
గుండెపోటుతో తహశీల్దార్ మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్పల్లి తహశీల్దార్ నరేందర్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్థరాత్రి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే నరేందర్ మార్గమధ్యంలోనే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. నరేందర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.