bhargavi
-
అవును.. అమ్మే భార్గవికి ఉరేసింది
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం దండుమైలారంలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా తేల్చారు. భార్గవి(19)ని తల్లే చంపిందని.. ప్రియుడితో కలిసి కూతురు కనిపించేసరికి భరించలేక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు నిర్ధారించారు. దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య, జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్గవి హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల భార్గవి తల్లిదండ్రులు మేనబావను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తాను స్థానికంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. అతన్నే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మూడు రోజులపాటు భార్గవి కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సదరు యువకుడు.. భార్గవి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తెపై తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిందని, చీరతో ఉరి వేసి హతమార్చింది. ఈలోపు భర్త, కొడుకు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయినట్లు నటించి.. కూతురిని ఎవరో చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. అక్కను తల్లే చంపి ఉంటుందని భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తాను చంపలేదని జంగమ్మ, తన భార్య చంపి ఉండకపోవచ్చని ఆమె భర్త వాదించారు. ఈ క్రమంలో ప్రియుడి పాత్రపైనా పోలీసులు అనుమానాలు మళ్లాయి. అయితే.. తమదైన శైలిలో ఈ కేసును విచారించగా.. చివరకు కూతురిని తానే ఉరేసి చంపిటనట్లు జంగమ్మ అంగీకరించింది. -
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో పరువు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సం చదువుతున్న భార్గవి, శశి అనే యువకుడు కొద్ది రోజలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక, వీరి ప్రేమ విషయమై గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శశితో మాట్లాడటం, కలవడం మానేయాలని తన తల్లి జంగమ్మ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భార్గవి ఇంట్లో ఉన్న ఉండగా శశి ఇటీవలే ఆమె ఇంటికి వచ్చాడు. ఈ విషయం భార్గవి తల్లికి తెలియడంతో వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్బంగా శశినే పెళ్లిచేసుకుంటానని భార్గవి చెప్పడంతో జంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈలోపు.. సోమవారం భార్గవి తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. భార్గవిని ఎవరో చీరతో ఉరి వేసి చంపినట్టు ఆనవాళ్లను ఆమె సోదరుడు గుర్తించాడు. తన తల్లే భార్గవిని చంపినట్టు అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి జంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, శశి మృతిపై ఆయన తండ్రి మాట్లాడుతూ.. కన్న తల్లి ఎక్కడైనా కూతురును చంపుకుంటుందా?. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. భార్గవి మాత్రం శశిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. నిన్న శశి మా ఇంటికి వచ్చాడు. నా భార్యను చూసిన వెంటనే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాతే ఇలా జరిగింది అని చెప్పారు. -
డిసెంబరు 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు. జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, ఎవిఎస్వో శ్రీ నారాయణ తదితరులు ఉన్నారు. -
ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్!
కామారెడ్డిటౌన్: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్’అంటూ రిటర్నింగ్ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. -
Bhargavi Pappuri: నా రోల్‌మోడల్ నేనే!
భార్గవి పప్పూరి... మన కళలను ఇష్టపడ్డారు. మన కళాకారులకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం కళాత్మకమైన వేదికను నేశారు. అది తన సృజనాత్మకతకే వేదికవుతుందనుకోలేదామె. ఆర్ట్ఎన్ వీవ్స్... కృషి ఆమెదే... కళ ఆమెదే. ఆర్ట్ అండ్ వీవ్స్ స్థాపించడానికి ముందు నా జర్నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అది సరదాగా సాగిపోయే ఓ సినిమాని తలపిస్తుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, వనస్థలి పురం దగ్గర ఆర్కే పురంలో. నాన్న పోస్ట్ మాస్టర్‌గా రిటైరయ్యారు. అమ్మ గృహిణి. బికామ్ చదివి చాలా కామ్‌గా ఉండేదాన్ని. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నోరు పెగిలేది కాదు. పెళ్లయిన తర్వాత మా వారు నన్ను మార్కెటింగ్ వైపు నడిపించారు. ఆయనది కూడా అదే ఫీల్డ్ కావడంతో నాకు మెళకువలు నేరి్పంచారు. మొదట క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లు మార్కెట్ చేశాను. మా వారికి కోల్‌కతాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కార్ లోన్ మార్కెటింగ్ చేశాను. కాలి నడకన కోల్‌కతా మొత్తం తిరిగాను. మళ్లీ బదలీ కోల్‌కతాలో మార్కెటింగ్ మీద పట్టు వచ్చేటప్పటికి మా వారికి మళ్లీ బదలీ. ఈ సారి విజయవాడ. అప్పుడు బాబు పుట్టడంతో నా కెరీర్లో విరామం తీసుకున్నాను. మళ్లీ బదలీలు. మొత్తానికి బాబు స్కూల్‌కెళ్లే వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్‌కొచ్చాం. బాబు పెద్దయ్యాడు కాబట్టి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ ఇక ఆ వయసుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరని ఫ్రెండ్‌తో కలిసి క్రెష్ నడిపించాను. కొంతకాలానికి ఇంట్లోనే ఉంటూ కేటరింగ్ మొదలుపెట్టాను. మేముండే వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎక్కువ మంది వయసు మళ్లిన దంపతులే. పిల్లలు విదేశాలకు వెళ్లిన తర్వాత పెద్ద దంపతులు విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని లంచ్, డిన్నర్ పంపించే ఏర్పాటు చేశాను. ఉదయం తొమ్మిదిలోపు ఆర్డర్ చేస్తే భోజనం సమయానికి ఒక బాయ్ సహాయంతో క్యారియర్ చేర్చాను. మా వారికి తరచూ బదలీలు, ఆయన కష్టమంతా ఎన్నో కంపెనీల అభివృద్ధికి దోహదం అవుతున్నాయి. మాకు మాత్రం ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం లేదు. మంచి జీతం వస్తోంది. కానీ మనకు మనంగా సాధించింది ఏమిటని చూసుకుంటే వెలితి కనిపించసాగింది. అప్పుడు పంథా మార్చుకున్నాం. ఇదంతా ఆర్డ్ అండ్ వీవ్స్ ప్రారంభానికి ముందు నా జీవితం. కళాకృతుల సేకరణ ఆర్ట్ అండ్ వీవ్స్ అనే ప్రాజెక్ట్ రూపొందించుకుని, దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో çకళలు, కళాకారులు, చేనేతకారులను స్వయంగా కలిశాం. భారతీయ కళలు ఒకదానికి మరొకటి పూర్తిగా భిన్నం. దేనికదే ప్రత్యేకం. అంతటి వైవిధ్యతను ఒక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఆ కళారూపాలను అభిరుచి ఉన్నవారికి దగ్గర చేయడం, కళాకృతుల తయారీదారులకు పని కలి్పంచడం మా ఉద్దేశం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేయించాం. ఒడిశా, రాజస్థాన్, బీహార్, కర్నాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకునే కళాకృతుల ఫొటోలను మా వెబ్సైట్లో పెట్టాం. మధుబని, బిద్రీ వంటి కళాఖండాలకు ఆదరణ బాగా వచ్చింది, ఆర్డర్లు కూడా వచ్చాయి. కానీ తయారీదారుల దగ్గర ఆ సమయానికి కస్టమర్ కోరుకున్న మధుబని ఆర్ట్ కానీ, చేనేత చీర కానీ ఉండేది కాదు. ఇవన్నీ చాలా సమయం తీసుకునే కళాకృతులు. అంత సమయం వేచి చూసే ఓపిక కస్టమర్లకు ఉండేది కాదు. కస్టమర్‌కి సకాలంలో అందించాలంటే తయారీదారులం మనమే అయి ఉండాలనుకున్నాను. టెర్రకోట కళాకృతులు నేర్చుకోవడానికి ప్రయతి్నంచాను. కానీ కుదరలేదు. అదే సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్లు హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్ వారం రోజుల కోర్సు ప్రకటించారు. నేర్చుకోవడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, పొరపాట్లను సరిదిద్దుకుంటూ 54 రకాల సబ్బుల తయారీలో నైపుణ్యం సాధించాను. నా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్ వచ్చింది. ఆర్గానిక్ హోమ్మేడ్ సబ్బులు, షాంపూ, బాత్ జెల్స్ చేస్తున్నాను. మా బ్రాండ్‌కు మౌత్ పబ్లిసిటీ వచి్చంది. విదేశాలకు వెళ్లే వాళ్లు తమ పిల్లల కోసం పచ్చళ్లు, పొడులతోపాటు మా దగ్గర నుంచి ఏడాదికి సరిపడిన సబ్బులు, షాంపూలు కూడా తీసుకెళ్తున్నారు. నా వర్క్ యూనిట్, ఆఫీస్, ఇల్లు ఒకే బిల్డింగ్‌లో. ఆర్డర్లు ఎక్కువున్నప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తాను. సాధారణంగా మధ్యాహ్నం రెండు వరకు పని చేస్తాను. ఓ గంట ధ్యానం, గార్డెనింగ్ నా డైలీ రొటీన్లో భాగం. ప్రకృతి సహకారం నా క్రియేటివిటీని నా బ్రాండ్ కోసమే ఉపయోగిస్తున్నాను. మరో నలుగురికి జీతం ఇవ్వగలుగుతున్నాను. మన సంకల్పం మంచిదై ఉండి, నిబద్ధతతో పని చేస్తే ప్రకృతి తన వంతుగా సహకారం అందిస్తుందని, అదే మనల్ని ఓ మార్గంలో నడిపిస్తుందని నమ్ముతాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)తో అనుసంధానమయ్యాను. ముద్ర లోన్ వచి్చంది. ఈ రోజు నేనిలా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏ పనికి గౌరవం ఎక్కువ, ఏ పనికి గౌరవం తక్కువ అని ఆలోచించకపోవడమే. అన్ని పనులూ గౌరవంతో కూడినవే. మహిళలకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటే. గొప్పవాళ్లు ప్రత్యేకంగా పుట్టరు. నిజాయితీగా కష్టపడే తత్వమే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతుంది. నాకు రోల్‌మోడల్ ఎవరూ లేరు. నాకు నేనే రోల్మోడల్ని. అలాగే నాకు నేనే కాంపిటీటర్ని. ఈ రోజు చేసిన పనిని రేపు మరింత మెరుగ్గా చేయాలనే లక్ష్యాన్ని మనకు మనమే నిర్దేశించుకోవాలి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. ఆర్థిక సవాళ్లతోపాటు ఆరోగ్యం పెట్టే పరీక్షలూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ఏకైక కర్తవ్యం. సంతోషంగా జీవించాలా దిగాలుగా రోజులు గడపాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. మనసు బాగాలేకపోతే ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావడం అనే చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది’’ అన్నారు భార్గవి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. సంతోషంగా జీవించాలా.. దిగాలుగా రోజులు గడపాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. – భార్గవి పప్పూరి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
వారంలో పెళ్లి.. కబళించిన విధి.. తీవ్ర విషాదం!
సాక్షి, ఖమ్మం: కుమార్తెను ఓ ఇంటి దాన్ని చేసి బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఈ మేరకు నిశ్చితార్థం కూడా పూర్తిచేశారు. ఇక పెళ్లి పనుల్లో నిమగ్నం కాగా.. యువతి అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువాత పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని జాస్తిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దురిశెట్టి తిరుమల్‌రావు – మాధవి కుమార్తె భార్గవి (20)కి ఖమ్మం రూరల్ మండలం తనకంపాడుకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. మూడు నెలల కిందట నిశ్చితార్థం జరిపించి ఈ నెల 26న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఓపక్క పెళ్లి ఏర్పాట్లలో ఉండగానే.. భార్గవి పది రోజుల కిందట జ్వరం బారిన పడింది. స్థానిక గ్రామీణ వైద్యుడి వద్ద చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో ఈనెల 18న ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఓ పక్క పెళ్లి కోసం ఇంటికి రంగులు వేయగా.. కుమార్తె మృతదేహాన్ని తీసుకురావడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చదవండి: ఓ యువకుడు పండుగ సెలవులకి వచ్చి.. ఒక్కసారిగా ఇలా..! -
హ్యాపీ స్పేస్
యాంత్రిక ప్రయాణంలో పోటీ ఎప్పుడూ ఉండేదే! కానీ, చంటిబిడ్డ తన జీవనంలోకి వచ్చినప్పుడు అమ్మ కళ్లలో.. కలల్లో చుట్టూ జీవం ఉండాలనుకుంటుంది. ‘ఆ ప్రయాస నుంచి పుట్టుకువచ్చిందే నా ప్రకృతి ఎకో ప్లే థీమ్’ అంటోంది భార్గవి. హైదరాబాద్ అల్వాల్‌లో ఉంటున్న భార్గవి నేచురల్ కలర్స్ వాడకం గురించి అపార్ట్మెంట్ పిల్లలకు పరిచయం చేస్తూ కనిపించారు. ఆసక్తితో ఆమె చేస్తున్న పని గురించి ప్రశ్నించినప్పుడు పిల్లల కోసం తను సృష్టించిన సహజ ప్రపంచాన్ని మన ముందుంచారు.. ‘‘పుట్టింది మెదక్ జిల్లాలో. ఎమ్‌టెక్ చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బిజీ బిజీగా మారిపోయాను. పెళ్లై, పిల్లలు జీవితంలోకి వచ్చాక నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. మూడేళ్ల నా కూతురు స్వతంత్రంగా ఎదగాలంటే ఏదైనా హ్యాపీ స్పేస్ ఉందా.. అని వెతికాను. కానీ, నాకేవీ సంతృప్తినివ్వలేదు. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే పిల్లల వికాసం అంత బాగుంటుంది అనే తపన నాది. దీంతో చాలారోజులు ఆలోచించాను. నా సేవింగ్స్ ఎంత ఉన్నాయో చూసుకున్నాను. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆరేళ్లక్రితం నా ఇద్దరు పిల్లలతో ఈ థీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాను. ఇప్పుడు ముప్పైమంది పిల్లలు ఉన్నారు. ఈ ముప్పై సంఖ్య దగ్గరే నేను కటాఫ్ పెట్టుకున్నాను. స్వలాభం ఏ మాత్రం చూసుకోని ఒక ప్రాజెక్ట్ ఇది. నాకై నేను నా పిల్లలకోసం సృష్టించుకున్న ప్రపంచం. ఈ పిల్లలు ఎదిగి, పైస్కూళ్లకు వెళ్లినప్పుడు ఎంత ప్రతిభను చూపిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నాను. ఈ హ్యాపీ స్పేస్‌లో పిల్లలు చేసే అద్భుతాలు కళ్లారా చూడాల్సిందే. అందమైన పెయింట్స్ వేస్తుంటారు. సీడ్ బాల్స్తయారుచేస్తారు. కాగితాలతో బొమ్మలు తయారుచేస్తారు. కూరగాయలు, పువ్వులతో రంగులు తయారుచేస్తారు. తొమ్మిదేళ్ల పాప ఫిక్షన్ స్టోరీస్ రాసి, బుక్ కూడా పబ్లిష్ చేసింది.ఆరుబయట చెట్ల కింద రాలిపడిన పూలు, విత్తనాలను ఏరుకొచ్చి, ఒక్కోదాని గురించి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారికి ఇష్టమైన పండ్లు, కూరగాయలతో సలాడ్స్ చేస్తుంటారు. ప్రతీదీ నిశితంగా పరిశీలించడం వల్ల వారిలో ఎంతటి అవగాహన పెరుగుతుందో స్వయంగా చూస్తుంటాం. ఇది వారి మానసిక వికాసానికి ఎంతో మేలు కలిగిస్తుంది. హ్యాండీ క్రాఫ్ట్ తయారీలో పిల్లల చూపే ప్రతిభ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తే ఎన్ని అద్భుతాలు చూపుతారో స్వయంగా నేనే తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుంటాను. రెండేళ్ల నుంచి పద్నాలుగేళ్ల పిల్లలు ఈ గ్రూప్‌లో ఉన్నారు. పిల్లలు వేసే ప్రశ్నలే ఈ ఎకో థీమ్‌లో పాఠ్యాంశాలు. ఎవరికీ నచ్చలేదు... మా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఇప్పుడు స్పెషల్ కిడ్స్ కూడా ఉన్నారు. వారిలో ఎంత ఆర్ట్ ఉందో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాను. చాలా మంది పేరెంట్స్ ముందు నా థీమ్‌ను ఏ మాత్రం నమ్మలేదు. ‘పిల్లలకు ఈమె ఏమీ నేర్పడం లేదు. ఆడుకోవడానికి వదిలేస్తున్నారు. క్రమశిక్షణగా పిల్లలు ఒక్క దగ్గర కూర్చోవడం లేద’ని చాలా మంది తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కోవిడ్ టైమ్‌లో అయితే అందరూ మూసేయమనే సలహాలే. మా ఇంటి నుంచి మరీ ఎక్కువగా వచ్చాయి. ‘జాబ్ మానేసి, ఇలాంటి ప్రాజెక్ట్ వద్దు, ఎలాంటి లాభాలూ ఉండవు’ అనే మాటలే నా చుట్టూ విన్నాను. కానీ, లాభం కోసం ఈ థీమ్‌ని ఎంచుకోలేదు. నా పిల్లల కోసం ఎంచుకున్నాను. నేను నమ్మిన ఈ సిస్టమ్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. నా ఈ థీమ్‌కు తగిన టీచర్లను ఎంపిక చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. దీంతో నేనే కొందరిని ఎంపిక చేసుకొని, నాకు తగినవిధంగా ట్రైన్ చేసుకున్నాను. అదే పట్టుదలతో కొనసాగించాను. ఫైనాన్షియల్‌గా ఇది సక్సెస్ఫుల్ అని చెప్పలేం. కానీ, ఎప్పటికీ నిలిచే ఉండేది, నాకు సంతృప్తిగా అనిపించిన ప్రపంచం ఇదే. దానినే పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాను. నా పిల్లలనూ ఈ ప్రపంచంలో పెంచడం చాలా హ్యాపీగా ఉంది. అవగాహన కార్యక్రమాలు... ఈ థీమ్ వల్ల పిల్లల్లో జరిగే మానసిక వికాసం ఎంతగా ఉంటుందో తెలియజేస్తూ కార్పోరేట్ స్కూళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల్లోని స్వయంప్రతిభ ఎలా ఉంటుందో, వారిని వారిలాగే ఎలా ఎదగనివ్వాలో మా నేచర్ పిల్లలను పరిచయం చేసి, మరీ చూపుతుంటాను. రోజువారీ మనకు ఏం అవసరమో వాటన్నింటినీ స్వయంగా ఇక్కడి పిల్లలు చేస్తుంటారు. వాళ్లే వంట చేయడం, తినడం.. ఏదీ కూడా చెప్పకుండానే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, తమ ప్రతిభను చూపుతుంటారు. లాభాపేక్ష లేకుండా చేసే ఈ పని రాబోయే తరాలకు ప్రయోజనం కలిగించడమే నాకు వచ్చే ఆదాయం’ అని చెబుతోంది భార్గవి. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
బొట్లపాలెం ఘటనలో నిందితుల అరెస్ట్
ఒంగోలు టౌన్/దర్శి: కులాంతర వివాహం కేసులో దళిత మహిళను బంధించి పెట్రోలు పోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మరెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి.. అదే గ్రామానికి చెందిన దళితుడు జక్కుల సాయిరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని బ్రహ్మారెడ్డి దంపతులు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మంచినీళ్లు పట్టుకునేందుకు కొళాయి వద్దకు వెళ్లిన సాయిరాం తల్లి అనురాధ, సోదరి కామునూరి మౌనిక మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. మౌనికను దుస్తులు చింపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ ఇంటి వరండాలో ఆమెను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారు. అయితే ఈ లోపు అనురాధ స్థానికుల సాయంతో 100కు కాల్ చేయడంతో వెంటనే దర్శి ఎస్ఐ డి.రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యువతిని కాపాడారు. చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో దర్శి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అంకితా సురాన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన దర్శి డీఎస్పీ టి.అశోక్‌వర్థన్.. మంగళవారం మధ్యాహ్నం తూర్పు గంగవరం బస్టాండ్ సెంటర్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నిముషాల్లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు గంటలోపే కేసు రిజిస్టర్ చేశారు. వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వివరించారు. కాగా, దళిత మహిళలపై దాడి ఘటనలో నిందితులు గంగిరెడ్డి బ్రహా్మరెడ్డి, భార్య పుల్లమ్మలకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ బుధవారం దర్శి ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
రామకృష్ణ పరువు హత్య! స్పందించిన భార్య భార్గవి
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తాజాగా రామకృష్ణ భార్య భార్గవి మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణ ఇంట్లో ఉండగా జిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదని తెలిపారు. మోత్కూర్ వైపు వెళ్లారని చెప్పారు. అమృతరావుని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా? అని తననే ప్రశ్నించారని తెలిపారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారని అన్నారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ తన భర్త రామకృష్ణను సంప్రదించారని పేర్కొన్నారు. లతీఫ్‌ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు పరిచయం చేశారని చెప్పారు. ఒకసారి తోట కావాలి అంటూ మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ నాటకమాడారని అన్నారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారంటూ తెలిపారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన పుట్టింటితో సంబంధాలు లేవని పేర్కొంది. ‘మీరు చచ్చినా మాతో సంబంధం లేదని గతంలో మా నాన్న వెంకటేష్ గొడవ పెట్టుకున్నారు’ అని భార్గవి తెలిపారు. -
కలహాలతో విసిగిపోయి.. బిడ్డతో సహా కావేరి నదిలో దూకి..
మండ్య (కర్ణాటక): కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ మూడేళ్ల కుమార్తెతో కలిసి కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పాండవపుర తాలూకా లక్ష్మీసాగర గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్‌కు భార్య భార్గవి (30), కుమార్తె దీక్ష (3) ఉన్నారు. వీరు మైసూరు నగరంలోని ఊటెగహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన భార్గవి శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో గంజా వద్ద ఉన్న గోసాయి ఘాట్ వద్దకు కుమార్తెతో వచ్చి మొబైల్ ఫోన్ పక్కన బెట్టి కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: (ఒమిక్రాన్ సోకిన మహిళ తండ్రికి కరోనా పాజిటివ్) -
ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!!
ఆమెకు నిరంతరం ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహం. ఉత్సాహంగా ఉంటేనే అలసట తెలియదంటారు. యువత కోసం కొత్తకొత్తగా ఆలోచిస్తుంటారు అన్నీ నలుగురికీ చెప్పాలనేదే ఆమె ఆకాంక్ష. చూసిన ప్రతిదీ రాస్తారు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. ఒంటరిగానే ప్రయాణిస్తారు. సైకిల్ తొక్కాలి, కొండలు ఎక్కాలి అనే ఆలోచనతోనే ఉంటారు.. పాండమిక్ సమయంలోనూ ఎంతో ధైర్యంగా చురుగ్గా పనిచేశారు. యువతను ప్రోత్సహించడానికి గ్యాలరీ తెరిచారు. యువత జీవనానికి కావలసిన విషయాలు ప్రముఖులతో చెప్పిస్తున్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న భార్గవి నిరంతర సంచారి. ఆమె గురించి ఆమె మాటల్లోనే... మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. బి.కామ్ వరకు చదువుకున్నాను. ఆ తరవాత వివాహం జరగడం, బాబు పుట్టడం, వాడు స్కూల్ కి వెళ్లటం... అన్నీ సామాన్యంగానే జరిగిపోయాయి. అప్పుడు నాకు ఆర్ట్ నేర్చుకోవాలని కోరిక కలిగింది. చిన్నప్పటి నుంచే నేను బొమ్మలు వేసేదాన్ని. ఏదో కారణంగా అప్పుడు నాకు ఆర్ట్ మీద దృష్టి పెట్టడానికి అవ్వలేదు. అబ్బాయి స్కూల్ కి వెళ్లాక నాకు చాలా సమయం దొరికేది. అప్పుడే నేను నా కలను నిజం చేసుకోవాలనుకున్నాను. నాన్నగారి స్నేహితుడి ప్రోద్బలంతో ఆర్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీకి అప్లయి చేశాను. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేశాను. డిగ్రీ చదివేటప్పుడు నాతో ఉన్నవారంతా చిన్నపిల్లలు. వాళ్లందరూ మధ్యతరగతివాళ్లు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు. అప్పటికే వాళ్లు వేసిన పెయింటింగ్స్ తీసుకుని డబ్బులు ఇచ్చేదాన్ని. ఊరికే డబ్బులు ఇస్తే వాళ్లకి డబ్బు విలువ తెలియదని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొంటూ వాళ్లని ప్రోత్సహించాను. మాస్టర్స్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ కి అప్లయి చేసి, జాయిన్ అయ్యాను. గోల్డ్ మెడల్ సాధించాను. మాస్టర్స్ కోర్సు పూర్తయ్యాక కలకత్తా, బరోడా ప్రాంతాలకు వెళ్లాను. ప్రింట్ మేకింగ్ నేను కాలేజీ నుంచి బయటకు వచ్చాక ప్రింట్‌మేకింగ్ స్టూడియో పెట్టాలనుకుంటున్నారు. అప్పటికి హైదరాబాద్‌లో ఆ తరహా స్టూడియో లేదు. నా స్పెషాలిటీ కూడా ప్రింట్మేకింగ్లోనే. ఈ స్టూడియోకి పెద్ద మెషినరీ కావాలి. పెయింటింగ్‌కి కావలసిన రంగులు, జింక్ ప్లేట్లు ఉపయోగించి, పేపర్ మీద ప్రింట్ తీస్తాం. ఈ స్టూడియో నడపడానికి చదువుకున్నవారు చాలామంది కావాలి. నాతో చదువుకున్న వారినే కొందరిని ఇందులోకి తీసుకోవాలనుకున్నాను. ఫైనల్ డిస్ప్లే (ఫైనల్ ఇయర్) కి బరోడా, శాంతినికేతన్లాంటి ప్లేసెస్‌కి వెళ్లేదాన్ని. అక్కడ టీచర్ స్టూడెంట్ పద్ధతి లేదు. గురుకులంలాగ ఉంటుంది. సాయంత్రం దాకా క్లాసెస్ జరుగుతాయి. ఆ తరవాత బడ్డీకొట్టు దగ్గర కూర్చుని ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి, అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. హైదరాబాద్‌లో ఇటువంటి వాతావరణం లేదు. పిల్లలకు టీచర్ అంటే భయం. టీచరే అన్ని విషయాలు చెప్తారు. బరోడా ఒక ఆర్ట్ హబ్ భారతదేశంలో బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వగానే బరోడాలో మాస్టర్స్ చేస్తారు. బరోడాలో చాలా స్టూడియోలు, గ్యాలరీలు ఉన్నాయి. ఒక్కో గది ఒక్కో ఆర్టిస్టుకి ఇస్తారు. 20 మంది ఒకచోట కూర్చుని పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ అలాంటిది లేదు. అటువంటి స్టూడియో ఇక్కడి విద్యార్థుల కోసం ప్రారంభించాలనుకున్నాను. 2014లో ది ఆర్ట్ స్పేస్ అని ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. బాలమురళి, సినారె ప్రారంభోత్సవం చేశారు. థి అనేది సంస్కృత పదం. ఈ పదానికి చాలా అర్థాలున్నాయి. ఈ స్టూడియోలో లైబ్రరీ, పెయింటింగ్ గ్యాలరీ కూడా ప్రారంభించాను. యువతకు ఎవ్వరూ అవకాశాలకు ఇవ్వట్లేదు. ఆ అవకాశం నేను ఇచ్చి వాళ్లని ప్రోత్సహించాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రియేటివ్‌గా ఉన్న యువతను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. అంతర్జాతీయంగా కూడా ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్ అన్నీ చేస్తున్నాను. మంచి విషయాలు ప్రతి సంవత్సరం యువతకు మంచి విషయాలు తెలిసేలా నాలుగు ప్రదర్శనలు చేస్తున్నాం. మోడరన్ ఆర్ట్, కాంటెంపరరీ ఆర్ట్.. అన్నీ చేస్తున్నాం. యువత చాలా బాగా వేసిన పెయింటింగ్స్ కొన్నాను. ఇప్పుడు వాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరారు. వాళ్ల పెయింటింగ్స్‌కి ఇప్పుడు లక్షల రూపాయలు వస్తాయి. పెయింటింగ్స్‌కి క్యూరేటర్ కోర్సు పెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాను. బార్గవి చేయని మంచి పని లేదు, చేయని సేవా రంగం లేదు. ఎంతోమందికి భార్గవి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరంతర ప్రయాణాలు ►వైయస్సార్ యూనిర్సిటీ అడ్వయిజరీ బోర్డు మెంబర్ ►ఎన్జీవో సేవలు ►ఆదిలాబాద్ గిరిజనులు, అంధులు, వృద్ధులకు కావలసిన సేవలు ►గ్రామాన్నిదత్తతు చేసుకుని, బాగుచేయటం ►వ్యవసాయానికి భూమి క్లియర్ చేయటం కరోనా సమయంలో.. ►బోనాలు వంటి మన సంప్రదాయం గురించి మనకు తెలీదు. నిపుణులతో వాటి గురించి ఆన్ లైన్ లో చెప్పించటం. ►ఫౌండేషన్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ (ఫేస్) తరఫున గ్రాంట్స్ ఇవ్వడం ►ఆన్లైన్లో ఎటికేట్ నేర్పటం ►కాలేజీలో నేర్పని విషయాలు బియాండ్ క్లాస్‌రూమ్‌లో నేర్పించటం ►కళాకారులకు ఉండవలసిన క్రమశిక్షణ గురించి నేర్పించటం ►పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలా అప్లయి చేయాలి, అక్కడికి వెళితే ఎలా ఉండాలి, ఆర్టిస్టు క్యూరేట్ చేసి ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, ఫౌండేషన్ గ్రాంట్స్ ఎలా తెచ్చుకోవాలి వంటి విషయాల గురించి అవగాహన కల్పించటం ►చరిత్రకారులను పిలిపించి మాట్లాడించటం జ్ఞానాన్ని పంచటం... ఆర్టిస్టులు దేనిని ఎలా నేర్చుకుంటారోననే అంశం మీద ఆధారపడి, కొందరిని సెలక్ట్ చేసుకుని, వారికి ఉచిత తరగతులు (అమౌంట్ ఇస్తాం) నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గురించి చాలామందికి తెలియని ఎన్నోఉన్నతమైన విషయాలు... అంటే హైదరాబాద్‌లోని దిగుడు బావులు, వైల్డ్ లైఫ్, రాయల్ లైఫ్, చార్మినార్, బేకరీలు, ఆర్జిజాన్లు, గ్లిట్టరింగ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అత్తరు, ప్రీ మిడీవల్ ... ఇలా ఎన్నో విషయాలను వారికి తెలియచేసే తరగతులు నిర్వహిస్తున్నాం. పఠాన్‌చెరు అతి పురాతన ప్రదేశమని, అది ఒకప్పుడు వ్యాపార కేంద్రమని, కొలోనియల్ టైమ్ పీరియడ్ నాటి ప్రదేశమని, ఉర్దూ భాష మాట్లాడేవారని, అప్పటి జనజీవనం, సింగాడా కాయల గురించి (వాటర్ చెస్ట్నట్) ... ఇలా హైదరాబాద్ గురించినవన్నీ చెప్పాం. సంభాషణ: వైజయంతి పురాణపండ చదవండి: జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా.. -
అభ్యంతకర మెసేజ్‌లు..పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ యాంకర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై మాట్లాడిన ఏసీపీ కె. వి. ఎం. ప్రసాద్.. యాంకర్ భార్గవి ఎఫ్బీ అఫీషియల్ అకౌంట్‌తో పాటు మరో అకౌంట్‌ను దుండగులు ఆమె పేరు మీద క్రియేట్ చేసినట్లు గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పకప్పుడు పాస్ వర్డ్స్‌ను మార్చుకోవాలని సూచించారు. యాంకర్ భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) -
అక్షరాలతో ఆలయాల అద్భుత యాత్ర
‘‘గుడి అంటే కేవలం ఒక రాతిబొమ్మ మాత్రమే కాదు. గుడి ఒక భావన . ఎప్పుడో ఏ పురాణ కాలంలోనో జరిగిన ఏ ఘట్టంతోనో గుడి ముడి పడి ఉంటుంది. శతాబ్దాల క్రితం చెక్కిన శిల్పం, వందల ఏళ్లుగా మొక్కుతున్న దైవం, ధ్వజస్తంభం పాదాల వద్ద శతాబ్దాల దీపమాలికల నూనె చారికలు, మోగి మోగి ముసలివైనా కంఠం మూగవోని గంటలు కూడా కథలెన్నో చెబుతాయి’’ అని కస్తూరి రాకా సుధాకర్ రావు తన ‘అడుగడుగునా గుడి ఉంది’ అనే పుస్తకంలో తన మాటలుగా చెప్పుకున్నారు. 25 ఆలయాల చరిత్ర ఉన్న ఈ పుస్తకంలో ఆయా ఆలయాలకు సంబంధించిన విశేషాలన్నీ ఇప్పటికే కొన్ని వందలు, వేల వాట్సాప్ గ్రూపులలో రచయిత పేరు లేని షేర్లుగా చాలా మంది చదివినవే కావచ్చు. అయితే ఇంకా ‘స్మార్ట్’ కాని వారు, సామాజిక మాధ్యమాలకు కాస్త దూరాన్ని పాటించేవారు ఇందులోని విషయాలను హాయిగా చదివి మనో నేత్రాలతోనే ఆయా ఆలయాలను దర్శించి ఆత్మానందాన్ని పొందుతారు. ‘గూగుల్ తల్లికి తెలియని గుడి’ అంటూ గోల్కొండ నుంచి భువనగిరి వెళ్లే మార్గంలో అప్పటికే కొన్ని వందల ఏళ్ల నుంచి విలసిల్లుతూ, శిథిలావస్థకు చేరి, అక్కన్న మాదన్నలు పునరుద్ధరించిన వేణుగోపాలుడి ఆలయం గురించిన విశేషాలు అబ్బుర పరుస్తాయి. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో తలపై నిప్పుల కుంపటి పెట్టుకుని పదిహేను వందల ఎకరాలలో నడయాడి మరీ జాగీర్దార్ను మెప్పించి పెరుమాళ్లు పంతులు కట్టించిన వరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి చదువుతుంటే తెలియని తన్మయత్వం కలుగుతుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ముదిగోళం గ్రామంలోని ఎలుక జోస్యం చెప్పే ఆలయం, (చిలక జోస్యం కాదు) కోరిన కోరికలు తీర్చే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి గుడి... ఇంకా ఎన్నో విశేషాలతో కూడిన రాకా రాతలకు తోడు ఆయా ఆలయాల అసలు శిల్పాలతో పోటీపడే వేణు మాధవ్ గీతలు... చదువరులకు విందు భోజనమే. రచయిత సీనియర్ పాత్రికేయులు కావడంతో వ్యర్థ పదాలు, అనవసర వాక్యాలు లేకుండా పుస్తకంలోని అన్ని శీర్షికలూ ఆసక్తిగా చదివిస్తాయి. అడుగడుగున గుడి ఉంది రచన: కస్తూరి రాకా సుధాకర్ రావు పుటలు: 146; వెల రూ. 100 ప్రతులకు: ప్లాట్ నం. 79, వీ ఆర్ ఆర్ ఎన్క్లేవ్ దమ్మాయిగూడ, హైదరాబాద్– 500 083 ఫోన్: 9000875952 జ్ఞాపకాల గుబాళింపు సాధారణంగా డాక్టర్ అనగానే వంటికి తెల్లకోటు, మెడలో స్టెత్, డెటాల్, స్పిరిట్.. ఇప్పుడైతే శానిటైజర్ వాసనా గుప్పుమంటాయి. అయితే ఈవిడేమిటీ, ముఖ పుస్తకం నుంచి ముద్రణాలయాల వరకూ... మామూలు పుస్తకాల నుంచి మహనీయుల మాటల దాకా దేనినీ వదలకుండా పూల గుత్తిలా గుచ్చి దానిని సింపుల్‌గా ‘ఒక భార్గవి’ అని చెప్పేశారు... ఈవిడ మెడికల్ డాక్టరే కాదు.. లిటరరీ డాక్టర్ కూడానేమో అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. జ్ఞాపకాల పొదరిల్లు అంటూ తను కన్ను తెరిచాక చూసిన ఇంటి జ్ఞాపకాలతో మొదలు పెట్టిన భార్గవి ‘మోహనం... సమ్మోహనం’ లో మోహన రాగాన్ని వినిపించారు. దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారి స్వీయచరిత్ర గురించి చెప్పుకొచ్చారు. అమ్మ కన్నా పెద్ద అమ్మతో తన ఆత్మీయతానుబంధాన్ని వర్ణించారు ‘మమతల పాలవెల్లి మా అమ్మ’లో. ఆ తర్వాత మంగళంపల్లి వారి సురాగాల జల్లులోనూ, పెదనాన్న జ్ఞాపకాలతోనూ గుండె తడి చేస్తారు. తర్వాత ఆపాత మధురం అనే మ్యూజికాలజిస్ట్ హాసం రాజాగారి పుస్తకాన్ని సమీక్షిస్తారు. ఇంకా బోలెడన్ని పండుగలు, పర్వదినాల జ్ఞాపకాలతో గుమ్మెత్తిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వృత్తి వైద్యమే అయినా, ప్రవృత్తి అయిన సంగీత, సాహిత్యాల లోతులు తరచే ప్రయత్నంలో సినిమాలూ, పుస్తకాలూ, ప్రముఖ వ్యక్తుల గురించి రాసిన ఈ వ్యాసాల సంకలనంలో తడమని అంశమంటూ లేనే లేదు. ఒక పక్క పాఠక దేవుళ్లకి సాహితీ నైవేద్యం పెడుతూనే, మరో చెంప అవసరమైన చోట తన వృత్తిగతమైన వైద్య విషయాలను కూడా అలవోగ్గా అందించేయడం ఈ డాక్టరమ్మ కలంకారీతనానికి అద్దం పడుతుంది. అందమైన అక్షరాలు, వాటికి తగ్గట్టు గిరిధర్ గౌడ్ గీచిన చక్కటి వర్ణచిత్రాలు ఈ పుస్తకానికి సిరాక్షరాలు. ఒక భార్గవి పుటలు: 268, వెల రూ. 320 ప్రతులకు: డా. భార్గవి, ఫోన్ : 08674 253210, 253366; మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు – డి.వి.ఆర్. -
సర్పంచ్ బరిలో యువ డాక్టర్
సాక్షి, శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీ సర్పంచ్ పదవికి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసిన డాక్టర్ నర్రా భార్గవి పోటీచేస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి మంచి అవకాశంగా భావించి వైఎస్సార్సీపీ అభిమానిగా సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పంచాయతీ పరిధిలో అనేక చిన్న, పెద్దతరహా పరిశ్రమలున్నాయని, దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు జీవిస్తున్నారని చెప్పారు. వారందరికీ సేవ చేయాలనే తపనతో ఉన్నట్లు పేర్కొన్నారు. -
'కష్టాల్లో ఉన్నవారిని సీఏఏ ఆదుకుంటుంది'
చికాగొ : ప్రపంచంలో మానవాళి ఇప్పుడు ఒక విచిత్రమైన విపత్కరం లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. కరోనా మహమ్మారి మన జీవితాలని అల్లకల్లోలం చేస్తోంది. ఏంతో మంది ప్రాణాలను కబళిస్తోంది. ప్రజలు భయబ్రాంతులతో రోజులు గడుపుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 'మానవ సేవే మాధవ సేవ' ధేయ్యంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలు భార్గవి నెట్టెం మాట్లాడుతూ.. 'ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సాటి తెలుగు వారికి సహాయం చెయ్యడం, కష్టాలలో వున్న భారతీయ విద్యార్థులను ఆదుకోవడం లాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైద్యబృందాల రక్షణ కోసం మా సంఘ ఆడపడుచులు అలుపెరగకుండా ఎన్నో మాస్క్ లు తయారు చేసి ఇవ్వటం మాకు గర్వకారణం. స్వతహా గా డాక్టర్ అయినా నేను నా సాయ శక్తుల రోగుల సేవలు అందించడమే కాకుండా, భారత దేశం నుంచి తమవాళ్లను చూసుకునేందుకు వచ్చిన తల్లితండ్రుల ఆరోగ్యం, మందుల విషయంలో సహాయం చేసే అదృష్టం కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు. ఆన్ లైన్ ద్వారా 100కి పైగా కుటుంబాలతో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించి ఆ వచ్చిన విరాళాలను ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పూజారులకు అందించాం. ఇమ్మిగ్రేషన్ సమస్యలున్న వారికి అటార్నీలతో సంప్రదింపులు జరిపి ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తున్నాం. వయో వృద్ధులకు మా వలంటీర్ల ద్వారా నిత్యావసరాలు అందించాం. నా తరపున సహాయం అందేందుకు సహకరించిన చికాగో ఆంద్ర అసోసియేషన్ వ్యవస్థాపకులకి, బోర్డు డైరెక్టర్లకి, మా సంఘ సభ్యులకి, శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు. -
ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది..
పట్నంబజారు(గుంటూరు): ఆస్తిని తనకు రాయకుండా.. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తికి రాస్తుందేమోనన్న అనుమానంతో తల్లిని హత్యచేసిన కుమార్తె, ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు లో గురువారం ఎస్‌హెచ్‌వో వి.వెంకటరెడ్డి, ఎస్ఐ భాగ్యరాజులు వివరాలను మీడియాకు వెల్లడిం చారు. నగరంపాలెం మూడుబొమ్మల సెంటర్‌కు చెందిన ఆలపాటి లక్ష్మి (45).. కూరగాయల మార్కెట్లో ఓ దుకాణం నడుపుకొంటూ జీవి స్తోంది. భర్త గతంలో మృతిచెందాడు. కుమార్తె భార్గవిని 2007లో అచ్చంపేట మండలం పుట్లగూడేనికి చెందిన రామాంజనేయులుకిచ్చి వివాహం చేసింది. భార్యాభర్తలు అచ్చంపేటలోని ఓ హోటల్లో పనిచేస్తున్న క్రమంలో భార్గవికి శివరావుతో పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా ఉండగా తల్లి లక్ష్మి పేరుతో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న 17 సెంట్లు, కుంచనపల్లిలోని అరెకరం భూమిని తన పేర్న రాయాలంటూ భార్గవి తరచూ తల్లిని వేధిస్తూ ఉండేది. దీంతో పాటు తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో.. ఆస్తిని అతనికి రాస్తుందేమోనన్న ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న భార్గవి, శివరావులు గుంటూరు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా లక్ష్మి గొంతు నులిమి చంపేశారు. లక్ష్మి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భార్గవి, శివరావులపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తమకు సంబంధం లేదని నిందితులు బుకాయించారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితులు పరారయ్యారు. చివరికి తామే హత్య చేసినట్టు అంగీకరిస్తూ బుధవారం తహసీల్దారు కార్యాలయంలో లొంగిపోయారు. హత్యకు పరోక్షంగా భర్త రామాంజనేయులు కూడా సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. హత్యచేసిన రోజే లక్ష్మి మెడలోని బంగారు గొలుసు, రూ.39 వేలను నిందితులు తీసుకెళ్లగా.. పోలీసులు బంగారు గొలుసు, సెల్‌ఫోన్, రూ.7 వేలను స్వాధీనం చేసుకున్నారు. -
భార్గవిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
-
అద్దం లాంటి నవ్వు
ఆమె పేరు మృదుల. ఆమె మనసూ మాటా, అన్నీ మృదులమే. విశాఖపట్నంలోని ఒక ప్రయివేట్ స్కూల్లో సైన్స్ పాఠాలు చెబుతుందామె. ఆమె బాహ్య రూపాన్ని గురించి చెప్పుకోవాలంటే, అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆమె నవ్వు గురించీ, తలకట్టు గురించీనూ. ఆమె చిరునవ్వు, అప్పుడే వెలిగించిన దీపంలా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా నవ్విందంటే ఓ వేసవి సాయంకాలం సన్నగా మొదలైన వాన గుర్తొస్తుంది. మరి ఆపుకోలేనంతగా నవ్వితేనో? ఒక పున్నమి వెన్నెల రాత్రివేళ, సముద్రపు ఇసుకలో నిలబడినప్పుడు, కాళ్ళ కిందకి వచ్చిన అల ఒకటి అలాగే ఆగిపోయినట్టనిపిస్తుందిఇక ఆమె పొడవాటి జడ గురించి చెప్పాలంటే, ప్రకృతి కూడా తనను తానోసారి తడుముకోవాల్సిందే. ఆమె రోడ్డు మీద నడుస్తుంటే ఆ పొడవాటి జడ చిక్కుల్లో పడకుండా, ఏ చూపూ తప్పించుకోలేదు. ఇక స్కూల్లో అయితే, స్టాఫ్ రూమ్‌లోంచి బయటకు వచ్చి, క్లాస్ వైపునకు బయలుదేరితే చాలు, మిగతా క్లాసుల్లోని ఆడపిల్లలంతా తలలు తిప్పి కిటికీల్లోంచి బయటకి చూడాల్సిందే. పదో తరగతిలో ప్రణీత ఉందే... టీచరంత పొడవైన, ఒత్తయిన జుట్టు కోసమని, అమ్మానాన్నల్ని పీడించి పీడించి, కొనుక్కోని నూనె లేదు. వాడని షాంపూ లేదు. ఏడో తరగతి ఎర్ర జుట్టు రాగిణయితే, తెల్లారేసరికల్లా తన జుట్టు కూడా మృదులా టీచర్ జుట్టంత నల్లగా, పొడవుగా మారిపోవాలని, రోజూ నిద్రపోయేటప్పుడు దేవుడ్ని ప్రార్థిస్తుంది. ఇక అప్పుడప్పుడే ఆరో తరగతిలోకొచ్చిన ఉత్తేజ్ ఉరఫ్ నాని గాడు, అంత పొడవు జుట్టున్న అమ్మాయి దొరికితే గానీ ప్రేమల్లో, దోమల్లో పడకూడదని రోజుకోసారైనా గుర్తు చేసుకుంటాడు. ఇప్పటికి మృదుల రూపం మీ మనసుల్లోకి చేరే ఉంటుంది కదూ? సరే, ఇక ఆమె మనసు దాకా వెళ్ళొద్దాం రండి. మృదుల, అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్నోసారి పరికించి చూసుకుంది. వెంటనే రాఘవ అన్న మాట గుర్తొచ్చింది. పెళ్లిచూపుల్లో అతను తన ముఖం వైపు ఒక్కసారే చూశాడట. మిగిలిన సమయమంతా తన జడనే చూస్తూ కూర్చున్నాడట. ‘‘ఇంప్రెస్ చెయ్యడం కోసమేగా జడనలా ముందుకు వేసుకున్నావు!’ అని ఏడిపిస్తుంటాడు. నెల్రోజుల్లో పెళ్లంటే ఏదో తెలియని భయంగా ఉంది. అమ్మమ్మ ఉంటే ఎంత బావుండేది. తనకి చిన్నప్పటినించీ అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే చనువు ఎక్కువ. ఇంత ఒత్తయిన, పొడవైన జడకట్టు కూడా అమ్మమ్మ దగ్గరనించే కదా, తనకు వారసత్వంగా వచ్చింది!ఎంత జాగ్రత్తగా నూనె రాసి, చిక్కు తీసి, జడ వేసేదో తనకి ప్రతిరోజూ. ఆఖరి రోజుల్లో, ఓపిక లేకపోయినా కూడా, మంచం మీంచే అనేది, ‘‘ఏమిటే ఆ పిచ్చవతారం, దువ్వెన్న తెచ్చుకో, జడేస్తాను’’ అని. ఇంకా ఇంకా చివరి రోజుల్లో అయితే, తను కనిపిస్తే చాలు, ముఖం వంకా, జుట్టు వంకా అదే పనిగా చూస్తూ ఉండేది, కళ్లనిండా ఏదో తీరని కోరికను నింపుకుని. ఆ మాయదారి క్యాన్సర్ మహమ్మారి ఆవిడని పీల్చి పిప్పి చేసిన దానికంటే, వయసుతోపాటైనా రాలిపోని జుట్టంతా, ఆ రోగానికి రాలిపోతుంటేనే అమ్మమ్మ ఎక్కువగా బాధపడిందనిపిస్తుంది. ఎప్పుడైనా కళ్ల నీళ్లు పెట్టుకునేది, ‘‘అంత చిన్నవయసులోనే ఆయన వదిలెళ్ళిపోయారే నన్ను. ఆసరాగా నిలబడేందుకు కొడుకులా లేరు. అప్పటినించీ మీ అమ్మే నాలోకమే తల్లీ. మీ నాన్న కూడా నన్ను సొంత తల్లిలా చూసుకుంటున్నాడమ్మా’’ అంటూనే మళ్ళీ పరధ్యానంలో పడేది, ‘‘ఈ పాడు జుట్టేమిటో ఇలా రాలిపోతోంది’’. అమ్మమ్మ పడిన నరకం పగవాళ్ళకి కూడా వద్దు. నిట్టూరుస్తూ అక్కడనించి లేచి బయటపడి, స్కూల్‌కి బయలుదేరింది మృదుల. సాధారణంగా మొదటి క్లాస్ ఏడో తరగతిలోనే ఉంటుంది. వెళ్లి కూర్చుని, అటెండెన్స్ రిజిస్టర్ తెరవబోతూ, ఓసారి క్లాసంతా కలియజూసింది. వాళ్ళు పలికేముందే తెలిసిపోతుంది తనకు, ఎవరెవరు క్లాస్‌కి వచ్చారో, ఎవరు ఎగ్గొట్టారో! వసంత, వేణులతో పాటుగా భార్గవి కూడా కనిపించలేదు. ఆ అమ్మాయిని తలుచుకోగానే గుండె బరువెక్కింది మృదులకు. ఇంచుమించుగా ఏడాది నించేమో, ఆ అమ్మాయి సరిగా స్కూల్‌కి రావడం లేదు. పాపకి బోన్‌కి సంబంధించిన క్యాన్సర్ అని ప్రిన్సిపాల్ మేడంతో చెప్పి వెళ్లారట పాప తండ్రి.అప్పటినించీ అప్పుడప్పుడూ స్కూల్‌కి వస్తున్నా, రెండు నెలల నుంచీ పూర్తిగా రావడం మానేసిందాపిల్ల. ఎలా ఉందో ఏమిటో అనిపించింది. ఉదయం నించీ అమ్మమ్మ బాగా గుర్తొస్తున్నందుకేమో, మృదులమనసు మరింత భారంగా ఉంది. సాయంత్రం ప్రిన్సిపాల్ మేడమ్‌తో చెప్పి, భార్గవినోసారి చూసి రావాలని నిర్ణయించుకుంది. ఫోన్ చేసి రావడం వల్లనేమో, బెల్ కొట్టగానే తలుపు తెరుచుకుంది. పాప తండ్రిలా ఉన్నాడు, ‘‘లోపలికి రండి మేడమ్’’ అన్నాడు. మొహమాటంగా నవ్వి లోపలికి అడుగుపెట్టింది. అయన తిన్నగా బెడ్ రూమ్‌లోకి దారి తీశాడు. వెనకాలే వెళ్ళింది. ఆ చిన్న రూమ్‌లో, పరుపు మీద పడుకుని నిద్రపోతోంది భార్గవి. ఆ పిల్లనలా చూడగానే విపరీతమైన ఆందోళన కలిగింది మృదులకి. ఆ కంగారుకి కడుపులో తిప్పడం మొదలైంది. ఊపిరి అందనట్టుగా అనిపిస్తుంటే తమాయించుకుని, గుండెల నిండా గాలి పీల్చుకుంది. మెల్లగా మంచం దగ్గరికి వెళ్లి, భార్గవి చెంపల్ని తాకింది. ఎంత చలాకీ అయిన పిల్ల! క్లాస్‌లో కూడా ఒక్క నిమిషమైనా నిశ్శబ్దంగా ఉండేది కాదు. ‘‘ఎలాగమ్మా ఇలా అయితే? చెప్పేది వినవు, చదవవు’’ అంటే, ‘‘ఏంటో మేడం, నాకు కదలకుండా కూర్చోవాలంటే చాలా కష్టం’’ అనేది. ఇప్పుడిలా ఇంత నిశ్శబ్దంగా ఉండటానికి, ఆ పిచ్చి పిల్ల ఎంత కష్టపడుతోందో పాపం. ‘‘రండి మేడమ్, హాల్లో కూర్చుందాం’’ అన్నాడు భార్గవి తండ్రి. వచ్చి కూర్చుందన్న మాటే గానీ గొంతు పెగలడం లేదు. మాట్లాడటమంత కష్టమైన పని ఇంకేదీ లేదనిపిస్తోంది. మనసంతా ఏదో తెలియని స్తబ్దత.ఎవరో ఒకామె టీ తీసుకొచ్చి ఇచ్చి, మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోవడాన్ని అలా పరధ్యానంగా చూస్తూ ఉండిపోయింది, ‘‘ఇప్పుడెలా ఉందంటారు?’’ అంది ఎలాగోలా చివరికి అయన వైపు తిరిగి. ‘‘ఇప్పుడు నయమే మేడమ్, కీమోథెరపీ పూర్తయ్యాక కంప్లీట్ రెమిషన్‌లో ఉంది. గండం గడిచినట్టే అని చెప్పారు డాక్టర్లు’’ అన్నాడాయన. ముడతలు పడిన ముఖంతో ముసలివాడిలా కనిపిస్తున్నాడు, ఆ మధ్య వయస్కుడు.పిల్లల్ని అలా చూడాల్సిన ఖర్మ ఏ తల్లితండ్రులకీ పట్టకూడదని అనిపించింది మృదులకి. ఆయన చెప్పిన విషయం, తన నిస్తేజాన్ని కొద్దిగా సడలించినట్టుగా అనిస్తుంటే, ‘‘ఎంత మంచి విషయం చెప్పారండీ! అయితే పాప త్వరలో స్కూల్‌కి కూడా రావచ్చేమో’’ అంది.‘‘డాక్టర్ గారు స్కూల్‌కి పంపొచ్చని చెప్పారు మేడమ్, అదే వెళ్లనంటోంది...’’ అంటూ ఆగిపోయాడాయన. మృదులకు ఏమీ అర్థం కాలేదు. ‘‘ఎందుకు మేడమ్, ఆదివారాలు మాత్రం సెలవు? నాకు ఇంటిదగ్గరేం తోచదు’’ అంటూ గారాలు పోయే భార్గవి, ఇప్పుడు స్కూల్‌కి రానంటోందా!‘‘అసలు ఆ పిల్ల ఒక్క క్షణం కుదురుగా ఉండేదా మేడమ్? స్కూల్ మానమన్నా మానేది కాదు. ఇంటికొచ్చినా కూడా, చదవమంటే చదవకుండా, పక్క వాళ్ళిళ్ళకు పోయి ఆడుతూనే ఉండేది. ఈ రోజు దానికి ఇలాంటి గతి పట్టింది. ఆ జుట్టు చూసి అందరూ ఏడిపిస్తారనిట, గుమ్మం కదిలి బయటకే వెళ్లడం లేదు’’ బాధగా తల దించుకున్నాడాయన. అప్పుడు హఠాత్తుగా ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది, ఇందాక తను చూసిన భార్గవి రూపం. అక్కడక్కడా జుట్టూడిపోయి, తల నిండా ఏర్పడిన ఖాళీలతో. అంతే, మృదులకి వెంటనే అమ్మమ్మ గుర్తొచ్చేసింది.ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ‘‘మరోసారి వస్తా లెండి’’ అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటపడింది.రాత్రయ్యే సరికల్లా మృదుల మనసు మరింత అల్లకల్లోలంగా తయారైంది. అంత చిన్న పాపకు ఎంత కష్టం? ఎంతటి మహామహులో, అనుభవజ్ఞులో కూడా తట్టుకోలేనంత శారీరకమైన బాధను అంత లేత శరీరం, మనసూ అసలెలా తట్టుకుంటాయి? ఎనిమిదేళ్లయిపోయినా తనకి ఆ రోజు బాగా గుర్తుంది. అమ్మమ్మ పోయిన పదోరోజు. చూడ్డానికొచ్చిన బాబాయ్‌తో నాన్న అంటున్న మాటలు అనుకోకుండా తన చెవిన పడ్డాయి. ‘‘పాపం, పెద్దావిడ నరకమే అనుభవించిందిరా, చివర్రోజుల్లో అయితే ఆ ట్రీట్మెంట్ అసలు తట్టుకోలేకపోయేది. అందుకే నిద్ర మాత్రలు మింగేసింది. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. బాగోదు కదా. మేమేదో సరిగా చూడలేదనుకుంటారు జనం. పాపం మృదమ్మ ఎంత సేవ చేసిందనీ! ఎప్పుడూ ఆవిడ దగ్గరే ఉండేది. దానిక్కూడా ఈ సంగతి తెలీనివ్వలేదురోయ్, దానికి ఆవిడంటే ప్రాణమని నీకు తెలుసు కదా. ఇలా చేసిందని తెలిస్తే తట్టుకోలేదు.’’ ఎవరైనా చూడ్డానికొచ్చినప్పుడు, ఎముకల పోగులాంటి శరీరాన్నైనా అలా వదిలేసి, గుండులా అయిపోయిన తలని దాచుకోవడానికి అమ్మమ్మ పడిన పాట్లు గుర్తొచ్చాయి మృదులకి, ఆ విషయం వినగానే. అర్ధరాత్రి దాటుతున్నా మృదులకి నిద్ర పట్టడం లేదు. మంచం మీద నిస్సహాయంగా పడున్న భార్గవి రూపంతో పాటుగా, రోడ్డు మీద దెబ్బ తగిలి కుంటుతున్న కుక్కపిల్లా, వెన్నెల లేని రాత్రుళ్ళూ, పేవ్మెంట్ మీద పడుకుని చలికి వణుకుతున్న ముసలి వాళ్ళూ, వాడిపోయిన పువ్వులూ, ప్లాస్టిక్ సంచుల పళంగా చెత్తని మింగేస్తున్న ఆవులూ, బీడు వారిపోయిన భూములూ, గాల్లో కలిసిపోతున్న విష వాయువులూ.... అలా ఏవేవో గుర్తొస్తున్నాయి. ఎన్నెనో ఆలోచనలు రాత్రంతా, ‘మన చేతిలో ఏమీ లేదా’. తెల్లారుతుండగానే లేచి తయారయిపోయింది. ‘‘అదేమిటమ్మా, ముందుగా అనుకోనైనా అనుకోలేదే. ఒక్కదానివీ ఎలా వెళ్తావు? రెండురోజులాగు. అందరం కలిసే వెళ్దాం’’ అంటూ తల్లి ఎంతగా చెప్తున్నా వినకుండా సింహాచలం బయలుదేరింది. దేవస్థానం కల్యాణకట్ట చేరుకుంది. ఎదురుగా కూర్చున్న మంగలాయన సందేహంగా చూస్తున్నంతసేపూ తల దించుకుని కూర్చునే ఉంది. పని చేస్తున్నా, ‘‘ఏం ఉంది తల్లీ జుట్టు, ఎలా ఇచ్చేస్తున్నావో గానీ’’ అంటూ అతను గొణుక్కోవడం వింటూనే ఉంది. ఇంటికి చేరగానే, ‘‘ఎంత పని చేశావే, నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని’’ అంటూ తల్లి నెత్తీ నోరూ బాదుకోవడాన్ని నిర్లిప్తంగా గమనించింది. ఇప్పుడే బాధా లేదు. ఏ దుఃఖమూ లేదు. ఉన్నదేదో పోతుందన్న భయం లేదు. మనసు నిండా ఒకటే ప్రశాంతత.తెల్లమొహాలేసుకుని చూస్తున్న పిల్లల మధ్యలోంచి క్లాస్‌లోకి ప్రవేశించింది మృదుల. ‘‘పిల్లలూ, మీకు తెలుసా? భార్గవి ట్రీట్మెంట్ ముగించుకుని ఇంటికొచ్చేసింది. చూడ్డానికి ఎవరెవరెళ్తున్నారు?’’.వెళ్లినవాళ్లంతా ఆ పిల్లకేం చెప్తారో తనకి తెలుసు. ఆమె పెదవుల నిండా చిరునవ్వు పరుచుకుంది. ఇప్పుడోసారి ఇలా బయటకి వచ్చి, నాతో పాటుగా ఆమె చిరునవ్వులోకి తొంగి చూడండి. అదిప్పుడు మునుపటిలా ఏవేవో అందమైన ప్రకృతి దృశ్యాల్ని గుర్తు చేయడం లేదు కదూ! అద్దంలా ఆమె మనసుని మాత్రమే ప్రతిబింబిస్తోంది. - భవానీ ఫణి -
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. శామీర్‌పేట పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు గ్రామానికి చెందిన శిరీష, భార్గవి(16) తమ నాయనమ్మ లచ్చమ్మను తీసుకొని బైక్‌పై లాలాపేట నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. హైదరాబాద్–కరీంనగర్ జాతీయరహదారిలోని అలంక్రిత రిసార్ట్స్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొనడంతో వారు కిందపడిపోయారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ భార్గవి మీదుగా వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శిరీష, లచ్చమ్మలతో పాటు, ట్రాలీ ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో బైక్‌కు నిప్పంటుకుని దగ్ధమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేన్నట్లు ఎస్ఐ అబ్దుల్ రజాక్ తెలిపారు. -
వీరి క్రేజ్‌కు సెలబ్రిటీలు సైతం అవాక్కు..
ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు విజయం సాధించాలంటే దానికి ఎన్నో ప్రయాసలు పడి మరెన్నో దారులు వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతిభ మనదైతే ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగం విజయపు మార్గాలను సమూలంగా మార్చేసింది. సామాన్యుల్ని సైతం ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మార్చే శక్తితో రోజుకో కొత్త టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇదే క్రమంలో సోషల్ సైట్లే వేదికగా అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకున్న నగరవాసులు కొందరితో ముచ్చటించినప్పుడు ‘విజయ’ విశేషాలను పంచుకున్నారు. హిమాయత్‌నగర్ : ఒకరు ఫేస్బుక్లో స్టార్ అయితే.. ఇంకొకరు యూట్యూబ్‌కు రిలేటెడ్‌గా ఉన్న ఛానల్స్‌లో స్టార్. ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెట్టినా.. ఛానల్లో ఒక్క డైలాగ్‌తో వీడియో పోస్ట్ చేసినా వేలల్లో లైక్‌లు, లక్షల్లో వ్యూస్ రావడం ఖాయం. ఫేస్బుక్ సెలబ్రిటీగా దిల్‌సుక్‌నగర్‌కు చెందిన దివ్య అన్వేషిత కొమ్మరాజు పేరుపొందితే.. హిమాయత్‌నగర్‌కు చెందిన హారిక అలేఖ్య దేత్తడి ఛానల్లో దుమ్మురేపుతోంది. మల్కాజ్గిరి వాసి నాగభార్గవి ఫన్బకెట్లో పాగా వేసింది. వీళకున్న క్రేజ్‌కి టాలీవుడ్ స్టార్లు సైతం విస్తుబోతున్నారు. ఒక్క ఎపిసోడ్‌తో స్టార్డమ్ రావాలని లేకున్నా అనుకోకుండా ఇలా వచ్చా. ఇప్పుడు విడిచిపెట్టలేకపోతున్నా. ‘అమ్మాయి ఇంటికి దారేది’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. ఈ ఫిల్మ్ నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత ఫన్బకెట్లో 13వ ఎపిసోడ్లో అడుగుపెట్టా. ఇప్పుడు 139 ఎపిసోడ్ నడుస్తోంది. ఫన్బకెట్లో నా స్టార్డమ్ చూసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు అందరూ నాకు దగ్గరయ్యారు. నేను ఎక్కడకు వెళ్లినా.. ప్రేక్షకులు నన్ను గుర్తించి నాతో సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో చాలా సంతోషంగా ఉంది. ఇది చూసిన మా అమ్మ గర్వంగా ఫీలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. – నాగభార్గవి, ఫన్‌బకెట్ సెలబ్రిటీ దేత్తడి అమ్మాయిగా గుర్తింపు మా ‘దేత్తడి’ ఛానల్‌కు 3 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ ఉన్నారు. ఈ ఛానల్లో నేను ఇప్పటి వరకు పది వీడియోలు చేశాను. వీటిలో ‘ఫ్రస్టేషన్ తెలంగాణ పిల్ల, హుషార్పిల్ల, తెలంగాణ పిల్ల బేరామాడితే, సేల్స్ గర్ల్స్, ఫ్రస్టేషన్ ఎంబీబీఎస్ స్టూడెంట్’ వంటివి బాగా క్లిక్కయ్యాయి. ఎక్కడికెళ్లినా దేత్తడిలో చేసిన అమ్మాయి.. అంటూ గుర్తు పట్టి మరీ పలకరిస్తున్నారు. యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌తోనే సోషల్ మీడియా బాట పట్టాను. నేను చేసిన ప్రతి వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. – హారిక అలేఖ్య, దేత్తడి సెలబ్రిటీ ఫేస్బుక్ మార్చేసింది.. నేను 2016 వరకు చాలా సాధారణ అమ్మాయినే. ఫేస్బుక్లో ‘లైవ్ వీడియో’ ఆప్షన్ వచ్చినప్పుడు ఒకరోజు లైవ్ చేశా. రెండు గంటల పాటు చేసిన లైవ్‌కి అదే టైంలో 70 వేల మందికి పైగా చూశారు. ఈ స్ఫూర్తితోనే లైవ్‌ని కంటిన్యూ చేశా. ఇప్పుడు పది నుంచి పదిహేను లక్షల మంది వ్యూస్ రావడం చాలా గర్వంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్బుక్ నన్ను స్టార్‌గా మార్చేసింది. నాకు ఏ సమస్య ఉన్నా.. ఇతరులకు ఎదైనా సమస్య వచ్చినా నేను ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి చెప్పి పరిష్కరించడం ఆనందంగా ఉంది. – దివ్య అన్వేషిత,ఫేస్బుక్ సెలబ్రిటీ -
నేను పోతున్నా డాడీ..
నేను పోతున్నా డాడీ.. అని కూతురు అంటుంటే ఆ తండ్రి కళ్ల వెంట జలధారలు పొర్లాయి. నీకేం కాదు బిడ్డా నా దగ్గర డబ్బులున్నాయి. నిన్ను బతికించుకుంటా. అని తండ్రి ధైర్యం చెప్పాడు. అప్పుడు తాను పురుగుల మందు తాగినట్లు అసలు విషయం చెప్పింది. అయినా కూతురును బతికించుకోవాలనుకున్నాడు ఆ తండ్రి.. కానీ అంతలోపే పరలోకానికి వెళ్లిపోయింది. కన్నవారికి పుట్టెడు దుఖాఃన్ని మిగిల్చింది. కడెం(ఖానాపూర్): కడెం మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన అమరవేణి శ్రీనివాస్‌గౌడ్–అనసూయ దంపతుల కూతురు అమరవేణి భార్గవి(19) పురుగుల మందు తాగి సోమవారం మృతి చెందింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్గవి ఆదివారం గ్రామ సమీపంలోని పొలం వద్ద పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు నిజామబాద్ తరలించే క్రమంలో మార్గ మధ్యలో ఆర్మూర్ వద్ద ఆమె మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై జన్నారపు నారాయణ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ.. ఖానాపూర్‌లో ఇటీవలే డీగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన భార్గవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి విషయం ఎవరికి చెప్పకుండా ఇంటికి చేరుకుంది. రాత్రి భార్గవి తండ్రి తిన్నవా బిడ్డ అని పలకరించడంతో లేదు నాన్న అని భార్గవి సమాధానమిచ్చింది. బిడ్డ తినలేదనే బెంగతో పండ్లు తినమని ఇచ్చాడు. పండ్లు తింటుండగానే భార్గవి వాంతులు చేసుకుంది. దీంతో ఆమెను ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తల్లి దండ్రులకు, వైద్యులకు పురుగుల మందు తాగిన విషయం తెలియకపోవడంతో సాధారణ చికిత్సను అందించారు. పరిస్థితి విషమించడంతో చివరి క్షణాల్లో తండ్రిని దగ్గరకు పిలిచి నేను పోతున్న డాడీ అని భార్గవి చెప్పింది. భయపడకమ్మా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నిన్ను బతికించుకుంట అని ధైర్యనిచ్చాడు తండ్రి. భార్గవి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పింది. తండ్రి హూటాహూటిన నిజామాబాద్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో భార్గవి చనిపోయింది. -
నిన్న మాతృమూర్తి..నేడు న్యాయమూర్తి!
