Narender
-
జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, అమరావతి: పదోన్నతిపై ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు హైకోర్టు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ నరేందర్‌కు వీడ్కోలు ఇచ్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జస్టిస్ నరేందర్ వెలకట్టలేని సేవలు అందించారని కొనియాడారు. అనేక కేసుల్లో పలు కీలక తీర్పులిచ్చారని, పరిపాలనాపరంగా ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా లోక్ అదాలత్‌లు సమర్థంగా జరిగేలా కృషి చేశారన్నారు. లోక్ అదాలత్‌లలో లక్ష కేసులు పరిష్కారం కావడం వెనుక ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. విజయవాడలో వరదల తరువాత ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా కృషి చేశారని జస్టిస్ ఠాకూర్ తెలిపారు.ప్రత్యేక ప్రతిభావంతులైన 62 మంది పిల్లలకు వినికిడి యంత్రాలు అందజేసేందుకు కృషి చేశారన్నారు. అలాగే అంధులైన పిల్లలకు వైద్య పరీక్షలు చేయించి, ఇద్దరికి కంటి చూపు వచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆయన కృషి, సేవలు తనను ఎంతో ఆనందానికి గురి చేశాయని సీజే పేర్కొన్నారు. ఇక్కడ గడిపిన కాలం గుర్తుండిపోతుంది అనంతరం జస్టిస్ నరేందర్ మాట్లాడుతూ, హైకోర్టులో పనిచేసిన ఈ 14 నెలల కాలం తన జీవితాంతం గుర్తుండి పోతుందన్నారు. ఇక్కడి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తనపై ఎంతో ప్రేమ, అనురాగం చూపారన్నారు. పరిపాలనపరమైన నిర్ణయాల్లో తన ఆలోచనలను సీజే ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. ఇక్కడ తాను సాధించిన మంచి పేరు ఏదైనా ఉందంటే అందులో సీజేకు సగం దక్కాల్సి ఉంటుందన్నారు.అంతకుముందు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు మాట్లాడారు. జస్టిస్ నరేందర్ తీర్పులు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. యువ న్యాయవాదులను ఎంతగానో ప్రోత్సహించారన్నారు.అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్ నరేందర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, దుర్గమ్మ చిత్ర పటాన్ని బహూకరించారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు నేతృత్వంలో సంఘం కార్యవర్గం కూడా జస్టిస్ నరేందర్‌ను సత్కరించింది. -
లగచర్ల కేసులో నేడు తీర్పు
సిటీ కోర్టులు: లగచర్లలో అధికారులపై దాడి కేసులో రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగిశాయి. సొమవారం రైతుల తరఫున సురేందర్‌రావు, జక్కుల లక్ష్మణ్, జి.కిరణ్‌లు వాదనలు వినిపించగా, మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి అఫ్రోజ్ అక్తర్ తీర్పును రిజర్వ్ చేస్తూ బుధవారానికి వాయిదా వేశారు.మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ఎలక్ట్రానిక్ సమాచారంతోపాటు ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించి వెంటనే జోక్యం చేసుకున్న రైతుల తరఫు న్యాయవాదులు పీపీ దాఖలు చేసిన ఫొటోల్లో ఉన్న ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, ఈ ఘటనకు సంబంధం లేని రైతులు, మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఒక్కరూ కూడా అరెస్టై రిమాండ్‌లో లేరని గుర్తు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడటం, వాట్సాప్ చాట్లు ఉన్నాయని అవన్నీ కోర్టుకు సమర్పించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు రైతుల అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని వారి ఆరోగ్యం క్షీణిస్తుందని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. నేడు తీర్పును వెలువరించే అవకాశముంది. -
‘రిమాండ్’ను కొట్టివేయలేం
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి జిల్లాకోర్టు విధించిన రిమాండ్‌ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పట్నం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని.. తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావం ఉండబోదని ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా తీర్పు వెలువరించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. పిటిషన్‌ను కొట్టివేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు డాకెట్(రిమాండ్) ఆర్డర్‌ను క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గత నెల తీర్పు రిజర్వు చేశారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అయితే, బెయిల్ పిటిషన్‌పై వికారాబాద్ కోర్టు చేసిన వ్యాఖ్యలను నరేందర్‌రెడ్డి న్యాయవాది జస్టిస్ కె.లక్ష్మణ్ దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లు తమ పరిధిలోకి రావని స్పెషల్ కోర్టు చూస్తుందని వెల్లడించిందన్నారు. దీంతో స్పెషల్ కోర్టు వివరాలు తెలపాలని న్యాయమూర్తి నరేందర్‌రెడ్డి న్యాయవాదిని ఆదేశించారు. గత నెల 13న నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయగా, ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. -
ఒకే ఎఫ్ఐఆర్పై విచారణ చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనకు సంబంధించి బొంరాస్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై ఒకే ఎఫ్ఐఆర్(153/2024)తో దర్యాప్తు జరపాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఫిర్యాదు చేసిన దుద్యాల తహసీల్దార్ కర్ర కిషన్, వికారాబాద్ డీఎస్పీ బి.జానయ్యల స్టేట్మెంట్ రికార్డు చేయొచ్చని దర్యాప్తు అధికారికి స్వేచ్ఛనిచి్చంది. ఒకవేళ ఇప్పటికే రికార్డు చేస్తే వాటిని కూడా 153 ఎఫ్ఐఆర్ కింద తీసుకున్నట్టే పరిగణించాలని స్పష్టం చేసింది. నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను అనుమతించింది.ఈ నెల 11న లగచర్లలో కలెక్టర్ సహా పలువురు అధికారులపై జరిగిన దాడి వెనుక నరేందర్‌రెడ్డి ఉన్నారని ఎఫ్ఐఆర్ 153 నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్ ఫిర్యాదు మేరకు 154, డీఎస్పీ ఫిర్యాదు మేరకు 155 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వేర్వేరు వ్యక్తుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద 3 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇది టీటీ ఆంటోని వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పునకు విరుద్ధమంటూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కె.లక్ష్మణ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘మూడు ఎఫ్ఐఆర్లలో పిటిషనర్ పేరు లేదు. అతనిపై వచి్చన ఏకైక ఆరోపణ కుట్ర.మూడు ఘటనల్లోనూ భౌతికంగా ఉన్నాడని, దాడిలో పాల్గొన్నాడని అతనిపై ఎలాంటి ఆరోపణ లేదు. వాస్తవాలను పరిశీలిస్తే.. 3 నేరాల్లో పిటిషనర్‌ను ఇరికించడానికి ప్రతివాదులు ప్రయతి్నస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఒకే ఘటనలో బహుళ ఎఫ్ఐఆర్ల నమోదు అనుమతించబడదు. మూడింటిలో కారణాలు, నేరాలు, వాహనాలకు నష్ట, ఫిర్యాదుదారుల మధ్య సారూప్యత ఉంది. అందువల్ల, పిటిషనర్‌పై ఒకే ఘటనకు సంబంధించి బొంరాస్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లోని 154, 155 ఎఫ్ఐఆర్లు అనుమతించలేం. రద్దు చేస్తున్నాం’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. లంచ్‌మోషన్ రూపంలో మరో పిటిషన్ ఇదే కేసులో తనపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ నిందితుడు(ఏ–33) కావలి శేఖర్ పిటిషన్ దాఖలు చేశారు.సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తగదన్నారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ నేరుగా దాడిలో పాల్గొన్న ఫొటోలను పీపీ పల్లె నాగేశ్వర్రావు న్యాయమూర్తికి అందజేశారు. దీంతో పిటిషనర్ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. -
అరెస్టు నోటీసులు భార్యకు ఇవ్వకుండా.. సలీమ్‌కు ఎందుకు ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటి వద్దే అరెస్టు చేస్తే పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకో ర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సహకరించని, పరారీలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్ డేటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పేరు వెల్లడించినట్లు చెబుతున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణార్హం కాదు.. న్యాయమూర్తికి పెన్‌డ్రైవ్ అందజేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి, కలెక్టర్ ఎవరొచి్చనా కూడా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) ప్రేరేపించారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల పెన్‌డ్రైవ్ ఉంది. పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదు. పిటిషనర్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోంది. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్‌కు అందినట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టివేయాలి’అని అన్నారు. అయితే సెక్షన్ 482 కేసులో పెన్‌డ్రైవ్ ఎలా సమరి్పస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు.అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘15 మంది సివిల్ డ్రస్‌లో వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పిటిషనర్‌తో పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అందులో ఏముందో చూసుకునే అవకాశం ఇవ్వలేదు’అని చెప్పారు. సంతకాలు అభ్యంతరకరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘చట్టపరమైన అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరం’అని అన్నారు. గాయపడిన వారి వివరాల్లో ప్రశ్నార్థకాలు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులిచ్చారు. ఈ సందర్భంగా విచారణ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు. కాగా, లగచర్ల ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చటవిరుద్ధమంటూ నరేందర్ రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ముందు విచారణకు రానుంది. -
ఆయనేమన్నా టెర్రరిస్టా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయన ఏమైనా టెర్రరిస్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను బహిరంగ ప్రదేశంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఆయన పరారీలో లేరు కదా.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చట్టప్రకారం అరెస్టు చేయొచ్చు కదా అని పేర్కొంది. గాయపడ్డ వారి వివరాల పక్కన ప్రశ్నార్థకం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వైద్యుడికే స్పష్టత లేదా అని అడిగింది. నరేందర్‌రెడ్డి మరో నిందితుడికి రెండు నెలల కాలంలో 84 సార్లు ఫోన్ చేశారన్న పోలీసుల వాదనపై ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు నేరపూరిత కుట్రపైనే మాట్లాడుకున్నారని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది.నరేందర్‌రెడ్డికి ప్రమేయం ఉందంటూ నిందితులు చెప్పిన వాంగ్మూలాల కాపీలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం: పీపీ ‘నరేందర్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు. నవంబర్ 11న రిమాండ్ డైరీలో ఆయన పేరు లేదు. నవంబర్ 13 నాటి డైరీలో చేర్చారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో ఒకటి తప్ప అన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇతర నిందితులు నరేందర్‌రెడ్డి పేరు చెప్పారంటూ చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజున ఆయన నుంచి మరో నిందితుడి (ఏ–4)కి ఒకే ఒక్క కాల్ వెళ్లింది. అలాంటప్పుడు ఘటన వెనుక ఆయన ఉన్నట్లు ఎలా చెబుతారు? రాజకీయ కోణంలోనే మాజీ ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమీ చెప్పకున్నా.. కేటీఆర్ పేరు చెప్పినట్లు, నేరాన్ని అంగీకరించినట్లు తప్పుడు నివేదికను ట్రయల్‌కోర్టుకు అందజేశారు. తోపులాటలో జరిగిన చిన్న గాయాలను రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు’అని గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారు. దీని కోసమే మరో నిందితుడికి రెండు నెలల్లో 84 సార్లు కాల్ చేశారు. నరేందర్‌రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశాం. విచారణ సాగుతోంది. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలి. నరేందర్‌రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై వికారాబాద్ కోర్టు విచారిస్తోంది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.ప్రాథమిక విచారణ చేశారా?వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఇంటి వద్దే అరెస్టు చేస్తే, విచారణ సమయంలో సలీమ్ అనే వ్యక్తి సమాచారం ఎందుకు ఇచ్చారు? సొంత పార్టీ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన అరెస్టు చేస్తారా? ఇతర నిందితుల స్టేట్మెంట్లు కాకుండా నరేందర్‌రెడ్డి పాత్రపై ప్రాథమిక విచారణ చేశారా? మీరు చెబుతున్నట్లు కుట్ర కోణం ఉంటే ఘటన జరిగిన రోజున ఇద్దరి మధ్య ఒకే కాల్ ఎందుకు ఉంటుంది? లగచర్ల ఘటనలో అధికారులకు పెద్దగా గాయాలు కాలేదని నిమ్స్ వైద్యుల నివేదిక చెబుతోంది. లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాలను అందజేయండి’అంటూ తీర్పు రిజర్వు చేశారు. అయితే తమ వాదనలకు కొంత సమయం కావాలని పీపీ విజ్ఞప్తి చేయడంతో గురువారానికి వాయిదా వేశారు. -
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
-
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్‌కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్‌రెడ్డి అందజేసిన అఫిడవిట్‌ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. -
భయం గుప్పిట్లోనే లగచర్ల!
