దగ్ధమైన బైక్ , మృతి చెందిన భార్గవి
శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. శామీర్‌పేట పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు గ్రామానికి చెందిన శిరీష, భార్గవి(16) తమ నాయనమ్మ లచ్చమ్మను తీసుకొని బైక్‌పై లాలాపేట నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. హైదరాబాద్–కరీంనగర్ జాతీయరహదారిలోని అలంక్రిత రిసార్ట్స్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొనడంతో వారు కిందపడిపోయారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ భార్గవి మీదుగా వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శిరీష, లచ్చమ్మలతో పాటు, ట్రాలీ ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో బైక్‌కు నిప్పంటుకుని దగ్ధమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేన్నట్లు ఎస్‌ఐ అబ్దుల్ రజాక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment