom were going to Ujjain for the wedding: Kota Police — ANI (@ANI) February 20, 2022 వివరాల ప్రకారం.. ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కోసం వెళ్తున్న పెళ్లి కొడుకు కారు ప్రమాదవశాత్తు కోటాలోని ఛోటీ పులియా వద్ద చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నకోటా పోలీసులు క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (చదవండి: ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?) -
రాజస్తాన్ చంబల్నదిలో పడవ బోల్తా..
-
రాజస్తాన్ చంబల్నదిలో తీవ్ర విషాదం
జైపూర్ : రాజస్తాన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని చంబల్ నదిలో పడవ బోల్తా పడి ఏడుగురు మరణించగా మరో 14 మంది గల్లంతయ్యారు. పడవలో మొత్తం 25 నుంచి 30మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొందరు గజ ఈతగాళ్లు ఇప్పటికే నదిలో దిగి బాధితులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పడవలో కొందరు బైక్లను కూడా తీసికెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే పడవ అదుపుతప్పి నీటిలో పడిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ప్రత్యేక బృందాలతో చంబల్ నది మొత్తం జల్లెడ పడుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా) -
నాన్న నువ్వే రైట్.. నాకు బతకాలని లేదు!
కోటా: డాక్టర్ కావాలని కలలు కన్న ఓ విద్యార్థి ఒత్తిడి తాళలేక అర్ధంతరంగా తనువు చాలించాడు. 'నువ్వైనా బాగా కష్టపడి అమ్మనాన్నల ఆకాంక్షలు నెరవేర్చు' అంటూ తన తమ్ముడు 'ఛోటు' కోసం ఓ వీడియో మెసేజ్ పెట్టి.. చంబల్ నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ కోటాలోని హ్యాంగింగ్ బ్రిడ్జి వద్ద గురువారం చోటుచేసుకుంది. బిహార్లోని రాధోపూర్కు చెందిన 16 ఏళ్ల అమన్ గుప్తా కోటాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో ఇంటర్ ఫస్టియర్ (11వ తరగతి) చదువతున్నాడు. అదేసమయంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం ఉద్దేశించిన ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. దేశంలోనే కోచింగ్ సెంటర్లకు పేరొందిన కోటాలో ఓ గదిలో అద్దెకు ఉంటూ అతను చదువు కొనసాగిస్తున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు గదినుంచి బయలుదేరిన అమన్.. స్నేహితులకు ఫోన్ చేసి తన నిర్ణయం గురించి చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చి.. సంఘటనా స్థలంలోకి చేరుకునేలోపే సెల్ఫోన్ లో ఓ వీడియో తీసి.. చంబల్ నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు అతని సెల్ఫోన్ను ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 'నాన్న చెప్పింది కరెక్టే. నేను చదువుల్లో ఎప్పుడు రాణించలేను. నాన్నా మీరు నాకెప్పుడూ మద్దతిచ్చారు. కానీ నేనే మీరు సిగ్గుపడేలా చేశాను. పదో తరగతిలోనూ నాపై ప్రిన్స్పాల్కు ఫిర్యాదు అందింది. నేను జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నా స్నేహితులు, ప్రతి ఒక్కరు నాకు సాయపడ్డారు. అయినా నేను సరిగ్గా చేయలేకపోతున్నా. నా కోసం ఎవరూ ఏడ్వొద్దు. ఏ కారణం లేకున్నా ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు బతకాలని లేదు. ఛోటు (తమ్ముడు) నువ్వు బాగా కష్టపడి అమ్మనాన్నల ఆకాంక్షలు నెరవేర్చు..' అని 11.14 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అమన్ భావోద్వేగంగా పేర్కొన్నాడు. అమన్ చాలా తెలివైన విద్యార్థి అని, టెస్టుల్లో 80శాతానికిపైగా మార్కులు తెచ్చుకునేవాడని కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు చెప్తున్నారు. దేశంలోనే కోచింగ్ సెంటర్లకు పేరొందిన కోటాలో ఏటా ఎంతోమంది విద్యార్థులు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 14మంది విద్యార్థులు ఇక్కడ తనువు చాలించారు.