వికారాబాద్/ పరిగి: లగచర్ల ఘటనతో వికారాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. రోటిబండతండా, పులిచర్లకుంటతండా, లగచర్ల గ్రామాల గిరిజనులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. అధికారులపై దాడి ఘటన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన చాలా మంది భయంతో ఊర్లు వదిలి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం ఆఫ్ చేసిన మొబైల్ నెట్వర్క్ సేవలను గురువారం పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. తమవారు ఏమైపోయారో తెలియక.. లగచర్ల సహా ఫార్మా విలేజ్ ప్రభావిత గ్రామాల ప్రజల్లో కొందరు వారి పనులు చేసుకుంటుండగా.. పరారీలో ఉన్నవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, పోలీసులకు దొరికిపోయారో ఏమీ తెలియక కన్నీళ్లు పెడుతున్నారు. ఇళ్లలో మగవారంతా వెళ్లిపోవడంతో.. వ్యవసాయ పనులు ఆగిపోయాయని, రెక్కాడితే కానీ పూట గడవని తమకు నిద్రాహారాలు కరువయ్యాయని వాపోతున్నారు. ఈ గ్రామాల్లో అధికారులపై దాడి ఘటన అంశంపై ఎవరిని పలకరించినా మాట్లాడేందుకు జంకుతున్నారు.మాట్లాడితే పోలీసులు, అధికారులు తమ ను టార్గెట్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులపై దాడిని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నవారు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు ఫార్మా విలేజీ భూసేకరణకు సంబంధించి ‘‘అధికారులను తరిమికొడదాం.. నేను, బీఆర్ఎస్ పార్టీ మీ వెంటే ఉంటాం. ఏం జరిగినా చూసుకుంటాం.. కేటీఆర్ కూడా మీకు అండగా ఉంటారు. భూములు జోలికి వస్తే దాడులు చేయటానికి కూడా వెనకాడొద్దు’’అంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గతంలో మాట్లాడిన వీడియో గురువారం వైరల్‌గా మారింది.ఘటనపై ఏడీజీ సమీక్ష లగచర్ల ఘటన, తర్వాతి పరిణామాలపై అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) మహేశ్ భగవత్ సమీక్షించారు. పరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీలు కరుణాసాగర్, ఇతర పోలీసు అధికారులతో.. ఘటన పూర్వాపరాలపై చర్చించినట్టు తెలిసింది. 120 మంది వరకు దాడి ఘటనలో పాల్గొ న్నట్లు భావిస్తున్న పోలీసులు ఇప్పటికే 21 మందిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం జరుపుతున్న గాలింపు.. ఫార్మా విలేజీ ప్రభావి త గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించినట్టు సమాచారం. భవిష్యత్‌లో ఇలాంటివి చోటు చే సుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. -
మెజార్టీ నిందితులకు భూముల్లేవు
వికారాబాద్: తమ వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నందునే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చి అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ అయిన ఆయన, ఆ తర్వాత ఎస్పీ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌రెడ్డితో పాటు మరో 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కోర్టులో హాజరుపర్చిన సమయంలో జరిగిన వాదనల సందర్భంగా సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలు సమరి్పంచామని వెల్లడించారు. కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముందుగా 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించిన తర్వాత ఘటనతో సంబంధం లేని 40 మందిని విడుదల చేశామని చెప్పారు. దాడిలో పాల్గొన్నవారిలో 42 మందిని గుర్తించామని, అయితే ఇందులో 19 మంది ఏ సంబంధం లేకుండానే దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. మెజార్టీ నిందితులకు అక్కడ భూములు లేవని, ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ఆధారాలున్నాయని ఐజీ చెప్పారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. తొలుత ఏ–1గా సురేశ్ ఉండగా దర్యాప్తు తర్వాత లభ్యమైన సాక్ష్యాధారాలతో నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చామని వివరించారు. దాడిలో సురేష్, మహేశ్, దేవదాస్, గోపాల్‌నాయక్, విఠల్, రాజు, విజయ్ ప్రధాన భూమిక పోషించారన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉందన్నారు. గతంలో సురేష్ పై కేసులున్నాయని, రేప్ కేస్ ఉంటే మేనేజ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. రిమాండ్‌కు తరలించింది వీరినే..ఏ1 పట్నం నరేందర్‌రెడ్డి, ఏ 21 బోగమోని మహేశ్, ఏ 22 బ్యాగరి విశాల్, ఏ 24 నీరటి సాయిలు, ఏ 27 నీరటి రమేశ్ (వీరిని బుధవారం అరె స్టు చేశారు), ఏ 3 ఎ.శివకుమార్, ఏ 11 మైలారం విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ 14 హీర్యానాయక్, ఏ 15 పతీవత్ శ్రీను, ఏ 16 పతీవత్ ప్రవీణ్, ఏ 17 పతీవత్ వినోద్, ఏ 18 రాథోడ్ వినోద్, ఏ 19 జర్పాల హీర్యానాయక్, ఏ 20 బాస్యానాయక్, ఏ 23 బ్యా గరి యాదయ్య, ఏ 25 దోరేమోని రమేష్, ఏ 26 కావ లి రాఘవేందర్, ఏ 28 లక్ష్మయ్య, ఏ29 నీలి రవి, ఏ 30 శ్రీశైలం, ఏ 31 బాలకిష్టయ్య (వీరిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు). -
అరెస్ట్ పై.. పట్నం నరేందర్ రెడ్డి భార్య.. కీలక వ్యాఖ్యలు
-
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్
-
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
-
చెక్‌లిస్టుపై సంతకం కోసం ఒత్తిడి చేశారు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అధిపతిగా ఈఎన్సీ ఉండాలి. సీడీఓ కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్ విభాగాలకు వేర్వేరు సీఈలు పనిచేయాలి. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సీడబ్ల్యూసీకి పంపించడా నికి ముందు హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్‌కి సంబంధించిన నిబంధనలన్నీ అమలు చేసినట్టు ధ్రువీకరిస్తూ చెక్‌లిస్టుపై సీడీఓ ఈఎన్సీ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో సీడీఓ ఈఎన్సీ లేరు. చెక్‌లిస్టుపై సంతకం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ (హైదరాబాద్) హరి రామ్.. నన్ను కోరగా..హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్ విభాగాలు నా పరిధిలోకి రానందున సంతకం చేసేందుకు నిరాకరించా. బరాజ్‌ల డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకం ఎందుకు పెట్టడం లేదు? సమస్యేమిటి? అని నాటి సీఎం (కేసీఆర్), ఇరిగేషన్ మంత్రి (హరీశ్‌రావు) ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని సీడీఓ విభాగం రిటైర్డ్ సీఈ డి.నరేందర్‌రెడ్డి.. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు తెలిపారు. హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాలకు పూర్తిగా తనదే బాధ్యత అని అంగీకరిస్తూ హరిరామ్ లేఖ ఇచ్చాకే తాను చెక్‌లిస్టుపై సంతకం చేశానని చెప్పారు. అయితే డిజైన్లు సీడబ్ల్యూసీకి సమర్పించడానికి ముందు ఈ లేఖను తొలగించారని ఇటీవల తనకు తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా కమిషన్ గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో నరేందర్‌రెడ్డికి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన హరిరామ్ లేఖను నరేందర్‌రెడ్డి కమిషన్‌కు ఆధారంగా అందజేశారు. ఎల్ అండ్ టీ ఇచ్చిన డిజైన్లను మక్కికి మక్కీగా కాపీ ఎందుకు చేశారు? మెదడును ఎందుకు వినియోగించలేదు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా స్పందించారు. కమిషన్ సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మేడిగడ్డ డిజైన్ల రూపకల్పనలో ఎల్ అండ్ టీ పాత్ర‘మేడిగడ్డ బరాజ్ డిజైన్ల రూపకల్పనతో తమకు సంబంధం లేదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. డిజైన్ల ప్రతిదశలో ఎల్ అండ్ టీ పాలుపంచుకుంది. నాటి సీఎం (కేసీఆర్) సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో పనిభారం తీవ్రంగా ఉందనే చర్చ జరగగా, మేడి గడ్డ బరాజ్ డిజైన్లు, డ్రాయింగ్స్కు రూపకల్పన చేస్తామని ఎల్ అండ్ టీ సీఎండీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ సంస్థతో కలిసి సీడీఓ ఇంజనీర్లు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించారు. ఎల్ అండ్ టీ, సీడీఓ మధ్య ఈ–మెయిల్ ద్వారా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలతో రూపొందించిన 600 పేజీల బుక్లెట్ సీడీఓ వద్ద ఆధారంగా ఉంది. (రుజువుగా కొన్ని మెయిల్స్‌తో కూడిన పత్రాలను కమిషన్‌కు అందజేశారు). కాళేశ్వరం నిర్మించాలన్న నిర్ణయం ఎవరిదో తెలియదుకాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఎవరిదో నాకు తెలియదు. సీఎం వద్ద జరిగిన సమావేశాలకు ఎన్నడూ సీడీఓ ఇంజనీర్లను పిలవలేదు. డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకే సీడీఓ పాత్ర పరిమితం. బరాజ్‌ల 3డీ మోడల్ స్టడీస్‌ను సీడీఓ డిజైన్లు ఇచ్చిన తర్వాతే చేయాలి. నాటి ప్రభుత్వం, సీఎం, మంత్రి వెంటబడడంతో సీడీఓ డిజైన్లు ఇవ్వడానికి ముందే 3డీ మోడల్ స్టడీస్‌ను తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ (టీఎస్ఈఆర్ఎల్) నిర్వహించింది. 2డీ మోడల్ స్టడీస్ ఫలితాలు మాత్రమే డిజైన్ల తయారీకి ముందు మాకు అందాయి. బరాజ్ నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో బయటికి దూసుకొస్తుందనే అంచనాలతో డిజైన్లను రూపొందించాం. కానీ సెకనుకు 15–16 మీటర్ల వేగంతో ప్రయాణి స్తున్నట్టు నిర్ధారణ జరిగింది.నిర్మాణ, నిర్వహణ లోపంతోనే బరాజ్‌లు విఫలంనిర్మాణంలో నాణ్యతా లోపం, నిర్మాణం పూర్తైన తర్వాత వర్షాలకు ముందు, తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ చేపట్టకపోవడం, గేట్ల నిర్వహణలో కోడ్ పాటించకపోవడం, మేడిగడ్డ బరాజ్‌లో బుంగలు ఏర్పడితే నాలుగేళ్ల పాటు పూడ్చివేయ కపోవడం వంటి కారణాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయి..’ అని నరేందర్‌రెడ్డి చెప్పారు. -
NRI: పల్లె నుంచి ప్రపంచస్థాయికి.. కరీంనగర్ వాసి!
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తన టాలెంట్‌తో విశ్వవేదికపై మరోమారు మెరిశాడు. ఫోర్బ్స్ జాబితాలో అఫీషియల్ ఎగ్జిక్యూటీవ్‌గా స్థానం పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా 160కిపైగా విద్యా విషయక జర్నల్స్ రాసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రకటించింది. చిన్న గ్రామం నుంచి అగ్రరాజ్యానికి.. మక్తపల్లికి చెందిన చింతం రాములు–కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలో పూర్తిచేశాడు. ఉన్నత విద్య ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ కరీంనగర్లో చదివాడు. 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్‌గా కెరీర్.. చదువు పూర్తయిన తర్వాత నరేందర్ బెంగళూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. తర్వాత వత్తిరీత్యా అమెరికా, ఇటలీ, జర్మనీ, లండన్, స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పనిచేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్‌గా గుర్తింపు పొందాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడ్డాడు. రీసెర్చ్ పేటెంట్లు.. అమెరికా వెళ్లిన తర్వాత నరేందర్ 55 కీలక అంశాలపై రీసెర్చ్ చేసి ఇన్నోవేటివ్ పేటెంట్లు పబ్లిష్ చేశాడు. తర్వాత ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులకు కీనోట్ స్పీకర్‌గా వ్యవహరించాడు. 11 ప్రపంచస్థాయి జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తూ సుమారు 160 ప్రపంచస్థాయి జర్నల్ ప్రచురించాడు. అనేక విద్యాసంస్థల టెక్నికల్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాడు. నరేందర్‌ను ప్రశంసిస్తూ వచ్చిన లేఖ పత్రం, నరేందర్‌కు వచ్చిన నేషన్ అవార్డు కేంబ్రిడ్జి నుంచి డాక్టరేట్.. నరేందర్ రీసెర్చ్ జర్నల్స్‌ను గుర్తించిన ప్రపంచంలోని అత్యున్నతమైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా అందజేసింది. అతి తక్కువ సమయంలోనే కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్‌ఫ్రైస్ ఆర్కిటెక్ట్ స్థానం సంపాదించాడు. అనేక ఇన్నోవేటివ్ జర్నల్స్ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జర్నల్‌లో అఫీషియల్ ఎక్జిక్యూటీవ్‌గా స్థానం సంపాదించాడు. పిల్లర్ ఆఫ్ ది నేషన్ పురస్కారం! ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నరేందర్‌కు పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రదానం చేసింది. ఈమేరకు స్పీకర్ శ్రీరాం నివాస్‌గోయల్ ఇటీవల అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈమేరకు నరేందర్‌ను ప్రశంసిస్తూ లేఖ కూడా పంపించారు. గ్రామంలో సంబరాలు.. తమ ఊరి యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మక్తపల్లిలో నరేందర్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు సంబురాలు చేసుకున్నారు. నరేందర్ తల్లిదండ్రులు అందరికీ మిఠాయిలు పంచారు. -
హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి..
సాక్షి, కుమరం భీం: తీవ్రజ్వరంతో ఒకరి మృతి చెందిన ఘటన మండలంలోని చింతగూడ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అనుమాల నరేందర్ (25) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీవల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఐదు నెలల పాప ఉంది. నరేందర్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 20 రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఆసుపత్రుల్లో చూపెట్టుకున్న తగ్గలేదు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్ అసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం
సాక్షి,అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్ నరేందర్ సోమవారం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ నరేందర్‌ను గవర్నర్ అభినందించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమ ప్రొసీడింగ్స్‌ను నిర్వహించారు. అనంతరం జస్టిస్ నరేందర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. కాగా.. రాజ్‌భవన్‌లో జస్టిస్ నరేందర్‌ను అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రికి జస్టిస్ ధీరజ్ సింగ్ పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో అందరూ పాల్గొన్నారు. 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య జస్టిస్ నరేందర్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ నరేందర్ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. మంగళవారం ఆయన జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కలిసి కేసులను విచారిస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే.. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం, తిరిగి రావడంలో జాప్యం జరగడంతో జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు. దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జి.నరేందర్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో చంద్రశేఖర్ జస్టిస్ నరేందర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు సమర్పించారు. -
ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ సీఐ నరేందర్ తరలింపు
-
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో తదుపరి గెలుపు ఎవరిది..?
కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డిపై 9319 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేంద్ర రెడ్డిని టిఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొడంగల్‌లో పోటీకి దించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రేవంత్ రెడ్డినియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన టిడిపి పక్షాన రెండుసార్లు ఎన్నికయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉంటూ, ఆ పార్టీని వదలి కాంగ్రెస్ ఐలో చేరి వర్కింగ్ అద్యక్షుడు అయ్యారు. నరేంద్ర రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సోదరుడు అవుతారు. నరేంద్ర రెడ్డికి 80754 ఓట్లు రాగా, రేవంత్ రెడ్డికి 71435 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన బాలకిషోర్కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. కాగా రేవంత్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. తదుపరి రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2014లో ఐదుసార్లు గెలిచిన సీనియర్ నేత గురునాధరెడ్డిని 14614 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన గురునాధ రెడ్డి 2014లో టిఆర్ఎస్లో చేరి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2014లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి విఠల్‌రావు 36304ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికే పరిమితం అయ్యారు. రేవంత్‌రెడ్డి ఒకసారి శాసనస మండలికి కూడా ఎన్నికయ్యారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడికి అల్లుడు. కొడంగల్‌లో గురునాధ రెడ్డి ఐదుసార్లు 1978, 1983, 1989, 1999, 2004లలో గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఐదుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. కొడంగల్‌లో నందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు టిడిపి తరుపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉపఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్య నారాయణ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.అచ్యుతరెడ్డి కొడంగల్‌లో రెండుసార్లు గెలిచారు. కొడంగల్‌లో ఇంతవరకు పన్నెండుసార్లు రెడ్లు గెలుపొందితే, నాలుగుసార్లు వైశ్య సామాజికవర్గం గెలవడం విశేషం. అచ్యుత్ రెడ్డి కొంతకాలం పి.వి.నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కొడంగల్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: అధికార బీఆర్ఎస్కు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరులపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఓ భూవిక్రయం విషయంలో ఎమ్మెల్యే, మరికొందరు తనపై భౌతిక దాడికి పాల్పడటంతోపాటు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సామ ఇంద్రపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ద్వారా స్థలం కొని... బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లి నాయుడు కాలనీకి చెందిన సామ ఇంద్రపాల్‌రెడ్డి అదే ప్రాంతంలో స్థలం కొనేందుకు 2018లో ప్రయత్నాలు సాగించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు రాకేశ్‌రెడ్డి మధ్యవర్తులుగా ఆయనకు పరిచయమయ్యారు. వారు ఆయనకు ఉప్పర్‌పల్లిలోని భూయజమానులను పరిచయం చేశారు. స్థలం కొనుగోలుకు అంగీకరించిన ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు కమిషన్‌తో కలుపుకొని రూ. 3.65 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భూయజమానులకు రూ. 90 లక్షలను అడ్వాన్స్ కింద చెల్లించడంతోపాటు రూ. 2.75 కోట్లకు ఖాళీ చెక్కులను ఎమ్మెల్యే వద్ద ష్యూరిటీగా ఉంచాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని యజమానులకు చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరుడు రాకేశ్‌రెడ్డికి చెరో రూ. 20 లక్షల చొప్పున కమీషన్ చెల్లించాడు. అయినప్పటికీ వారు ఖాళీ చెక్కులను ఇవ్వకపోగా మరో రూ. 60 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆయన రుణానికి ప్రయత్నించగా లభించలేదు. దీంతో నాటి నుంచి తరచూ వేధింపులకు గురిచేస్తూ వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 2022 జూన్‌లో ఇంద్రపాల్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టడంతోపాటు చంపుతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగొలా తప్పించుకున్న ఇంద్రపాల్‌రెడ్డి దీనిపై 2022 జూన్ 26న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలని వెస్ట్‌జోన్ డీసీపీని కోరినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఎమ్మెల్యే, ఇతరులపై కేసు నమోదుకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిలింనగర్లో జరగడంతో కేసును ఫిలింనగర్ పీఎస్‌కు బదిలీ చేశారు. -
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 12వ పతకం ఖాయం చేసిన నరేందర్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 12వ పతకం ఖాయమైంది. పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో నరేందర్ 5–0తో ఇమాన్ (ఇరాన్)పై గెలిచాడు. బుధవారం మొత్తం 12 వెయిట్ కేటగిరీల్లో భారత బాక్సర్లు సెమీఫైనల్ బౌట్లు ఆడనున్నారు. -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నరేందర్ ముందంజ..
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో నరేందర్ 4–1తో ఒస్కార్ సఫర్యాన్ (పోలాండ్)పై నెగ్గగా... సుమిత్ 5–0తో డామన్ ఒనీల్ (జమైకా)ను చిత్తు చేశాడు. గోవింద్ 3–2తో అరియస్ ఒరిట్జ్ (ఈక్వెడార్)పై, నిశాంత్ 5–0తో లాస్లో కొజాక్ (హంగేరి)పై విజయం సాధించారు. 86 కేజీల విభాగంలో భారత బాక్సర్ లక్ష్య చహర్ తొలి రౌండ్లో కిమ్ హైంగ్కియు (కొరియా) చేతిలో ఓడిపోయాడు. చదవండి: Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్ -
ఆర్డీవో నరేందర్ ఆచూకీ ఎక్కడ!
సాక్షి, కామారెడ్డి: ఇటీవల సస్పెండ్ అయిన కామారెడ్డి ఆర్డీవో నరేందర్ వారం రోజులుగా కనిపించడం లేదు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో జిన్నారం మండలం కాజిపల్లిలో మాజీ సైనికుల పేర భూమి కేటాయించిన విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు నరేందర్‌పై ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన అరెస్ట్కాకుండా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. (అడిషనల్ కలెక్టర్ 'నగేష్' కేసులో మహిళ పాత్ర) ఆరోపణల వెల్లువ.. సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమాల్లో సస్పెండ్ అయిన తరువాత నరేందర్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కామారెడ్డి ఆర్డీవోగా ఆయన మూడు నెలలు పనిచేశారు. ఈ మూడు నెలల్లోనే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి, బస్వాపూర్ గ్రామాల పరిధిలో పలు భూ వివాదాల్లో తలదూర్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జంగంపల్లి శివారులో ప్రభుత్వ భూములను నిబంధనలను విరుద్ధంగా కట్టబెట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. గతంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌గా కామారెడ్డి ప్రాంతంలో చాలా కాలం పనిచేసిన నరేందర్‌కు ఇక్కడి భూములపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఆయన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే భూ వివాదాల్లో తలదూర్చారని ఆరోపణలు వస్తున్నాయి. (ఆ ముగ్గురు ఎక్కడ?..) -
రవాణా కమిషనర్ కార్యాలయంలో దాడులు
సాక్షి, హైదరాబాద్: స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొలువుదీరి ఉండే రవాణా కమిషనర్ కార్యాలయంలోనే లంచావతారం పడగవిప్పింది. కొత్త వాహనాల్లో మార్పుచేర్పులు, అక్షర దోషాలను సవరించడం వంటి విధులు నిర్వహించే పరిపాలనాధికారి జె.నరేందర్ మంగళవారం రూ.36 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా అవినీ తికి పాల్పడుతూ నరేందర్ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన సీహెచ్ సందీప్ ట్రేలర్ అండ్ ట్యాంకర్‌గా వాహనాన్ని మార్పు చేసుకోవడం కోసం రవాణాశాఖ నుంచి ప్రొసీడింగ్స్‌ను పొందేందుకు గత నెల 13న అడ్మినిస్ట్రేటివ్ అధికారి నరేందర్‌ను సంప్రదించాడు. సదరు అనుమతుల కోసం రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నరేందర్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.30 వేలు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో సందీప్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు రూ.36 వేల నగదును నరేందర్‌కు అందజేశాడు. అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు నరేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2016 జనవరి 4న ఒక కేసులో రూ.8,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్ తిరిగి మరోసారి పట్టుబడటం గమనార్హం. అతన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. రవాణా శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్–1064కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ దాడులతో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దళారులను కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించారు.