
వృద్ధురాలికి పెన్షన్ అందిస్తున్న సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్లు రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా..ఆ హామీని అమలు చేయనున్నారు. ప్రతి నెల ఇచ్చే సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్టు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుంచి పింఛన్ల పెంపుదల వర్తిస్తుందని.. జూలైలో లబ్దిదారులకు ఆ మొత్తాన్ని అధికారులు అందజేస్తారని వెల్లడించింది. ఆసరా పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1000 పింఛన్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు ఇకపై పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ. 2,016 అందనున్నాయి. అదేవిధంగా దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment