
శంషాబాద్: రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని పీసీసీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు జల్లపల్లి నరేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు, హైకోర్టు న్యాయవాది కాజా హైమద్‌తో కలసి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు.
దళితులను సీఎం చేస్తానన్న హామీని తుం గలో తొక్కి ఎస్సీ, ఎస్టీ ప్రజలను వంచించారన్నారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మోసగించిన ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే కనీస అర్హతలేదని, ఆయన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.