రక్తపు చేతులతోనే మరొకరికి తాళి.. | lover murder in Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

రక్తపు చేతులతోనే మరొకరికి తాళి..

Published Wed, Mar 7 2018 2:20 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

lover murder in Bhuvanagiri District - Sakshi

మోత్కూరు (తుంగతుర్తి): ప్రేమించిన అమ్మా యిని హత్య చేసి ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్డాడు ఓ కిరాతకుడు. తనను ప్రేమించి ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నా వని నిలదీసినందుకు ప్రియురాలిని తన వ్యవసాయ బావివద్ద చంపేసి, మట్టిదిబ్బ గోతిలో పూడ్చాడు. హత్యచేసిన మరుసటి రోజే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ దారుణం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో మంగళవారం వెలుగుచూసింది.  

మాట్లాడుదామని నమ్మించి..
మోత్కూరు మండల బుజిలాపురానికి చెందిన కాసగాని సత్తయ్య–ఆండాలు దంపతుల కుమారుడు నరేందర్‌(25) అలియాజ్‌ నందు, మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య–లక్ష్మీ దంపతుల రెండవ కుమార్తె భార్గవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆత్మకూర్‌ లోని వినాయక ఆస్పత్రిలో భార్గవి రిసెప్షనిస్ట్‌ గా పనిచేస్తోంది. అదే ఆస్పత్రి అంబులెన్స్‌ డ్రైవర్‌గా నరేందర్‌ పనిచేస్తున్న సమయంలో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.

ఇటీవల నరేందర్‌కు జనగాం జిల్లా గుండాల మండలం సుద్దాలకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. 4వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. దీంతో భార్గవి తనను పెళ్లి చేసుకోవాలని నరేందర్‌ను నిలదీసింది. నరేందర్‌ 3వ తేదీన మాయమాటలు చెప్పి భార్గవిని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే బండరాయితో మోది హత్య చేశాడు. మృతదేహాన్ని వ్యవసాయ బావి వద్ద పూడ్చిపెట్టాడు. 4వ తేదీన సుద్దాలలో నరేందర్‌ వివాహం చేసుకున్నాడు. భార్గవి కనిపించకపోవడంతో ఆమె తండ్రి, బంధువులు అక్కడికి వెళ్లి గొడవ చేశా రు.

పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా 5వ తేదీన భార్గవి అదృశ్యమైనట్లు ఆత్మకూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నరేందర్‌పై అను మానం వ్యక్తం చేసి విచారణ జరిపారు. దీంతో భార్గవిని హత్యచేసినట్లు అంగీకరించాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి  తరలించారు. భార్గవిని ఎలా హత్య చేశాడు, అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.  

నరేందర్‌కు ఇది రెండో పెళ్లి..
నరేందర్‌ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కీసర ప్రాంతానికి చెందిన మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నాలుగేళ్లకే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement