
జమాల్ పాషా, పండరిగౌడ్ మృతదేహాలు
మేడ్చల్: అతివేగం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. జాతీయ రహదారిపై మెదక్ జిల్లా చేగుంట నుంచి బైక్‌పై వస్తున్న జమాల్ పాషా(42)పండరిగౌడ్(56 అత్వెల్లి సెయింట్ క్లారేట్ స్కూల్ సమీపంలో డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్‌తో సహ రోడ్డు అవతలి వైపు పడిపోవడంతో అదే సమయంలో మేడ్చల్ నుంచి తూఫ్రాన్ వైపు వెళుతున్న టిప్పర్ వారిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. జమాల్‌పాషా కడప జిల్లా, చాపాడుకు చెందిన వాడు కాగా, పండరిగౌడ్ మెదక్‌జిల్లా చేగుంట మండలం రాజపల్లికి చెందిన వాడు. మృతులిద్దరు చేగుంటలోని ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికులుగాపని చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు మృతదేహలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం
అదే సమయంలో తన నియోజకవర్గానికి వెళుతున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కారు దిగి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు రావడంలో ఆలస్యం జరగడంతో తన కాన్వాయ్ లోని వామనాలను మృతదేహలకు అడ్డుగా పెట్టించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment