ముందస్తు కుట్రతోనే కలెక్టర్, అధికారులపై దాడి
పక్కా సాక్ష్యాధారాలతో నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేసి అరెస్టు చేశాం
మొత్తం 21 మందిని రిమాండ్‌కు తరలించాం
లగచర్ల ఘటనపై ఐజీ సత్యనారాయణ
వికారాబాద్: తమ వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నందునే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చి అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ అయిన ఆయన, ఆ తర్వాత ఎస్పీ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌రెడ్డితో పాటు మరో 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
కోర్టులో హాజరుపర్చిన సమయంలో జరిగిన వాదనల సందర్భంగా సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలు సమరి్పంచామని వెల్లడించారు. కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముందుగా 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించిన తర్వాత ఘటనతో సంబంధం లేని 40 మందిని విడుదల చేశామని చెప్పారు.
దాడిలో పాల్గొన్నవారిలో 42 మందిని గుర్తించామని, అయితే ఇందులో 19 మంది ఏ సంబంధం లేకుండానే దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. మెజార్టీ నిందితులకు అక్కడ భూములు లేవని, ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ఆధారాలున్నాయని ఐజీ చెప్పారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. తొలుత ఏ–1గా సురేశ్ ఉండగా దర్యాప్తు తర్వాత లభ్యమైన సాక్ష్యాధారాలతో నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చామని వివరించారు.
దాడిలో సురేష్, మహేశ్, దేవదాస్, గోపాల్‌నాయక్, విఠల్, రాజు, విజయ్ ప్రధాన భూమిక పోషించారన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉందన్నారు. గతంలో సురేష్ పై కేసులున్నాయని, రేప్ కేస్ ఉంటే మేనేజ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలను గుర్తిస్తామని పేర్కొన్నారు.
రిమాండ్‌కు తరలించింది వీరినే..
ఏ1 పట్నం నరేందర్‌రెడ్డి, ఏ 21 బోగమోని మహేశ్, ఏ 22 బ్యాగరి విశాల్, ఏ 24 నీరటి సాయిలు, ఏ 27 నీరటి రమేశ్ (వీరిని బుధవారం అరె స్టు చేశారు), ఏ 3 ఎ.శివకుమార్, ఏ 11 మైలారం విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ 14 హీర్యానాయక్, ఏ 15 పతీవత్ శ్రీను, ఏ 16 పతీవత్ ప్రవీణ్, ఏ 17 పతీవత్ వినోద్, ఏ 18 రాథోడ్ వినోద్, ఏ 19 జర్పాల హీర్యానాయక్, ఏ 20 బాస్యానాయక్, ఏ 23 బ్యా గరి యాదయ్య, ఏ 25 దోరేమోని రమేష్, ఏ 26 కావ లి రాఘవేందర్, ఏ 28 లక్ష్మయ్య, ఏ29 నీలి రవి, ఏ 30 శ్రీశైలం, ఏ 31 బాలకిష్టయ్య (వీరిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు).
Comments
Please login to add a commentAdd a comment