పట్టుదల, సంకల్పం ముందు కొండంత లక్ష్యం చిన్న బోతుందనేందుకు అతి చిన్నవయస్సులోనే జూనియర్ జడ్జిగా ఎంపికైన భార్గవి ఓ ఉదాహరణ. పెళ్లయిన తర్వాత కూడా చదువును కొనసాగించారీమె. భర్త ఇచ్చిన ప్రోత్సాహం, ప్రేరణతో ఎల్ఎల్బీ పూర్తిచేసి తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. ఈ విజయం కేవలం ప్రణాళిక.. టైం మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యమయ్యాయంటారీమె.. మదనపల్లె/తంబళ్లపల్లె : ‘చిన్నప్పటి నుంచి నాకు చదువంటే చాలా ఆసక్తి. ఉన్నతస్థానంలో ఉండాలనేది సంకల్పం. నాన్న రమణారెడ్డి ఆర్ఎంపీ వైద్యులు. అమ్మ ఏఎన్ఎం. మధ్య తరగతి వ్యవసాయకుటుంబం. తాతలు, తండ్రుల నుంచీ వ్యవసాయంపై ఆధారపడి జీవనం. కష్టాలు ఎదురైనా, ఎందరు విమర్శిం చినా బిడ్డను చదివిం చాలని నన్ను 30కి.మీ. దూరంలోని మదనపల్లెలో ఉంచి చదివించారు. బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో పెళ్లి చేశారు. పెళ్లి వల్ల నా లక్ష్య సాధన దెబ్బతినలేదు. పట్టుదలతో కొనసాగించాను. అమ్మగా మారడం.. బీఫార్మసీ తర్వాత ఏడాదిన్నర చదువులో గ్యాప్ ఏర్పడింది. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లికావడం జరిగింది. పెద్ద పాప రెండో తరగతి, చిన్నమ్మాయి ఎల్.కే.జి. చదువుతున్నారు. పిల్లలతో సమయం గడచిపోతున్నా మనసులో వెలితిగా ఉండేది. భర్త న్యాయవాద వృత్తిలో ఉండటం, కక్షిదారులు, సహచర న్యాయవాదులు, వాతావరణం, న్యాయమూర్తులకిచ్చే గౌరవం చూశాను. న్యాయవాద వృత్తిపై ఆసక్తిని పెంచాయి. మా ఆయన వృత్తిలో చూపే నిబద్ధత, నిజాయితీ, నైతికత ఆకర్షించాయి. న్యాయమూర్తిగానూ ప్రజాసేవ చేయవచ్చన్న భావన బలపడింది. కడపలోని బసవరాజ తారకం మెమోరియల్ లా కాలేజిలో ఎల్ఎల్బీ చేరాను. అక్కడ అధ్యాపకులు జావీద్ సార్ ఇచ్చిన గైడెన్స్, తోటి విద్యార్థుల ప్రోత్సాహంతో కాలేజిలో ఎప్పుడూ నేనే మొదటి స్థానంలో ఉండేదాన్ని. గత సంవత్సరం మార్చిలో ఫలితాలు రావడం, ప్రొవిజనల్ సర్టిఫికెట్ వచ్చిన పది రోజులలోపే జడ్జి పోస్టుల నోటిఫికేషన్ వెలువడటం, దరఖాస్తుకు చివరి రెండు రోజుల సమయం ఉందనగా హడావిడిగా అప్లికేషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. రోజుకు నాలుగు గంటలు.. ఇంటిపనులు చూసుకుంటూనే రోజుకు నాలుగు గంటలు పరీక్షకు సంబంధించిన పుస్తకాలను చదివేదాన్ని. ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకునేదాన్ని. విజయానికి అడ్డదారులు ఉండవని, కష్టపడటం, నిజాయితీనే మనకు గెలుపును తెచ్చి పెడతాయనే మాట నాకు స్ఫూర్తి.. అనుకున్నది సాధించగలిగాను. మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది మహిళలు పెళ్లవడంతో చదువును నిలిపేస్తుంటారు. చదవాలనే కోరిక, ఉన్నతస్థానాలకు చేరుకునే తపన ఉంటే ఎవరైనా విజయాలు సాధించవచ్చు. ముఖ్యంగా సమయపాలన ప్రధాన అంశం. టైమ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యం. పోటీ పరీక్షలకు అభ్యర్థులు నిరంతర సాధనకు అలవాటు పడాలి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకూడదు. విజయం దక్కుతుందనే నమ్మకంతో ముందుకు సాగాలి. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా ఇంగ్లిషులోనే అందుబాటులో ఉంటోంది. ప్రణాళిక, కష్టించే మనస్తత్వం, చదవడంలో నిజాయితీ ఉంటే తప్పక విజయం లభిస్తుంది. -
ప్రియుడి చేతిలో ప్రియురాలి దారుణహత్య
-
రక్తపు చేతులతోనే మరొకరికి తాళి..
మోత్కూరు (తుంగతుర్తి): ప్రేమించిన అమ్మా యిని హత్య చేసి ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్డాడు ఓ కిరాతకుడు. తనను ప్రేమించి ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నా వని నిలదీసినందుకు ప్రియురాలిని తన వ్యవసాయ బావివద్ద చంపేసి, మట్టిదిబ్బ గోతిలో పూడ్చాడు. హత్యచేసిన మరుసటి రోజే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ దారుణం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. మాట్లాడుదామని నమ్మించి.. మోత్కూరు మండల బుజిలాపురానికి చెందిన కాసగాని సత్తయ్య–ఆండాలు దంపతుల కుమారుడు నరేందర్(25) అలియాజ్ నందు, మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య–లక్ష్మీ దంపతుల రెండవ కుమార్తె భార్గవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆత్మకూర్ లోని వినాయక ఆస్పత్రిలో భార్గవి రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. అదే ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్‌గా నరేందర్ పనిచేస్తున్న సమయంలో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల నరేందర్‌కు జనగాం జిల్లా గుండాల మండలం సుద్దాలకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. 4వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. దీంతో భార్గవి తనను పెళ్లి చేసుకోవాలని నరేందర్‌ను నిలదీసింది. నరేందర్ 3వ తేదీన మాయమాటలు చెప్పి భార్గవిని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే బండరాయితో మోది హత్య చేశాడు. మృతదేహాన్ని వ్యవసాయ బావి వద్ద పూడ్చిపెట్టాడు. 4వ తేదీన సుద్దాలలో నరేందర్ వివాహం చేసుకున్నాడు. భార్గవి కనిపించకపోవడంతో ఆమె తండ్రి, బంధువులు అక్కడికి వెళ్లి గొడవ చేశా రు. పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా 5వ తేదీన భార్గవి అదృశ్యమైనట్లు ఆత్మకూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నరేందర్‌పై అను మానం వ్యక్తం చేసి విచారణ జరిపారు. దీంతో భార్గవిని హత్యచేసినట్లు అంగీకరించాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్గవిని ఎలా హత్య చేశాడు, అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. నరేందర్‌కు ఇది రెండో పెళ్లి.. నరేందర్ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కీసర ప్రాంతానికి చెందిన మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నాలుగేళ్లకే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నాడు. -
కుక్కల్లో వ్యాధి నిర్ధారణతో వైద్యం సులువు
ఆత్కూరు(గన్నవరం): పెంపుడు కుక్కల్లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను సకాలంలో నిర్ధారించడం ద్వారానే నివారణ సాధ్యమని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన యువ పశువైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ భార్గవి గడియారం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో పెంపుడు కుక్కల యాజమాన్యంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో గురువారం వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలపై పరిశోధన ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా భార్గవి కుక్కల్లో వచ్చే హర్ట్ఓర్మ్ వ్యాధి ప్రాణంతకరమైనదని చెప్పారు. దోమకాటు వల్ల సంభవించే ఈ వ్యాధి వల్ల పరాన్నజీవులు వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని తెలిపారు. డయాగ్నసిస్ విధానంలో ఎక్సరే, రక్తం, యూరిన్ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చని చెప్పారు. ఈ వ్యాధి దోమల ద్వారా కుక్కల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుందని వెల్లడించారు. బేరియాట్రిక్ సర్జరీ నిపుణులు ప్రొఫెసర్ ఎల్.రంగనాథ్ మాట్లాడుతూ... మనుషుల మాదిరిగానే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు కారణంగా పెంపుడు కుక్కలో గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా ఎక్కువ కొవ్వు శాతం ఉన్న పదార్థాలను పెట్టడం కారణంగా కుక్కల్లో వయసు పెరిగిన కొద్దీ జీవ క్రీములు పెరిగి, రోగ నిరోధక శక్తి మందగిస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా కుక్కలకు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా వ్యాధి నివారణ చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. కాలేయ వ్యాధి నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ పీఎన్ ద్వివేది మాట్లాడుతూ కుక్కల్లో ఎక్కువగా వైరస్ కారణంగా కాలేయ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీరసించడం వంటివి వ్యాధి లక్షణాలుగా ఉంటాయన్నారు. కుక్కలకు ముందస్తు టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి కాపాడవచ్చని సూచించారు. ప్రొఫెసర్ డాక్టర్ నంది రేబిస్ వ్యాధి నిర్ధారణ, నివారణ పద్ధతుల గురించి వివరించారు. ప్రొఫెసర్ సయ్యద్ సాజిద్ హుస్సెన్ స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా కుక్కల్లో నాడీ వ్యవస్థ సమస్యలను, కీళ్ళ సమస్యల పరిష్కార మార్గాలు గురించి తెలియజేశారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, సదస్సు నిర్వాహకులు వై. వైకుంఠరావు, దేశ, విదేశాలకు చెందిన 300 మంది పాల్గొన్నారు.