సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం దండుమైలారంలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా తేల్చారు. భార్గవి(19)ని తల్లే చంపిందని.. ప్రియుడితో కలిసి కూతురు కనిపించేసరికి భరించలేక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు నిర్ధారించారు.
దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య, జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్గవి హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల భార్గవి తల్లిదండ్రులు మేనబావను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తాను స్థానికంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. అతన్నే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి.
ఈ క్రమంలో మూడు రోజులపాటు భార్గవి కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సదరు యువకుడు.. భార్గవి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తెపై తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిందని, చీరతో ఉరి వేసి హతమార్చింది.
ఈలోపు భర్త, కొడుకు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయినట్లు నటించి.. కూతురిని ఎవరో చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. అక్కను తల్లే చంపి ఉంటుందని భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తాను చంపలేదని జంగమ్మ, తన భార్య చంపి ఉండకపోవచ్చని ఆమె భర్త వాదించారు. ఈ క్రమంలో ప్రియుడి పాత్రపైనా పోలీసులు అనుమానాలు మళ్లాయి. అయితే.. తమదైన శైలిలో ఈ కేసును విచారించగా.. చివరకు కూతురిని తానే ఉరేసి చంపిటనట్లు జంగమ్మ అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment