
సాక్షి, శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీ సర్పంచ్ పదవికి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసిన డాక్టర్ నర్రా భార్గవి పోటీచేస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి మంచి అవకాశంగా భావించి వైఎస్సార్‌సీపీ అభిమానిగా సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పంచాయతీ పరిధిలో అనేక చిన్న, పెద్దతరహా పరిశ్రమలున్నాయని, దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు జీవిస్తున్నారని చెప్పారు. వారందరికీ సేవ చేయాలనే తపనతో ఉన్నట్లు పేర్కొన్నారు.